From Wikipedia, the free encyclopedia
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2022-06-01 : 2023-07-31
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
← పాత చర్చ 87 | పాత చర్చ 88 | పాత చర్చ 89 →
ప్రస్తుతం ఛాట్ జిపిట్ అనే కృత్రిమ మేధస్సు సంబంధించిన ఒక సౌకర్యం, ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఛాట్జిపిట్ ఇస్తున్న అనేక సౌకర్యాలలో, వాడుకరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆ కృత్రిమ మేధస్సు (పేరు ఛాట్ జిపిటి) ఇవ్వటం. ఈ జవాబులు చాలా వివరంగానూ, ఎంతో ప్రామాణింకంగానూ ఉంటున్నాయని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు వికీపీడియాలో ఛాట్ జిపిటిలో తెలుసుకున్న/సంపాయించిన సమాచారం వ్యాసాల్లో వ్రాయవచ్చా? వ్రాస్తుంటే, ఛాట్ జిపిటిని ఒక "సోర్స్" కింద ఉట్టంగించటం తప్పనిసరి అని నా అభిప్రాయం.
ఇప్పటికే ఈ విషయం మీద చర్చ జరిగి ఉండకపోతే, తగిన విధంగా చర్చించి ఒక పాలసీ నిర్ణయం తీసుకోవచ్చని ఇక్కడ ఈ శీర్షిక ఉంచటం జరిగింది. 115.98.112.58 00:11, 2 జూన్ 2023 (UTC)
గత రెణ్ణెల్లుగా నేను వికీలో చురుగ్గా లేను. మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పనిచేసే అవకాశం లేదు. ఈ కారణంగా నాకున్న నిర్వాహకుడు, అధికారి అనే రెండు బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నాను. అంచేత ఈ రెండు బాధ్యతల నుండి తప్పించమని స్టీవార్డులను అభ్యర్థించాను. ఒక రోజులో వాళ్ళు తమ పని చేస్తారు.
బాధ్యతలను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్న నిర్వాహకుల పట్ల వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ మార్గదర్శకం ఉంది మనకు. ఆ విధానం ప్రకారం కొన్నాళ్ళ తరవాతైనా ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పని చేసే వీలు నాకు ఉండదని ఎలాగూ తెలుసు కాబట్టి అప్పటి వరకు ఆగదలచుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
సముదాయం లోని సహచరులందరికీ నమస్కారాలు. ఉంటాను. __చదువరి (చర్చ • రచనలు) 13:30, 2 జూన్ 2023 (UTC)
Please feel free to translate it into your language.
Dear Wikimedians,
Greetings! We are pleased to inform you that CIS-A2K has successfully completed several activities during the month of May. As a result, our monthly newsletter, which covers the highlights of the previous month, is now ready to be shared. The newsletter includes updates on the conducted events and ongoing activities, providing a comprehensive overview of A2K's recent endeavours. We have taken care to mention both the conducted and ongoing events/activities in this newsletter, ensuring that all relevant information is captured.
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.
Thank you MediaWiki message delivery (చర్చ)
అందరికీ నమస్కారం,
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తెలుగు వికీపీడియా కార్యకలాపాలకు చాలాకాలంగా ఉచితంగా వేదికను ఇవ్వడం, స్వయంగా తామే ఖర్చుచేసి కార్యక్రమాలు నిర్వహించడం, ఇతరత్రా సాయం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఒక కార్యక్రమంలో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు సంస్థ ప్రచురించిన, వారికి కాపీహక్కులున్న పలు విజ్ఞానదాయకమైన పుస్తకాలను, రవీంద్ర భారతిలో వారు నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల ఫోటోలను, వీడియోలను స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేయడానికి అంగీకరించారు.
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గాను మామిడి హరికృష్ణ గారిని మే నెలలో వికీమీడియా ఫౌండేషన్‌కు చెందిన Jorge Vargas, ప్రవీణ్ దాస్, భాషా సాంస్కృతిక శాఖతో కలసి పనిచేయడంలో తెలుగు వికీపీడియాకు ఉపకరిస్తున్న తెలుగు వికీపీడియన్లు వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Adithya pakide గార్లు, ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్న నేను రవీంద్రభారతిలో కలిశాము. ఈ సందర్భంగా గతంలో అనుకున్న విధంగా తెలంగాణ సంస్కృతితో పాటుగా భారతదేశంలో అనేక ప్రాంతాల సాంస్కృతిక కార్యక్రమాలను పొందుపరిచిన ఫోటోలు, వీడియోలను, భాషా సాంస్కృతిక శాఖ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపకల్పన చేసి, ప్రచురించిన అనేక పుస్తకాలను స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేస్తామని, వికీపీడియా పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలకు రవీంద్రభారతిలో భాగమైన పైడి జైరాజ్ థియేటర్ని ఉచితంగా ఇవ్వడం కొనసాగిస్తామని, ఇతరత్రా ఏదైనా వికీపీడియా అభివృద్ధి కోసం కావాలంటే అడగవచ్చునని మామిడి హరికృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో ఈ ఆలోచనలు చేశాము:
ఈ ప్రాజెక్టు ద్వారా బయటకు వచ్చే మీడియా తెలుగు వికీపీడియాకే కాక వికీమీడియా ప్రపంచం మొత్తానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాము. పై ఆలోచనలపై మీ అభిప్రాయాలు దయచేసి చెప్పగలరు. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:27, 9 జూన్ 2023 (UTC)
తెలుగు వికిపీడియాకు నిర్వాకుడిగా,ఆధికారిగా ఎంతో విలువైన సేవలు అందించిన @చదువరి గారు స్వచ్చంద విరమణ తీసుకోవటం వలన, ఈ కొరత తీర్చడానికి నిర్వాహకులుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న @వెంకటరమణ గారిని @ప్రణయ్‌రాజ్ గారిని కూడా అధికారిగా ప్రతిపాదిస్తున్నాను, దీనికి సంబంధించి సహసభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను, మార్గ నిర్దేశం చేయమని @అర్జునరావు గారు @రాజశేఖర్ గారిని కొరుతున్నాను. Kasyap (చర్చ) 05:30, 15 జూన్ 2023 (UTC)
Apologies to write in English please help us to translate the message in your language
Greetings! WikiConverse India is a new initiative that A2K is working on to improve collaboration among communities in India. WikiConverse India aims to initiate and foster dialogue within the Indian language Wikimedia community on various topics that are important for the growth of the Wikimedia movement. Currently, we are conducting regular calls as part of this initiative. For the month of June, this call will be scheduled on June 24th, 2023, from 6:00 PM to 7:30 PM IST. A2K will invite Indian participants from recent international conferences, namely the Wikimedia Hackathon and EduWiki Conference, to share their important takeaways specifically relevant to India.
To join the WikiConverse India Call, You can find the call details below:
If you have any questions, please write to a2k@cis-india.org. Regards MediaWiki message delivery (చర్చ) 18:29, 16 జూన్ 2023 (UTC)
చర్చ:నాటకరంగం ఎందుకు తొలగించారు. Theatre or theater కి థియేటర్ వ్యాసం వుంది కదా. థియేటర్ వ్యాసం en:Theatre వ్యాసం నుంచి అనువాదం చేయబడింది. నాటకరంగం అనే వ్యాసం విరుడ్డంగా సృష్టించబడింది. మరీ విరుడ్డంగా నాటకం నుండి దారిమార్పు ఇవ్వడం జరిగింది. YVSREDDY (చర్చ) 15:04, 17 జూన్ 2023 (UTC)
గతంలో నేను నిర్వహిస్తూ ఉన్న ప్రాజెక్టుల్లో కొన్ని ముగిసినై, కొన్ని అచేతనంగా ఉన్నాయి. అలాగే చేతనంగా ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ నేను చేతనంగా లేనందున వాటి నిర్వహణ చురుగ్గా ఉన్న వాడుకరులు చేపడితే బాగుంటుంది.
నేను నిర్వహిస్తూ, ప్రస్తుతం చేతనంగా ఉన్న ప్రాజెక్టులు:
ఆయా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత స్వీకరించేవారు ప్రాజెక్టు పేజీలోను, ప్రాజెక్టుల పేజీ లోని పట్టిక లోనూ ప్రాజెక్టు నిర్వాహకులుగా తమ పేరు చేర్చవలసినదిగా కోరుతున్నాను. ఒక వారం తరువాత ఎవరూ ముందుకు రాకపోతే ఆ ప్రాజెక్టుల స్థితిని అచేతనంగా మారుస్తాను.__ చదువరి (చర్చ • రచనలు) 15:13, 17 జూన్ 2023 (UTC)
@ చదువరిగారు, @ పవన్ సంతోష్ గారు - పైన పేర్కొన్న రెండవ విషయం "గణాంకాలు" యాంత్రికంగా ఏర్పడవా? ప్రత్యేకంగా తయారు చేయాలా? అని నాకు ఒక సందేహం. వీలయితే చెప్పండి. ధన్యవాదాలు.--VJS (చర్చ) 09:11, 21 జూన్ 2023 (UTC)
2023 జనవరి - జూన్‌ల మధ్య నా నిర్వాహకత్వ స్వీయ సమీక్షను ఇక్కడ చూడవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 16:22, 17 జూన్ 2023 (UTC)
సభ్యులకు సమస్కారం, వికీ అధికారులకు సంబంధించి రచ్చబండలో జరిగిన చర్చను అనుసరించి, అధికారిగా స్వీయ ప్రతిపాదనలో భాగంగా అధికార హోదా కొరకు వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రణయ్‌రాజ్ పేరున ఒక ఉపపేజీ తయారుచేశాను. ఆ ఉపపేజీని పరిశీలించి తమ మద్దతును తెలుపవలసిందిగా సముదాయ సభ్యులను కోరుతున్నాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:53, 20 జూన్ 2023 (UTC)
ఆంధ్రప్రదేశ్ మండలాలలోని 736 పేజీలలో [Error: Unable to display the reference properly. See the documentation for details.] అనే ఎర్రర్ చూపిస్తుంది.ఇది నాకు తెలిసినంతవరకు వికీడేటా నందు ఏర్పడిన లోపం వల్ల ప్రతి మండలంలో ఆ ఎర్రర్ చూపుతుందని నేను భావిస్తున్నాను.తెలిసిన వారు ఈ లోపం సరిచేయగలరు.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ముందు ప్రతి మండల వ్యాసంలో మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం అనే మూస ఉండేది.దాని ప్రకారం అయితే ఏ వ్యాసంలో లోపం ఉంటే ఆ వ్యాసంలో కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చేయటానికి అవకాశం ఉండేది. ఇంకా అదనపు సమాచారం లభ్యమైతే ఎవరైనా అదనపు సమాచారం చేర్చుటానికి సులభంగా ఉండేది.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 తరువాత పునర్వ్యవస్థీకరణ భాగంగా అర్జున గారు ఆంగ్ల వ్యాసాల ప్రకారం కేంద్ర డేటాకు సమాచారం చేర్చి ప్రతి మండలవ్యాసంలో మూస:Infobox India AP Mandal మూసను కూర్పు చేసారు.సమాచార పెట్టెలో ఏదైనా అదనపు సమాచారం చేర్చాలంటే ఇది అందరికి సాధ్యమయ్యే పనికాదు.దీని మీద అవగాహన ఉంటే తేలికగానే ఉండవచ్చుగానీ, దీనిమీద పూర్తి అవగాహన నాకు తెలిసినంతవరకు అర్జున గార్కి, చదువరి గార్కి మాత్రమే ఉందని అనుకుంటున్నాను.దీనికి సరియైన ప్రత్యామ్నాయ పద్దతి లేకపోతే అందరూ కష్టపడి చేసిన శ్రమ వృధాఅయ్యే అవకాశం ఉంది.దీనికి పరిష్కారం మార్గం చర్చించగలరు. అలాగే ఈ లోపం ఏలా సవరించాలో తెలిసిన విజ్ఞులు ఎవరైనా వివరించగలరు.దీని మీద ముఖ్యంగా అర్జున గారు స్పందించవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:40, 23 జూన్ 2023 (UTC)
Apologies for writing in English
Hello all,
As we informed you earlier, CIS-A2K has begun a new initiative to improve collaboration among communities in India. WikiConverse India aims to initiate and foster dialogue within the Indian language Wikimedia community on various topics that are important for the growth of the Wikimedia movement. Currently, we are conducting regular calls as part of this initiative. For the month of June, this call will be scheduled for June 24th, 2023, today at 6:00 PM. The call meta page is already prepared and you can find it here.
The call details are here to join us:
We hope you can find some time to join us and listen to the amazing stories and learning experiences from the speakers. Regards MediaWiki message delivery (చర్చ) 10:01, 24 జూన్ 2023 (UTC)
ప్రణయ్ రాజ్ గారు అధికారిగా ఎన్నికైతే మనకు ఒక అధికారి ఉన్నట్టు. కానీ ఒకరు సరిపోరు. ఇంకా కనీసం ఒక్కరైనా ఉండాలి. ఆసక్తి ఉండి, చురుగ్గా ఉంటున్న నిర్వాహకులు మరెవరైనా ముందుకు రావలసినదిగా కోరుతున్నాను. గతంలో రవిచంద్ర గారు తాను ప్రతిపాదించుకుంటానని అన్నారు. ఆయన్ను ఆ సంగతి పరిశీలించవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 01:16, 25 జూన్ 2023 (UTC)
Hello there,
We are glad to announce the new members and advisors of the Elections Committee. The Elections Committee assists with the design and implementation of the process to select Community- and Affiliate-Selected trustees for the Wikimedia Foundation Board of Trustees. After an open nomination process, the strongest candidates spoke with the Board and four candidates were asked to join the Elections Committee. Four other candidates were asked to participate as advisors.
Thank you to all the community members who submitted their names for consideration. We look forward to working with the Elections Committee in the near future.
On behalf of the Wikimedia Foundation Board of Trustees,
RamzyM (WMF) 18:00, 28 జూన్ 2023 (UTC)
సభ్యులకు నమస్కారం, తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించేందుకు వికీమీడియా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు నిర్వహించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, వికీలో ప్రస్తుతమున్న "వెక్టర్" స్థానంలో "వెక్టర్ 2022" డిఫాల్టు రూపుగా రాబోతున్నందున ఇప్పటివరకు తయారు చేసిన పాఠాల స్థానంలో కొత్త రూపుకు తగ్గట్టుగా పాఠాలను రూపొందించాల్సివస్తుంది. అందుకు మరికొంత గడువు అవసరమయింది. ఈ విషయమై వికీమీడియా ఫౌండేషన్ గ్రాంట్ మేనేజర్ గారికి మెయిల్ చేయగా, వారి నుండి అనుమతి వచ్చింది. 2023 అక్టోబరు చివరి నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి, తుది నివేదికను అందించగలను. ప్రాజెక్టు గురించిన అప్డేట్ కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు పేజీని చూడగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:48, 2 జూలై 2023 (UTC)
నమస్తే!
Apologies as this message is not in your language, ⧼Please help translate⧽ to your language.
The WMF Language team has added another machine translation (MT) system for Content Translation in your Wikipedia called MinT; you can use MinT machine translation when translating Wikipedia articles using the Content and Section Translation tool.
The WMF Language team provides the MinT service. It is hosted in the Wikimedia Foundation Infrastructure with neural machine translation models that other organizations have released with an open-source license. MinT integrates translation based on NLLB-200, OpusMT and IndicTrans2 which is the model MinT is using in your Wikipedia. This MT is set as optional in your Wikipedia. Still, you can choose not to use it by selecting "Start with empty paragraph" from the "Initial Translation" dropdown menu.
Since MinT is hosted in the WMF Infrastructure and the models are open source, it adheres to Wikipedia's policies about attribution of rights, your privacy as a user and brand representation. You can find more information about the MinT Machine translation and the models on this page.
Please note that the use of the MinT MT is not compulsory. However, we would want your community to:
We trust that introducing this MT is a good support to the Content Translation tool.
Thank you!
UOzurumba (WMF) (చర్చ) 08:05, 3 జూలై 2023 (UTC)
పైన MinT Machine Translation added to your Wikipedia అంటూ రాసిన విభాగాన్ని చూడండి. ఈ పరికరాన్ని నేను కొంత పరీక్షించి చూసాను. నేను గమనించినవి ఇవి:
దీన్ని మరింత పరీక్షించాలి. మింట్ అందరం వాడి దాని పనితనాన్ని పరిశీలించి, మంచి చెడులను మాట్టాడుకుని వాళ్ళకు కూడా చెప్పాలి.
ఒక గమనిక: అనువాద పరీక్ష కోసం నేను వాడిన మూల వ్యాసంలో ఇంగ్లీషు భాష నాణ్యత అంత బాగాలేదు. ఇలాంటి వాటిని అనువదించడంలో యంత్రాలు చాలా తప్పులు చేస్తాయి. అంచేత నాణ్యమైన ఇంగ్లీషు వ్యాసాన్ని అనువదించి చూడాలి. రాబోయే రోజుల్లో మరిన్ని పరీక్షలు చేసి ఆయా ఫలితాలను ఇక్కడ రాస్తాను. మింట్ వాళ్ళకు కూడా చెబుతాను.
ఈ పరికరంలో భారతీయ భాషల అనువాదాల కోసం ఐఐటి చెన్నై వాళ్ళు తోడ్పడ్డారు. ఐఐఐటి హైదరాబాదు వాళ్ళు తమ "పది లక్షల వ్యాసాల" పథకాన్ని మొదలుపెట్టినపుడు కొందరు తెలుగు వికీపీడియన్లని పిలిచారు మాట్టాడ్డానికి. నేనూ వెళ్ళాను. అప్పుడు వాళ్ళకు నేను ఇదే చెప్పినట్టు గుర్తు - మీరు అనువాద యంత్రాన్ని తయారు చేసారు గదా.. దాన్ని వికీమీడియా వాళ్ళకు ఇచ్చి వికీపీడియాలో చేర్చవచ్చు గదా అని. ఇంకా మెరుగు పరచాలి, అదయ్యాక చేస్తాం అని చెప్పారు. వీళ్ళు చెయ్యలేదు గానీ, ఇప్పుడు చెన్నై ఐఐటీ వాళ్ళు తమ మేధను వికీమీడియాకు అందించి ఈ పరికరం తయారీలో తోడ్పడ్డారని గమనించాను. ఆమధ్య నేను ఐఐఐటీ వారి ప్రాజెక్టులో తయారు చేసిన "పది లక్షల" వ్యాసాల్లో ఒక రెండొందల వ్యాసాలను ర్యాండంగా చూసాను. వాటి నాణ్యత ఈ పరికరం నాణ్యతతో పోలిస్తే బాగా తక్కువగా ఉంది -నేలబారుగా ఉందని చెప్పొచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 00:48, 4 జూలై 2023 (UTC)
2021, 2022 సంవత్సరాలలో తెలుగు వికీపీడియాను ప్రపంచ స్థాయిలో నిలిపిన WPWP పోటీని ఈ సంవత్సరం కూడా జరుపుకుందాం. జులై 1 నుండి అంతర్జాతీయంగా ఈ పోటీ మొదలైంది, వాడుకరులు పేజీలలో ఫోటోలు చేర్చేటప్పుడు #WPWP #WPWPTE ట్యాగులను వాడవచ్చు, తద్వారా మనం అంతర్జాతీయంగా పోటీలో నిలవవచ్చు.
గ్లోబల్ గా జరుగుతున్న ఈ పోటీ తెలుగు వికీలో ఏ స్థాయిలో జరగాలి అన్న దానిపై సముదాయ సభ్యుల అభిప్రాయాలు కోరుతున్నాను. ఇక గత సంవత్సరం పోటీకి వచ్చిన గ్రాంటులో ఖర్చులు పోను అక్షరాలా 53000 రూపాయలు అందుబాటులో ఉన్నాయి.
ప్రాజెక్టు పేజీ : వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023
ఇక ప్రాజెక్టు లక్ష్యాలు అలాగే ఈ సంవత్సరం ఏ పని చేయాలో అనే దానిపై ఇక్కడ చర్చ ప్రారంభించాను.
అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి అందరికి పేరు పేరున నమస్కారాలు, గత సంవత్సరం పోటీలో చక్కటి కృషి చేసిన మీ అందరిని ఈ ప్రాజెక్టు లక్ష్యాల నిర్దేశనలో అలాగే ప్రాజెక్టు అభివృద్ధికై సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
ప్రాజెక్టు నిర్వహణకు ఎవరైనా యువకులు సారధ్యం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. NskJnv 06:32, 4 జూలై 2023 (UTC)
53000 రూపాయలు అందుబాటులో ఉన్న విషయం వికీమీడియా ఫౌండేషన్ వారికి తెలపడం జరిగింది.
ఇక మీరు మాట్లాడుతున్న తెవికీ జన్మదిన వేడుక విషయానికి వస్తే, తన్వీర్ గారికి నేను ఈ మెయిల్ చేయడం జరిగింది, కానీ దానికి నాకు ఎటుంవంటి స్పందన అందలేదు. ఇక 2023 పోటీ విషయానికి వస్తే, నేను ఎక్కడ కూడా బహుమతుల విషయం కానీ కార్యక్రమాల గురించి గాని ప్రస్తావించలేదు. కేవలం గ్లోబల్ గా జరుగుతున్న పోటీకి లోకలైసెషన్ అవసరమని తెలిపాను, ఇక సభ్యుల అభిప్రాయాలు తెలిపితే ప్రోగ్రామ్ ఆఫీసర్ ని అడిగి మనకు అనుమతి అందిన తరువాతనే కార్యక్రమాలు, బహుమతుల గురించి చర్చించుకుందాం. NskJnv 15:31, 4 జూలై 2023 (UTC)
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ అనేది ఒక అంతర్జాతీయ వికీ ఉద్యమం, దీంట్లో ఏ కమ్యూనిటీ వారైనా పాల్గొనవచ్చు. తెలుగు కమ్యూనిటీ కూడా పాల్గొనవచ్చు, అందరికి ఈ పోటీని గుర్తు చేయాలని నేను ఆయా పేజీలు సృష్టించాను- వాటి వల్ల గ్లోబల్ గా మన గుర్తింపు ఉంటుంది. ఈ ప్రాజెక్టుని నిర్వహించడానికి ఏ గ్రాంటు అవసరం లేదు ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటె తెవికీ పేజీలలో దిద్దుబాట్లు చేయవచ్చు, అవి గ్లోబల్ పోటీకి లెక్కలోకి వస్తాయి.
సదరు సభ్యులు తెవికీ అభివృద్ధికి దిశగా నేను ఏ పని చేయడానికి ముందుకు వచ్చిన అడ్డుకోవాలి అన్నట్లుగా వారి ప్రవర్తన ఉన్నదని తోస్తుంది, అంతర్జాతీయంగా తెలుగు వికీ ఖ్యాతి పెంచిన ప్రాజెక్టు నిర్వహణ గురించిన చర్చలో వ్యక్తిగత విమర్శే తప్ప ప్రాజెక్టు నిర్వహించే దిశగా ఏ అంశం లేకపోవటం శోచనీయం.
అయినా సదుద్దేశంతో సదరు సభ్యులు ఈ సూచనలు చేశారని భావిస్తున్నాను.
మరొక్క సారి గత సంవత్సరం పోటీలో చక్కటి కృషి చేసిన తెలుగు వికీ సభ్యులను అందరిని ఈ ప్రాజెక్టు లక్ష్యాల నిర్దేశనలో అలాగే ప్రాజెక్టులో గ్లోబల్ స్థాయిలో మన ఉనికి నిలుపుకునేందుకు దశ దిశలపై చర్చకు ఆహ్వానిస్తున్నాను.
అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య.
NskJnv 15:27, 5 జూలై 2023 (UTC)
ఇతర వికీల నుంచి దిగుమతి చేసుకునే విధానం గురించి వికీపీడియా:వాడుకరులకు సూచనలు/దిగుమతి అనే పేజీని సృష్టించి దాన్ని వాడుకరులకు సూచనలు పేజీలో ఇమిడ్చాను. అలాగే దిగుమతి చెయ్యమని నిర్వాహకులను అభ్యర్థించేందుకు గాను వికీపీడియా:దిగుమతి అభ్యర్థనలు అనే పేజీని తయారు చేసాను. వాడుకరులు తమ అభ్యర్థనలను ఆ పేజీలో చేర్చవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 15:21, 5 జూలై 2023 (UTC)
తెవికీలో 2013 తరువాత కొత్తగా నిర్వాహకుల జాబితాలోకి కొత్త వారు ఎక్కువగా ఎవరు చేరనట్లు వికీపీడియా:నిర్వాహకుల జాబితా పేజీ ద్వారా తెలుస్తుంది, అలాగే 2023 జనవరిలో వాడుకరి:దురుపయోగాల వడపోత ని నిర్వాహకుల జాబితాలో చేర్చడం జరిగింది, ఈ ఖాతా ఎవరిది దీనిని నిర్వాహకుల జాబితాలో ఎలా చేర్చడం జరిగింది అనే దానిపై ఎవరికైన సమాచారం ఉంటె తెలుపగలరు.
NskJnv 15:42, 5 జూలై 2023 (UTC)
en:Template:Wikipedia_languages మూసలో ఇప్పుడు తెవికీ కూడా చేరింది. ఈ మూస ఎన్వికీ మొదటి పేజీలో అడుగున ఉంటుంది. చాలా ఎక్కువ పేజీవ్యూలుండే పేజీ అది - రోజుకు 13 కోట్ల పైచిలుకు పేజీ వ్యూలు! ఇప్పుడు ఆ మూసలో మన లింకు కూడా చేర్చడంతో మనకూ పేజీ వ్యూలు పెరిగే అవకాశం ఉంది.
అందులో మన లింకు కూడా చేర్చమని చేర్చమని అడిగే సమయంలో, గతంలో మనవాళ్ళు అడిగారని, అప్పట్లో మనకు ఆ అర్హత లేనందువల్ల చేర్చలేదనీ తెలిసింది. ఇప్పుడు మనకు ఆ అర్హతలు ఉన్నాయి కాబట్టి అడగ్గానే రెండు మూడు రోజుల్లో చేసేసారు. నిజానికి ఆ అర్హతలు మనకు ఎప్పుడో వచ్చేసాయి. ఇన్నాళ్ళూ అడగకపోవడం మన తప్పే. __ చదువరి (చర్చ • రచనలు) 00:33, 6 జూలై 2023 (UTC)
వెక్టరు 2022 రూపులో పేజీకి పైన కుడి మూలన ఉండే వాడుకరి డ్రాప్ డౌన్ మెనూలో నిన్నటి నుండి సమస్య ఏర్పడింది. ఆ మెనూలో నా మార్పులు, అనువాదం, ఎక్కింపులు ఈ మూడూ వివిడిగా డ్రాప్ డౌనులో కనబడేవి. నిన్నటి నుండి ఆ మూడింటినీ నా మార్పులు అనే మెనూకు ఉపమెనూగా మార్చారు. ఇప్పుడూ "నా మార్పులు" మీద కర్సరును ఉంచినపుడు పై మూడూ ఉపమెనూలిఉగా కనిపిస్తాయి. అంతవరకూ బానే ఉంది. కానీ ఈ ఉపమెనూలను క్లిక్కు చేద్దామని పోతే అవి అమంకు అందవు, మాయమై పోతాయి. దాంతో వాటిని క్లిక్కు చెయ్యడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఆ సంగతిని డెవలపర్లకు చెప్పాను.__ చదువరి (చర్చ • రచనలు) 02:06, 7 జూలై 2023 (UTC)
ఇటీవల యోగా అనే వ్యాసంలో జరిగిన మార్పులు ఇలా ఉన్నాయి ఈ వ్యాసం ఆంగ్ల మూలంలో కూడా సామాన్య శకం Common Era (CE) and సామాన్య శకం, సామాన్య శక పూర్వము Before the Common Era (BCE) అనే ఉంది. కానీ తెలుగు అనువాదంలో ఇక్కడ క్రీపూ, క్రీశ వాడారు. లౌకికవాదం కోసం ఆధునిక చర్తిత్ర కారులు ఈ మార్పుని చేయడం జరిగింది. లౌకిక భాషనీ తెలుగులో కూడా విరివిగా వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మార్పు చేయడం జరిగింది అని రాశారు, దీనివలన ఇప్పటి వ్యాసాలలో ఉన్న క్రీ.పూ. 512, సా.శ..పూ. 512 గాను, సా.శ.. 1757, సా.శ.. 1757 గాను మారుతాయి,ఇది నాకూ సబబు గానే అనిపించినది ఇలాంటివి చాలా వరకు అటోవికీ ద్వారా సవరించవచ్చు, దీని మీద చర్చ చేసి ఆమోదయోగ్యమైన వికీ రచనా శైలి లో సూచన చేద్దామా? : Kasyap (చర్చ) 10:31, 7 జూలై 2023 (UTC)
పజీలొ ఉంచితె మంచిది అని నా అభిప్రయం.
5 AD | ? |
5 BC | ? |
5 BCE | ? |
సా.శ..పూ. 512 | ? |
క్రీ.పూ. 512 | ? |
రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 00:41, 11 జూలై 2023 (UTC)
వివిధ భారతీయ భాషల వికీపీడియాలకు చెందిన ముఖ్యమైన గణాంకాలను కింది పట్టికలో చూడవచ్చు. తమిళం, హిందీల్లో వ్యాసాలు మనకంటే 80% పైగా ఎక్కువ. కానీ డేటాబేసు పరిమాణం మాత్రం మనకంటే తక్కువ. మలయాళంలో వ్యాసాలు మనతో సమానం. కానీ డేటాబేసు మాత్రం మనకంటే 30% ఎక్కువ. బెంగాలీ వికీలో వ్యాసాలు మనకంటే 65% ఎక్కువ, కానీ డేటాబేసు మాత్రం మనకంటే 160% ఎక్కువ. ఈ విధంగా చూస్తే బెంగాలీ, మలయాళం వికీపీడియాల మూలాలు వికీలన్నిటి లోకీ గట్టిగా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఆ తరవాత మనమే. హిందీ తమిళ వికీలు మనకంటే బోలుగా ఉన్నై. పరిశీలించండి.
ఈ గణాంకాలు 2023 జూలై 5 నాడు wikiscan.org నుండి తీసినవి. __చదువరి (చర్చ • రచనలు) 14:16, 7 జూలై 2023 (UTC)
2023 జూలై 5 నాటి గణాంకాలు (wikiscan.org నుండి) | తెలుగు | తమిళం | మలయాళం | కన్నడం | హిందీ | బెంగాలీ | మరాఠీ | పంజాబీ | గుజరాతీ | ఒరియా |
వ్యాసాల సంఖ్య | 83,922 | 1,57,010 | 84,940 | 30,934 | 1,61,621 | 1,39,536 | 93,692 | 50,620 | 30,380 | 16,949 |
మొత్తం పేజీలన్నిటి సంఖ్య | 3,26,669 | 4,91,629 | 5,09,738 | 1,34,986 | 12,62,175 | 11,76,224 | 2,98,429 | 1,61,313 | 1,23,781 | 75,391 |
మొత్తం దిద్దుబాటు చేసిన వాడుకరులు | 16,061 | 25,583 | 25,542 | 16,014 | 81,621 | 58,740 | 16,740 | 5,249 | 7,140 | 3,855 |
చురుగ్గా ఉన్న వాడుకరులు | 184 | 299 | 244 | 174 | 1239 | 1095 | 178 | 96 | 69 | 40 |
వ్యాసాల్లో చేసిన దిద్దుబాట్లు | 26,99,491 | 25,95,173 | 19,68,232 | 6,06,459 | 33,83,585 | 41,50,015 | 16,90,840 | 5,01,993 | 5,04,910 | 2,73,265 |
మొత్తం దిద్దుబాట్లన్నీ | 36,29,212 | 35,34,340 | 36,82,025 | 11,15,288 | 51,58,820 | 62,25,885 | 21,80,605 | 6,66,314 | 8,07,760 | 4,28,583 |
డేటాబేస్ పరిమాణం | 1.7 జిబి | 1.6 జిబి | 2.2 జిబి | 674 ఎంబి | 1.6 జిబి | 4.6 జిబి | 590 ఎంబి | 389 ఎంబి | 245 ఎంబి | 231 ఎంబి |
సగటున రోజువారీ వ్యాసాల దిద్దుబాట్లు | 572 | 588 | 275 | 120 | 526 | 1247 | 324 | 181 | 37 | 51 |
సగటున రోజువారీ మొత్తం దిద్దుబాట్లు | 670 | 744 | 356 | 162 | 825 | 2056 | 404 | 260 | 61 | 67 |
సగటున రోజుకు చేరే వ్యాసాల కంటెంటు | 228 కెబి | 260 కెబి | 174 కెబి | 114 కెబి | 191 కెబి | 644 కెబి | 144 కెబి | 224 కెబి | 9.4 కెబి | 27 కెబి |
సగటున రోజుకు చేరే మొత్తం కంటెంటు | 477 కెబి | 316 కెబి | 388 కెబి | 148 కెబి | 308 కెబి | 973 కెబి | 171 కెబి | 276 కెబి | 18 కెబి | 45 కెబి |
సగటున రోజుకు కొత్త వ్యాసాలు | 20 | 24 | 14 | 5 | 19 | 40 | 22 | 30 | 1 | 3 |
సగటున రోజుకు అన్ని వ్యాసాలు | 66 | 86 | 66 | 15 | 224 | 535 | 64 | 80 | 18 | 11 |
చదువరి (చర్చ • రచనలు) 14:16, 7 జూలై 2023 (UTC)
నాకు తెలిసిన హిందీ వంటి భాషలలో 30 శాతం మానవ సవరణల నిబంధన లేదు అనుకొంటున్నాను.Kasyap (చర్చ) 06:20, 9 జూలై 2023 (UTC)
"భారత స్వాతంత్ర్యోద్యమం" అనే పదం దోషంగా కనపడుతోంది. ఈ శీర్షికలో దోషాన్ని సరిచేయడానికి ప్రయత్నించండి. ఇటువంటి చర్చ వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_68#2010వికీపీడియా ఎడిటర్ తో దోష నిర్ధారణకు సహాయం లో జరిగింది. దీనిని సరిచేయవలసినదిగా వీవెన్, చదువరి, ప్రణయ్ రాజ్ లు ఈ దోషాన్ని సరిచేయుటకు తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 02:17, 9 జూలై 2023 (UTC)
నేను విండోస్ 11 తో పాటు తెలుగు ఇంటర్ఫేస్ ప్యాక్ వాడుతున్నాను నాకు ఈ సమస్య ఉన్నప్పుడు లోహిత్ ఫాంట్ వాడాను. Kasyap (చర్చ) 06:16, 9 జూలై 2023 (UTC)
పేజీలో కింద చూపించే మూలాల పెట్టెలో మార్పులు చేసారు. దిద్దుబాటు మోడ్‌లో మూలాల పెట్టెపై నొక్కితే మామూలు మూసపై నొక్కినట్టు మూసంతా సెలెక్టయ్యేది. ఏదైనా ఒక మూలాన్ని సెలెక్టు చేసుకునే వీలు ఉండేది కాదు. ఇప్పుడు ఒక్కో మూలాన్ని విడివిడిగా నొక్కవచ్చు. అలా నొక్కినపుడు ఆ మూలాన్ని సరిదిద్దే పెట్టె ప్రత్యక్షమౌతుంది. ఇక్కడ మూలాన్ని సరిదిద్దవచ్చు. గతంలో మూలాన్ని దిద్దాలంటే పేజీ పాఠ్యంలో ఆ మూలం ఉన్నచోటనే చెయ్యాల్సి వచ్చేది. పరిశీలించండి.
దీని వలన అసలు ఉపయోగం లేదని అనను గానీ.., అలవాటు కాకనో ఎంచేతనో గానీ ఇది నాకు నచ్చలేదు. మూస లక్షణాన్ని మారుద్దామని (రెండు వరసల్లో చూపించడం) మూసపై నొక్కగానే మూలాన్ని సరిచేసే దిద్దుబాటు పెట్టె ప్రత్యక్షమౌతోంది. దాన్ని చూస్తంటే చిరాగ్గా ఉంది. __ చదువరి (చర్చ • రచనలు) 00:17, 11 జూలై 2023 (UTC)
నెలలు పేర్లు ఎల వ్రాయలి! రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 01:28, 12 జూలై 2023 (UTC)
స్త్రీలకు సంబంధించిన వర్గాలు చూస్తున్నప్పుడు, ఈ క్రింది రెండు వర్గాలు/ఉపవర్గాలు గమనించాను.
వర్గం:మహిళలు; యుద్ధాలు చేసిన భారతీయ మహిళలు; 18వ శతాబ్ది యుద్ధరంగాల్లో మహిళలు.
గమనించండి - వర్గం:మహిళా శ్రేయస్సు కోసం వికీ మహిళలు 2018 ఈ పేజీలో చాలావరకు వ్యాధులు (మహిళలవే కాకుండా జనరల్) ఉన్నాయి.
వర్గం: మహిళలలో ఈ పేజీ కూడా గమనించండి.
గమనించండి - వర్గం:ఆదర్శ వనితలు - వికీపీడియా కూడా ఉంది.
ఇవి కాకుండా కవయిత్రులు ; వర్గం:రచయిత్రులు గురించి చూస్తే విడిగా చాలానే ఉన్నాయి.
ప్రధానం గా వనితలు లేదా మహిళలులో ఏది ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంలో స్పష్టత లేదు. పరిశీలించండి. ధన్యవాదాలు. VJS (చర్చ) 05:16, 12 జూలై 2023 (UTC)
మన వికిీలో సుమారు 3,000 వ్యాసలో మూస:Infobox film ఉపయొగించిగబడినది. విడుదల తేదీకి లేద releasedకు {{Film date}} ముూసను ఉపయోగించగలరు వివరాలకు మూస:Infobox film#Release_dates మరియు మూస:Film date గమనించండి. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 10:07, 12 జూలై 2023 (UTC)
మూస:Infobox film wikidataలో en:template:infobox filmకు జత ౘయాలి. మూస:సినిమా ముసాను నుండి import చేసారు? రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 14:08, 12 జూలై 2023 (UTC)
చంద్రయాన్-3 పేజీలో Amityyt అనే వాడుకరి పదేపదే దుశ్చర్య చేస్తున్నారు. ఒక రోజుపాటు వారిని నిరోధించాలేమో నిర్వాహకులు పరిశీలించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 10:37, 14 జూలై 2023 (UTC)
దయచేసి మూస:Filmdateను మూస:Film dateకు ధారిమర్పు చెయగలురు రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 01:28, 15 జూలై 2023 (UTC)
కొన్ని సినిమా వ్యాసాలో ఒకే సమచారము నకలు వున్నవి. ఉధాహరినికి: "సాంకేతిక నిపుణులు" డ్రైవర్ జమున వ్యాసంలొ. సమాచార పెట్టె మరియు సాంకేతిక నిపుణులు విభాగం ఒకే సమచారము నకలు. "సాంకేతిక నిపుణులు" విభాగం తీసివేయచ? రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 23:21, 15 జూలై 2023 (UTC)
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా జరిగింది. తెవికీలో జూలై 14 న ఆ పేజీకి 8,807 పేజీ వ్యూలు వచ్చాయి. భారతీయ భాషా వికీల్లో హిందీ (59,487) తరవాత తెలుగుపేజీకే ఎక్కువ వ్యూలొచ్చాయి. ఈ పేజీ కారణంగా ఇతర పేజీలు కూడా లబ్ధి పొందాయి. చంద్రయాన్-2 కు జూలై 13 న 200, 14 న 1300 పేజీ వ్యూలొచ్చాయి, చంద్రయాన్-1 కు జూలై 13 న 180, 14 న 1450 వ్యూలు వచ్చాయి. అంతకుముందు వరకూ వీటికి రోజుకు సగటున పాతిక ముప్పై పేజీవ్యూలే ఉండేవి. చంద్రయాన్-3 అనే ఘటన కారణంగా ఈ మూడు పేజీలకు సందర్శకులు పెరిగారు. ఆ పేజీల్లో ఉన్న సమాచారం వాళ్ళకు సంతృప్తి కలిగించి ఉంటుందని భావిద్దాం.
ఈ పేజీలు గనక నిన్నటికి లేకపోయి ఉంటే బహుశా వికీ సందర్శకులకు నిరాశ కలిగి ఉండేది. అంచేత ఇలాంటి ఆసక్తి కలిగించే ఘటనలు ఏమేం రాబోతున్నాయో (ఆటలు, ఎన్నికలు వగైరాల్లాంటివి) మనం ముందే ఒక జాబితా వేసుకుని వాటికి ఒక ఏడాది ముందే లేదా కనీసం ఒక నాలుగైదు నెలల ముందే పేజీలు సృష్టించి/తగు సమాచారంతో విస్తరించి పెట్టుకుంటే బావుంటుంది.__ చదువరి (చర్చ • రచనలు) 00:34, 16 జూలై 2023 (UTC)
2023 క్రికెట్ ప్రపంచ కప్పు జరగనున్న సందర్భంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 అనే ప్రాజెక్టును నడపాలని ప్రతిపాదించాను. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 01:01, 17 జూలై 2023 (UTC)
Please feel free to translate it into your language.
Dear Wikimedians,
Greetings! We are pleased to inform you that CIS-A2K has successfully completed several activities during the month of June. As a result, our monthly newsletter, which covers the highlights of the previous month, is now ready to be shared. We have taken care to mention the conducted events/activities in this newsletter, ensuring that all relevant information is captured.
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.
Thank you MediaWiki message delivery (చర్చ) 07:27, 17 జూలై 2023 (UTC)
అందరికీ నమస్కారం,
మనం గతంలో చర్చించుకున్నదాని ప్రకారం మెటా-వికీలో యూజర్ గ్రూప్ పేజీ ఏర్పాటుచేసి యూజర్ గ్రూపును ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. ఈ క్రమంలో ఒకసారి సముదాయానికి నిర్ణయాలన్నీ చెప్పి అభ్యంతరాలు లేకుంటే వెంటనే ఏర్పాటుచేద్దామని ఈ పోస్టు చేస్తున్నాను:
వీటిపై అభ్యంతరాలేమీ లేకపోతే ఈ జూలై 26 నాడు పేజీ సృష్టించి యూజర్ గ్రూప్ కార్యకలాపాలు ప్రారంభిస్తాను. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 09:59, 19 జూలై 2023 (UTC)
నమస్కారం వాడుకరి:Chaduvari గారు,
మీ అభిప్రాయం తెలియ పరిచినందుకు ధన్యవాదాలు, అలాగే కానివ్వండి తెలుగు వికీ యూజర్ గ్రూప్ లో లేనంత మాత్రాన తెలుగు వికీకి నేను అందించే సేవలు ఆగవు, తప్పక కొనసాగిస్తాను.
ఇక మీరు మాట్లాడుతున్న ఆ గ్రాంటు విషయమై రచ్చబండలో జరిగిన చర్చలో విషయానికి వస్తే, ఈ విషయంలో అసలు జరిగింది ఏమిటి అంటే..
ఈ మూవెమెంట్ చార్టర్ అంబాసిడరు కార్యక్రమం పూర్తిగా వ్యక్తిగతం, ఈ పని ఎవరైనా చేయవచ్చు. ఈ కార్యక్రమం ఒకటి ఉన్నదని సముదాయానికి చెప్పవలసిన భాద్యత వికీమీడియా వారిది, కానీ వారు కొంత మంది వ్యక్తులకు మాత్రమే సంప్రదించారు. అందుకే నేను నమోదు చేసుకున్నాను. ఆ తరువాత ఈ గ్రాంటు అనేది అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి వెచ్చించే సమయానికి పనికి అందించే రుసుము.
ఇక గ్రాంటు నియమాల ప్రకారం గ్రాంటు పేజీ సృష్టించిన తరువాత సముదాయ మద్దతును కొరవలసిందిగా ఇక్కడ ఇచ్చిన నియమాల ప్రకారం పేజీ సృష్టించిన 24 గంటల్లో నేను సముదాయంలో చర్చకు పెట్టాను ఇక్కడ దీనికి సంబంధించి మరింత చర్చ చూడవచ్చు. అయితే నేను సముదాయంలో 24 గంటల్లో పెట్టేలోపే పవన్ సంతోష్ గారు ఇతర వాడుకరులు ముఖ్యముగా వాడుకరి:యర్రా రామారావు గారు లేని పోనీ విషయాలను కల్పించి కట్టు కథలు అల్లడం చూడవచ్చు.
ఇక విషయానికి వస్తే, లెక్క ప్రకారం పనిని నిర్వహిస్తున్న నా వంటి వాడిపై అపోహలు సృష్టించే దిశగా పనులు చేసే పవన్ సంతోష్ గారికే అసలు యూజర్ గ్రూప్ మొదటి కాంటాక్టు పర్సన్ గా ఉండే అర్హత లేదని నా అభిప్రాయం. NskJnv 06:57, 20 జూలై 2023 (UTC)
ఇక మీరు అన్నట్లు వెంటనే సమాధానం ఇవ్వటం అంటే, మీరు నేను నిర్వహించిన ఏ ప్రాజెక్టులో కానీ చర్చల్లో పాల్గొన్న దాఖలాలు నాకు కనిపించలేదు(ఒకవేళ ఉంటె చూపగలరు). మీరు అడిగిన ప్రశ్నలకు ఎక్కడైనా సమాధానం చెప్పకుండా ఉంటె తెలుపగలరు, తప్పక సహకరించగలను. ఇక అసలు నేను నిర్వహించే ప్రాజెక్టు చర్చల్లోనే పాల్గొనని మీరు ఈరోజు అకస్మాత్తుగా ఈ అభిప్రాయం వెళ్ళబుచ్చటం నాకు అనుమానాస్పదంగా ఉంది.
ఇక ఈ ర్యాపిడ్ గ్రాంటుల విషయానికి వస్తే, ర్యాపిడ్ ఇండివిడ్యుల్ గ్రాంటులు అలాగే ఇతర గ్రాంటుల గురించి పవన్ సంతోష్ సముదాయంలో ఎవరైనా, ఒక శిక్షణా తరగతి నిర్వహిస్తే బాగుంటుంది, తద్వారా సముదాయ సభ్యులకు వారి/వాటి పరిధులు అర్థమవుతాయి. NskJnv 15:18, 20 జూలై 2023 (UTC)
ఇక్కడ నా గురించి జరుగుతున్న చర్చలో గమనించవలసిన విషయాలు ఏమిటి అంటే, నేను ఏ గ్రాంటు తీసుకున్న ఏ పని చేసిన వికీమీడియా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తిస్తున్నాను, నిర్వర్తిస్తాను అలాగే కొనసాగిస్తాను. ఇక మూమెంట్ చార్టర్ గ్రాంటులో నేను సముదాయంలో చర్చకు పెట్టె 24 గంటల్లోనే కొంత మంది వ్యక్తులు నా మీద వ్యక్తిగత దాడికి దిగారు, వారికి అర్ధమయ్యే విధంగా చెప్పిన కూడా నేను మాట్లాడుతున్న విషయాల్లో మధ్య మధ్యలో ఉన్న అక్షరాలను పట్టుకొని నన్ను దోషిగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారు. వీరు ఇప్పుడు ఒకసారి ఇలాగ ఉన్నారా అంటే! కానే కాదు, ఇంతకూ ముందు జరిగిన ఎన్నో చర్చల్లో వ్యక్తుల మీద దాడులు చేయడం చూడవచ్చు (అవన్నీ నేను మాట్లాడ దలుచుకోలేదు), సముదాయంలో ఏంతో మంది చురుకైన వాడుకరులు ఎందుకు తెలుగు వికీని వదిలారో మనమంతా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సముదాయం అంటే మేమె అని చెప్పుకొనే ముగ్గురు నలుగురు వ్యక్తులేనా! మిగతా అందరి అభిప్రాయం కూడా ఉంటె బాగుంటుంది.
ఇక నేను తీసుకున్న గ్రాంటు ఇండివిడ్యుఅల్ కి సహాయం అందించడానికి పెట్టినది, అది కమ్యూనిటీ రిసోర్సెస్ కి సంబంధం ఉన్నది కాదు. ఇకపై మాట్లాడ దలుచుకుంటే మూమెంట్ చార్టర్ గ్రాంట్ ల గురించి మరింత అవగాహన పొంది చర్చిస్తే బాగుంటుంది.
ఇక ఈ చర్చ పక్క దోవ పట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు, తెలుగు వికీ అభివృద్ధి దిశగా పవన్ గారు ఇప్పటి ఈ చర్చ ప్రారభించినందుకు ధన్యవాదాలు, నేను యూజర్ గ్రూప్ లో ఉంటానని ముందుకు రాలేదు, మీరే ప్రస్తావించారు ఇప్పుడు మీరే కాదంటున్నారు. ఆ స్థానంలో ఉండకపోవడం వల్ల తెలుగు వికీకి నేను అందించే సేవలు ఏం మారవు, ఆ భాద్యతలు ఎవరు చేపట్టిన నా సహాయ సహకారాలు ఉంటాయి.
ఇంకో ముఖ్యమైన విషయం, గతంలో యూజర్ గ్రూప్ గురించి జరిగిన చర్చల ద్వారా నేను గ్రహించిన కొన్ని విషయాలు ఈ క్రింది అభిప్రాయాన్ని కలిగించాయి:
NskJnv 07:54, 25 జూలై 2023 (UTC)
మొదటిగా
అలా చెప్పే భాద్యత నాది కాదు, ముమ్మాటికీ కానే కాదు. ఫౌండేషన్ వారు అసలు ఈ మూమెంట్ చార్టర్ అంబాసిడర్ కార్యక్రమం గురించి తెలపాలి, వారు తెలపలేదు. నాకు అందిన మెయిల్ ద్వారా నేను తెలుసుకున్నాను. అలాగే ఇంతకు ముందు ప్రస్తావించిన విదంగా వారు సూచించిన నియమావళికి అనుగుణంగా నేను ఆ పని చేపట్టాను.
ఈ కాంఫరెన్సుకు మూమెంట్ చార్టర్ అంబాసిడర్ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు, దీని గురించి ఒక సాటి వికీపీడియన్ గా నాకు చెప్పే భాద్యత ఉందని నేను భావిస్తాను! కానీ మూమెంట్ చార్టర్ అంబాసిడరుకు ఇది భాద్యత కానే కాదని మీరు గమనించగలరు. ------ నేను దరఖాస్తు చేసుకుంది కూడా చివరి రోజున, ఆది పూర్తి కూడా అవ్వలేదు. ఇంకా మీకు ఆసక్తి ఉంటె ఆయా మెటా పేజిలకి వెళ్లి తెలుసుకోగలరు, మీకు కనుక్కోవడం కష్టంగా ఉంటె అడగండి నేను తప్పకుండ సహకరిస్తాను.
నేను తీసుకున్న గ్రాంటుల విలువ 8 లక్షలకు దగ్గరగా ఉంటుంది, ఇక నేను ఇంతకు ముందు తీసుకున్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసాను కాబట్టే ఇటీవల కొలామి వికీపీడియా గ్రాంటు అందుకున్నాను.
అంతే కాదండి నేను ప్రస్తుతం మూడు భారతీయ భాషల్లో దాదాపు 7 వికీమీడియా ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాను. నయా పైసా తీసుకోకుండా గత సంవత్సర కాలంగా రెండు కొత్త భాషలలో వికీపీడియాను నిర్మిస్తున్నాము, వాటిల్లో ఒకటే ఈ కొలామి వికీపీడియా. ఇక తెలంగాణా ప్రభుత్వం సహకారంతో, ఆయా భాషల సంఘాలతో కలిసి దాదాపు 10 కి పైగా ఆఫ్ లైన్ మీటింగులు కూడా నిర్వహించాను.
ఇక మీరు నా అనుభవం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కూడా చెప్తే బాగుంటుంది అనిపించి చెబుతున్న, నేను తెలంగాణ, అస్సాం రాష్ట్రాలలోని లోని మూడు జిల్లాలలో పని చేస్తూ ప్రైవేట్, ప్రభుత్వం ఇలా రకరకాల సంస్థల అనుబంధంతో విద్య, వైద్యం, ఉపాధి కల్పన, శిశు సంక్షేమం ఇతరాత్ర అంశాలపై దాదాపు 36 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణపై కృషి చేసాను. ఇక నాకున్న సంస్థాగత అనుభవంతో తెలుగు వికీ యూజర్ గ్రూప్ కి కూడా ప్రాజెక్టుల రూపకల్పన అందించగలను.
సముదాయంలో ఎన్నో ప్రాజెక్టులో మొదలుకొని అసంపూర్ణంగా అలాగే సంవత్సరాల కొద్దీ ఉండేవి ఉంటూనే ఉంటాయి, వాటి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా నామీద చేస్తున్న ఆరోపణలను నా పట్ల మీ ధోరణిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను, దీనిని నేను వ్యక్తిగత దాడిగా పరిగణిస్తున్నాను. ఎవరెన్ని దాడులు చేసిన, నన్ను పదే పదే నా మనోధైర్యం దెబ్బతినే విధంగా దూషణలు చేసిన నా వికీ స్ఫూర్తి చావదు, వికీ కాన్ఫరెన్సు 2023 సాక్షిగా మన దేశంలో ఉన్న 1600కు పైగా మాతృ భాషలలో కేవలం ~29 భాషలలో మాత్రమే ఉన్న వికీపీడియాను మరిన్ని భాషలలో మానవాళికి అందించే దిశగా నా కృషి సాగుతూనే ఉంటుంది.
ఇక్కడితో నేను ఈ చర్చ ముగిస్తున్నాను.
NskJnv 05:13, 1 ఆగస్టు 2023 (UTC)
సముదాయ సభ్యులకు నమస్కారం!
తెలుగు వికీపీడియా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వికీ ప్రాజెక్టులలో ఒకానొక గొప్ప ప్రాజెక్టు. 84 వేయిలకు పైగా వ్యాసాలతో ముందుకు వెళ్తున్న మనం 1 లక్ష వ్యాసాలకు చేరువ కాబోతున్నాము, ఈ విషయం గురించి సముదాయంలో చాలా సార్లు చర్చ జరిగింది. ఇక 2023 సంవత్సరాన్ని ప్రాతిపదికగా లక్ష వ్యాసాల మైలు చేరుకునే దిశగా మన ప్రయాణం ఉండే అవసరం ఎంతో ఉంది. అలాగే మనం నిర్వహించుకుంటున్న, నిర్వహించుకోబోయే ప్రాజెక్టులను గురించి చర్చించి వ్యూహాలు రచించవలసిన అవసరం ఉన్నది.
ఈ ప్రయాణంలో వాడుకరి:Pranayraj1985 గారు సమన్వయ కర్తగా వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Veeven, వాడుకరి:యర్రా రామారావు గార్లు కమిటీ సభ్యులుగా నిర్వహిస్తున్న తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదిగా నా అభిప్రాయం. ఈ ప్రాజెక్టులో జరిగిన పురోగతి అలాగే ప్రాజెక్టు యెంత వరకు పూర్తయింది, దీనికి సముదాయం నుండి ఏదైనా సహాయం కావాలా! వగైరా విషయాలను గురించి ప్రాజెక్టు నిర్వాహకులని, సముదాయ సభ్యులని చర్చకు ఆహ్వానిస్తున్నాను.
ఇటీవల ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్టు ,
"తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించేందుకు వికీమీడియా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు నిర్వహించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, వికీలో ప్రస్తుతమున్న "వెక్టర్" స్థానంలో "వెక్టర్ 2022" డిఫాల్టు రూపుగా రాబోతున్నందున ఇప్పటివరకు తయారు చేసిన పాఠాల స్థానంలో కొత్త రూపుకు తగ్గట్టుగా పాఠాలను రూపొందించాల్సివస్తుంది. అందుకు మరికొంత గడువు అవసరమయింది."
ఈ ప్రాజెక్టులో భాగాంగా నిర్మించిన పాఠాలకు సంబంధించి లింకులు అందజేయవల్సిందిగా కోరుతున్నాను.
NskJnv 06:18, 20 జూలై 2023 (UTC)
ఈ వెబ్సైట్ ప్రత్వేకంగా ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంభందించినది. ఇందులోని సమాచారం దాదాపుగా 90 శాతానికి పైగా తెవికీ నుండి యథావిధిగా సేకరించిందే. తెవికీ నుండి తీసుకోకూడదు అనేది ఏమీ లేదు కదా? కాబట్టి ఇది తప్పు అని అనలేం.కాకపోతే కొన్ని మీడియా సంస్థలు వార్కి సమాచారం గ్రహించి, లేదా సేకరించి రాయటానికి వార్కి ఓపిక లేకనో, అంత నిష్ణాతులు లేకనో ఇలా జరుగుచుందేమోనని నా స్వంత అభిప్రాయం.ఉదాహరణకు ఆనందపురం గ్రామ వ్యాసం చూడండి.కాకపోతే తెలుగు వికీపీడియా నుండి సేకరించిందని రాయకపోవటం శోచనీయం.ఇంకో విషయం ఈ వెబ్సైట్ అడ్మిన్ గురించి తెవికీలో ఒక పేజీ ఉంది. కేవలం ఇది పరిశీలనకోసం మాత్రమే. యర్రా రామారావు (చర్చ) 05:02, 26 జూలై 2023 (UTC)
అందరికీ నమస్కారం,
2023 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 వరకు ఫెమినిజం, ఫోక్లోర్ ఎడిటథాన్ 2023 పేరుతో అంతర్జాతీయ రచనల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో 77 కొత్త వ్యాసాలతో మురళీకృష్ణ గారు ప్రథమ స్థానంలోనూ, 12 కొత్త వ్యాసాలతో ప్రణయ్‌రాజ్ వంగరి గారు ద్వితీయ స్థానంలోనూ, 1 కొత్త వ్యాసంతో చదువరి గారు తృతీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీలో పాల్గొన్నందుకు వారికి నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.--Nagarani Bethi (చర్చ) 06:49, 26 జూలై 2023 (UTC)
నమస్తే!
Apologies if this message is not in your language, ⧼Please help translate⧽ to your language.
This wiki will soon be able to use the inline audio player implemented by the Phonos extension. This is part of fulfilling a wishlist proposal of providing audio links that play on click.
With the inline audio player, you can add text-to-speech audio snippets to wiki pages by simply using a tag:
<phonos file="audio file" label="Listen"/>
The above tag will show the text next to a speaker icon, and clicking on it will play the audio instantly without taking you to another page. A common example where you can use this feature is in adding pronunciation to words as illustrated on the English Wiktionary below.
{{audio|en|En-uk-English.oga|Audio (UK)}}
Could become:
<phonos file="En-uk-English.oga" label="Audio (UK)"/>
The inline audio player will be available in your wiki in 2 weeks time; in the meantime, we would like you to read about the features and give us feedback or ask questions about it in this talk page.
Thank you!UOzurumba (WMF), on behalf of the Foundation's Language team
02:26, 27 జూలై 2023 (UTC)
అందరికీ నమస్కారం,
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటును ముందుకుతీసుకువెళ్ళే ఉద్దేశంతో జరిగిన చర్చల్లో గత డిసెంబరు ప్రాంతంలో సముదాయ సభ్యులు పలువురు నన్ను యూజర్ గ్రూప్‌కి ప్రాథమిక కాంటాక్టు పర్సన్‌గా ఉండమని కోరారు. దానితో వికీమీడియా ఫౌండేషన్‌తోనూ, ఇతర యూజర్ గ్రూపులూ, సంస్థలతోనూ సంప్రదింపులు జరిపుతూ, నివేదికలు అందచేస్తూ ఉండాల్సిన ఈ నియమిత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బాధ్యతలను స్వీకరించడానికి నేను అంగీకారం తెలిపాను.
గత ఏడాది వరకూ చేస్తున్న ఉద్యోగంలోంచి మారి ఇటీవల మూడు నెలల క్రితం నేను సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగంలో చేరాను. వృత్తిపరమైన పనుల కోసం, వ్యక్తిగతమైన పనుల కోసం వేర్వేరు మెయిల్ ఐడీలు, వేర్వేరు వికీమీడియా ఖాతాలు నేను ఉపయోగిస్తూ స్వచ్ఛంద, వృత్తిపరమైన పనుల విషయంలో భేదాన్ని, స్పష్టతని పాటిస్తున్నాను. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగానూ, భారతదేశవ్యాప్తంగానూ కూడా వికీమీడియా ఉద్యమంలో వివిధ హోదాలు/బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న వ్యక్తుల ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
నా ఉద్యోగ బాధ్యతలకు, యూజర్ గ్రూప్ కాంటాక్టు పర్సన్ బాధ్యతలకు మధ్య మా సంస్థపరంగా వృత్తిపరమైన వైరుధ్యం లేదనీ నిర్ధారించుకున్నాను. నావైపు నుంచి ఈ బాధ్యత తలకెత్తుకోవడానికి ఏ విధమైన అభ్యంతరమూ లేదు. అదే విధంగా, తెలుగు వికీమీడియా సముదాయం కూడా ఆలోచించుకుని నాకు యూజర్ గ్రూప్ ప్రాథమిక కాంటాక్టు పర్సన్‌గా ఉండడానికి అంగీకారం తెలిపితేనే ఈ విషయంలో నేను ముందుకువెళ్తాను. పవన్ సంతోష్ (చర్చ) 06:01, 28 జూలై 2023 (UTC)
వారంరోజుల పాటు సాగిన పై చర్చలో భిన్నాభిప్రాయాలేమీ వ్యక్తం కాకపోవడంతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తూ రెండవ కాంటాక్ట్ పర్సన్‌ని ప్రతిపాదించాను. దయచేసి అక్కడ మీ అభిప్రాయాలు రాయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:21, 4 ఆగస్టు 2023 (UTC)
యూజర్ గ్రూప్ గురించి అనేక సంవత్సరాలుగా పలుదఫాలుగా (మొదటి అవగాహాన సదస్సు 2015) జరిగినప్పటికీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ ఉన్నది ఈ సారి అయినా ఒక దరికి చేరుతున్నది అని ఆశిస్తున్నాను, కొత్తగా చేరిన వారి సౌలభ్యంకోసం పవన్ గారు రాసిన ప్రాథమిక ప్రతిపాదన తోపాటు నాకు తెలిసిన సమాచారం ఇక్కడ పంచుకొంటున్నాను . ఒకే తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటు సమూహం వికీమీడియా ట్రేడ్‌మార్క్‌లను ఉపయోగించడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా నిర్దిష్ట గ్రాంట్లు పొందడానికి అనుమతిస్తుంది అయితే ఇది ఐచ్చికం , ఇవి చట్టబద్ధంగా వికీమీడియా ఫౌండేషన్‌కు ప్రాతినిధ్యం వహించవు. ఇవి స్వయంసేవకుల ప్రత్యేక & స్వతంత్ర సమూహాలు, సాధారణ వినియోగదారు సమూహాలు చేసే లేదా చేయగల ఏ పనిని చేయడానికి గుర్తింపు అవసరం లేదు, తెలుగు వారందరికీ ఖచ్చితంగా ఒకే యూజర్ గ్రూపు ఉండాలని నిబంధన కూడా లేదు సమూహ ఆసక్తి బట్టి ఒక ప్రాంతానికో , ఇస్టమైన వికీ అంశానికో ఇలా వివిధ రకాల యూజర్ గ్రూప్ ఉండవచ్చు వాటి లక్ష్యాలు అనుగుణంగా ఉన్నంత వరకూ , ఆ లక్ష్యాలకు తోర్పడుతున్నంత వరకూ ఎంత మంది ఎన్ని యూజర్ గ్రూప్ లలో అయినా చేరవచ్చు లేదా ఆ గుంపు నుండి బయటకు రావచ్చు , ఇవి లేకుండా కూడా సభ్యులు ప్రాజెక్ట్ & ఈవెంట్ గ్రాంట్లు , వ్యక్తిగత గ్రాంట్లు మరియు ట్రావెల్ & పార్టిసిపేషన్ సపోర్ట్ గ్రాంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . నాకు తెలిసి ఖచ్చితంగా తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అనుమతి ఖచ్చితంగా ఉండి తీరాలి అన్న నిబంధన లేదు, అయితే వీటికి యూజర్ గ్రూప్ ఆమోద ప్రక్రియ , అనుసంధాన మద్దతు కు తోర్పడుతుంది అంతే కాక ఈ గ్రూప్ సభ్యులలో ఒకరికి ప్రతి సంవత్సరం బెర్లిన్‌లో నిర్వహించే వికీమీడియా సమావేశానికి హాజరయ్యేందుకు ఒక స్కాలర్షిప్ కూడా ఉంటుంది , ఈ ఏర్పాటుకు దాదాపు 10 మంది సభ్యులను కలిగి ఉండాలని సిఫార్సు చేయబడినప్పటికీ, అప్లికేషన్‌కు ముందు సంవత్సరంలో కనీసం 3 మంది సభ్యులు 500 లేదా అంతకంటే ఎక్కువ సహకారాలతో సక్రియంగా ఉండాలి. ఈ క్రియాశీల సభ్యులు తప్పనిసరిగా మంచి కమ్యూనిటీ స్టాండింగ్‌లో ఉండాలి (సస్పెండ్ కాకుండా , పాల్గొనకుండా నిరోధించ బడకుండా) ఉండాలి అవి ఇక్కడ (xtools) తెలుసుకోవచ్చు , వ్యవస్థాపక సభ్యుల నేపథ్యం సమూహం యొక్క విజయానికి చాలా కీలకం కాబట్టి అందుకు అనుగుణంగా ఎంపిక ఉండాలి, స్వచ్ఛందంగా పనిచేయదలుచుకున్నవారు ఎవరైనా కాంటాక్టు పర్సన్ గా బాధ్యతలు తీసుకోవచ్చు (వీరికి ఇలా ఉన్నందుకు ఎలాంటి డబ్బు రాదు, ఇది ఉపాధి కాదు ), వీరు కాలానుగుణంగా ఇంకొకరికి ఆ బాధ్యత అప్పగించవచ్చు ప్రాథమిక సంప్రదింపు అనేది వినియోగదారు సమూహంలోని ఇతర సభ్యులపై అధికారం చెలాయించే స్థానం కాదు, వికీమీడియా మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా లేదా ఇతర వికీమీడియా సంస్థలు లేదా వికీమీడియా ప్రాజెక్ట్‌లకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగించే కార్యాచరణలో పాల్గొనకూడదు. కాంటాక్టు పర్సన్ సమూహంలో చర్చలు ఏకాభిప్రాయం తర్వాత మాత్రమే అవసరమైన చర్యలు తీసుకోంవాలి. వికీమీడియా మార్గదర్శక సూత్రాలకు లోబడి నిర్వహించే కార్యకలాపాలకు సంబంధించిన ఆన్-వికీ డాక్యుమెంటేషన్ లో క్రియాశీలకంగా ఉండాలి, పారదర్శకంగా ప్రవర్తించాలి ,తప్పనిసరిగా వికీమీడియా వినియోగదారు సమూహ ఒప్పందం మరియు ప్రవర్తనా నియమావళికి అంగీకరించాలి. వివరాలు సమర్పించిన తరువాత WMF వారినుండి ఆమోదం రావటానికి అంచనా సమయం సుమారు 1-3 వారాలు, ప్రారంభ గుర్తింపు సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది, ఆపై సమీక్షించబడుతుంది. సమూహం నిష్క్రియంగా మారితే, గుర్తింపు నిలిపివేయబడుతుంది లేదా అవసరమైతే తీసివేయబడుతుంది. Kasyap (చర్చ) 08:46, 28 జూలై 2023 (UTC)
క్రికెట్ ప్రాజెక్టు మొదలయ్యేది రేపే.__ చదువరి (చర్చ • రచనలు) 01:28, 31 జూలై 2023 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.