From Wikipedia, the free encyclopedia
1967, నవంబర్ 26న జన్మించిన రిడ్లీ జాకబ్స్ (ఆంగ్లం: Ridley Detamore Jacobs) వెస్ట్‌ఇండీస్ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 1990 దశాబ్దం, 2000 దశాబ్దంలలో ఇతడు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రిడ్లీ డెటామోర్ జాకబ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | స్వీట్స్ విలేజ్, ఆంటిగ్వా, బార్బుడా | 1967 నవంబరు 26|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1998 26 నవంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 జూలై 29 - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1996 మార్చి 26 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2004 జూలై 10 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991–2005 | Leeward Islands | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 22 |
ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన రిడ్లీ జాకబ్స్ 31వ యేటా తొలి టెస్ట్ ఆడి తన ఆరేళ్ళ టెస్టు క్రీడా జీవితంలో మొత్తం 65 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తిచేసుకునాడు. వికెట్ కీపర్‌గా 65 టెస్టులలో 207 క్యాచ్‌లను వికెట్ల వెనుక పట్టుకున్నాడు. జెఫ్ డూజాన్ తరువాత ఈ ఘనత సాధించిన రెండో వెస్ట్‌ఇండీస్ వికెట్ కీపర్ గా రికార్డు సాధించాడు.
రిడ్లీ జాకబ్స్ 147 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 1865 పరుగులు, వికెట్ల వెనుక 160 క్యాచ్‌లు సాధించాడు. వన్డేలలో 19 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 80 నాటౌట్.
ఇంగ్లాండ్కు విరుద్ధంగా బ్రియాన్ లారా సాధించిన టెస్ట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 400 నాటౌట్ సమయంలో అతడు కూడా క్రీజులో ఉండి సెంచరీతో కదం తొక్కి లారాతో కలిపి భారీ భాగస్వామ్యం జతచేశాడు. అతడు టెస్టులలో సాధించిన 3 సెంచరీలలో దీనికి ప్రత్యేకత ఉంది.
రిడ్లీ జాకబ్స్ 1999, 2003 ప్రపంచ కప్ క్రికెట్‌లలో వెస్ట్‌ఇండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
జాకబ్స్ వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు రెండు టెస్టులలో నాయకత్వం వహించాడు. 2002-03లో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టులకు నాయకత్వం వహించి ఆ రెండింటినీ డ్రాగా ముగించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.