Remove ads
గుజరాత్ రాష్ట్రం, రాజ్‌కోట్ జిల్లా లోని నగరం From Wikipedia, the free encyclopedia
రాజ్‌కోట్, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, రాజ్‌కోట్ జిల్లా లోని నగరం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, వడోదర, సూరత్ తర్వాత నాల్గవ అతిపెద్ద నగరం.[5] భౌగోళికంగా ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం మధ్యలో ఉంది. రాజ్‌కోట్ భారతదేశంలో 35వ అతి పెద్ద మహానగర ప్రాంతం. 2021 నాటికి రాజ్‌కోట్ మహానగర పరిధిలో 2 మిలియన్ల జనాభా కంటే ఎక్కువ జనాభా ఉంది.[6] రాజ్‌కోట్ భారతదేశం లోని 6వ అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తించబడింది.[7] 2021 మార్చినాటికి ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందిన 7వ నగరంగా నమోదైంది [8] ఈ నగరం రాజ్‌కోట్ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయాన్నికలిగి ఉంది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ నుండి 245 కిమీ దూరంలో అజీ, న్యారీ నదుల ఒడ్డున ఉంది. రాజ్‌కోట్ 1956 నవంబరు 1న బొంబాయి రాష్ట్రంలో విలీనానికి ముందు 1948 ఏప్రిల్ 15 నుండి 1956 అక్టోబరు 31 వరకు సౌరాష్ట్ర రాష్ట్రానికి రాజధానిగా ఉంది. రాజ్‌కోట్ 1960 మే 1న గుజరాత్ రాష్ట్రంలోకి తిరిగి విలీనం చేయబడింది.
Rajkot | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
Metropolis | ||||||||
Coordinates: 22.3000°N 70.7833°E | ||||||||
దేశం | India | |||||||
State | గుజరాత్ | |||||||
Region | Saurashtra | |||||||
జిల్లా | Rajkot | |||||||
Zone | 3 (Central, East and West)[1] | |||||||
Ward | 18[1][2] | |||||||
Rajkot Municipal Corporation | 1973 | |||||||
Founded by | Thakur Sahib Vibhoji Ajoji Jadeja | |||||||
Government | ||||||||
• Type | Municipal Corporation | |||||||
• Body | Rajkot Municipal Corporation | |||||||
• Mayor | Pradip Dav (BJP) | |||||||
• Deputy Mayor | Dr. Darshitaben Shah | |||||||
విస్తీర్ణం | ||||||||
• Metropolis | 170 కి.మీ2 (70 చ. మై) | |||||||
Elevation | 134.42 మీ (441.01 అ.) | |||||||
జనాభా (2021)[4] | ||||||||
• Metropolis | 20,00,000 | |||||||
• Rank | 28th 4th (in Gujarat state) | |||||||
• జనసాంద్రత | 12,000/కి.మీ2 (30,000/చ. మై.) | |||||||
• Metro | 2.45 million | |||||||
• Metro rank | 35th | |||||||
Demonym | Rajkotian | |||||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | |||||||
పిన్ కోడ్ | 360 0XX | |||||||
Telephone code | 0281 | |||||||
Vehicle registration | GJ-03 | |||||||
Literacy | 87.80 (2016)%[ఆధారం చూపాలి] | |||||||
Planning agency | (RUDA) | |||||||
Climate | Semi-Arid (Köppen) | |||||||
Precipitation | 590 మిల్లీమీటర్లు (23 అం.) | |||||||
Avg. annual temperature | 26 °C (79 °F) |
రాజ్‌కోట్ స్థాపించబడినప్పటి నుండి వివిధ పాలకుల క్రింద పరిపాలించబడింది.దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గణనీయమైన ప్రభావాన్నిచూపింది.రాజ్‌కోట్ మహాత్మా గాంధీ వంటి అనేకమంది వ్యక్తులకు ఈనగరం నిలయంగాసేవలందించింది. రాజ్‌కోట్ నగరం సాంస్కృతిక, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాల రంగాలలో అనతి కాలంలోనే అభివృద్ధిని సాధించింది.2010లో రాజ్‌కోట్ భారతదేశంలో 26వ అతిపెద్ద నగరంగా,ప్రపంచంలో 22వ అత్యంతవేగంగాఅభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతంగాగుర్తించబడింది.[8]
1956 నవంబరు 1 న ద్విభాషా చట్టం కింద బొంబాయి రాష్ట్రంలో విలీనమయ్యే ముందు రాజ్‌కోట్ 1948 ఏప్రిల్ 15 నుండి1956 అక్టోబరు 31 వరకు సౌరాష్ట్ర రాష్ట్రానికి రాజధానిగా ఉంది.రాజ్‌కోట్ 1960 మే 1న ద్విభాషా బిల్లు కింద బొంబాయి రాష్ట్రం నుండిగుజరాత్ రాష్ట్రంలో విలీనమైంది. ఠాకూర్ సాహెబ్ ప్రద్యుమన్సిన్హ్జీ 1973లో మరణించాడు.అతనికుమారుడు, మనోహర్సిన్హ్జీ ప్రద్యుమన్సిన్హ్జీ, ప్రాంతీయ స్థాయిలోరాజకీయ జీవితాన్ని ప్రారంభించి, తండ్రి తర్వాత అధికారంలోకి వచ్చాడు.అతనుగుజరాత్ శాసనసభ సభ్యునిగా అనేక సంవత్సరాలు పనిచేసాడు.రాష్ట్ర ఆరోగ్య,ఆర్థిక మంత్రిగా కొంతకాలం పనిచేశాడు.మోనోహర్సింహ్జీ కుమారుడు మందత్తాసిన్హ్ జడేజా వ్యాపార వృత్తిని ప్రారంభించాడు.[9]
2001 జనవరి 26న గుజరాత్ భూకంపం పశ్చిమ భారతదేశాన్ని గరిష్ట తీవ్రతతో కదిలించింది.ఆ విప్పత్తుకు13,805 నుండి 20,023 మంది మరణించారు.దాదాపు 1.66,800 మందిగాయపడ్డారు.ఈ భూకంపం పశ్చిమ గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోప్రధానంగాప్రభావం చూపింది.
రాజ్‌కోట్ 22°18′N 70°47′E / 22.3°N 70.78°E వద్ద ఉంది. ఇది సగటున సముద్ర మట్టానికి 128 మీటర్లు (420 అడుగులు) ఎత్తులోఉంది. ఈ నగరం అజీ నది,న్యారీ నదిఒడ్డునఉంది.ఇదిజూలై నుండిసెప్టెంబరువరకు వర్షాకాలం మినహామిగతాకాలంలోపొడిగాఉంటుంది.నగరం 170.00 కిమీ2 విస్తీర్ణంలోవిస్తరించి ఉంది.
రాజ్‌కోట్ గుజరాత్ రాష్ట్రంలోనిసౌరాష్ట్ర అనేప్రాంతంలో ఉంది.గుజరాత్‌లోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలలోఇది ఒకటికావడంవల్ల రాజ్‌కోట్ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంది.రాజ్‌కోట్‌కు కథియావార్ ద్వీపకల్పం అనే ప్రాంతంలో కేంద్ర స్థానం ఉంది.ఈనగరంగుజరాత్లోనిరాజ్కోట్ జిల్లాలో ఉంది.రాజ్‌కోట్ నగరం రాజ్‌కోట్ జిల్లాపరిపాలనాప్రధానకార్యాలయం.జిల్లాచుట్టూ తూర్పున బొటాడ్,ఉత్తరాన సురేంద్రనగర్,దక్షిణాన జునాగఢ్,అమ్రేలి,వాయువ్యంలో మోర్బి, పశ్చిమాన జామ్‌నగర్,నైరుతిలో పోర్బందర్ జిల్లాలు ఉన్నాయి.
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1891 | 29,200 | — |
1941 | 66,400 | +127.4% |
1951 | 1,32,100 | +98.9% |
1961 | 1,93,500 | +46.5% |
1968 | 2,70,800 | +39.9% |
1971 | 3,02,000 | +11.5% |
1981 | 4,44,200 | +47.1% |
1991 | 6,54,500 | +47.3% |
2001 | 10,03,015 | +53.2% |
2011 | 13,90,640 | +38.6% |
2013 | 15,60,000 | +12.2% |
Religions in Rajkot City (2011)[ఆధారం చూపాలి] | ||||
---|---|---|---|---|
హిందూ | 89.90% | |||
ఇస్లాం | 7.68% | |||
జైనులు | 1.90% | |||
క్రైస్తవులు | 0.27% | |||
ఇతరులు | 0.24% | |||
మతాలు ప్రకారం జనాభా |
రాజ్‌కోట్‌లోని ప్రజలు ప్రధానంగా శాకాహారులు.రాజ్‌కోట్‌లోని మహిళలకు ఆభరణాలుఅంటే చాలాఇష్టం.పెద్ద గొలుసులు,లాకెట్లు,ఇతర భారీ బంగారు ఆభరణాలువివాహాలు,పండుగలు,వేడుకలు సమయంలోఇష్టంగా వాడతారు. కాలానుగుణంగాపండుగలను బట్టివేషధారణ మారుతుంది.స్త్రీలు సాధారణంగాగుజరాతీ సాంప్రదాయరీతిలోచీరధరిస్తారు.పురుషులు వదులుగా ఉండే కుర్తాలు,సాధారణ దుస్తులు వాడతారు.
రాజ్‌కోట్ బహుళ సాంస్కృతిక ప్రాంతం.గుజరాతీ,హిందీ,ఉర్దూ, ఆంగ్లం, సింధీ, బెంగాలీ, తమిళం, మలయాళం, మరాఠీ వంటి అనేక భాషలను మాట్లాడతారు.అయితే, గుజరాతీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు మాత్రమే బాగా అర్థమవుతుంది.రాజ్‌కోట్ కథియావాడ్లో భాగం.దీని కారణంగా రాజ్‌కోట్ ప్రజలను కతియావాడి అని కూడా పిలుస్తారు.
రాజ్‌కోట్‌ను తరచుగా రంగిలు రాజ్‌కోట్ (రంగిలు రాజకోట్) అని పిలుస్తారు, దీని అర్థం "రంగుల రాజ్‌కోట్" అనిసూచిస్తుంది.రాజ్‌కోట్‌ను "చిత్రనాగ్రి" (చిత్రాల నగరం) అనే మరోపేరుతో కూడాపిలుస్తారు.[10]
ఫ్రాంజ్ కాఫ్కా రచనల అనువాదకుడు,ప్రముఖ పండితుడు మాల్కం పాస్‌లే రాజ్‌కోట్‌లో జన్మించాడు.
రాజ్‌కోట్‌లో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. జూబ్లీ ఉద్యానవనం అనేది వలస కాలం నాటి అనేక స్మారక చిహ్నాలను కలిగి ఉన్న నగరం మధ్యలో ఉన్న ఒక పెద్ద బహిరంగ ఉద్యానవనం.తోట మధ్యలో కన్నాట్ హాలు ప్రముఖంగా ఉంది.ఉద్యానవనం సమీపంలోని ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో చారిత్రక మోహన్‌దాస్ గాంధీ ఉన్నత ఫాఠశాల (ఇప్పుడు మహాత్మా గాంధీ సంగ్రహశాల), కాబా గాంధీ నో డెలో (మోహన్‌దాస్ గాంధీ చిన్ననాటి నివాసం), రాష్ట్రీయ శాల, వాట్సన్ సంగ్రహశాల,రోటరీ డాల్స్ సంగ్రహశాల, లాంగ్ గ్రంధాలయం,రోటరీ మిడ్‌టౌన్ గ్రంధాలయం,సౌరాష్ట్ర క్రికెట్ సంఘ ప్రాంగణం నగరంలో ఉన్నాయి
రోటరీ డాల్స్ సంగ్రహశాలలో ప్రపంచం నలుమూలల నుండి 1,400 కంటే ఎక్కువ బొమ్మల సేకరణ ఉంది.[11] ఈ సంగ్రహశాలను రాజ్‌కోట్ నాగ్రిక్ సహకార బ్యాంక్‌తో పాటు రాజ్‌కోట్ మిడ్టౌన్లోని రోటరీ క్లబ్ నిర్వహిస్తోంది. సంగ్రహశాల తన ప్రత్యేకమైన బొమ్మల సేకరణకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.[12]
లాంగ్ గ్రంధాలయం, జిటి షెత్ గ్రంధాలయం, రాజ్‌కోట్ సౌరాష్ట్ర చరిత్రలోని ప్రతి కాలానికి సంబంధించిన వేలాది పత్రాలు,పుస్తకాలను సేకరిస్తాయి.రాజ్‌కోట్ నగరం అంతటా అనేక శాఖలతోఅనేక ఇతర వ్యక్తులకు చెందిన సంస్థల గ్రంధాలయాలను కలిగి ఉంది.ఇందులోరోటరీ మిడ్‌టౌన్ ఆఫ్ రాజ్‌కోట్ నగర గ్రంధాలయం మరెన్నో ఉన్నాయి.
రాజ్‌కోట్‌లోని దర్బార్‌ఘర్ హవేలీ,స్వామినారాయణ గురుకుల్, మసోనిక్ హాల్, రేస్ కోర్స్, అజీ డ్యామ్,స్వామినారాయణ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, విశ్వకర్మ ప్రభుజీ ఆలయం అనే ఇతర ఇంకాఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి.
జూబ్లీ ఉద్యానవనంలో ఉన్న వాట్సన్ సంగ్రహశాల మానవ చరిత్ర, సంస్కృతిని కలిగి ఉంది. ఇది భారతదేశం వలసరాజ్యాల కాలంనాటి రాజ్‌కోట్ చరిత్ర వస్తువులను ప్రదర్శిస్తుంది.రాజ్‌కోట్ మెమన్ బోర్డింగ్ 1947కి ముందు ముస్లిం కార్యకలాపాలకు ప్రధానకార్యాలయం.సౌరాష్ట్ర ముస్లిం లీగ్ రాజ్‌కోట్ మెమన్ బోర్డింగ్ గ్రౌండ్లోఅనేకముస్లిం సమావేశాలను నిర్వహించింది.
గైబాన్షా పీర్ దర్గా హిందూ ప్రజల విశ్వాసానికి కూడా కేంద్రం. గైబాన్షా పీర్ దర్గా వద్ద ప్రతి సంవత్సరం ఉర్సు అనేమతపరమైన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో దాదాపు ప్రతి సంవత్సరంప్రతిమత పెద్దలు వచ్చి శాంతి, మానవత్వం గురించి బోధించడానికి ఈ సమావేశంలో పాల్గొంటారు.
త్రిమందిర్, దాదా భగవాన్ స్థాపించిన సెక్టారియన్ ఆలయం, నగరానికి కొద్ది దూరంలో ఉంది.[13] అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ రాజ్‌కోట్ వైద్య కళాశాల రాజ్‌కోట్‌లోని ఆసుపత్రి చౌక్ ప్రాంతంలోని పిడియు వైద్య కళాశాల దాని తాత్కాలిక ప్రాంగణం ఉంది.
రాజ్‌కుమార్ కళాశాల, రాజ్‌కోట్‌ను 1868లో కతియావార్ (ప్రస్తుతం గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం) రాజ్,వారి ముఖ్య అనుచరులు స్థాపించారు.
రాజ్‌కోట్ కళలకు ప్రధాన ప్రాంతీయ కేంద్రం.నగరంలో ప్రదర్శన కళల కోసం అనేక వేదికలు ఉన్నాయి.హేము గాధవి నాట్యగ్రహ,[14] లాభాపేక్ష లేని మొదటి ప్రాంతీయ థియేటర్లలో ఇది ఒకటి.ఇది చరిత్రతో గొప్పది.గుజరాతీ నాటకరంగానికి అంకితం చేయబడింది.
రాజ్‌కోట్ దాని స్వంత స్థానిక సంగీత శైలిని కలిగి ఉంది. దీనిని డే అని పిలుస్తారు,[15] ఇది జానపద కథలు, సూక్తులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. రాజ్‌కోట్ కథియావాడి జానపద సంగీతం వారసత్వంగా పొందింది.నగరంలో వివిధ వాయుద్య సమూహాలు ఉన్నాయి, ఇవి వృత్తిపరంగా ప్రదర్శనలు ఇస్తాయి.వారుప్రధానంగా బాలీవుడ్ నుండి సంగీత ఆల్బమ్‌లను ప్రదర్శిస్తారు.
రాజ్‌కోట్ జిల్లా సేవా సదన్ (రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం), రాజ్‌కోట్ నగరపాలక సంస్థ,రాజ్‌కోట్ పట్టణాభివృద్ధి అధికార సంస్థ సహా అనేక ప్రభుత్వ సంస్థలచే నిర్వహించబడుతుంది.
రాజ్‌కోట్ ప్రధాన భారతీయ నగరాలకు వాయు,రైలు,రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది.
రాజ్‌కోట్ నుండి గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుజరాత్‌లోని ఇతర నగరాలకు సాధారణ బస్సులను నడుపుతుంది.రాజ్‌కోట్ నుండి గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా సరాసరి రోజుకు 81,000 మందికి పైగా ప్రయాణిస్తున్నారు.రాజ్‌కోట్ గుజరాత్ రాష్ట్ర రహదారులతో బాగా కలపబడింది.రాజ్‌కోట్ వాహన నమోదు సంఖ్య జిజె-3ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేటాయించింది.గుజరాత్ రాష్ట్రంలోని ఇతర నగరాలతో, ఇతర రాష్ట్రాలతో నగరాన్ని కలుపుతూ వ్యక్తులకు చెందిన అనేక సంస్థల బస్సు నిర్వాహకుల ద్వారా బస్సు సేవలు ఉన్నాయి.
రాజ్‌కోట్‌లో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రాజ్‌కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది ప్యాసింజర్ రైళ్ల కోసం విస్తృతంగా ఉపయోగించే రైల్వే స్టేషన్. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇది సేవలను అందిస్తుంది. భక్తినగర్ రైల్వే స్టేషన్, సోమనాథ్, వెరావల్, జునాగఢ్, పోర్ బందర్ నుండి మాత్రమే రైలు సేవలు అందిస్తాయి.
రాజ్‌కోట్ విమానాశ్రయం [16] నగరం నుండి కొంచెం దూరంలోనే ఉంది.అద్దె కార్లు, ఆటో రిక్షా సేవల ద్వారా చేరుకోవచ్చు.ఎయిర్ ఇండియా ద్వారా ముంబైకి రోజువారీ రెండు విమానాలు ప్రయాణిస్తాయి. స్పైస్‌జెట్ తన సేవలను 2019 అక్టోబరు 27న ముంబై నుండి రాజ్‌కోట్‌కు ప్రారంభించింది. ఎయిర్ ఇండియా 2015 15 ఫిబ్రవరి నుండి రాజ్‌కోట్ నుండి న్యూఢిల్లీకి విమానాన్ని ప్రారంభించింది [17] అవి రాజ్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గుజరాత్‌లోని హిరాసర్ వద్ద, బెంగుళూరు, హైదరాబాద్, గోవా వంటి కొత్త గమ్యస్థానాలకు 2021లో స్పైస్‌జెట్, ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా మరిన్ని విమానాలు జోడించబడుతున్నాయి.
రాజ్‌కోట్ ఆల్ఫ్రెడ్ ఉన్నత పాఠశాల మహాత్మా గాంధీకి విద్యను అందించడంలో ప్రసిద్ధి చెందింది. నగరంలోని అనేక పాఠశాలలను రాజ్‌కోట్ నగరపాలకసంస్థ నిర్వహిస్తుంది. వాటిలో 20 పాఠశాలలు, అభ్యాస కేంద్రాలు ఉన్నాయి,[18] ఇందులో 3 ప్రాథమిక పాఠశాలలు, 7 మధ్య పాఠశాలలు, 4 జూనియర్ ఉన్నత పాఠశాలలు, 4 సీనియర్ ఉన్నత పాఠశాలలు, ఒక విద్యా కేంద్రం, ఒక ప్రత్యేక పాఠశాల ఉన్నాయి.[19] కొన్ని స్వయం ఆర్థిక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అంతర్జాతీయ పాఠ్యాంశాలను అందించే రెండు పాఠశాలలు ఉన్నాయి. కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌ను అందించే నార్త్‌స్టార్ స్కూల్ , ఇంటర్నేషనల్ బాకలారియాట్ ప్రోగ్రామ్‌ను అందించే ది గెలాక్సీ స్కూల్, రాజ్‌కోట్‌లోని రాజ్‌కుమార్ కళాశాల ఉన్నాయి, ఇది భారతదేశంలోని పురాతన పాఠశాలల్లో ఒకటి. అజ్మీర్‌లోని మాయో కళాశాల ఇండోర్‌లోని డాలీ కళాశాల పురాతనమైనవి. రాజ్‌కోట్‌లోని రాజ్‌కుమార్ కళాశాలలో రాజవంశస్థులకు చెందిన పిల్లలు చదువుకునేవారు.ఇది కతియావార్ యువరాజుల కోసం ప్రత్యేకంగా స్థాపించబడింది. సెయింట్ పాల్ కూడా ఐ.సి.ఎస్.ఐ పాఠ్యాంశాలకు అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ పాఠశాల.
రాజ్‌కోట్‌లో కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. ఇది సర్ లఖాజీరాజ్ ఉన్నతపాఠశాల జూని ఖాడ్కీ పాఠశాల ఆవరణలో ప్రారంభించబడింది. తరువాత జామ్‌నగర్ రోడ్‌లోని దాని స్వంత భవనానికి మార్చబడింది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ అనుబంధంగా పనిచేస్తుంది.బాలికలు, అబ్బాయిల కోసం రెసిడెన్షియల్ పాఠశాల, ఇది 6 తరగతి అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షలో ఎంపికైన వారికి విద్యను అందిస్తుంది.[20][21]
ఈ నగరం సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం, ప్రభుత్వ, వ్యక్తులకు చెందిన అనేక కళాశాలలు ఉన్నాయి. రెండింటిలోనూ ఉన్నత విద్యాసంస్థలకు నిలయంగా ఉంది. రాజ్‌కోట్‌లో మూడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.రాజ్‌కుమార్ రాజ్‌కుమార్ విశ్వవిద్యాలయం,[22] ఆత్మీయ విశ్వవిద్యాలయం. మార్వాడీ విశ్వవిద్యాలయం ఉన్నాయి.[23] నగరంలో 12 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇది హేము గాధ్వి నాట్య గృహ ప్రదర్శన కళల కళాశాల (గాత్రం, శాస్త్రీయ నృత్యం, తబలా వదన్ మొదలైనవి) కలిగి ఉంది. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం (ప్రభుత్వ విశ్వవిద్యాలయం) ఇది దాదాపు 410 ఎకరాలు (1.7 కి.మీ2) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిలో 28 పోస్ట్-గ్రాడ్యుయేషన్ విభాగాలలో కోర్సులు అందింంచే సదుపాయాలు ఉన్నాయి.[24]
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాజ్‌కోట్, ఇన్స్టిట్యూట్ 2020 డిసెంబరులోబ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ విద్యార్థుల ప్రారంభ బ్యాచ్‌తో తన వైద్య కళాశాలను ప్రారంభించింది [25][26]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.