సిమ్‌డేగా

ఝార్ఖండ్ లో నగరం, ఇండియా From Wikipedia, the free encyclopedia

సిమ్‌డేగాmap

సిమ్‌డేగా, జార్ఖండ్‌ రాష్ట్రం సిమ్‌డేగా జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఇది సముద్రమట్టం నుండి సుమారు 418 మీటర్ల ఎత్తున ఉంది. సిమ్‌డేగా జిల్లాకు ఉత్తరాన గుమ్లా, తూర్పున రాంచీ, పశ్చిమ సింఘ్భూమ్, పశ్చిమాన జశ్‌పూర్ నగర్ (ఛత్తీస్‌గఢ్), దక్షిణాన రూర్కెలా (ఒడిశా) ఉన్నాయి. [1] గ్రేటర్ రూర్కెలా, సిమ్‌డెగాల మధ్య దూరం 35 కి.మీ. రూర్కెలా, రాంచీ ల నుండి జాతీయ రహదారి 143 ద్వారా పట్టణం చేరుకోవచ్చు. సిమ్‌డేగాకు సమీపం లోని రైల్వే స్టేషను రూర్కెలా.

త్వరిత వాస్తవాలు సిమ్‌డేగా, దేశం ...
సిమ్‌డేగా
పట్టణం
Thumb
సవ్యదిశలో- కేలాఘాగ్ ఆనకట్ట, పర్వత ప్రంతం, జిల్లా కలెక్టరు కార్యాలయం
Nickname: 
Nursery of Sports
Thumb
సిమ్‌డేగా
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22.62°N 84.52°E / 22.62; 84.52
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాసిమ్‌డేగా
Founded byబీరూగఢ్ రాజ్యం
Elevation
418 మీ (1,371 అ.)
జనాభా
 (2011)
  Total5,99,813
  Rank22
భాషలు
  అధికారికహిందీ, నాగ్‌పురి, ఒరియా.
Time zoneUTC+5:30 (IST)
PIN
835223
Telephone code+91-6525
Vehicle registrationJH 20
మూసివేయి

శతాబ్దాలుగా ఈ ప్రాంతం కళింగ రాజ్యంలో, గజపతి రాజుల పాలనలో ఉంది. ఈ ప్రాంతం సాంస్కృతికంగా స్థానిక, ఒరియా సంస్కృతుల సమ్మేళనం. ఒరియా సంస్కృతి ప్రభావం ఈ ప్రాంతంలో, ప్రజలలో గణనీయంగా ఉంది. ఈ ప్రాంతం చక్రవర్తి అశోకుడితో, బౌద్ధమతంతో చారిత్రక సంబంధాన్ని కలిగి ఉందని పురావస్తు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.

చరిత్ర

సిమ్‌డేగా పూర్వం కైసాల్పూర్-బీరూగఢ్ పరగణాల రాజ్యంలో భాగం. [2] శతాబ్దాలుగా గజపతి వంశానికి చెందిన గంగా వంశీ రాజు పాలించాడు. సిమ్‌డేగా నగరం నుండి జాతీయ రహదారి 23 పై 11 కి.మీ. దూరంలో ఉన్న బీరూగఢ్‌లో ఇప్పటికీ గజపతి కుటుంబం నివసిస్తోంది. పీఠభూమి యొక్క ఈ ప్రాంతంలో గిరిజనులు, ఒరియా ప్రజలూ నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీలు ఎప్పుడూ ప్రాబల్యంలో ఉంటూ వచ్చారు. పూర్వపు గజపతి రాజులు, వారి సామంతులూ విరాళంగా ఇచ్చిన భూములలో వీళ్ళు పాఠశాలలు, కాన్వెంట్లు, ఆసుపత్రులు, చర్చిలను స్థాపించారు. క్రైస్తవ మిషనరీలు, ముఖ్యంగా సొసైటీ ఆఫ్ జీసస్, ఈ ప్రాంతంలో అనేక క్రైస్తవ పాఠశాలలను స్థాపించి, విద్యా వ్యాప్తికి కృషి చేసింది.

దక్షిణ జార్ఖండ్‌లో లాగా, ఈ ప్రాంతాన్ని కూడా ఒరియా సంస్కృతి బాగా ప్రభావితం చేసింది. ఒరియా రాజులు ఈ ప్రాంతాన్ని శతాబ్దాలుగా పరిపాలించారు. బ్రిటిష్ రాజ్ కాలంలో కూడా వాళ్ళే ఇక్కడి పాలకులు. కైసల్పూర్-బీరూగఢ్ కు చెందిన గజపతి రాజులు ఒడిశా నుండి ఒరియా-బ్రాహ్మణ పండితులను ఈ ప్రాంతానికి పిలిపించారు. క్రమంగా ఈ ఒరియా బ్రాహ్మణులు కైసాల్పూర్-బీరూగఢ్ రాజ్యంలోని ప్రతి మూలలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలోని మారుమూల గ్రామాలలో కూడా ఈ ఒరియా బ్రాహ్మణ కుటుంబాల వారు కనిపిస్తారు. గజపతి రాజులు వారికి ఎకరాల మేరకు భూములను, గ్రామాలను, జమీందారీలనూ విరాళ మిచ్చారు. ఈ ప్రాంతంలోని పాఠశాలల నుండి కొందరు ప్రముఖ హాకీ ఆటగాళ్ళు వచ్చారు. ఒలింపిక్స్‌తో పాటు, అనేక ఇతర జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. దీనిని జార్ఖండ్‌లో హాకీ ఆటకు ఊయల అంటారు. [3]

జనాభా వివరాలు

2011 జనగణనప్రకారం, సిమ్‌డెగా జనాభా 42,944. జనాభాలో పురుషులు 52%, మహిళలు 48% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సిమ్‌డేగాలో సగటు అక్షరాస్యత రేటు 85.46%. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ఇందులో పురుషుల అక్షరాస్యత 89.22% కాగా, స్త్రీల అక్షరాస్యత 81.54%.

క్రీడలు

Thumb
సిమ్‌డేగా హాకీ స్టేడియం

సిమ్‌డేగాను జార్ఖండ్ రాష్ట్రపు 'హాకీ ఊయల' అని అంటారు. భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న అగ్రశ్రేణి క్రీడాకారులు ఇక్కడి నుండి వచ్చారు. సిల్వానస్ డుంగ్ డుంగ్ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో హాకీలో స్వర్ణం గెలుచుకున్న జట్టు సభ్యుడు. మైఖేల్ కిండో 1972 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన జట్టు సభ్యుడు. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ అసుంతా లక్రా సిమ్‌డేగాకు చెందినవారే. [4]

ఇటీవల, నగరంలో 'ఆస్ట్రోటర్ఫ్ హాకీ స్టేడియం'ను నిర్మించారు. [5] ఇతర క్రీడల కోసం నగరంలో ఆల్బర్ట్ ఎక్కా స్టేడియం అనే పేరుతో మరొక స్టేడియం కూడా ఉంది.

భౌగోళికం, వాతావరణం

సిమ్‌డేగా వద్ద ఉంది22.62°N 84.52°E / 22.62; 84.52 . [6] ఇది సగటు ఎత్తు 418 మీటర్లు (1371 అడుగులు).

సిమ్‌డెగాలో వెచ్చని, సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. వర్షం ఎక్కువగా వర్షాకాలంలో పడుతుంది. వేసవిలో తక్కువ వర్షం పడుతుంది. కోప్పెన్-గీగర్ వాతావరణ వర్గీకరణ ప్రకారం ఈ వాతావరణాన్ని Csa గా పరిగణిస్తారు. సిమ్‌డెగాలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 25.1 °సి. వార్షిక సగటు వర్షపాతం 1450 మి.మీ. అత్యంత పొడిగా ఉండే నెల డిసెంబరు. ఆ నెలలో 3 మి.మీ వర్షపాతం ఉంటుంది. ఆగస్టులో, అవపాతం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ నెలలో సగటున 410 మి.మీ. వర్షపాతం ఉంతుంది. సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెల మే. ఈ నెలలో సగటు ఉష్ణోగ్రత 33.0 °సి. చేరుకుంటుంది. డిసెంబరు 17.9 °C సగటు ఉష్ణోగ్రతతో అత్యంత శీతలంగా ఉండే నెల. [7]

రవాణా

సిమ్‌డేగా జార్ఖండ్-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల కూడలిలో ఉంది.

నగరంలో బస్ టెర్మినల్ ఉంది, ఇక్కడి నుండి పొరుగు రాష్ట్రాలలోని నగరాలకు బస్సులు నడుస్తున్నాయి. రాంచీ, సిమ్‌డేగా నుండి రాంచీకి గంట గంటకూ రెగ్యులర్, డీలక్స్ ఎయిర్ కండిషన్డ్ బస్సులు నడుస్తాయి.

రోడ్డు రవాణా

రాంచీ, గుమ్లా, లోహర్‌దాగా, సాసారమ్, సంబల్‌పూర్, రూర్కెలా (ఒరిస్సా) నుండి ప్యాసింజర్ బస్సులు, నాన్ స్టాప్ బస్సులు క్రమం తప్పకుండా నడుస్తాయి.

  1. సిమ్డెగా నుండి రాంచీ - 155 కి.మీ
  2. సిమ్‌డెగా నుండి రూర్కెలా ( ఒడిశా ) - 70 కి.మీ.
  3. సిమ్‌డెగా నుండి గుమ్లా - 77 కి.మీ.
  4. సిమ్‌డేగా నుండి గయ ( బీహార్ )- 320 కి.మీ
  5. సిమ్‌డేగా నుండి సంబల్‌పూర్ ( ఒడిశా )- 158 కి.మీ
వైమానిక

రూర్కెలా విమానాశ్రయం [8] సమీప విమానాశ్రయం. రాంచీ విమానాశ్రయం, ఝార్సుగూడ విమానాశ్రయాలు సమీపం లోని ఇతర విమానాశ్రయాలు.

రైలు

రూర్కెలా, నగరానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషను. రాంచీ నుండి లోహర్‌దాగా, గుమ్లా మీదుగా సిమ్‌డేగాకు కొత్త రైలు మార్గం ప్రతిపాదనలో ఉంది.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.