సామ్రాట్ పృథ్వీరాజ్
తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమా From Wikipedia, the free encyclopedia
తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమా From Wikipedia, the free encyclopedia
సామ్రాట్ పృథ్వీరాజ్ 1962,ఫిబ్రవరి 24న విడుదలైన సినిమా. ఇది హిందీ నుండి తెలుగులోనికి అనువాదం చేయబడింది.
సామ్రాట్ పృథ్వీరాజ్ (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హర్ సుఖ్ భట్ |
---|---|
నిర్మాణం | టి.దశరథరామిరెడ్డి |
తారాగణం | పైడి జైరాజ్, అనితా గుహ, చాంద్ ఉస్మానీ, సప్రూ |
సంగీతం | వసంత్ దేశాయ్, బి.గోపాలం |
గీతరచన | అనిసెట్టి |
సంభాషణలు | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయభారతీ ఫిలింస్ |
భాష | తెలుగు |
అనేక దేశాలను జయించి విజయదుందుభి మ్రోగించిన పృథ్వీరాజుకు కర్ణాటకి అనే రాజనర్తకి పట్టుబడింది. ఆమె గూఢచారిణి అని తెలిసివుండి కూడా పృథ్వీరాజ్ ఆమెను ఆస్థానంలో నర్తకిగా నియమించాడు. తన మంత్రి కైమాస్ ఆమెను బలాత్కరించబోతున్న సమయంలో అతడిని చంపివేసి ఆమెను కాపాడుతాడు. ఆమె తననే మోహించబోగా తప్పని హితోపదేశం చేస్తాడు. జయచంద్రుని కుమార్తె సంయుక్త పృథ్వీరాజును ప్రేమిస్తుంది. ఆమె స్వయంవర సమయంలో జయచంద్రుడు ద్వారంవద్ద ఉంచిన పృథ్వీరాజ్ శిలావిగ్రహానికి పూలదండ వేస్తుంది. చాటున పొంచివున్న పృథ్వీరాజు ఆమెను ఎత్తుకుపోతాడు. తదుపరి ఘజనీమహమ్మదును యుద్ధంలో ఖైదీగా పట్టుకుని ఉదారహృదయంతో వదిలివేస్తాడు. ఘజనీ జయచంద్రులు ఏకమై యుద్దానికి వస్తారు.పృథ్వీరాజ్ ఓడిపోతాడు. ఘజనీ పృథ్వీరాజ్ కళ్ళు పొడిపించివేశాడు. ఆ సమయంలో కవిచంద్ వస్తాడు. పృథ్వీరాజ్ అంధుడి ఉండి కూడా ఘజనీ గొంతు విని బాణంతో అతని ప్రాణం తీస్తాడు. కవిచంద్, పృథ్వీరాజ్‌లు బాకులతో తమ ప్రాణాలు తీసుకొని వీరస్వర్గం పొందుతారు[1].
ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల, పిఠాపురం,పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి తదితరులు పాడారు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.