Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సివాన్ జిల్లా (హిందీ:) ఒకటి. సివాన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 1972 నుండి సివాన్ జిల్లా సారణ్ డివిజన్లో భాగం. జిల్లాలోని జిరాడెయికి చెందిన ... మొదటి భారత అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఈ జిల్లా ప్రత్యేకత.[1] జిల్లాలోని అలిగంజ్ గ్రామానికి అలి సావన్ ఙాపకర్ధం పేరు నిర్ణయించబడింది. సివాన్ జిల్లాకు పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత ఉంది. సివాన్ పార్లమెంటు నుండి " ఓం ప్రకాష్ యాదవ్ " పార్లమెంటుకు ఎన్నిక చేయబడ్డాడు.[2]
సివాన్ జిల్లా
सीवान ज़िला ضلع سیوان | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | సారణ్ |
ముఖ్య పట్టణం | సివాన్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | సివాన్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,219 కి.మీ2 (857 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 33,18,176 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 71.59 % |
• లింగ నిష్పత్తి | 984 |
ప్రధాన రహదార్లు | NH 85 |
Website | అధికారిక జాలస్థలి |
సివాన్ బీహార్ రాష్ట్ర పశ్చిమ భూభాగంలో ఉంది. ఇది సారణ్ డివిజన్లో భాగం. పురాతన కాలంలో ఇది కోసల రాజ్యంలో భాగం.[3] 1976లో సారణ్ జిల్లా నుండి వేరుచేసి సివాన్ ఉపవిభాగాన్ని పూర్తిస్థాయి జిల్లాగా మార్చారు..[4]
ఈ ప్రాంతాన్ని పాలించిన బంధ్ రాజు శివమాన్ కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. శివమాన్ వారసులు ఈ ప్రాంతాన్ని బాబర్ ప్రవేశించే కాలం వరకు పాలించారు. సివాన్ అంటే సరిహద్దు. ఇది బీహార్ సరిహద్దు వరకు ఉంది కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. సివాన్ జిల్లాలోని ఉపవిభాగం మహరాజ్గంజ్ వద్ద మహారజ నివాసం ఉంది కనుక మహరాజ్గజ్ అయిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని భెర్బనియా గ్రామం వద్ద జరిపిన త్రవ్వకాలలోఒక చెట్టు కింద సమీప కాలంలో విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అందువలన ఇక్కడ ఒకప్పుడు వైష్ణవులు పెద్ద సంఖ్యలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రానికి సరిహద్దుగా లేదు. 1790లో గొరఖా రాజు కొంతకాలం తనసామ్రాజ్యాన్ని శివన్ వరకు విస్తరించాడు. తరువాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఘోరకరాజును తిప్పి కొట్టాడు. ఇప్పుడీ ప్రాంతంలో యాదవులు, రాజపుత్రులు అధికంగా నివసిస్తున్నాడు.[5]
8వ శతాబ్దంలో సివాన్ బనారస్ రాజ్యంలో భాగం అయింది. 13వ శతాబ్దంలో సివాన్ ప్రాంతంలో ముస్లిములు ప్రవేశించారు. 15వ శతాబ్దంలో సికందర్ లోడీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. బాబర్ సివాన్ ప్రాంతంలోని ఘాఘ్రా నదిని దాటి ఈ ప్రాంతంలో ప్రవేశించాడు. 17వ శతాబ్దంలో మొదట డచ్ వారు వారి వెంట ఇంగ్లీష్ వారు ఈ ప్రాంతంలో ప్రవేశించారు. 1765లో జరిగిన బక్సర్ యుద్ధం తరువాత ఈ ప్రాంతం బెంగాల్ రాష్ట్రంలో భాగంగా మారింది. 1875లో స్వాతంత్ర్యసమరంలో సివాన్ ప్రజలు ప్రధాన పాత్రవహించారు. ఈ జిల్లా స్టాల్వర్ట్, భోజ్పురీలకు ప్రసిద్ధం. వారు శారీరక సహనానికి, వీరత్వానికి పేరుపొందారు. వీరు అధికంగా పోలీస్, మిలటరీ ఉద్యోగాలకు నియమించబడుతుంటారు. [3]
జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
సివాన్ బ్లాకులోని మెహందర్ ధాంలో శివునికి, విశ్వకర్మకు ఒక ఆలయం ఉంది. శిరాత్రి నాడు ఈ భవనానికి భక్తులు అధికంగా వస్తారు. సెప్టెంబరు 17న ఇక్కడ విశ్వకర్మపూజ నిర్వహించబడుతుంది. ఇక్కడ 748800 చ.అడుగుల వైశాల్యంలో ఒక కోనేరు నిర్మించబడింది. పూర్వం ఇక్కడ ఉన్న చిన్న కోనేరులో నేపాల్ రాజు తన యాత్రసమయంలో స్నానం చేసాడని. తరువాత ఆయనకు కుష్టు వ్యాధి నయం అయిందని అందువలన ఆయన ఈ కోనేరుని విశాలంగా పునర్నిర్మించాడని విశ్వసిస్తున్నారు.
కొరర గ్రామం మైర్వ బ్లాకులో ఉంది. మైర్వా ఆనకట్టకు 2కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శివాలయం, దుర్గా ఆలయాలతో జిల్లాలో మొదట నిర్మించిన సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో రాజీవ్ కుమార్ సింగ్ (బిట్టు సింగ్) ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.
దరౌ బ్లాకులోని డాన్ గ్రామంలో ఉన్న శిథిలమైన కోటకు మహాభారతంలోని ద్రోణాచార్యునకు సంబంధం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న దోన అందరికీ తెలియనప్పటికీ ఇది బౌద్ధుల యాత్రీక ప్రదేశాలలో ఒకటిగా భావించబడుతుంది. చైనా యాత్రీకుడు హూయంత్సాంగ్ తన భారతదేశ యాత్రలో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. బుద్ధుని అస్థులు భద్రపరచిన ప్రాంతం అని విశ్వసిస్తున్నారు. హ్యూయంత్సాంగ్ సందర్శించిన సమయంలో ఈ స్థూపం శిథిలావస్థలో ఉందని వర్ణించాడు. ప్రస్తుతం దోన గడ్డి నిండిన కొండగా ఉంది. దాని మీద ప్రస్తుతం తరా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం సా.శ. 9వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. బౌద్ధ యాత్రీకులు ఇప్పుడు కూడా ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని దర్శిస్తూనే ఉన్నారు.
ఇది ఒక మండల కేంద్రంగా ఉండేది. దీనిని బస్నౌలి గంగార్ అని కూడా పిలిచేవారు. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ ఫులేనా ప్రసాద్ తన ఉద్యమ కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నడు.
భికబంధ్ సివాన్ జిల్లాలోని మహరాజ్గంజ్ మండలం లోని గ్రామం. ఇక్కడ ఉన్న పెద్ద చెట్టు కింద భైయ - బహిని ఆలయం ఉంది. 14వ శతాబ్దంలో ఇక్కడ అన్నా - చెల్లెలు మొగల్ సైన్యాలతో పోరాటం చేసి మరణించారని అందువలన ఇక్కడ అన్నా చెల్లెలి కొరకు ఆలయం నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. .[6]
సోహంగర గుతాని మండలంలోని ప్రాంతం. ఇక్కడ ప్రముఖ శివాలయం ఉంది. ఇది జిల్లా కేంద్రం సివాన్ పట్టణానికి 40కి.మీ దూరంలోనూ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని దియోరియా జిల్లా సరిహద్దుకు సమీప ంలో ఉంది.[7]
సివాన్ జిల్లా వైశాల్యం 2219 చ.కి.మీ.,[8] ఇది రష్యాలోని విల్సెక్ ద్వీపం వైశాల్యానికి సమానం.[9]
సివాన్ జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : సివాన్, మహరాజ్గంజ్.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,318,176,[10] |
ఇది దాదాపు. | ఉరుగుయే దేశ జనసంఖ్యకు సమానం.[11] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[12] |
640 భారతదేశ జిల్లాలలో. | 101వ స్థానంలో ఉంది..[10] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1495 [10] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.25%.[10] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 984:1000 [10] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 71.59%.[10] |
జాతియ సరాసరి (72%) కంటే. | స్వల్పంగా తక్కువ |
శివన్ జిల్లాలో గ్రామాలు :- బర్హన్ గోపాల్,పిహులి,తర్వర,కర్మసి,గరర్, బిషంభెర్పుర్, అఘైల,పిథౌరి,పచౌర,పచలఖి, భర్థుఇ, సలెంపుర్, ఢనవతి మఠం హసూ, షరీఫ్ జలాల్పూర్,హథౌర,హరిహన్స్, మద్కన్, ఖలిస్పుర్, పెర్తప్పుర్, తివారీ కే బధయ, కొహర్వలియ, ఆత్తెర్సువ, బగౌర, సమర్దహ్, బెలఒన్, కణౌలి, మైర్వహ్, జిరదై, భిత్తి, షెఖ్పుర, షహర్కొల, హరియమ, ఖెద్వ, బస్వన్, నగరిలో ముర్వర్, ఆఅందర్, జతౌర్, షివ్పుర్, కాలా దుమ్ర, సక్ర, సొనహుల, చిత్బిస్రన్వ్, లౌవన్, మహ్పుర్, ముసెహ్రి (వ్యక్తి) సవన (రాజ్పుట్), సర్సర్ (భూమిహార్), ఆంలోరి, చైంచప్ర (షెఖ్) .మధొపుర్, జగర్నథ్పుర్ లక్ష్మిపూర్, ష్యంపుర్, కల్యాణ్పూర్ జమొబజర్, రచొపలి, ఆసఒన్, బభ్నౌలి, రాంపూర్ ఉధొ, పతర్, కుతుబ్ చాప్రా, మొహమ్మద్పూర్ లో, హర్పుర్ కొత్వ, చకరి బజార్.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.