గోరఖ్‌పూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గోరఖ్‌పూర్ జిల్లా (హిందీ:गोरखपुर ज़िला) ఒకటి. గోరఖ్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

గోరఖ్‌పూర్ జిల్లా
गोरखपुर ज़िला | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో గోరఖ్‌పూర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | గోరఖ్‌పూర్ |
ముఖ్య పట్టణం | గోరఖ్‌పూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 7,483.8 కి.మీ2 (2,889.5 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 44,36,275[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.25%.[1] |
• లింగ నిష్పత్తి | 944 |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
జిల్లా ప్రాంతాన్ని అవధ్ నవాబు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు 1600లో ఇచ్చాడు. ఇది 1801 వరకు వారి ఆధీనంలోనే ఉంది. బ్రిటిష్ దీనిని గోరఖ్‌పూర్ జిల్లాగా రూపొందించబడింది.మిస్టర్ రూట్లెడ్జ్ ఈ జిల్లాకు మొదటి కలెక్టర్‌గా నియమించబడ్డాడు. 1829లో గోరఖ్‌పూర్ కేంద్రంగా గోరఖ్‌పూర్ డివిజన్ ఏర్పాటైంది. గోరఖ్‌పూర్ డివిజన్‌లో గోరఖ్‌పూర్, ఘాజీపూర్, ఆజంగఢ్ జిల్లాలు ఉన్నాయి. గోరఖ్‌పూర్ డివిజన్‌కు ఆర్. ఎం బియాడ్ మొదటి కమీషనర్‌గా నియమించబడ్డాడు.
1865లో గోరఖ్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి బస్తీ జిల్లాను ఏర్పాటు చేసారు. తరువాత 1946లో మరికొంత భూభాగం వేరుచేసి దేవరియా జిల్లాను ఏర్పాటు చేసారు. మూడవసారిగా 1989లో గోరఖ్‌పూర్ జిల్లా లోని మరికొంత భూభాగంతో మహారాజ్‌గంజ్ జిల్లా ఏర్పాటైంది.
భౌగోళికం
గోరఖ్‌పూర్ జిల్లా 26° 46´ ఉత్తర అక్షాంశం, 83° 22´ తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 7483 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో మహరాజ్‌గంజ్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఖుషీనగర్ జిల్లా, దియోరియా జిల్లా, దక్షిణ సరిహద్దులో అంబేద్కర్ నగర్ జిల్లా, ఆజంగఢ్ జిల్లా రాజాసుల్తాన్‌పూర్ జిల్లా,, దియోరా జిల్లా, మైయు పశ్చిమ సరిహద్దులో సంత్ కబీర్ నగర్ జిల్లా ఉన్నాయి.[2]
ఆర్ధికం
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గోరఖ్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,436,275,[1] |
ఇది దాదాపు. | కరోటియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | కెంటకీ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 40 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1236 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.69%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 944:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 73.25%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
భాషలు
గోరఖ్‌పూర్ జిల్లాలో హిందీ భాషతో చేర్చి వర్నాక్యులర్ భాష వాడుకలో ఉంది. ఈ భాష 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[6]
బయటి లింకులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.