వల్సాడ్ జిల్లా
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో వల్సాడ్ జిల్లా ఒకటి. వాపి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5,244 చ.కి.మీ 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,410,553. వీరిలో 27.02% నగరాలలో నివసిస్తున్నారు.[1].[2] వల్సాడ్ ను బుల్సార్ అని కూడా వ్యవహరిస్తారు

సరిహద్దులు
వల్సాడ్ జిల్లా ఉత్తర సరిహద్దులో నవ్‌సారి జిల్లా, తూర్పు సరిహద్దులో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన నాసిక్ జిల్లా , దక్షిణ సరిహద్దులో కేంద్రపాలిత ప్రాంతం అయిన దాద్రా నాగర్ హవేలి , మహారాష్ట్ర రాష్ట్రంలోని పాల్‌ఘర్ జిల్లా , పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి. ఉత్తర, తూర్పు , దక్షిణ సరిహద్దులో డయ్యూ డామన్ ఉంది.[2]
విభాగాలు
జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి : వల్సాద్, పర్ది, ఉమర్గం, కపర్ద , ధరంపూర్.
ఆర్ధికం
వల్సద్ జిల్లాలో అధికంగా మామిడి, సపోడిలా , టేకు ఉత్పత్తి చేయబడుతుంది. జిల్లాలో అతుల్ (గుజరాత్) అనే రసాయన పరిశ్రమ ఉంది.
చరిత్ర
గుజరాత్‌లోని సాజన్ నౌకాశ్రయం నుండి పారశీకులు మొదటిసారిగా భారతదేశంలోకి ప్రవేశించారు.[3] పర్నెరా పర్వతంలో చత్రపతి శివాజీ మహారాజు కోట , కొన్ని ఆలయాలు ఉన్నాయి.[3] బగ్వద వద్ద ఔరంగజేబు కోట , జైన్ ఆలయం వంటి పలు ఆలయాలు ఉన్నాయి.
భౌగోళికం
- సరాసరి వర్షపాతం – 2000 మి.మీ.
- సీస్మిక్ భూభాగం - భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతం - జోన్ - 3
- ప్రధాన నదులు - దామగంగా నది, పార్, ఔరంగా నది, కోలక్ నది, తాన్ నది , మాన్ నది.
- వల్సద్ జిల్లాలో తిథల్ సముద్రతీరం జిల్లాలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది.
- ధరంపూర్‌లో ఉన్న విల్సన్ హిల్స్ కూడా జిల్లాలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఉంది.
ఆర్ధికం
వ్యవసాయం
2006-07లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి. 3.6 లక్షల మెట్రిక్ టన్నులు. ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు మామిడి, సొరకాయలు, చికూ, అరటి , చెరకు. 2006-07లో వల్సద్ మామిడి (2,03,112 మెట్రిక్ టన్నులు) ఉత్పత్తి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. 2006-07లో వల్సద్ సొరకాయ ఉత్పత్తి (47,960 మెట్రిక్ టన్నులు) లో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది.
పరిశ్రమలు
వల్సాడ్ జిల్లాలో రసాయనాలు, వస్త్రాలు, , కాగితం & గుజ్జు పరిశ్రమలు రంగాలకు పారిశ్రామలు ఉన్నాయి. జిల్లాలో 1980 నుండి, వస్త్ర , రసాయనాలు వంటి రంగాలలో ప్రధానంగా పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. ఇవి ప్రజలకు ఉపాధి కల్పించడంలో కూడా ప్రధానపాత్ర వహిస్తున్నాయి. వల్సాడ్ ఆహార ధాన్యాల పంటలు ఉత్పత్తి గణనీయంగా ఉంది. అంతేకాక వల్సద్ హార్టి కల్చర్ ఉత్పత్తి కూడా అధికంగా అభివృద్ధి చెంది ఇది రాష్ట్ర ఉద్యానవన కేంద్రంగా గుర్తించబడుతుంది. 300 కంటే అధికమైన మద్యతరహా , బృహత్తర పరిశ్రమలతో వల్సద్‌లోని వాపి జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. ఆసియాలోని అతిపెద్ద వాపి ఎఫ్లుయంట్ మేనేజ్మెంటు కంపనీకి స్వంతమైన " కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంటు ప్లాంట్ " ప్రస్తుతం వాపిలో ఉంది. జిల్లాలో రసాయనాలు, వస్త్రాలు, ఇంజనీరింగ్, , కాగితం పరిశ్రమ, జిల్లాలో ప్రస్తుతం ఉంటాయి. అనేక ప్రైవేట్ మిశ్రమాలు అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వైత్, వెల్స్పన్, భారతదేశం లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్, అతుల్ లిమిటెడ్, గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్ (జి.హెచ్.సి.ఎల్), రేమండ్ సహా, వల్సాడ్ లో ఉన్నాయి, సన్ ఫార్మాస్యూటికల్స్, యునైటెడ్ భాస్వరం, పిడిలైట్, పాలియోల్స్ & పాలిమర్స్ , వడిలాల్, ప్రత్యేక పాలిమర్లు మొదలైన 10,716 కంటే అధికమైన వివిధరంగాలకు సంబంధించిన చిన్నతరహా , మద్యతరహా ఎంటర్ప్రైసెస్ ఉన్నాయి. వల్సద్ జిల్లాలో వాపి (కెమికల్ హబ్ ఆఫ్ గుజరాత్) వంటి పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి.
ప్రధాన పరిశ్రమలు
- అటువంటి దీమినొ సుల్ఫొనే రసాయన ఉత్పత్తులు, ఎసిటిక్ ఆమ్లాలు , లవణాలు, రంగులు వివిధ రకాల మొదలైనవి వల్సాడ్ అతుల్ లిమిటెడ్
- ఔషధ ఉత్పత్తులు వల్సాడ్ వీత్ లెదెర్లే లిమిటెడ్
- వెల్‌స్పిన్ పాలియెస్టర్ ఇండియా లిమిటెడ్ , అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ : కాటన్ నూలుతో, పత్తి టెర్రీ టవల్ మదెఉప్స్ , బట్టలు.
- ధర్మపూర్ వదిలల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ : సెమీ ప్రాసెస్ & రెడీమేడ్ ఆహారాలు, టమోటో కెచప్, తయారుగా , ఘనీభవించిన ఆహారాలు
- పర్యావరణ , గాలి కాలుష్యం నియంత్రణ కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు, భాస్వరం
- యునైటెడ్ సల్ఫైట్ లిమిటెడ్ (వాపి) : పీంటా సల్ఫైడ్, బొంజైట్
- వాపి సన్ ఫార్మాస్యూటికల్స్: ఔషధ ఉత్పత్తులు.
- అంబెర్గోన్ సరిగం స్టీల్ లిమిటెడ్ :- ఐరన్ పైపులు, సీమ్‌లెస్ పైపులు , స్టెయిన్లెస్ స్టీల్స్ మొదలైనవి.
- పర్ది రూబీ మాకోంస్ లిమిటెడ్ :- అంకోటెడ్ క్రాఫ్ట్ పేపర్, న్యూస్ పేపర్ , పోస్టర్ పేపర్ మొదలైనవి.
- వాపి పిడిలైట్ ఇండస్ట్రీస్ : సింథటిక్ రెసింస్, అధెసివ్స్, కలర్‌పిగ్మెంట్స్ , ల్యూబ్రికేటింగ్ కెమికల్స్ మొదలైనవి.
- క్లోరిన్లైన్, కాల్షియం, సల్ఫరిక్ ఆసిడ్
- పర్ది రేమండ్ లిమిటెడ్ :- వీవింగ్ , ప్రొసెసింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టెక్స్టైల్ ఫైబర్ మొదలైనవి.
- వాపి హిందూస్థాన్ ఇంక్స్ లిమిటెడ్ :- ప్రింటింగ్ ఇంక్స్, సింథటిక్ రెసింస్, ప్రిపేర్డ్ గ్లూస్, , అథెసిసివ్స్ మొదలైనవి.
- భిలాడ్ జి.హెచ్.సి.ఎల్ లిమిటెడ్ :- రెడిమేడ్ కటెన్లు, బెడ్ కవర్లు.[2]
చిన్నతరహా పరిశ్రమలు
జిల్లాలోని 5 తాలూకాలలో 10,716 యూనిట్స్ ఉన్నాయి. ఈ యూనిట్లలో 58,641 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమల మొత్తం పెట్టుబడి 84,912 లక్షలు. వల్సద్ జిల్లాలో ప్రస్తుతం డైస్టఫ్ & ఆప్టికల్స్, కాటన్ టెక్స్టైల్స్, కెమికల్స్ , లాథ్స్ , మెషిన్ టూల్స్ వంటి ప్రధాన స్మాల్స్కేల్ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. పర్ది తాలూకాలో పలు ఎస్.ఎస్.ఐ యూనిట్లు ఉన్నాయి. పరిశ్రమల మొత్తం పెట్టుబడి 39,340. ఈ పరిశ్రమల నుండి 25,776 మందికి ఉపాధి లభిస్తుంది.
అడ్వాన్స్ అగ్రిసెర్చ్ లిమిటెడ్
వల్సద్ నగరానికి 7కి.మీ దూరంలో ధాందాచి గ్రామంలో " అడ్వాన్స్ అగ్రిసెర్చ్ లిమిటెడ్ " అనే కపెనీ ఉంది. ఇక్కడ " హెర్బల్ బేస్డ్ ఏంటీ- టెర్మైట్ " (చెదలు వ్యతిరేక ) ఉత్పత్తి చేయబడుతుంది. ఇది వుడ్ ప్రొడక్షన్ , సాయిల్ ట్రీట్మెంటు కొరకు ఉపయీగించబడుతుంది. ఇది ఇక్కడ మార్కెట్‌లో లభిస్తుంది. దీనిని ఇక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. టెర్మీకోల్డ్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తి చేయబడుతున్న " ఏంటీ టెర్మైట్ వుడ్ అథెంసివ్ " తయారు చేస్తున్న సంస్థలలో ఇది ప్రపంచంలోనే మొదటిది ప్రధానమైనది అని గుతించబడుతుంది. టెర్మినేటర్ వుడ్ ప్రిజర్వేటివ్ అండ్ స్ట్రక్చర్ ప్రిజర్వేటివ్ అనబడే ఏంటీ టెర్మైట్ ఉతపత్తులను ఈ సంస్థ పిడిలైట్ ఇండస్ట్రీకి సరఫరా చేస్తుంది.
విభాగాలు
- తాలూకాలు - 6 వల్సాడ్, ఫర్ది, వాపి, ధర్మపూర్ (భారతదేశం), ఖప్రద అంబెర్గఒన్
- ప్రధాన నగరాలు - 2 వాపి, వల్సాడ్
ప్రయాణసౌకర్యాలు
రైలు మార్గం
1965లో వల్సాద్ రైల్వే స్టేషను స్థాపించబడింది. నిగరంలో రైల్వేశాఖ అత్యుత్తమంగా పనిచేయడానికి నగరంలో కంట్రోల్ టవర్ నిర్మించబడింది. వల్సాద్ నగరంలో " వెస్టర్న్ రైల్వే కేడెట్స్ ఆఫ్ పి.ఆర్.ఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) శిక్షణాకేంద్రం ఉంది. వెస్టర్న్ రైల్వే వ్యాగన్లు , కోచ్‌లను రిపేరు చేయడానికి నగరంలో " ఫుల్ రిపెయిర్ లోకో షెడ్ ఫర్ ఎలెక్ట్రానిక్ లోకోమోటివ్స్ " ఉంది. వల్సద్ నుండి ముంబయి, అహమ్మదాబాదు, కాంపూర్ , పాట్నా నగరాలకు రైళ్ళు నడుపబడుతూ ఉన్నాయి.
- ముంబయి- సూరత్ మార్గంలో ఉమర్‌గావ్, సంజన్, భిలద్, వాపి, ఉద్వాడా, పర్ది, వల్సద్ , దుంగ్రి మొదలైన ప్రధాన స్టేషన్లు ఉన్నాయి.
.

2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,703,068,.[4] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 561వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.74%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | 926:1000 [4] |
అక్షరాస్యత శాతం. | 80.94%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
సంస్కృతి
సుప్రసిద్ధ వ్యక్తులు
- దయారాం (1777-1853) - కవి. చనోడ్ లో జన్మించారు.
- మొరార్జీ దేశాయి - మాజీ భారతదేశం ప్రధానమంత్రి.
- నిరూప రాయ్ - నటి.
- భూలాభాయ్ దేశాయ్ - భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు , ప్రసిద్ధ న్యాయవాది.
- డాక్టర్. అమూల్ దేశాయ్ - భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్ట్, ప్రఖ్యాత వైద్యుడు, సామాజిక కార్యకర్త , రాజకీయ నాయకుడు.
ఆర్ధికం
- ప్రభుత్వ పాలిటెక్నిక్, 1965లో స్థాపించబడింది.వల్సాడ్‌లో ఇది ఒక ప్రముఖ విద్యాసంస్థ.[7]
- ప్రభుత్వ ఇజనీరింగ్ కాలేజ్ (2004 లోస్థాపించబడింది). గత కొన్ని సంవత్సరాలుగా " కంప్యూటర్ అప్లికేషన్ " శాఖకూడా విజయవంతంగా పనిచేస్తుంది. .[8]
- జిల్లాలో సైన్సు , కామర్స్ కోర్సులను అందిస్తున్న ఇతర కాలేజీలు ఉన్నాయి.[9]
- కొత్తా కాలేజీ ప్రతిపాదించబడింది.[10]
సరిహద్దు ప్రాంతాలు
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.