ఉడిపి జిల్లా
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉడిపి, కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా. ఉడుపి జిల్లాను ఆగష్టు 1997లో ఏర్పాటు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడు ఉత్తర తాలూకాలు (ఉడుపి, కుందాపుర, కార్కళ) కలిపి ప్రత్యేక ఉడుపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 11, 12, 243. అందులో 18.55% పట్టణ జనాభా. కన్నడ, తుళు, కొంకణి జిల్లాలో మాట్లాడే ప్రధాన భాషలు. తుళు మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయంగా ఉండటం వలన ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలను కలిపి కొన్నిసార్లు తుళునాడుగా వ్యవహరిస్తారు.ఉడిపి, కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరం ఉడుపి నగరంలో ఉంది.
Udupi district | |||||||
---|---|---|---|---|---|---|---|
District of Karnataka | |||||||
Nickname: Temple City | |||||||
Coordinates: 13.35°N 74.75°E | |||||||
Country | India | ||||||
State | Karnataka | ||||||
Region | Tulunadu[1] | ||||||
Established | 1997 | ||||||
Headquarters | Udupi | ||||||
Talukas | Udupi, Karkala, Kundapura, Hebri, Byndoor, Brahmavara & Kaup | ||||||
Government | |||||||
• District Commissioner | Mr. Dr. K VidyaKumari ,IAS | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 3,880 కి.మీ2 (1,500 చ. మై) | ||||||
జనాభా | |||||||
• Total | 11,77,361 | ||||||
• జనసాంద్రత | 300/కి.మీ2 (790/చ. మై.) | ||||||
Languages | |||||||
• Official | Kannada | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
PIN | 576 101 | ||||||
ISO 3166 code | IN-KA-UD | ||||||
Vehicle registration | KA-20 | ||||||
Coastline | 98 కిలోమీటర్లు (61 మై.) | ||||||
Largest city | Udupi | ||||||
Sex ratio | 1094 ♂/♀ | ||||||
Literacy | 86.24% | ||||||
Lok Sabha constituency | Udupi-Chikmagalur | ||||||
Precipitation | 4,302 మిల్లీమీటర్లు (169.4 అం.) |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1, 177, 908,[4] |
ఇది దాదాపు. | తైమూర్ లెస్టే దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | రోలె ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 403 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 304 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 5.9%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1093:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 86.29%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
ఉడిపి జిల్లా పశ్చిమ తూర్పున పశ్చిమ కనుమలు (వరల్డ్ హెరిటేజ్ సైట్) పశ్చిమంలో అరేబియన్ సముద్రం ఉన్నాయి. సముద్ర సమీపంలో ఉన్న భూమి చిన్న కొండలు, వరి పొలాలు, కొబ్బరి తోటలు, అడవులు, కొండ ప్రాంతాల్లోతో కప్పబడి ఉంటుంది తూర్పు పశ్చిమ కనుమల సరిహద్దు భూమి సాధారణంగా అడవులు కొన్ని భాగాలలో చాలా మందపాటి అరణ్యాలు ఉన్నాయి. హెబ్రి, సోమేశ్వర వద్ద " సోమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం " ఉంది. కొల్లూరు (ఉడిపి) సమీపంలో ఉన్న, " మూకాంబికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ " ఉంది. కర్కలకు 16 కిలోమీటర్ల దూరంలో మాలా సమీపంలో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ఉంది. పరిసర ప్రాంతం కొల్లూర్ (ఉడుపి) దట్టమైన అడవులున్న, గ్రామాలు అటవీ ప్రాంతం మధ్య ఉన్నాయి. కుందాపూర్ తాలూకాలో, కర్కాల తాలూకాలోని కొన్ని భాగాలు మాలెనాడు అడవులు ఉన్నాయి. రెండు పచ్చదనం అలాగే సంస్కృతిలో ఒకదానిని ఒకటి పోలిఉన్నాయి. జిల్లాలో అరుదైన వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. పులి, రాజనాగం, జింక, అడవి దున్న మొదలైన అరుదైన జంతువులు ఉన్నాయి. జిల్లాలోని అడవిలో గులాబీ చెక్క, టేకు కలప, అరుదైన మొక్కలు, కొన్ని ఫంగస్ ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | 3 ఉడిపి, కుండపుర, కర్కల |
ప్రతిపాదించబడిన తాలూకాలు | బైందూర్, బ్రహ్మవర్ |
జిల్లా రూపకల్పన | 1997 ఆగస్ట్ |
అసెంబ్లీ నియోజక వర్గం | 5 కౌప్, ఉడిపి, కుండపుర, బైదూర్, కర్కల |
పార్లమెంటు నియోజక వర్గం | షిమోగా |
ఉడిపి జిల్లాలో వరి, కొబ్బరి పుష్కలంగా పండించబడుతుంది. తరువాత పోక (వక్క) తోటలు. ముంతమామిడి కూడా పండించబడుతుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వ్యవసాయదారుల నుండి పాలను సేకరించి వినియోగదారులకు అందిస్తుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు జిల్లాలోని మణిపాల్ వద్ద డైరీ ప్రొసెసింగ్ ప్లాంటు ఉంది. సమీపకాలంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా పాలను సేకరించడం, ప్రొసెసింగ్ సస్థలను నిర్వహిస్తుంది.
జిల్లాలో మంచినీటి చేపలు, ఉప్పునీటి చేపలు పరిశ్రమలు ఉన్నాయి. మాల్పె, గంగొల్లి చేపలపరిశ్రమ ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. అరేబియన్ సముద్రం చేపలపరిశ్రమకు ప్రధాన వనరుగా ఉంది.
జిల్లాలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రముఖ పరిశ్రమలు ఏవీ లేవు. అయినప్పటికీ జిల్లాకు కొన్ని ప్రముఖ పరిశ్రమలు రానున్నాయి. జిల్లాలో ఎర్రమట్టి పెంకులు (మంగుళూరు టైల్స్), ముంతమామిడి (జీడిపప్పు) కొబ్బరి నూనె పరిశ్రమలు ప్రకలకు వందలాది మందికి ఉపాది కలిగిస్తూ ఉన్నాయి. మణిపాల్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది. పై గ్రూప్‌కు చెందిన ఈ ప్రింటింగ్ ప్రెస్ నుండి అత్యున్నత సెక్యూరిటీ సంబంధిత చెక్కులు, షేర్ సర్టిఫికేట్లు, మొబైల్ రీచార్జ్ కూపన్లు, పలు భారతీయ విశ్వవిద్యాల కొరకు ప్రశ్నాపత్రాలు ముద్రించబడుతున్నాయి. అవిభాజిత దక్షిణ కనరా 4 ప్రభుత్వరంగ బ్యాంకులకు పి.ఎస్.బి (., విజయాబ్యాంక్, కనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్) జన్మస్థలం. జిల్లాలో లైఫ్ ఇంసూరెంస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఉడిపి) డివిషనల్ ఆఫీస్ ఉంది. రోబోసాఫ్ట్ టెక్నాలజీస్ SourceHub India Pvt Ltd, డాటా ట్రీ ఐ.టి సర్వీసెస్, యునైటెడ్ స్పెక్ట్రం సొల్యూషంస్- మొబైల్ అప్లికేషంస్, మణిపాల్ వద్ద మణిపాల్ డిజిటల్ సిస్టంస్ వారి కార్పొరేట్ ఆఫీసులు, రీజనల్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. రోబోసాఫ్ట్ ఉడిపికి అంతర్జాతీయ గురింపును తీసుకు వచ్చింది. నందికూర్ వద్ద నాగార్జునా గ్రూప్ విద్యుద్త్పత్తి కొరకు ఒక థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయబడింది. ఈ స్థాపించేసమయంలో పర్యావణ సంబంధిత వివాదాలు తలెత్తాయి. పదుబిద్రె వద్ద సుజలాన్ పవన విద్యుత్తు తయారీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. పదూర్ వద్ద కేంద్రప్రభుత్వం భూగర్భ పెట్రోలియం వెలికితీత కొరకు పనిచేస్తుంది.[7] పర్యావరణవాదులు ఇటువంటి పరిశ్రమల స్థాపన వలన అరణ్యాల పచ్చదనానికి భగంకలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు.
ఉడిపి జిల్లా రెండు జాతీయరహదార్లు ఉన్నాయి. జాతీయరహదారి 17 (ప్రస్తుతం జాతీయరహదారి 66 అని మార్చబడింది), రెండవది జాతీయరహదారి 13. జాతీయరహదారి 17 జిల్లా ఉత్తర దక్షిణ దిశగా పయనిస్తూ ఉడిపిని మంగుళూరు, కార్వార్, మురుదేష్వర, కొచ్చి, మద్గావ్, గోవా [8] రత్నగిరి, ముంబయితో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షిమొగా, బీజపూర్, సోలాపూర్, చిత్రదుర్గ, హోస్పేటలతో అనుసంధానిస్తుంది.
కొంకణి రైల్వే జిల్లాను పొరుగు జిల్లాలు, రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. జిల్లాలో ఉడిపి, బైందూర్, కుందపురె వద్ద ప్రధాన రైలు స్టేషన్లు ఉన్నాయి.
జిల్లాకు అతి సమీపంలోని విమానాశ్రయం జిల్లాకేంద్రం ఉడిపికి 55 కి.మీ దూరంలో బజ్పె వద్ద " మంగుళూరు విమానాశ్రయం " ఉంది.
ఉడిపి జిల్లాలో ప్రధానంగా తులుభాష, కన్నడ, బియరీ భాష, ఉర్దూ, కొంకణి భాషలు వాడుకలో ఉంది. ఉడిపి, దక్షిణ కన్నడ తులునాడు అంటారు. ఇక్కడ తులు ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. తులు భాషా శిలాశాసనాలు జిల్లా, పరిసర ప్రాంతాలలోని బర్కూర్ (పురాతన తులునాడు రాజధాని) లభిస్తున్నాయి. కన్నడ భాషా కుటుంబానికి చెందిన కుందకన్నడ కుందపూర్, బైందూర్ తాలూకా, హెబ్రి, బ్రహ్మవర్ ప్రాంతాలలో దీర్ఘకాలం నుండి వాడుకలో ఉంది. జిల్లాలోని గౌడసరద్వతి బ్రాహ్మణులు, మంగోలోరియన్ కాథలిక్స్ కొంకణి భాషను అధికంగా మాట్లాడుతుంటారు. జిల్లాలోని ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది. బైందూర్ లోని ముస్లిములలో బియరీ భాష, నవయాథ్ వాడుకలో ఉంది.
ఉడుపి వంటకాలు. ఉడుపి హోటల్లు ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయి.. సాధారణము శాకాహార వంటకాలలో ఉడుపి శైలి వంటలు చాలా ప్రసిద్ధి చెందినవి.[8] కర్ణాటక అంతటా ఉడిపి వంటలకు విశేష ఆధారణ ఉంది. ఉడిపి శైలి హోటల్స్ భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. అలాగే తరువాత ప్రంపంచమంతా విస్తరించాయి. ఉడిపి రెస్టేరెంట్లు దక్షిణ భారతీయ శాకాహార వంటకాలను మాత్రమే అందిస్తుంటాయి. ముంబయి, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో రుచికరమైన శాకాహార వంటకాలకు, మర్యాదపూర్వకంమైన సేవలకు ఉడిపి హోటల్స్ ప్రసిద్ధి చెందాయి. నేయి వేసి దోరగా కాల్చిన దోశ మద్యలో ఉర్లగడ్డకూరను చేర్చి మడిచి పెట్టి వివిధ రకాల చట్నీలతో అందించే మసాలా దోశను ఉడిపి హోటళ్ళ రూపకల్పన అన్నది ప్రత్యేకత.[8]
ఉడిపి జిల్లా పలువురు కన్నడ సాహిత్యకారులను అందించి కన్నడ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుంది. ఙానపీఠ అవార్డ్ గ్రహీత డాక్టర్ షివరామ కరంథ్ జిల్లాలోని కుగ్రామం కోటలో జన్మించారు. ముఖ్యమైన రచయితలు
యక్షగాన ప్రఖ్యాత నృత్య, నాటక సమ్మిశ్రిత జానపద సంప్రదాయ నృత్యరూపం. జిల్లాలో పలు యక్షగాన కళారూపాలు ఉన్నాయి. జిల్లాలో యక్షగాన శిక్షణాలయాలు ఉన్నాయి. నాగారాధనె జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో ఆచరించబడుతుంది. జిల్లాలో నాగరాధన సమయంలో నృత్యం, పూజ, రంగోలి మొదలైన కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భుటకోల, ఆటి కలెంజ, కద్యనాట మొదలైన రూపస్లలో జిల్లాలోని ప్రజలు ప్రకృతి ఆరాధన చేస్తుంటారు. గ్రామాలలో ప్రజలు కంబల, కోడిపందాలు, లగోరి, గిల్లి దండ మొదలైన క్రీడలను వీక్షిస్తుంటారు.
సంప్రదాయ నాటకరూపాలు జిల్లాలో సజీవంగా ఉన్నాయి. జిల్లాలో స్కూల్ డే, కాలేజీ డే వంటి సందర్భాలలో ప్రాంతీయవాసులు నాటకప్రదర్శన ఇవ్వడం నాటకపోటీలు నిర్వహించడం సాధారణంగా జరుగుతుంటాయి.
ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ విగ్రహం ఉంది. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచార్యులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు.
ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.
ఇక్కడ ధనుర్మాసం 4వ రోజు నిర్వహించే పూజకు భక్తులు విశేషంగా వస్తుంటారు.
ఉడిపి జిల్లాలో దట్టమైన సతతహరితారణ్యాలు ఉన్నాయి. ఇవి పశ్చిమకనుమలు, సహ్యాద్రి పర్వతారణ్యాలలో భాగమై ఉన్నాయి. అరణ్యాలలో ఉత్తనతమైన వృక్షజాల మైరియు జంతుజాల సంపద ఉంది.
నదులు సౌపర్నిక, స్వర్న, చక్రానది, సీతా, వర్హి నది, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి. త్రాగునీరు, విద్యుత్తు, ప్రయాణ వసతులు మొదలైన మౌలిక సదుపాయాలు లేవు. ఉదాహరణగా నదీద్వీపాలలో సుల్ కుర్దు, కన్నడ కుర్దు, బబ్బు కుర్దు, కట్టె కుర్దు, బెన్నె కుర్దు, కుక్కుడె కుర్దు, తిమ్మన్న కుర్దు, పాడు కుర్దు, హట్టి కుర్దు, బాల్ కుర్దు, బవలి కుర్దు, షెట్టి కుర్దు, ఉప్పిన కుర్దు, కురు, జరు కుర్దు ఉన్నాయి.
స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగిన సమయంలో తులువ ప్రజలు తులువ భాషకు అధికార హోదా, ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటం సాగించారు. ప్రస్తుత కర్ణాటక రాషంలోని దక్షిణ కన్నడ, ఉడిపి, కేరళ రాషంలోని కాసరగాడ్ జిల్లాలను కలిపిన భూభాన్ని కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం సాగించారు. తరువాత ఇది కొంత ఆణిచివేయబడినప్పటికీ సమీపకాలంగా ఈ కోరిక తిరిగి బలపడుతూ ఉంది. తులు రాజ్య హోరాట సమితి వంటి సంస్థలు ఈ కోరికను కేంద్రీకరించి తరచుగా సమావేశాలు, ప్రదర్శనలు తులువనాడు లోని పట్టణాలలో పోరాటం సాగిస్తున్నారు. తులు అధికారభాషగా చేయడం, తులువనాడులో తులువ భాషను బోధనా భాషగా చేయడం, తులు సంప్రదాయ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఈ పోరాటానికి ప్రధానాంశాలుగా పోరాటం కొనసాగుతూ ఉంది.[10][11][12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.