Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో శ్రావస్తి జిల్లా ఒకటి. భింగా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. శ్రావస్తి జిల్లా, దేవిపటన్ డివిజన్‌లో భాగంగా ఉంది.[1] 2001 నాటి సాంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలను బట్టి భారత ప్రభుత్వం ఈ జిల్లాను అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.
శ్రావస్తి జిల్లా
श्रावस्ती जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | దేవీపటన్ |
ముఖ్య పట్టణం | భింగా |
మండలాలు | 2 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,858.2 కి.మీ2 (717.5 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 11,14,615 |
• జనసాంద్రత | 600/కి.మీ2 (1,600/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 49.13% |
Website | అధికారిక జాలస్థలి |
శ్రావస్తి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో, రాప్తి నదీ తీరంలో ఉంది. శ్రావస్తి పట్టణంతో గౌతమబుద్ధునికి దగ్గర సంబంధం ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ 24 చాతుర్మాస వ్రతాలు అవలంబించాడని విశ్వసిస్తున్నారు.[2] శ్రావస్తి జిల్లాలోని సాహేత్- మాహేత్ గ్రామంలో పురాతనమైన స్తూపాలు, అద్భుతమౌన విహారాలు, పలు ఆలయాలు ఉన్నాయి. పురాణ పరిశోధనలు అనుసరించి వేదభారత కాలంలో రాజా శరవస్త ఈ నగరాన్ని స్థాపించాడని వివరిస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుండి సా.శ. 6వ శతాబ్దం వరకు శ్రావస్తి కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రముఖ వాణిజ్య కేంద్రంగాను, మతపరమైన ప్రాధాన్యత కలిగీ ఉండేది. శ్రావస్తి శోభనాథ్ (దెరసర్) తీర్ధంకర్ సాంభవనాథ్ (జైనిజం) జన్మస్థానమని భావిస్తున్నారు. అందువలన ఇది జైనులకు పుణ్యస్థలంగా ఉంది. నాగార్జునుడీ రచనల ప్రకారం క్రీ.పూ 5వ శతాబ్దంలో నగరం జనాభా 9,00,000.
బ్రుహత్కల్పలో శ్రావస్తి గురించిన ప్రస్తావనలో ఇది మహిద్ అనిపిలువబడేదని ఉంది. తరువాత ఇది సాహేత్ - మహేత్ అని పిలువబడిందని సూచించబడింది. నగరం చుట్టూ పలు మందిరాలు, ఆలయాలతో పెద్ద కోట నిర్మించబడిందని భావిస్తున్నారు.
ప్రస్తుతం నగరంలో కోటనిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు, కోట శిథిలాలు కనిపిస్తున్నాయి. పురావస్తు శాఖ త్రవ్వకాలలో శ్రావస్తి సమీపంలో ఉన్న సాహేత్- మాహెత్ వద్ద జరుపుతున్న త్రవ్వకాలలో పలు పురాతన విగ్రహాలు శిలాశాసనాలు లభిస్తున్నాయి. అవన్ని ఇప్పుడు మ్యూజియం ఆఫ్ మథురా, లక్నోలో బధ్రపరచబడి ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి.
శ్రావస్తి —చారిత్రాత్మక అవధ్ భూభాగంలో ఒక భాగం.
జిల్లా దక్షిణ సరిహద్దులో గోండా, పశ్చిమ సరిహద్దులో బహ్రైచ్, తూర్పు సరిహద్దులో బలరాంపూర్ జిల్లాలు, ఈశాన్య సరిహద్దులో నేపాల్ దేశంలోని డన్ంగ్ డెయుఖురి జిల్లా, వాయవ్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బంకే జిల్లా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని లక్నోకు శ్రావస్తి రాజధాని భింగా 170 కి.మీ దూరంలో ఉంది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశం లోని వెనుకబడిన 250 జిల్లాలలో శ్రావస్తి జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,114,615, [4] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 414 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 572 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | -5.25 % |
స్త్రీ పురుష నిష్పత్తి. | 875:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 49.13%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
2001 గణాంకాల ప్రకారం 34.2%. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప అక్షారాశ్యత కలిగిన జిల్లాగా శ్రావస్తి గుర్తించబడుతుంది.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.