ఒడియా భాష

ఒడిషా రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భారతీయ భాష From Wikipedia, the free encyclopedia

ఒడియా భాష

ఒరియా (ଓଡ଼ିଆ oṛiā), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భారతీయ భాష. ఒరియా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వం తూర్పు భారతదేశంలో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించిందని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్, అరబిక్ భాషల ప్రభావం చాలా స్వల్పం.

ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట
ఒడియా వర్ణమాల ఉచ్చారణ.

ఒరియాకు 13వ శతాబ్దం నుండి ఘనమైన సాహితీ వారసత్వం ఉంది. 14వ శతాబ్దంలో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు.15వ, 16వ శతాబ్దాలలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవంలోకి వచ్చాయి. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ ఒకడు. ఆధునిక యుగంలో ఒరియాలో విశిష్ట రచనలు చేసిన వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకంగా బౌద్ధ, జైన మతాలచే ప్రభావితమైంది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.