From Wikipedia, the free encyclopedia
అనితా గుహ (17 జనవరి 1939 - 20 జూన్ 2007) భారతీయ నటి. ఈమె ఎక్కువగా పౌరాణిక పాత్రలను ధరించింది. జై సంతోషి మా (1975)లో ప్రధాన పాత్ర పోషించినందుకు ఈమె పేరు తెచ్చుకుంది. అంతకుముందు, ఈమె ఇతర పౌరాణిక చిత్రాలలో సీతగా నటించింది; సంపూర్ణ రామాయణం (1961), శ్రీ రామ్ భారత్ మిలాప్ (1965), తులసి వివాహం (1971). ఇవి కాకుండా ఈమె గూంజ్ ఉఠీ షెహనాయ్ (1959), పూర్ణిమ (1965), ప్యార్ కి రహెన్ (1959), గేట్‌వే ఆఫ్ ఇండియా (1957), దేఖ్ కబీరా రోయా (1957), లుకోచూరి (1958), సంజోగ్ (1961). వంటి చిత్రాలలో కూడా ప్రముఖ పాత్రలు పోషించింది.
అనితా గుహ | |
---|---|
జననం | 1939 జనవరి 17 |
మరణం | 2007 జూన్ 20 68) | (వయసు
క్రియాశీలక సంవత్సరాలు | 1953–1989 |
భార్య / భర్త | మాణిక్ దత్ |
బంధువులు | ప్రేమా నారాయణ్ (మేనకోడలు) |
ఈమె 1950లలో తన 15వ ఏట అందాల పోటీలలో పాల్గొనడానికి ముంబైకి వచ్చింది. [1] ఈమె అక్కడ నటిగా టోంగా-వాలి (1955) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తరువాత ఈమె దేఖ్ కబీరా రోయా (1957), శారద (1957), [2] గూంజ్ ఉఠీ షెహనాయ్ వంటి హిట్ చిత్రాలలో నటించింది. గూంజ్ ఉతి షెహనాయ్ చిత్రంలోని పాత్రకు ఈమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్ అయ్యింది. ఇది ఆమె జీవితంలో ఏకైక నామినేషన్. [3] 1961లో, ఆమె బాబూభాయ్ మిస్త్రీ తీసిన సంపూర్ణ రామాయణంలో సీతగా కనిపించింది, అది ఈమె ఇంటి పేరుగా మారింది. [4] కానీ జై సంతోషి మా (1975)లో ప్రధాన పాత్ర ఈమెకు అత్యంత కీర్తిని తెచ్చిపెట్టింది. [5] ఈమె ఆ పాత్రను అంగీకరించే వరకు సంతోషి దేవత గురించి వినలేదు. ఇది చాలా చిన్న పాత్ర మాత్రమే. ఈమె నటించిన సన్నివేశాలు 10-12 రోజులలో చిత్రీకరించబడ్డాయి. షూటింగ్ సమయంలో ఆమె నిష్టతో ఉపవాసం ఉంది. ఈ తక్కువ-బడ్జెట్ చిత్రం ఆశ్చర్యకరంగా భారీ విజయాన్ని సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. సంతోషిమాత ఇప్పుడు ప్రసిద్ధ దేవతగా మారింది, భారతదేశం అంతటా స్త్రీలకు ఆరాధ్య దేవత అయ్యింది. సినిమా థియేటర్లను ప్రజలు గుడిగా భావించి జై సంతోషి మా అని జపిస్తూ, ప్రసాదాలు తెచ్చి, తలుపుల వద్ద చెప్పులు విడిచిపెట్టి సినిమాను చూసేవారు. ప్రజలు ఈమెను నిజమైన దేవతగా భావించి తమను ఆశీర్వదించమని కోరుతూ తన వద్దకు వచ్చేవారని గుహ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నది. అయితే, ఈమె తాను సంతోషీమాత భక్తురాలిని కాదని కాళీ దేవి భక్తురాలినని చెప్పుకుంది .
ఆమె నటించిన ఇతర పౌరాణిక చిత్రాలలో కవి కాళిదాస్ (1959), జై ద్వారకాదేశ్ (1977), కృష్ణ కృష్ణ (1986) ఉన్నాయి. పౌరాణిక నటిగా ముద్ర పడినందుకు ఈమె సంతోషించలేదు. ఆమె ప్రారంభ చిత్రాలలో సంగీత సామ్రాట్ తాన్సేన్ (1962), కన్ కాన్ మే భగవాన్ (1963), వీర్ భీంసేన్ (1964) వంటివి ఉన్నాయి. ఆరాధన (1969) చిత్రంలో ఈమె రాజేష్ ఖన్నా పెంపుడు తల్లిగా నటించింది.
ఈమె నటుడు మాణిక్ దత్‌ను వివాహం చేసుకుంది; వీరికి సంతానం లేక పోవడంతో ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. తన భర్త మరణం తరువాత, ఈమె ముంబైలో ఒంటరిగా జీవిస్తూ, 20 జూన్ 2007న గుండెపోటుతో మరణించింది. అనితా గుహ నటుడు ప్రేమ నారాయణ్‌కి మేనత్త. ప్రేమ ఆమె సోదరి అనురాధ గుహ కుమార్తె.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | విశేషాలు |
---|---|---|---|
1953 | బన్సేర్ కెల్లా | ||
1955 | టాంగా వాలీ | తొలి చిత్రం | |
దునియా గోల్ పై | దేవీ దియా కుమారి | ||
1956 | యాహుదీ కీ బేటీ | ||
ఆంఖ్ కా నషా | ఆశాదేవి | ||
చిరకుమార్ సభ | బెంగాలీ సినిమా | ||
ఛూ మంతర్ | రత్నావళి | ||
1957 | హర్జీత్ | ||
ఉస్తాద్ | మిసెస్ రోజీ | ||
శారద | పద్మ | ||
పవన్ పుత్ర హనుమాన్ | |||
గేట్ వే ఆఫ్ ఇండియా | కిషోర్ స్నేహితురాలు | ||
ఏక్ ఝలక్ | |||
దేఖ్ కబీరా రోయా | రేఖ | ||
1958 | కల్ క్యా హోగా | ||
లకోచురి | గీత | బెంగాలీ సినిమా | |
స్టాండ్ | |||
మాయాబజార్ | సురేఖ | వీర ఘటోత్కచ పేరుతో తెలుగులోనికి డబ్ చేయబడింది. | |
ఫరిస్తా | రాణి | ||
భలా ఆద్మీ | |||
1959 | టిప్పు సుల్తాన్ | ||
సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ | కర్ణాటకి | రాజనర్తకి | |
మహారాణి పద్మిని | |||
ప్యార్ కీ రాహే | |||
కవి కాళిదాస్ | పుష్పవల్లి | ||
గూంజ్ ఉఠీ షెహనాయ్ | రామ్‌కలీ | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి పురస్కారానికి ప్రతిపాదించబడింది. | |
చాచా జిందాబాద్ | రేణు | ||
1960 | రిక్షావాలా | ||
ముడ్ ముడ్కే న దేఖ్ | అనితా సింగ్ | ||
అంగుళిమాల్ | గురుమాత | ||
1961 | సంజోగ్ | లాలి | |
సంపూర్ణ రామాయణ | సీత | ||
1962 | సంగీత్ సమ్రాట్ తాన్సేన్ | హంస | తాన్సేన్ బాల్యస్నేహితురాలు |
1963 | నాగజ్యోతి | ||
కణ్ కణ్మే భగవాన్ | రూప | ||
దేవకన్య | |||
1964 | వీర్ భీమ్సేన్ | ||
రూపసుందరి | |||
మహాసతి అనసూయ | |||
1965 | షాహీ రకస | ||
సంత్ తుకారామ్ | |||
శ్రీ రామ్ భరత్ మిలన్ | సీత | ||
శంకర్ సీత అనసూయ | సీత | ||
సతి నారి | రాజకుమారి మాళవతి | ||
పూర్ణిమ | వందనా మెహ్రా | ||
మహారాజా విక్రమ్ | |||
జహా సతి వహా భగవాన్ | మందాకిని/ గంధర్వ కన్య | ||
1966 | లవ్ కుష్ | ||
1969 | హనుమాన్ చాలీసా | ||
ఆరాధన | మిసెస్ ప్రసాద్ సక్సేనా | ఈ చిత్రంలో ఈమె పేరు అనితా దత్‌గా పేర్కొనబడింది | |
సతీ సులోచన | నాగకుమారి సులోచన | ||
1971 | తులసీ వివాహ్ | లక్ష్మీదేవి | |
1972 | అనురాగ్ | రాజేష్ తల్లి | అనురాగాలు పేరుతో తెలుగులో పునర్మించబడింది. |
1973 | ఝూమ్ ఉఠా ఆకాశ్ | ||
గరీబీ హటావో | |||
1974 | జబ్ అంధేరా హోతాహై | మిసెస్ మనోరమా భరద్వాజ్ | |
1975 | మహాపవన్ తీర్థ్ యాత్ర | ||
జై సంతోషి మా | సంతోషి మాత | పేరు తెచ్చిపెట్టిన పాత్ర | |
బీవీ కిరాయా కి | |||
బద్నామ్ | |||
1976 | లడ్కీ భోలీ భాలీ | రాజు తల్లి | |
నాగిన్ | సునీత తల్లి | ||
జై మహాలక్ష్మి మా' | |||
దో ఖిలాడి | మమతా సింగ్ | ||
1977 | ఆనంద్ ఆశ్రమ్ | చంద్రముఖి | |
సోలా శుక్రవార్ | కౌసల్య | ||
జై ద్వారకాదీశ్ | రేవతి | ||
జై అంబె మా | |||
1978 | తుమ్హారే లియే | శీలాదేవి | |
1979 | గురూ హోజా షురూ | షీలా తల్లి | |
1981 | సంఫూర్ణ సంతోషి మా కీ మహిమ | ||
ఫిఫ్టీ ఫిఫ్టీ | రాణీ మా | ||
1983 | నవరాత్రి | ||
సతీ నాగకన్య | సతీ అనసూయ | ||
1984 | ప్రార్థన | ||
1986 | కృష్ణ - కృష్ణ | రేవతి | |
1989 | సోచా నా థా | ||
1991 | లఖ్పతి | రంభ | చివరి సినిమా |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.