మార్చి 16– పవిత్ర రోమన్ సామ్రాజ్యం, గ్రేట్ బ్రిటన్, డచ్ రిపబ్లిక్, స్పెయిన్ ల మధ్య వియన్నా ఒప్పందం కుదిరింది.
ఏప్రిల్ 1: సర్‌సేనాపతి త్రయంబకరావు దభాడే, బాజీరావ్ పేష్వాల మధ్య దభోల్ యుద్ధం జరిగింది.
ఏప్రిల్: క్యూబాలోనిస్పానిష్ కోస్ట్ గార్డ్స్ బ్రిటిష్ వ్యాపారి రాబర్ట్ జెంకిన్స్ చెవిని కత్తిరించారు. 1739లో జరిగిన జెంకిన్స్ చెవి యుద్ధానికి ఇది కారణమైంది. [1]
అక్టోబర్ 23: వెస్ట్ మినిస్టర్ లోని అష్బర్న్హామ్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 114 రాతప్రతులు ( ఆంగ్లో-సాక్సన్ క్రానికల్ యొక్క మాన్యుస్క్రిప్ట్తో సహా) కాలిపోయాయి. మరో 98 దెబ్బతిన్నాయి. (వాటిలో బేవుల్ఫ్ మాన్యుస్క్రిప్ట్ కూడా ఉంది). కింగ్స్ లైబ్రేరియన్, హౌస్ యజమాని డాక్టర్ రిచర్డ్ బెంట్లీ, కోడెక్స్ అలెగ్జాండ్రినస్ యొక్క ఏకైక కాపీని కాపాడాడు. అతను దాన్ని చంకలో పెట్టుకుని కిటికీ నుండి దూకేసాడు. గ్రీకు నిబంధనను అనువదించడానికి డాక్టర్ బెంట్లీ పడిన పదేళ్ల శ్రమ బూడిదైపోయింది. మిగిలిన 844 రాతప్రతులే ఆ తరువాతి కాలంలో బ్రిటిష్ లైబ్రరీకి ఆధారభూతమయ్యాయి. [2][3]
"Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p49
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.