Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో లఖిసరాయ్ జిల్లా ఒకటి. లఖిసరాయ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. లఖిసరాయ్ జిల్లా లఖిసరాయ్ డివిజన్లో భాగం. జిల్లావైశాల్యం 1228 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 8,01,173.
లఖిసరాయ్ జిల్లా
लक्खिसराय जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | ముంగేర్ |
ముఖ్య పట్టణం | లఖిసరాయ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ముంగేర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,228 కి.మీ2 (474 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,00,717 |
• జనసాంద్రత | 810/కి.మీ2 (2,100/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 64.95 % |
• లింగ నిష్పత్తి | 900 |
Website | అధికారిక జాలస్థలి |
1994 జూలై 3 న ముంగర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి లఖిసరాయ్ జిల్లాను రూపొందించారు. ఈ ప్రాంతం లఖిసరాయ్ డివిజన్లో ఉపవిభాగం.
లఖిసరాయ్ జిల్లా వైశాల్యం 1228 చ.కి.మీ.[1] ఇది పపౌ న్యూ గునియాదేశ న్యూ హనోవర్ ద్వీపం జసంఖ్యకు సమానం.[2]
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో లఖిసరాయ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
జిల్లాలో పలు ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. లఖిసరాయ్ నగరంలో బీహార్ మినరల్ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో వస్త్రాలతయారీ సంస్థలు ఉన్నాయి. జిల్లాలో పలు దుకాణాలు అంచనాలను మించి పనిచేస్తున్నాయి.
జిల్లాలో 1 ఉపవిభాగం ఉంది. జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి ( లఖిసరాయ్, సూర్య గర్హ, బరహై,,హల్సి, పిపారియా, రాంగర్). జిల్లాలో భూమిహార్ - బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు. పిరిబజార్, చనాన్ పోలీస్ స్టేషన్లు భౌగోళికంగా నక్సల్ బాధిత ప్రదేశంగా ఉంది. సింధూర్ తయారీకి జిల్లా ప్రసిద్ధిచెందింది.
లఖిసరాయ్ జిల్లాలో అశోక్ధాం ఆలయం, అభైపూర్ వద్ద భగవతి స్థాన్ ఆలయం, అభైపూర్ గ్రామం వద్ద ఉన్న కొండల వద్ద ఉన్న అభయ్నాథ్ ఆలయం, బరాహియా వద్ద ఉన్న మహారాణి ఆలయం, మనో - రాంపూర్ వద్ద ఉన్న బాబా గోవిందాలయం, శృంగిర్షి పర్వతాలు, అలిఘర్ పనచాయితీలోని పొఖ్రమ గ్రామంలో ఉన్న సూర్య మందిర్ ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ఈ గ్రామంలో ప్రవేశించడం, బుద్ధుని అవశేషాలు ఉండడం వలన ఈ గ్రామం ఏర్పడింది.
లఖిసరాయ్ జిల్లాలోని గ్రామాలలో దరియాపూర్ గ్రామం ఒకటి. ఇది ప్రస్తుతం లఖిసరాయ్ బ్లాకులో ఉంది.
విషషయం | వివరణ |
---|---|
ప్రధాన గ్రామం | లఖిసరాయ్ |
జనసంఖ్య | 953 |
అక్షరాస్యత | 43.72%. |
పురుషుల అక్షరాస్యతt | 59.05%. |
స్త్రీల అక్షరాస్యత | 28.53%. |
విషయం | వివరణ |
---|---|
గ్రామీణ కుటుంబాలు | 142 |
పురుషులు | 98.96% (బీహార్ 91.93%) |
అక్షరాస్యత | 43.72% (బీహార్ 47%) |
పురుషుల | 58.56%. |
స్త్రీల | 28.53% |
శ్రామికులు | 54.33% |
పురుషులు | 63.54% |
స్త్రీలు | 44.92% |
దినసరి కూలీ చేసే పురుషులు | 30.17% |
పురుషులు | 52.76% |
స్త్రీలు | 7.06% |
అవసరార్ధం | 24.16% |
పురుషులు | 10.77% |
స్త్రీలు | 37.85% |
పనిచేయని వారు | 45.67% |
పురుషులు | 36.46% |
స్త్రీలు | 55.08% |
జనసంఖ్య | 4000 |
అక్షరాస్యత | 64% |
ప్రధాన వృత్తి | వ్యవసాయం |
స్త్రీలు | 40% |
రైల్వేస్టేషను | కజ్ర |
రహదారి | జాతీయ రహదారి 80 |
లఖిసరాయ్ జిల్లాలోని గ్రామాలలో నంద్నామా గ్రామం ఒకటి. జిల్లా కేంద్రం లఖిసరాయ్ నుండి 11 కి.మీ దూరంలో ఉంది. రాష్ట్ర కేంద్రం పాట్నాకు 117 కి.మీ దూరంలో ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,000,717,[4] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | మొంటానా నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 445వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 815 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 24.74%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 900:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 64.95%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో ఇండో- ఆర్యన్ భాధాకుటుంబానికి చెందిన ఆంగిక భాష వాడుకలో ఉంది. దీనిని వ్రాయడానికి దేవనాగరి భాషను వాడుతుంటారు. ఈ భాష ఆంగిక భూభాగంలో 7,25,000 మందికి వాడుక భాషగా ఉంది.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.