Remove ads
ఒడిశా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో జాజ్‌పూర్ జిల్లా ఒకటి. ఇది ఒక చారిత్రాత్మక యాత్రా స్థలం. ఒకప్పుడు జాజ్‌పూర్ పట్టణం కళింగ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది ప్రస్తుతం పురాతత్వ పరిశోధన కేంద్రంగా ఉంది. జిల్లాలో విరజా దేవి శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో విరజాదేవి (దుర్గా) ఆలయాలు, జంగ్య బరాహ (మహావిష్ణువు వరాహావతారం), సప్తమాతృక ఆలయాలు , ఇతర మతాలయాలు బైతరణి నదీతీరంలో ఉన్నాయి. జిల్లాలో అశోక్‌నగర్, చంద్రఖోల్, చతియా, గోకర్ణికా, కురంసా, మహావినాయక్, పతరాజపూర్, రత్నగిరి (ఒడిషా), ఉదయగిరి (ఒడిషా), సత్యపిరా, సింఘపూర్, వ్యాస్ సరోబర్ , బరునేశ్వర్ పీఠం వంటి ప్రయాటక ఆకర్షిత ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రమాభివృద్ధికి సహకరించే ఖనిజాలు , సహజ వనరులు ఉన్నాయి.
జాజ్‌పూర్ జిల్లా | ||||
---|---|---|---|---|
జిల్లా | ||||
Nickname: జాజ్రా నగర్ | ||||
దేశం | India | |||
రాష్ట్రం | ఒడిశా | |||
ప్రధాన కార్యాలయం | జాజ్‌పూర్ | |||
Government | ||||
• Collector | Anil Kumar Samal, IAS | |||
• Member of Lok Sabha | Mohan Jena | |||
విస్తీర్ణం | ||||
• Total | 2,887.69 కి.మీ2 (1,114.94 చ. మై) | |||
Elevation | 331 మీ (1,086 అ.) | |||
జనాభా (2001) | ||||
• Total | 19,00,054 | |||
• జనసాంద్రత | 658/కి.మీ2 (1,700/చ. మై.) | |||
భాషలు | ||||
• అధికార | Odia, హిందీ,ఇంగ్లీషు | |||
Time zone | UTC+5:30 (IST) | |||
పిన్‌కోడ్ | 755 xxx | |||
Vehicle registration | OD-04,OD-34 | |||
సమీప పట్టణం | Bhubaneswar | |||
Literacy | 72.19% | |||
లోక్‌సభ నియోజకవర్గం | Jajpur | |||
Vidhan Sabha constituency | 7
| |||
శీతోష్ణస్థితి | Aw (Köppen) | |||
అవపాతం | 1,014 మిల్లీమీటర్లు (39.9 అం.) | |||
సగటు వేసవి ఉష్ణోగ్రత | 38 °C (100 °F) | |||
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 12 °C (54 °F) |
జాజ్‌పూర్ వైశాల్యం 2888 చ.కి.మీ. ఇందులో 202 చ.కి.మీ భూభాగంలో అటవీ ప్రాంతం ఉంది. జనసంఖ్య 1, 622,868, అక్షరాస్యత 72.19%. జిల్లాకేంద్రంగా జాజ్‌పూర్ పట్టణం ఉంది. జిల్లాలో 2 పట్టణాలు , 1781 గ్రామాలు ఉన్నాయి. జిల్లా వార్షిక వర్షపాతం 1771.8 మిమీ.
దనగడి మండలంలో ఉన్న కళింగ నగర్లో 6 బృహత్తర స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి: జిండల్ స్టీల్ ప్లాంటు, నీలాంచల్ ఇస్పాటు నిగం లిమిటెడ్, వి.ఐ.ఎస్.ఎ. స్టీల్, మెస్కో స్టీల్, టాటా స్టీల్. అదనంగా 7 స్టీలు ప్లాంట్లు ఉతపత్తికి సిద్ధంగా ఉన్నాయి.
జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
జిల్లాలో 2 పురపాలకాలు, 6 తాలూకాలు , 242 గ్రామపంచాయితీలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,826,275,[3] |
ఇది దాదాపు. | కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 206 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 630 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.43%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 972:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 80.44%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
ఈ క్రింది జాజ్పూరుకు చెందిన 7 ఒడిషా శాసనసభ నియోజకవర్గాలు [6][7] ఎన్నికైన సభ్యుల జాబితా [8] ఉంది.
క్ర.సం | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభ సభ్యులు | పార్టీ |
---|---|---|---|---|---|
48 | బింఝాపూర్ | షెడ్యూల్డ్ కులాలు | Binjharpur, Dasarathpur (part) | ప్రమీళా మాలిక్ | బి.జె.డి |
49 | బరి | లేదు | బరి, జాజ్‌పూర్ (భాగం), రసూల్పూర్ (భాగం) | డెబాసుస్ నాయక్ | బి.జె.డి |
50 | బరచన | లేదు | బరచన | అమర్ ప్రసాద్ సత్పతి | బి.జె.డి |
51 | ధర్మశాల | లేదు | ధర్మశాల, రసూల్పూర్ (part) | కల్పతరు దాస్ | బి.జె.డి |
52 | జాజ్‌పూర్ | లేదు | జాజ్‌పూర్ (ఎం), జాజ్‌పూర్ (భాగం) , దశరథపూర్ (భాగం) | ప్రణాబ్ ప్రకాష్ దాస్ | బి.జె.డి |
53 | కొరెయి | లేదు | Vyasanagar (M), Vyasanagar (O. G), Korei, Rasulpur (part) | ప్రతిరంజన్ ఘాడై | బి.జె.డి |
54 | శుకిండ | లేదు | శుకిండ, డంగడి | ప్రఫుల్ల చంద్ర ఘడై | బి.జె.డి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.