శంషాబాద్ (పి), తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న శంషాబాద్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
శంషాబాద్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.26619°N 78.40551°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | శంషాబాద్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 87,837 |
- పురుషుల సంఖ్య | 45,201 |
- స్త్రీల సంఖ్య | 42,636 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 87,837 - పురుషులు 45,201 - స్త్రీలు 42,636.సముద్రమట్టనికి 581 మీ.ఎత్తు[4]
ప్రముఖులు
- బంగారు లక్ష్మణ్ - భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.ఇతను నర్సింహ, శివమ్మ దంపతులకు 1939 మార్చి 17న శంషాబాద్ పట్టణంలోని సిద్దంతి బస్తీలో అతి సామాన్య దళిత కుటుంబంలో జన్మించాడు.
విద్యా సౌకర్యాలు
శ్రీ విద్యా హైస్కూల్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్, ఒయాసిస్ హైస్కూల్, శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజి, గవర్నమెంట్ జూనియర్ కాలేజి ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ శంషాబాద్ మండలంలో ఫోర్ట్ గ్రాండ్ అండర్పాస్ సమీపంలో మెట్రో స్టేషన్ను ప్లాన్ చేసింది.[5][6][7] రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; ఉమ్రానగర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 18 కి.మీ దూరంలో ఉంది.
అంతర్జాతీయ విమానాశ్రయం
నిద్రలో జోగుతున్నట్టుగా ఉండే శివారు ప్రాంతపు గ్రామం షాంస్ ఉల్ ఉమ్రా పేరు కాస్త శంషాబాద్ గా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి ఇప్పుడు చాలా పాపులర్ పేరుగా మారింది.23 మార్చి 2008 న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. దీని మొత్తం విస్తీర్ణం 5400 ఎకరాలు.
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.