Remove ads
భారత్ సైన్యం లో అత్యంత ఉన్నతమైన హోదా From Wikipedia, the free encyclopedia
మూస:Infobox military rankఫీల్డ్ మార్షల్ (ఎఫ్ఎమ్) అనేది భారత సైనిక దళంలో ఫైవ్ స్టార్ ఆఫీసర్ ర్యాంకు. సైన్యంలో ఇది అత్యున్నత స్థాయి ర్యాంకు. ఫీల్డ్ మార్షల్ జనరల్ స్థాయి కంటే పైన ఉంటుంది. అయితే ఇది సైన్యం నిర్మాణంలో ఉపయోగంలో లేదు. ఫీల్డ్ మార్షల్ అనేది ఉత్సవ ప్రయోజనాల కోసం గానీ, యుద్ధ సమయాల్లో గానీ జనరల్‌లకు ఇచ్చే ర్యాంకు. ఇప్పటివరకు దీన్ని రెండుసార్లు మాత్రమే ప్రదానం చేసారు.
సామ్ మానెక్షా భారత సైన్యంలో మొట్ట మొదటి ఫీల్డ్ మార్షల్. 1973 జనవరి క్వ్ప న అతనికి ఈ ర్యాంకు ఇచ్చారు. రెండవ వ్యక్తి కోదండర మాదప్ప కరియప్ప. అతను 1986 జనవరి 15 న ఈ ర్యాంకుకు పదోన్నతి పొందారు.
ఫీల్డ్ మార్షల్ పదవిని భారత నావికా దళంలో అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ అని, భారత వాయు సేనలో మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్‌పోర్స్ అనీ అంటారు. భారత నౌకాదళంలో ఎవరికీ అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ పదవిని ఎవరికీ ఇవ్వలేదు. అర్జన్ సింగ్ మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా పదోన్నతి పొందాడు.
ఇప్పటి వరకు ఇద్దరు భారత సైనిక దళాల ఆఫీసర్లకు మాత్రమే ఫీల్డ్ మార్షల్ ర్యాంకు లభించింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో సామ్ మానెక్షా చేసిన సేవకు, నాయకత్వానికీ గుర్తింపుగా 1973 లో దీన్ని మొదటిసారిగా ప్రదానం చేసారు. యుద్ధం ముగిసిన వెంటనే, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మానెక్షాకు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించి, తదనంతరం అతన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా నియమించారు. అధికార వర్గం నుండి, నేవీ, ఎయిర్ ఫోర్స్ కమాండర్ల నుండీ వచ్చిన అభ్యంతరాల వలన ఈ నియామకాన్ని రద్దు చేసారు. 1973 జనవరి 3 న, ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) గా పదవీకాలం ముగిసిన తర్వాత, మానెక్షాకు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి ఇచ్చారు.[1][2] ఈ ర్యాంకులో నియామకం అదే మొదటిసారి అయినందున, ర్యాంకు చిహ్నం వంటి కొన్ని వివరాలు అప్పటికి ఇంకా రూపొందించలేదు. మానెక్షా నియామకానికి కొన్ని వారాల ముందు, ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ వర్క్‌షాపులో తొలి ఫీల్డ్ మార్షల్ బ్యాడ్జ్‌లు తయారు చేసారు. వీటికి బ్రిటిష్ ఫీల్డ్ మార్షల్ ర్యాంకు చిహ్నం ప్రేరణ నిచ్చింది.[3]
ఈ ర్యాంకు పొందిన రెండవ వ్యక్తి కోదండర ఎం. కరియప్ప, ఇండియన్ ఆర్మీకి కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన మొదటి భారతీయుడతడు (ఆ తరువాత ఈ పదవి ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా మారింది). చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పదవీ విరమణ చేయడానికి కొన్ని రోజుల ముందు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందిన మానెక్షా లాగా కాకుండా,[2] కరియప్ప రిటైరైన దాదాపు 33 సంవత్సరాల తరువాత, ఈ పదోన్నతి పొందాడు. ఫీల్డ్ మార్షల్, తన జీవితాంతం యాక్టివ్ డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇది సమస్యగా మారింది. కరియప్ప చేసిన ఆదర్శప్రాయమైన సేవకు గాను, పై నిబంధనతో సంబంధం లేకుండా ఈ పదోన్నతి కల్పించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1986 జనవరి 15 న రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అతనికి ఫీల్డ్ మార్షల్ హోదాను ప్రదానం చేసింది.[4][5][6]
ఫీల్డ్ మార్షల్ అనేది భారతీయ సైన్యంలో ఫైవ్ స్టార్ ర్యాంకు, అత్యున్నత స్థాయి ర్యాంకు. ఇది ఉత్సవ సమయాల్లో, లేదా యుద్ధసమయాల్లో ఇచ్చే ర్యాంకు. 2024 నాటికి దీన్ని రెండుసార్లు మాత్రమే ప్రదానం చేసారు.[7]
ఫీల్డ్ మార్షల్ పూర్తి జనరల్‌కు అందే వేతనాన్ని అందుకుంటాడు. ఫీల్డ్ మార్షల్‌ను జీవితాంతం సేవలో ఉన్న అధికారిగానే పరిగణిస్తారు. వేడుకల సందర్భాలలో వారు పూర్తి యూనిఫాం ధరించడానికి అర్హులు.[7]
ఫీల్డ్ మార్షల్ చిహ్నంలో, వికసించిన పద్మాల దండలో ఐమూలలుగా ఉన్న లాఠీలు, సాబెర్ మీద జాతీయ చిహ్నం ఉంటుంది. నియామకం సమయంలో, ఫీల్డ్ మార్షల్లకు బంగారు పొన్నులు ఉండే లాఠీని అందజేస్తారు. దానిని వారు అధికారిక సందర్భాలలో తీసుకెళ్లవచ్చు. ఎరుపు రంగు పట్టీపై ఐదు బంగారు నక్షత్రాలు ఉన్న చిహ్నాన్ని కారు పెనెంట్లు, ర్యాంక్ ఫ్లాగ్‌లు, కాలర్ ప్యాచ్‌లుగా ఉపయోగిస్తారు.[7]
1973 లో సామ్ మానెక్షాకు ఫీల్డ్ మార్షల్ హోదాను ప్రదానం చేసినప్పటికీ, ఫీల్డ్ మార్షల్‌గా అతనికి ఇవ్వాల్సిన పూర్తి అలవెన్సులు ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. రాష్టప్రతి APJ అబ్దుల్ కలాం వెల్లింగ్టన్లో మానెక్షాను కలిసినప్పుడు చొరవ తీసుకుని, ఫీల్డ్ మార్షల్‌కు, 30 సంవత్సరాలకు పైగా అతని బకాయి జీతమైన ₹1.3 కోట్ల చెక్కును అందజేయడంతో అది నెరవేరింది. ఇంకా ఆశ్చర్యకరంగా, మానెక్షా అంత్యక్రియలకు పౌర, సైనిక, రాజకీయ నాయకత్వంలోని ఉన్నతాధికారులు హాజరుకాలేదు. దీనికి కారణం, పార్సీ అంత్యక్రియల్లో ప్రవేశించడానికి పార్సీయేతరులకు అనుమతి లేదు.[3][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.