ప్రపంచంలోని వినాయకుడి దేవాలయాల జాబితా From Wikipedia, the free encyclopedia
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు.[4] ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.[5] హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.[6] గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది.[7] గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు.[8] గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు),[9] కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా[10] భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ వినాయకకి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా వినాయకని పూజిస్తారు.[11][3] ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.
వినాయకుడు | |
---|---|
అనుబంధం | దేవుడు, బ్రహ్మము (గాణాపత్యం), సగుణ బ్రహ్మ (పంచాయతన పూజ) |
నివాసం | • కైలాస పర్వతం (తల్లిదండ్రులైన శివ పార్వతులతో కలిసి) , • గణేశలోకం |
మంత్రం | ఓం శ్రీ గణేశాయనమః ఓం గం గణపతయేనమః |
ఆయుధములు | పరశు, పాశం, అంకుశం |
గుర్తులు | ఓం, మోదకం |
భర్త / భార్య |
|
తోబుట్టువులు | షణ్ముఖుడు అశోకసుందరి |
పిల్లలు | • శుభ • లాభ • సంతోషి మాత |
వాహనం | ఎలుక |
పాఠ్యగ్రంథాలు | గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షము |
పండుగలు | వినాయక చవితి |
తండ్రి | శివుడు |
తల్లి | పార్వతి |
ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు వినాయకగా పరిగణిస్తారు.[12] సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు.[13] కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు.[14] శైవ సాంప్రదాయం ప్రకారం వినాయక పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ, వినాయక అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు.[15][16] గాణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.[17]
గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, వినాయక అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.
పేరు | నగరం/పట్టణం | రాష్ట్రం |
---|---|---|
బల్లాలేశ్వర్ పాలి | పాలి, కర్జత్, రాయిగఢ్ జిల్లా | మహారాష్ట్ర |
చింతామణి దేవాలయం | తేర్, పూణె జిల్లా | మహారాష్ట్ర |
లేన్యాద్రి | లేన్యాద్రి, పూణె జిల్లా | మహారాష్ట్ర |
మోర్గావ్ వినాయక దేవాలయం | మోర్గావ్, పూణె జిల్లా | మహారాష్ట్ర |
రంజన్‌గావ్ వినాయక | రంజన్‌గావ్ | మహారాష్ట్ర |
సిద్ధివినాయక దేవాలయం (సిద్ధాటెక్) | సిద్ధటెక్, అహ్మద్‌నగర్ జిల్లా | మహారాష్ట్ర |
వరద్వినాయక దేవాలయం | మహద్, రాయిగఢ్ జిల్లా | మహారాష్ట్ర |
విఘ్నేశ్వర దేవాలయం, ఓజర్ | ఓజర్, పూణె జిల్లా | మహారాష్ట్ర |
పేరు | నగరం/పట్టణం | రాష్ట్రం |
---|---|---|
లార్డ్ వినాయక దేవాలయం బోహా పహార్ | మయోంగ్ | అస్సాం |
గణపత్యార్ దేవాలయం | శ్రీనగర్ | జమ్మూ కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) |
శ్రీ వినాయక దేవాలయం | రఫియాబాద్, బారాముల్లా జిల్లా | జమ్మూ కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) |
త్రినేత్ర గణేశ దేవాలయం | రణతంబోర్ కోట | రాజస్థాన్ |
బొహ్రా వినాయక దేవాలయం | ఉదయపూర్ | రాజస్థాన్ |
శ్రీ వినాయక దేవాలయం | ఆనెగుడ్డె | కర్ణాటక |
బుధ వినాయక దేవాలయం | జాజ్‌పూర్ | ఒడిషా |
చింతామన్ వినాయక దేవాలయం, ఉజ్జయిని | ఉజ్జయిని | మధ్యప్రదేశ్ |
దగదుషేత్ హల్వాయి వినాయక దేవాలయం | పూణే | మహారాష్ట్ర |
దశభుజ వినాయక దేవాలయం | పూణే | మహారాష్ట్ర |
ద్విభుజ గణపతి స్వామి ఆలయం | ఇడగుంజి | కర్ణాటక |
వినాయకపూలే | వినాయకపూలే, రత్నగిరి జిల్లా | మహారాష్ట్ర |
కలమస్సేరి మహావినాయక దేవాలయం | కలమస్సేరి | కేరళ |
కాణిపాకం వినాయక దేవాలయం | కాణిపాకం | ఆంధ్రప్రదేశ్ |
కర్పాక వినాయక దేవాలయం | పిల్లయార్‌పట్టి | తమిళనాడు |
కస్బా వినాయక దేవాలయం | పూణే | మహారాష్ట్ర |
ఖజ్రానా గణేష్ దేవాలయం | ఇండోర్ | మధ్యప్రదేశ్ |
పొటాలి వాలె వినాయక దేవాలయం | ఇండోర్ | మధ్యప్రదేశ్ |
కొట్టారక్కర శ్రీ మహావినాయక క్షేత్రం | కొట్టారక్కర | కేరళ |
పౌర్ణమికవు దేవాలయం | త్రివేండ్రం | కేరళ |
కుమార స్వామి దేవస్థానం, బెంగళూరు | బెంగళూరు | కర్ణాటక |
మధుర్ దేవాలయం | కాసరగోడ్ జిల్లా | కేరళ |
మహా వినాయక మహమ్మయ్య దేవాలయం | షిరాలీ, ఉత్తర కన్నడ జిల్లా | కర్ణాటక |
మహావినాయక దేవాలయం | జాజ్‌పూర్ జిల్లా | ఒడిషా |
నంద్రుదయన్ వినాయక దేవాలయం | తిరుచిరాపల్లి | తమిళనాడు |
పద్మాలయ | పద్మాలయ, జలగావ్ జిల్లా | మహారాష్ట్ర |
పజవంగడి వినాయక దేవాలయం | తిరువనంతపురం | కేరళ |
రంజన్‌గావ్ వినాయక | రంజన్‌గావ్ | మహారాష్ట్ర |
సిద్ధివినాయక మహావినాయక దేవాలయం | టిట్వాలా | మహారాష్ట్ర |
సిద్ధివినాయక దేవాలయం | ముంబై | మహారాష్ట్ర |
శ్రీ ఇండిలయప్పన్ దేవాలయం | కరికోమ్, కొల్లాం జిల్లా | కేరళ |
గుడ్డట్టు వినాయక దేవాలయం | కుందపురా, ఉడిపి | కర్ణాటక |
శ్వేత వినాయక దేవాలయం | తిరువలంచుజి | తమిళనాడు |
టార్సోడ్-వినాయక దేవాలయం | తర్సోడ్, జల్గావ్ జిల్లా | మహారాష్ట్ర |
తూండుగై వినాయక దేవాలయం | తిరుచెందూర్ | తమిళనాడు |
ఉచ్చి పిళ్లయార్ దేవాలయం, రాక్‌ఫోర్ట్ | తిరుచిరాపల్లి | తమిళనాడు |
ఉత్రపతిశ్వరస్వామి దేవాలయం | తిరుచెంకట్టుకుడి, తిరువారూర్ జిల్లా | తమిళనాడు |
వరసిద్ధి వినాయక దేవాలయం | చెన్నై | తమిళనాడు |
స్వయంభూ శ్రీ అభీష్ట జ్ఞాన వినాయక దేవాలయం | కర్నూలు | ఆంధ్రప్రదేశ్ |
జై వినాయక దేవాలయం | కచారే గ్రామం, రత్నగిరి జిల్లా. | మహారాష్ట్ర |
శ్రీ నవ్య వినాయక దేవాలయం | నాసిక్, గోదావరి నది ఒడ్డున | మహారాష్ట్ర |
రేజింతల్ సిద్ధి వినాయక దేవాలయం | రేజింతల్, సంగారెడ్డి జిల్లా | తెలంగాణ |
కాజీపేట శ్వేతార్కమూల గణపతి దేవాలయం | కాజీపేట, హన్మకొండ జిల్లా | తెలంగాణ |
పేరు | నగరం / పట్టణం | దేశం |
---|---|---|
సూర్యవినాయక దేవాలయం | ఖాట్మండు | నేపాల్ |
అరుల్మిగు నవశక్తి వినాయక దేవాలయం | విక్టోరియా | సేషెల్స్ |
హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా | ఫ్లషింగ్, క్వీన్స్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
శ్రీ వినాయక దేవాలయం | నాష్విల్లే | సంయుక్త రాష్ట్రాలు |
సిద్ధి వినాయకుని దేవాలయం | రహీమ్ యార్ ఖాన్, పంజాబ్ | పాకిస్తాన్ |
గణేశ దేవాలయం | రావల్పిండి | పాకిస్తాన్ |
ఉటాలోని శ్రీ గణేశ హిందూ దేవాలయం [18] | దక్షిణ జోర్డాన్, ఉటా, 84095 | సంయుక్త రాష్ట్రాలు |
శ్రీ వినాయక దేవాలయం [19] | బెర్లిన్ | జర్మనీ |
శ్రీ సిద్ధి వినాయక దేవాలయం | మెదన్ | ఇండోనేషియా |
శ్రీ సిద్ధి వినాయక దేవాలయం | పెటాలింగ్ జయ | మలేషియా |
శ్రీ వరతరాజ సెల్వవినాయక దేవాలయం | డెన్ హెల్డర్ | నెదర్లాండ్స్ |
దేవస్థాన్ లోపల వినాయక దేవాలయం | రత్తనాకోసిన్ ద్వీపం, బ్యాంకాక్ | థాయిలాండ్ |
వినాయక దేవాలయం, హువాయ్ ఖ్వాంగ్ | దిన్ డేంగ్, బ్యాంకాక్ | థాయిలాండ్ |
వినాయక దేవాలయం, బ్యాంగ్ యాయ్ | బ్యాంగ్ యాయ్, నోంతబురి | థాయిలాండ్ |
పికనేసుఅందేవలై | ముయాంగ్ చియాంగ్ మాయి, చియాంగ్ మాయి | థాయిలాండ్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.