పురందర దాసు

కర్ణాటక సంగీత విధ్యంసుడు From Wikipedia, the free encyclopedia

Remove ads

పురందర దాసు (PURANDARA DHASU) (1470 1564) (కన్నడ: ಪುರಂದರ ದಾಸ)[1] ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు,, కర్ణాటక సంగీత పితామహులు.[2][3] ఇతడు రచించిన కీర్తనలు ఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి .[4] అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశాడు. కొందరి అంచనా ప్రకారం దాసుగారు 475,000 కీర్తనలు రచించారు. అయితే అందులో ఒక వెయ్యి మాత్రమే మనకు లభించాయి.[5] పురందర దాసు కీర్తనలు చాలా పుస్తకాలు, వెబ్ సైటులలో ఉన్నాయి.[6] వీనిలో ఇంచుమించు 225 బహుళ ప్రాచుర్యం పొందినవి అచ్చువేశారు.[7] ఇంచుమించు 100 కీర్తనలు ఇంగ్లీషులో అచ్చువేశారు.[8] పురందర దాసు సంఘంలో అన్ని తరగతుల వారికి చెందిన కీర్తనలు రచించారు. ప్రతి కీర్తన భాషాపరంగా, సంగీతపరంగా అత్యంత విలువలు కలవిగా ప్రశంసించబడ్డాయి.[9]

త్వరిత వాస్తవాలు పురందర దాసు, జన్మ నామం ...
Remove ads
Remove ads

జీవితచరిత్ర

పురందర దాసు సా.శ. 1470లో పూణే సమీపాన గల గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వరదప్ప నాయక్ ప్రముఖ వడ్డీ వ్యాపారి. తల్లిదండ్రులు వేంకటేశ్వరుని భక్తులగుటచేత పురందరునికి శ్రీనివాస నాయక్ అని నామకరణం చేశారు. శ్రీనివాసుడు బాల్యంలో సంస్కృతం, కన్నడం చదువుకున్నాడు. తరువాత సరస్వతీ బాయినిచ్చి పెళ్ళి చేశారు. తండ్రి చనిపోయిన తరువాత ఆతని అడుగుజాడలలో వ్యాపారం చేస్తూ లక్షలకు లక్షలు గడించాడు. మిక్కిలి ధనవంతునిగా గణనకెక్కాడు. పిసినారిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు పరమేశ్వరుడు భార్యద్వారా జ్ఞానోదయం కలిగించాడు. పిదప తన సర్వస్వం బీదలకు పంచిపెట్టి, కట్టుబట్టలతో విద్యానగరం (విజయనగరం) చేరాడు. వ్యాసరాయలను ఆశ్రయించాడు. నాటి నుండి శ్రీనివాసులు పురందర దాసుగా దేశం నలుమూలలా హరినామ సంకీర్తనం చేస్తూ తిరిగాడు. సాధారణ భక్తి భావం మొదలుకొని, కీలకమైన తత్త్వబోధ ఆయన కీర్తనలలో కనిపిస్తాయి.

పురందరదాసు తొంభై ఐదు సంవత్సరాలు జీవించి సా.శ. 1564లో కాలధర్మం చెందాడు. పుట్టుకతో మహారాష్ట్ర వాడైనా కన్నడ భాషలో రచనలు చేసి, కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపి, కర్ణాటక ప్రజలకు ప్రీతిపాత్రుడైనాడు.

తన వాగ్గేయ కృతులకు ఈయన, సమకాలికులికులైన ఆంధ్ర పదకవిత పితామహుడైన అన్నమాచార్యులను గురువుగా భావించాడు.[10] వ్యాసతీర్థలు, కనకదాసులు ఈయనకు ఇతర సమకాలికులు.

Remove ads

పురందర దాసు , కర్ణాటక సంగీతము

కర్ణాటక సంగీత సాధనకు పురందర దాసు అనేక శాస్త్రీయ పద్ధతులు కనుగొనెను. ఏన్నొ వందల సంవత్సరములు గడిచినా, ఈ నాటికి అవే పద్ధతులను సంగీత భొధనకు ఉపయోగించడం ఒక విషేశం. ఇతను కర్ణాటక సంగీతంలో ప్రధానమైన "రాగ మాయమాళవగౌళ" పద్ధతిని అవిష్కరించెను. ఇతర బోధనా పద్ధతులైన స్వరావళులు, జంట స్వరాలు, అలంకారాలు, లక్షణ గీతాలు, ప్రబంధాలు, యుగభోఘలు, దాటు వరసలు,గీతాలు, సూలదిలు, కృతులు వంటి ఆంశాలు కూడా కనుగొనెను. సాధరణ మానవులు కూడా అనువుగా పాడుకొనుటకు అనువైన జానపదులను కూడా రచించెను. పురందర దాసు ఒక వాగ్గేయకారుడు, సంగీత అధ్యయన వేత్త, కృతి కర్త. ఆందుకే అతన్ని "కర్ణాటక సంగీత పితామహా" అని పిలుస్తారు. కర్ణాటక సంగీతంలో మొదటి లాలి పాటను రచించి, శ్రుతులు కట్టినాడు.

Remove ads

పురందర దాసు, త్యాగరాజు

ప్రముఖ వాగ్గేయకారులు అయిన త్యాగరాజు గారు ( 1767 1847 మే 4 జనవరి 6) పురందర దాసు నుండి ప్రేరణ పొందారని చరిత్రలో చెప్పబడింది. త్యాగరాజు గారు తన రచన ప్రహ్లాద విజయంలో పురందర దాసు గారిని ఈ విధముగా శ్లాఘించారు. दुरितव्रातमुलेल्लनु परिमार्चेडि हरिगुणमुल बाडुचु नेप्पुडुन् परवशुड वेलयु पुरन्दरदासुनि महिमलनु दलचेद मदिलोन्. పాపములను పారద్రోలు ఆ భగవంతుడు అయిన హరి కీర్తించెద ఎల్లపుడు నేను మదిలోన పురందరుని తలుచుకొని. వీరు ఇద్దరు రాముడు, కృష్ణుడు ఎడల అధిక భక్తి భావం, ఆరాధనా భావము కలిగి వుండెడి వారు. వారి రచనలు ఎంతో సాధారణంగా వున్నను అంతర్లీనముగా ఎంతో తాత్విక ఆధ్యాత్మికతను కలిగివుండెడివి. వారు ఇరువురు నరస్తుతిని చేయలేదు. గొప్ప వాగ్గేయకారులయనప్పటికిని ఏనాడు రాజాశ్రము చేయలేదు, రాజ కానుకలను ఇష్టపడలేదు. ఫురందర దాసు తమ సమకాలీనుడయిన విజయనగర రాజ అనుగ్రహము, ఆశ్రయముని ఆశించలేదు. అదే విదముగా త్యాగరాజు కూడా మైసూరు, తాంజావురు,, ట్రంవెంకొర్ సంస్థానముల రాజ పిలుపులను తిరస్కరించారు. తమ మనసులోని భావాలను సంగీత రూపంలో వ్యక్తపరిచి జాతిని వుద్దరించారు.

సత్కారములు

తిరుపతి తిరుమల దేవస్థానం ప్రచారం, దాసా సాహిత్య ప్రాజెక్ట్ కింద పురందర దాసు సాహిత్య ప్రచారం చేస్తున్నది. పురందర దాసు విగ్రహం అలిపిరిలో తిరుమల పాదాల వద్ద స్థాపించబడింది.

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads