Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సంత్ కబీర్ నగర్ జిల్లా (హిందీ:संत कबीर नगर जिला) ఒకటి. ఖలీలాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా బస్తీ డివిజన్లో భాగం. 1997 సెప్టెంబరు 5 న బస్తీ జిల్లా నుండి 131 గ్రామాలు, బంసి జిల్లాలోని సిద్ధార్ద్ నగర్ నుండి 161 గ్రామాలు చేర్చి సంత్ కబీర్ నగర్ జిల్లా రూపొందించబడింది.
సంత్ కబీర్ నగర్ జిల్లా
संत कबीर नगर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | బస్తీ |
ముఖ్య పట్టణం | ఖలీలాబాద్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | సంత్ కబీర్ నగర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,659.15 కి.మీ2 (640.60 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 17,14,300 |
• జనసాంద్రత | 1,000/కి.మీ2 (2,700/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.01% |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లా ఉత్తర సరిహద్దులో సిద్ధార్ధనగర్, మహారాజ్‌గంజ్, తూర్పు సరిహద్దులో గోరఖ్‌పూర్, దక్షిణ సరిహద్దులో అంబేద్కర్ నగర్, పశ్చిమ సరిహద్దులో బస్తీ జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1659.15 చ.కి.మీ.
జిల్లకు 15వ శతాబ్ధానికి చెందిన కవి కబీర్దాస్ స్మృత్యర్ధం నామకరణం చేయబడింది. కబీర్దాస్ జిల్లాలోని మఘర్‌లో నివసించాడు. ఆయన మరణం గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. భారతదేశంలో పాఠశాలలలో ఇది పాఠ్యాంశ్యంగా (నీతి కథలు లేక చరిత్ర) కూడా ఉంది. ఆయనను ఖనం చేసే సమయంలో ముస్లిములు మరుయు హిందువుల మద్య వివాదం చెలరేగింది. ముస్లిములు మరణానంతరం శరీరాన్ని పూడ్చి పెట్టడం ఆనవాయితీ. హిందువులు మరణానంతరం శరీరాన్ని దహనం చేయడం ఆనవాయితీ. కబీర్దాస్ చెప్పిన విషయాలను పుస్తకరూపంలో హిందువులు, ముస్లిములు వ్రాసి ఉంచినదానిని గుర్తించుకు తెచ్చుకుని దానిని అనుసరించారు. ఇలా వివాదం ముగింపుకు వచ్చింది.మఘర్‌లో ఆయన సమాధి (దర్గా), మందిరం పక్కపక్కన ఉంటాయి.
1997 సెప్టెంబరు 5 న బస్తీ జిల్లా నుండి 131 గ్రామాలు, బంసి జిల్లాలోని సిద్ధార్ద్ నగర్ నుండి 161 గ్రామాలు చేర్చి సంత్ కబీర్ నగర్ జిల్లా రూపొందించబడింది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సంత్ కబీర్ నగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
విషయాలు | వివరణలు |
---|---|
డివిజన్ | బస్తి |
తాలూకాలు | 3 ఖాలిలబ్ధ్, మెందావల్, ధన్‌ఘట |
మండలాలు | శాంత, మెందవల్, బెళర్ కలాన్, సెమెరియవన్, బఘౌలి, ఖలిలబద్, నాథ్ నగర్, హైన్సర్ బజార్, పౌలి |
అసెంబ్లీ నియోజక వర్గం | 3 ఖాలిలబ్ధ్, మెందావల్, ధన్‌ఘట |
పార్లమెంటు నియోజక వర్గం | సంత్ కబీర్ నగర్ |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,714,300, [2] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 283 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1041 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.71%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 869:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 69.01%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.