Remove ads
గుజరాత్ రాష్ట్రం, వల్సాడ్ జిల్లాలోని ఒక నగరం. From Wikipedia, the free encyclopedia
వల్సాడ్, చారిత్రాత్మకంగా దీనిని బుల్సర్ అని పిలుస్తారు. ఇది భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, వల్సాడ్ జిల్లాలోని ఒక నగరం.ఇది పురపాలక సంఘ పట్టణం. ఇది వల్సాడ్ జిల్లా కేంద్రంగా ఉంది.[2] వల్సాడ్ నగరం, నవ్సారి నగరానికి, సూరత్‌కు దక్షిణాన ఉంది.
వల్సాడ్
బుల్సర్ | |
---|---|
నగరం | |
Nickname: City of Peace | |
Coordinates: 20.610°N 72.926°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | గుజరాత్ |
జిల్లా | వల్సాడ్ |
విస్తీర్ణం | |
• Total | 24.10 కి.మీ2 (9.31 చ. మై) |
Elevation | 13 మీ (43 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,70,060 |
• జనసాంద్రత | 7,100/కి.మీ2 (18,000/చ. మై.) |
Demonym(s) | వల్సాడియన్లు, వల్సాడిలు |
భాషలు | |
• అధికారిక | గుజరాతీ |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 396001 |
టెలిఫోన్ కోడ్ | 912632 |
Vehicle registration | జిజె-15 |
లింగ నిష్పత్తి | పురుఫులు 926/ స్త్రీలు 1000 |
అక్షరాస్యత | 80.94 % |
"వల్సాద్" అనే పేరు గుజరాతీ భాషా సమ్మేళనం వాద్-సాల్ నుండి వచ్చింది. దీని అర్థం "మర్రి చెట్లచే కప్పబడిన (సాల్ ) " అని సూచిస్తుంది. (ఈ ప్రాంతం సహజంగా మర్రి చెట్లతో సమృద్ధిగా ఉండేది). బ్రిటిష్ రాజ్ కాలంలో, దీనిని చారిత్రాత్మకంగా "బల్సర్" అని పిలిచారు. ప్రధానంగా మాట్లాడే భాష గుజరాతీ.మాట్లాడే ఇతర భాషలు హిందీ, మరాఠీ, అంగ్ల భాష . వల్సాద్‌లో అనుసరించే ప్రధాన మతం హిందూ మతం.పట్టణంలో అనుసరించే ఇతర మతాలు ఇస్లాం, క్రైస్తవం, జైనమతం, జొరాస్ట్రియనిజం, బౌద్ధమతం .
వల్సాద్ జాతీయ రహదారి 48 లో ఉంది. గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సేవల ద్వారా వల్సాద్ నుండి, గుజరాత్‌లోని అన్ని ప్రముఖ నగరాలకు బస్సు సేవలు ఉన్నాయి. డామన్ గంగగా సూచించబడే గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 16 విభాగాలలో వల్సాద్ ఒకటి.
వల్సాద్ రైల్వే స్టేషన్ పశ్చిమ రైల్వేలోని ముంబై రైల్వే విభాగం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది పశ్చిమ రైల్వే కింద ఒక ఉప విభాగం. ఇది కొత్త ఢిల్లీ-ముంబై ప్రధాన మార్గంలో ఉంది. ప్రస్తుత రైల్వే స్టేషన్ భవనం 1925లో స్థాపించారు. రైల్వే స్టేషన్‌కు ఆనుకుని వల్సాడ్ విద్యుత్ లోకో షెడ్లో 100కి పైగా ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లు ఉన్నాయి.
వల్సాద్ నగరం, సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఇది నగరానికి ఉత్తరాన 99 కి.మీ. దూరంలో సూరత్‌లో ఉంది. వల్సాద్కు సమీపంలో ఉన్న ఇతర విమానాశ్రయం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది వల్సాడ్ నగరం నుండి దక్షిణాన 188 కి.మీ.దూరంలో ఉంది.
రసాయనాలు, వస్త్రాలు, కాగితం & గుజ్జు పరిశ్రమల వంటి రంగాలకు వల్సాద్ ఒక పారిశ్రామిక స్థావరం.1980వ దశకం నుండి, నగరంలో ఉపాధికి వస్త్ర తయారీ, రసాయన ఉత్పత్కులు ప్రధాన రంగాలుగా ఉన్నాయి. వల్సాద్ రాష్ట్రంలోని ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు, పంటలలో గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తోంది.
వల్సాద్‌లో డుంగ్రా, పార్డి, ధరంపూర్, భిలాద్, వల్సాద్, ఉంబర్‌గావ్, సరిగామ్, వాపి (గుజరాత్ రసాయన కేంద్రం) కల్గామ్లో ఒక పారిశ్రామిక ఉద్యానవనం ఉన్నాయి.[3] నగరంలో 300 కంటే ఎక్కువ మధ్యతరహా, భారీ పరిశ్రమలతో, వాపి వల్సాద్ ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఆసియాలోని అతిపెద్ద కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సిఇటిపి) వాపిలో ఉంది, ఇది వాపి వేస్ట్ & ఎఫ్లూయెంట్ నిర్వహణ కంపెనీకి చెందింది. వాపి పారిశ్రామిక సంఘం ద్వారా ప్రచారం చేయబడింది.[4]
మొరార్జీ దేశాయ్ సంగ్రహశాల వల్సాద్‌లో భారతదేశ మాజీ 5వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌కు అంకితం చేస్తూ నిర్మించబడింది. ఈ సంగ్రహశాలను వల్సాద్ పురపాలక సంఘం రూ.4 కోట్లు ఖర్చుతో నిర్మించింది.దీనిని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రారంభించారు.[7]
కాల్లియన్ బాగ్ వల్సాద్‌లోని ఒక పట్టణ ఉద్యానవనం. ఇది 1929లో, మిస్టర్ మోతీలాల్ కలియన్జీ తన తండ్రి జ్ఞాపకార్థం వల్సాద్ పురపాలక సంఘానికి అందించిన విరాళంతో ఏర్పడింది.సా.శ. 1931లో, కాలియన్ బాగ్ని జెహెచ్గారెట్ ప్రారంభించాడు.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.