From Wikipedia, the free encyclopedia
హూద్ (ఆంగ్లం Hũd), (2500 క్రీ.పూ.?)[1][2]), (అరబ్బీ భాష هود) ఒక ఇస్లామీయ ప్రవక్త. ఇతడి గురించి వర్ణణ ఖురాన్ లోని 11వ సూరాలో ఉంది. ఈ సూరా పేరు హూద్, ఇతని పేరున ఉంది.[3][4] హూద్ ప్రవక్త, నూహ్ (نوح), ప్రవక్త పరంపరకు చెందినవాడు. బైబిల్లో ఇతని పేరు "ఎబేర్"
Prophet Hud | |
---|---|
Prophet, Seer, Apostle to 'Ad | |
జననం | ʿĀd |
గౌరవాలు | Islam |
పెద్ద ప్రార్ధనామందిరము | Kabr Nabi Hud, Hadhramaut |
వివాదం | The identification of Hud with Eber has been the subject of debate in Islam |
|
ఖురాన్ ప్రకటన ప్రకారం అల్లాహ్ హూద్ ప్రవక్తను ఆ'ద్ (عاد) ప్రజలను హెచ్చరించడానికి వారి వద్దకు పంపాడు. ఈ మధ్య కాలంలో కనుగొనబడ్డ నగరం ఉబార్, ఖురాన్ లో ఇరమ్ (إرَم),గా వర్ణింపబడినది, దీనినే 'ఆద్ ప్రజల రాజధానిగా భావిస్తున్నారు.'ఆద్ ప్రజలు యెమన్, ఒమన్ దేశాల మధ్య గల ప్రాంతంలో నివసించారు. వీరు నిర్మాణ కళలలో ఉద్ధండులు. ఎత్తైన సౌధాలు, కళాకృతులు, శిల్పకళలలో వీరు ఆరితేరిన వారు. వీరు దైవం (అల్లాహ్) ఉన్నాడని గుర్తించిననూ, ప్రాపంచిక మదముతో ఈశ్వరుడైన అల్లాహ్ ను ధిక్కరించి, అల్లాహ్ శాపానికి గురయ్యారు.
ఆద్ ప్రజలు నివసించిన ప్రాంతం యెమన్ లోని వాదీ హజ్రమౌత్ ఒకటి. ఈ ప్రాంతపు నిర్మాణాలు, కొండలలోని పెద్ద పెద్ద రాళ్ళలో గుహలను త్రవ్వి నిర్మాణాలు గావించారు. నేటికినీ ఈ నిర్మాణాలు కానవస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.