Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సివాన్ బీహార్ రాష్ట్రం, సివాన్ జిల్లా లోని పట్టణం. [4] ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఇది ఉత్తర ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఉంది. [5]
సివాన్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26.22°N 84.36°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | సివాన్ |
విస్తీర్ణం | |
• Total | 69.4 కి.మీ2 (26.8 చ. మై) |
• Rank | 53rd |
Elevation | 72 మీ (236 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 1,35,066 |
• Rank | 18th |
• జనసాంద్రత | 1,900/కి.మీ2 (5,000/చ. మై.) |
భాష | |
• అధికారిక | హిందీ[3] |
Time zone | UTC+5:30 (IST) |
Pin Code | 841226-841227 |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-29 |
సివాన్ పట్టణం 26.22°N 84.36°E అక్షాంశ, రేఖాంశాల వద్ద, [6] సముద్ర మట్టం నుండి 72 మీటర్ల ఎత్తున ఉంది. పట్టణం పశ్చిమ ప్రాంతం గుండా దహా నది ప్రవహిస్తోంది. వేసవిలో ఇది ఎండిపోతుంది. ఇది అత్యంత కలుషితమైన నది కూడా
సివాన్ శీతోష్ణస్థితి సాధారణంగా తేలికపాటి వేడిగా, సమశీతోష్ణంగా ఉంటుంది. కొప్పెన్-గీగర్ వాతావరణ వర్గీకరణ ప్రకారం ఈ వాతావరణం క్వాగా పరిగణించబడుతుంది.
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సగటు అధిక °C (°F) | 23.1 (73.6) |
26.1 (79.0) |
32.4 (90.3) |
36.2 (97.2) |
38.6 (101.5) |
36.2 (97.2) |
32.8 (91.0) |
32.3 (90.1) |
32. (90) |
31.8 (89.2) |
28.7 (83.7) |
24.7 (76.5) |
31.2 (88.3) |
రోజువారీ సగటు °C (°F) | 16.4 (61.5) |
18.9 (66.0) |
24.5 (76.1) |
28.9 (84.0) |
32 (90) |
31.4 (88.5) |
29.4 (84.9) |
29.2 (84.6) |
28.7 (83.7) |
26.7 (80.1) |
21.6 (70.9) |
17.6 (63.7) |
25.4 (77.8) |
సగటు అల్ప °C (°F) | 9.8 (49.6) |
11.8 (53.2) |
16.7 (62.1) |
21.7 (71.1) |
25.5 (77.9) |
26.6 (79.9) |
26 (79) |
26.2 (79.2) |
25.5 (77.9) |
21.7 (71.1) |
14.5 (58.1) |
10.5 (50.9) |
19.7 (67.5) |
సగటు అవపాతం mm (inches) | 21 (0.8) |
7 (0.3) |
11 (0.4) |
7 (0.3) |
25 (1.0) |
164 (6.5) |
257 (10.1) |
316 (12.4) |
192 (7.6) |
54 (2.1) |
6 (0.2) |
2 (0.1) |
1,062 (41.8) |
Source: Climate-data.org[7] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సివాన్ జనాభా 1,35,066, వీరిలో 70,756 మంది పురుషులు, 64,310 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 18,282. సివాన్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 92,967, ఇది జనాభాలో 68.8%. పురుషుల్లో అక్షరాస్యత 73.6% కాగా, స్త్రీలలో ఇది 63.6%. సివాన్‌లో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 79.6%, ఇందులో పురుషుల అక్షరాస్యత 85.2%, స్త్రీల అక్షరాస్యత 73.5%. షెడ్యూల్డ్ కులాలు జనాభా 8,244, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,514. 2011 లో సివాన్‌లో 21,223 గృహాలు ఉన్నాయి. [2]
మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని (65%), ఇస్లాంను (34%) అనుసరిస్తున్నారు. సిక్కు మతం, బౌద్ధమతం, జైన మతలను అవలంబించినవారి సంఖ్య స్వల్పంగా ఉంది. [8]
జాతీయ రహదారి-531 సివాన్‌ను గోపాల్‌గంజ్, ఛప్రా లతో కలుపుతుంది. ఈ రహదారి గోపాల్‌గంజ్ వద్ద జాతీయ రహదారి-27 తో కలుస్తుంది. ఇది భారతదేశంలో రెండవ పొడవైన రహదారి. బీహార్ రాష్ట్ర రహదారి -47 బర్హారియా, మైర్వా, గుథానీలను సివాన్తో కలుపుతుంది. రాష్ట్ర రహదారి -73, 89 సివాన్‌ను సమీప పట్టణాలతో, గ్రామాలతో కలుపుతుంది.
సివాన్‌లో లోని సివాన్ జంక్షన్ రైల్వే స్టేషను పట్టణాన్ని భారతదేశంలోని ప్రధాన పట్టణాలతో కలుపుతుంది. ఇది ఛప్రా, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్, థావేలను నేరుగా కలుపుతుంది. ఇతర రైల్వే స్టేషన్లు మైర్వా, దురౌంద, జిరాడే, మహారాజ్‌గంజ్ .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.