Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
షామ్లీ ఉత్తరప్రదేశ్ లోని పట్టణం, షామ్లి జిల్లాకు ముఖ్యపట్టణం. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. ఈ జిల్లా సహారాన్పూర్ డివిజన్ పరిధిలోని పరిపాలనా ఉపవిభాగం.
2011 సెప్టెంబరులో షామ్లీ ముఖ్యపట్టణంగా షామ్లీ జిల్లాను ఏర్పాటు చేసారు. అప్పటి ముఖ్యమంత్రి మాయావతి దీనికి ప్రబోధ్ నగర్ అని పేరు పెట్టింది. 2012 లో ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ 2012 జూలైలో జిల్లా పేరును షామ్లీ జిల్లాగా మార్చాడు.
ఈ నగరం జాతియ రాజధాని ప్రాంతంలో (ఎన్సిఆర్) లో భాగం. క్రింది రహదారులు పట్టణం గుండా పోతున్నాయి
ఇది ఢిల్లీ నుండి 100 కి.మీ., మీరట్, సహారన్పూర్ ల నుండి 65 కి.మీ., ముజఫర్ నగర్, కర్నాల్, పానిపట్ ల నుండి 40 కి.మీ. దూరంలో ఉంది.
షామిలి 29.45°N 77.32°E వద్ద [4] సముద్ర మట్టం నుండి 254 మీటర్ల ఎత్తున ఉంది .
2011 జనాభా లెక్కల ప్రకారం షామ్లీ జనాభా 1,07,233. వీరిలో 57,236 మంది పురుషులు, 49,997 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 82.97 %. షామ్లీ జిల్లాను ఉత్తర ప్రదేశ్లోని మొదటి బహురంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. [5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.