ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్, వేల్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 1997 నుండి దీన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) పాలిస్తోంది. అంతకు మునుపు,1903 నుండి మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) పాలనలో ఉండేది. వ్యవస్థాపక దేశంగా ఇంగ్లాండుకు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో (ICC) టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి20) హోదాలతో పూర్తి సభ్యత్వం ఉంది. 1990 ల వరకు, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలు ICC లో సభ్యులు కానందున ఆ దేశాల ఆటగాళ్ళు కూడా ఇంగ్లండ్ తరపున ఆడేవారు.
Remove ads
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచపు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన జట్లు (1877 మార్చి 15-19). దక్షిణాఫ్రికాతో కలిసి, ఈ రెండు దేశాలు 1909 జూన్ 15 న ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌ను (నేటి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్వజ సంస్థ) ఏర్పాటు చేశాయి. 1971 జనవరి 5 న మొదటి వన్‌డే ఆడింది కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలే. ఇంగ్లాండ్ తన మొదటి టి2005 ని 20 జూన్ 13 న ఆస్ట్రేలియాతో ఆడింది.
Remove ads
టోర్నమెంట్ల చరిత్ర
ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుని ఓ జట్టు ఆడిన మొదటి ఆట 1739 జూలై 9 న జరిగింది. కెంట్ మినహాయించి ఇంగ్లండ్‌లోని మిగతా ప్రాంతానికి చెందిన 11 మంది పెద్దమనుషులతో కూడిన "ఆల్-ఇంగ్లండ్" జట్టు కెంట్‌లోని "ది అన్‌కాంకరబుల్ కౌంటీ"తో ఆడి, చాలా కొద్ది తేడాతో ఓడిపోయింది. [8] ఇటువంటి మ్యాచ్‌లు ఓ శతాబ్దం పైగానే అనేక సందర్భాల్లో జరిగాయి.
1846లో విలియం క్లార్క్ ఆల్-ఇంగ్లండ్ ఎలెవెన్‌ని స్థాపించాడు. ఈ జట్టు చివరికి 1847, 1856 మధ్య జరిగే వార్షిక మ్యాచ్‌లలో యునైటెడ్ ఆల్-ఇంగ్లాండ్ ఎలెవెన్‌తో పోటీ పడింది. ఆటగాళ్ల నాణ్యత ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లు ఇంగ్లీష్ సీజన్‌లో అత్యంత ముఖ్యమైన పోటీలని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్రారంభ పర్యటనలు

1859 సెప్టెంబరులో ఇంగ్లాండ్, ఉత్తర అమెరికాలో చేసిన పర్యటన మొట్టమొదటి విదేశీ పర్యటన. ఈ జట్టులో ఆల్-ఇంగ్లండ్ ఎలెవన్ నుండి ఆరుగురు ఆటగాళ్లు, యునైటెడ్ ఆల్-ఇంగ్లండ్ ఎలెవెన్ నుండి ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. జార్జ్ పార్ దానికి కెప్టెన్.
అమెరికాలో అంతర్యుద్ధం మొదలవడంతో, క్రికెట్ దృష్టి మరోవైపు మళ్లింది. మెల్‌బోర్న్ లోని రెస్టారెంట్లైన మెస్సర్స్ స్పియర్స్ అండ్ పాండ్, వాణిజ్యపరమైన కార్యక్రమంగా నిర్వహించిన సీరీస్‌లో ఇంగ్లాండు ఆటగాళ్ళు 1861-62లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. 1877కి ముందు పర్యటనల సమయంలో ఆడిన చాలా మ్యాచ్‌లలో జట్లు "సమ ఉజ్జీలుగా" ఉండేవి కావు. ప్రత్యర్థి జట్టు 11 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను ఫీల్డింగ్ చేయించి పోటీని సమం చేసేవారు.[9] ఈ మొదటి ఆస్ట్రేలియా పర్యటనలో 11 మందికి గాను 18 మంది వరకు ఆడేవాళ్ళు.

ఆ పర్యటన ఎంతలా విజయవంతమైందంటే, మళ్ళీ 1863-64లో పార్ నాయకత్వంలో రెండవ పర్యటన జరిగింది. జేమ్స్ లిల్లీవైట్ నాయకత్వంలో తదుపరి ఇంగ్లాండ్ జట్టు 1876 సెప్టెంబరు 21 న P&O స్టీమ్‌షిప్ పూనాలో ఆస్ట్రేలియా వెళ్ళింది. వారు సంయుక్త ఆస్ట్రేలియా XIతో ఆడారు. ఈసారి ఇరుజట్లూ 11 మంది ఆటగాళ్ళతో ఆడాయి. 1877 మార్చి 15న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను తొట్టతొలి టెస్ట్ మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బ్యానర్‌మాన్ చేసిన తొలి టెస్టు సెంచరీతో ఈ టెస్టు మ్యాచ్‌లో సంయుక్త ఆస్ట్రేలియా XI 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ సమయంలో, మ్యాచ్ జేమ్స్ లిల్లీవైట్స్ XI v కంబైన్డ్ విక్టోరియా అండ్ న్యూ సౌత్ వేల్స్‌గా ప్రచారం పొందింది. [9] ఆ జట్లే 1877 ఈస్టర్ లోని అదే మైదానంలో మళ్ళీ మ్యాచ్ ఆడాయి. ఈసారి లిల్లీవైట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచి తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ గడ్డపై 1880లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచింది; ఇంగ్లాండ్‌కు పూర్తిగా ప్రాతినిధ్యం వహించిన తొలి జట్టు ఇది. ఈ జట్టు లోనే WG గ్రేస్ తొలి ఆట ఆడాడు. [10]
1880లు

1882లో ఇంగ్లండ్, తన మొదటి స్వదేశీ సిరీస్‌ను 1-0తో కోల్పోయింది. ది స్పోర్టింగ్ టైమ్స్ పత్రిక ఇంగ్లీష్ క్రికెట్ మరణించిందంటూ సంస్మరణను ముద్రించింది:
In Affectionate Remembrance
OF
N.B.—The body will be cremated and the
ENGLISH CRICKET,
WHICH DIED AT THE OVAL
ON
29th AUGUST, 1882,
Deeply lamented by a large circle of sorrowing
friends and acquaintances.
R. I. P.
ashes taken to Australia.[11]
ఈ ఓటమి ఫలితంగా, 1882-83 పర్యటనను ఇంగ్లండ్ కెప్టెన్ ఐవో బ్లైగ్ "చితా భస్మాన్ని (యాషెస్) తిరిగి పొందాలనే తృష్ణ"గా పేర్కొన్నాడు. ఔత్సాహికులు, నిపుణుల మిశ్రమంతో కూడిన ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది.[12] బ్లైగ్‌కు కొంత బూడిద ఉన్న ఒక పాత్రను అందించారు. ఆ బూడిద బెయిలుదని, బంతిదనీ, ఓ స్త్రీ ముసుగు దనీ చెప్పుకున్నారు. ఆ విధంగా యాషెస్ పుట్టింది. ఆ తర్వాత జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ను యాషెస్ సిరీస్‌లో భాగంగా పరిగణించలేదు.[13][14] 1884, 1898 మధ్య ఇంగ్లండ్ 10 సార్లు యాషెస్ సిరీస్‌ను గెలుచుకోవడంతో ఈ ప్రారంభ పోటీలలో చాలా వరకు ఇంగ్లాండే ఆధిపత్యం చెలాయించింది.[15] ఈ సమయంలో ఇంగ్లాండ్ 1889 లో పోర్ట్ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో కూడా తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది..[16]
1890లు
1890 యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-0తో గెలుచుకుంది, సిరీస్‌లోని మూడవ మ్యాచ్ రద్దైంది. చరిత్రలో రద్దైన మొట్ట మొదటి టెస్ట్ మ్యాచ్ అది. 1891-92 సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఓడిపోయింది. అయితే ఆ తర్వాతి సంవత్సరం ఇంగ్లండ్ తిరిగి యాషెస్‌ను సాధించింది. ఇంగ్లండ్ మళ్లీ 1894-95 సిరీస్‌ను ఆండ్రూ స్టోడార్ట్ నాయకత్వంలో 3-2తో గెలిచింది. 1895-96లో, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాతో ఆడి, సిరీస్‌లోని అన్ని టెస్టులను గెలుచుకుంది. 1899 యాషెస్ సిరీస్‌లో జట్టు సభ్యులను MCC, కౌంటీలు కలిసి ఒక ఎంపిక కమిటీని నియమించిన మొదటి పర్యటన. ముగ్గురు క్రియాశీల ఆటగాళ్ళు ఉన్నారు: గ్రేస్, లార్డ్ హాక్, వార్విక్‌షైర్ కెప్టెన్ హెర్బర్ట్ బైన్‌బ్రిడ్జ్. దీనికి ముందు, స్వదేశంలో జరిగే టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్లను మ్యాచ్ ఎవరి మైదానంలో ఆడాలో క్లబ్ ఎంపిక చేసింది. ఇంగ్లండ్ 1899 యాషెస్ సిరీస్‌ను 1-0తో కోల్పోయింది, సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో గ్రేస్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో కనిపించాడు.
Remove ads
పాలక సంస్థ
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అనేది ఇంగ్లండులో క్రికెట్‌కు, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకూ పాలకమండలి. బోర్డు 1997 జనవరి 1 నుండి పనిచేస్తోంది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రధానంగా ఇంగ్లండ్ జట్టుకు సంబంధించి టిక్కెట్ల విక్రయం, స్పాన్సర్‌షిప్, ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా ECB బాధ్యత వహిస్తుంది. 2006 క్యాలెండర్ సంవత్సరంలో ECB ఆదాయం £7.7 కోట్లు. [17]
1997కి ముందు, టెస్ట్ అండ్ కౌంటీ క్రికెట్ బోర్డు (TCCB) ఇంగ్లీష్ జట్టుకు పాలకమండలిగా ఉండేది. టెస్ట్ మ్యాచ్‌ల లోనే కాకుండా, 1976-77 ఆస్ట్రేలియా పర్యటన వరకు విదేశాల్లో పర్యటించినప్పుడు ఇంగ్లాండ్ జట్టు, అధికారికంగా MCC పేరుతో ఆడింది. ఇది పర్యటన జట్టును ఎంపిక చేయడంలో MCC బాధ్యత వహించిన కాలానికి ఇది అవశేషం. ఇంగ్లాండ్ పర్యటన బృందం MCC గుర్తులను చివరిసారిగా 1996-97 న్యూజిలాండ్ పర్యటనలో ధరించింది.
వేల్స్ స్థితి
చారిత్రికంగా, ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో యావత్తు గ్రేట్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది, స్కాటిష్ లేదా వెల్ష్ జాతీయ జట్లు అప్పుడప్పుడు ఆడుతూండేవి. ఈ రెండు దేశాల ఆటగాళ్లు అప్పుడప్పుడు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించేవారు కూడా. 1994లో స్కాట్లాండ్ ICCలో స్వతంత్ర సభ్యునిగా చేరింది. అంతకు రెండేళ్ల ముందే దానికి TCCBతో సంబంధాలు తెగిపోయాయి. [18] [19] [20] [21]
సైమన్, గెరైంట్ జోన్స్ వంటి వెల్ష్ ఆటగాళ్లను ఓవైపున [21] [20] ఉపయోగించుకుంటూనే జట్టు పేరులో మాత్రం "ఇంగ్లాండ్" ఒక్కటే ఉంచడంపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. వెల్ష్ ఆటగాళ్ళు ఇంగ్లండ్ జట్టు తోనే అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నందున వేల్స్, ICCలో స్వతంత్ర సభ్యురాలిగా మారాలని లేదా వెల్ష్ జాతీయ జట్టుకు మరిన్ని మ్యాచ్‌లను ఇవ్వాలనీ అనేక పిలుపులు వచ్చాయి. [22] అయితే, క్రికెట్ వేల్స్, గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్ లు రెండూ ECBకి నిరంతరం మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇంగ్లీష్ వ్యవస్థలో భాగంగా ఉంటే వెల్ష్ కౌంటీకి కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి గ్లామోర్గాన్ వాదించగా, "ECBలో ప్రధాన పాత్రను కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని క్రికెట్ వేల్స్ చెప్పింది." [23] [24] [25]
వేల్స్‌కు స్వంత క్రికెట్ జట్టు లేకపోవడం పట్ల వెల్ష్ సెనెడ్‌లో కూడా అనేక చర్చలు జరిగాయి. 2013 లో జరిగిన ఒక చర్చలో కన్జర్వేటివ్, లేబర్ సభ్యులు ఇద్దరూ స్వతంత్ర వెల్ష్ జట్టు స్థాపనకు మద్దతు పలికారు.[26]
2015లో, వెల్ష్ నేషనల్ అసెంబ్లీ లోని పిటిషన్ల కమిటీ రూపొందించిన నివేదిక, ఈ సమస్యపై జరుగుతున్న ఉద్వేగభరితమైన చర్చను ప్రతిబింబిస్తుంది. హెరిటేజ్, కల్చర్, స్పోర్ట్, బ్రాడ్‌కాస్టింగ్‌పై ప్లాయిడ్ సైమ్రు ప్రతినిధి, పిటిషన్‌ల కమిటీ సభ్యుడూ అయిన బేతన్ జెంకిన్స్, వేల్స్‌కు స్వంతంగా అంతర్జాతీయ జట్టు ఉండాలని, ECB నుండి వైదొలగాలనీ వాదించాడు. 64 లక్షల జనాభా 6,000 మంది క్లబ్ ప్లేయర్‌లు ఉన్న ఉన్న ఐర్లాండుకు ICC సభ్యత్వం ఉండగా, 30 లక్షల జనాభా, 7,500 మంది ఆటగాళ్ళూ ఉన్న వేల్స్‌కు లేదని జెంకిన్స్ అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: "క్రికెట్ వేల్స్, గ్లామోర్గాన్ CCC లు వెల్ష్ జాతీయ క్రికెట్ జట్టు అనే ఆలోచన 'ఉద్వేగభరితమైన అంశం' అని చెపుతున్నాయి. ఔను మరి, జాతీయ జట్టును కలిగి ఉండటం భావావేశపూరితమైనదే, జాతీయ జట్టు ఆడే సమయంలో స్టాండ్‌లను చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. ఇది సహజం కాదన్నట్లుగా చేసే ఏ వాదనైనా తప్పుదారి పట్టించే వాదన అవుతుంది." [27] [28] [29] [30] [31] [32]
2017లో, వేల్స్ మొదటి మంత్రి కార్విన్ జోన్స్, వేల్స్ తన వన్డే జట్టును తిరిగి ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చాడు: "ఓ పక్కన ఐర్లాండ్, స్కాట్‌లాండ్ లు అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ఆడుతోంటే వేల్స్ ఆడకపోవడం వింతగా ఉంది." అని అతను అన్నాడు. [33] [34]
Remove ads
క్రికెట్ మైదానాలు
టోర్నమెంట్ చరిత్ర
ఛాంపియన్స్ | |
రన్నర్స్-అప్ | |
మూడో స్థానం | |
నాల్గవ స్థానం |
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్
క్రికెట్ ప్రపంచ కప్
- *విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.
- *విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ
- *విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.
Remove ads
గుర్తింపులు
- ప్రపంచ కప్ :
- ఛాంపియన్స్ (1): 2019
- రన్నర్స్-అప్ (3): 1979, 1987, 1992
- టి20 ప్రపంచ కప్ :
- ఛాంపియన్స్ (2): 2010, 2022
- రన్నరప్ (1): 2016
- ఛాంపియన్స్ ట్రోఫీ :
- రన్నర్స్-అప్ (2): 2004, 2013
రికార్డులు
టెస్ట్ మ్యాచ్‌లు
టెస్టు జట్టు రికార్డులు
- అత్యధిక జట్టు స్కోరు: 903–7 డిసెంబరు., 1938లో ఓవల్‌లో ఆస్ట్రేలియాతో
- అత్యల్ప జట్టు స్కోరు: 45, 1886/87లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో
- టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో 100 విజయాలు సాధించిన ఏకైక జట్టు ఇంగ్లండ్.
టెస్టులలో వ్యక్తిగత రికార్డులు
- అత్యధిక మ్యాచ్‌లు: 178 టెస్టులు – జేమ్స్ ఆండర్సన్ [38]
- సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన: 64 టెస్టులు - జో రూట్
టెస్టులలో బ్యాటింగ్ రికార్డులు
- అత్యధిక పరుగులు: 12,472 – అలస్టర్ కుక్[39]
- అత్యుత్తమ సగటు: 60.73 – హెర్బర్ట్ సట్‌క్లిఫ్[40]
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 364 – లెన్ హట్టన్ 1938లో ది ఓవల్‌లో లెన్ హట్టన్, ఆస్ట్రేలియాతో
- రికార్డ్ భాగస్వామ్యం: 411 – 1957లో ఎడ్జ్‌బాస్టన్‌లో కోలిన్ కౌడ్రే, పీటర్ మే, వెస్టిండీస్‌తో
- అత్యధిక సెంచరీలు: 33 – అలస్టర్ కుక్
- అత్యధిక డబుల్ సెంచరీలు: 7 – వాలీ హమ్మండ్
- ఇంగ్లండ్ యొక్క అత్యంత ఫలవంతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం జాక్ హాబ్స్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్. 38 ఇన్నింగ్స్‌లలో, వారు 15 సెంచరీ భాగస్వామ్యాలు, 50 లేదా అంతకంటే ఎక్కువ 10 మందితో మొదటి వికెట్‌కు 87.81 సగటును సాధించారు.
- అత్యధిక డకౌట్లు: 39 – స్టువర్ట్ బ్రాడ్[41]
టెస్ట్ బౌలింగ్ రికార్డులు
- అత్యధిక వికెట్లు: 685 - జేమ్స్ ఆండర్సన్
- అత్యుత్తమ సగటు: 10.75 - జార్జ్ లోమాన్
- అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్: 10/53 - జిమ్ లేకర్, 1956లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
- బెస్ట్ మ్యాచ్ బౌలింగ్: 19/90 - జిమ్ లేకర్, 1956లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్ : 34.1 - జార్జ్ లోమాన్
- అత్యుత్తమ ఎకానమీ రేటు: 1.31 - విలియం అట్టేవెల్
- ఐదుగురు ఇంగ్లండ్ బౌలర్లు ఒక ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టారు, వీటిలో మూడు హెడింగ్లీలో ఉన్నాయి. వారు
- మారిస్ అల్లోమ్, 1929-30లో క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో,
- కెన్నెత్ క్రాన్స్టన్, 1947లో దక్షిణాఫ్రికాతో హెడ్డింగ్లీలో,
- ఫ్రెడ్ టిట్మస్, 1965లో హెడ్డింగ్లీలో న్యూజిలాండ్‌తో,
- క్రిస్ ఓల్డ్, 1978లో ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్థాన్‌తో,
- ఆండీ కాడిక్, 2000లో హెడ్డింగ్లీలో వెస్టిండీస్‌తో
టెస్ట్ ఫీల్డింగ్ రికార్డులు
- ఔట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 175 - అలస్టర్ కుక్
- వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 269 - అలాన్ నాట్
- ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక అవుట్‌లు: 7 - బాబ్ టేలర్, 1979/80లో బొంబాయిలో భారతదేశంతో
- ఒక మ్యాచ్‌లో అత్యధిక అవుట్‌లు: 11 - జాక్ రస్సెల్, 1995/96లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో
వివిధ దేశాలతో ఆడిన టెస్టుల రికార్డు
వన్ డే ఇంటర్నేషనల్స్
వన్డే జట్టు రికార్డులు
- అత్యధిక జట్టు స్కోరు: 498/4 (50 ఓవర్లు), 2022లో VRA క్రికెట్ గ్రౌండ్‌లో నెదర్లాండ్స్‌తో
- అత్యల్ప జట్టు స్కోరు: 86 (32.4 ఓవర్లు), 2001లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
వన్డే వ్యక్తిగత రికార్డులు
- అత్యధిక మ్యాచ్‌లు: 225 - ఇయాన్ మోర్గాన్
- సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన: 126 మ్యాచ్‌లు – ఇయాన్ మోర్గాన్ [43]
వన్డే బ్యాటింగ్ రికార్డులు
- అత్యధిక పరుగులు: 6,957 - ఇయాన్ మోర్గాన్
- అత్యుత్తమ సగటు: 51.25 - జోనాథన్ ట్రాట్
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 117.97 - జోస్ బట్లర్
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 180 - జాసన్ రాయ్, 2018లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో
- రికార్డ్ భాగస్వామ్యం: 256* - అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్, 2016లో ఎడ్జ్‌బాస్టన్‌లో శ్రీలంకతో
- అత్యధిక శతాబ్దాలు: 16 - జో రూట్
- అత్యధిక డకౌట్లు: 15 - ఇయాన్ మోర్గాన్
వన్డే బౌలింగ్ రికార్డులు
- అత్యధిక వికెట్లు: 269 - జేమ్స్ ఆండర్సన్
- అత్యుత్తమ సగటు: 19.45 - మైక్ హెండ్రిక్
- అత్యుత్తమ బౌలింగ్: 6/31 – పాల్ కాలింగ్‌వుడ్, 2005లో ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద బంగ్లాదేశ్‌తో
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 30.6 - లియామ్ ప్లంకెట్
- అత్యుత్తమ ఎకానమీ రేటు: 3.27 - మైక్ హెండ్రిక్
వన్డే ఫీల్డింగ్ రికార్డులు
- ఔట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 108 - పాల్ కాలింగ్‌వుడ్
- వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 238 - జోస్ బట్లర్
- ఒక మ్యాచ్‌లో అత్యధిక అవుట్‌లు: 6 - అలెక్ స్టీవర్ట్, 2000లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద జింబాబ్వే ; మాట్ ప్రియర్, 2008లో ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద దక్షిణాఫ్రికా ; జోస్ బట్లర్, 2013లో ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో
వివిధ దేశాలతో ఆడిన వన్డేల రికార్డు
టి20 ఇంటర్నేషనల్ పోటీలు
గణాంకాలలో 2022 నవంబరు 13 వరకు గేమ్‌లు ఉన్నాయి.
టి20 జట్టు రికార్డులు
- అత్యధిక జట్టు స్కోరు: 241/3, 2019లో మెక్లీన్ పార్క్ వద్ద న్యూజిలాండ్‌తో
- అత్యల్ప జట్టు స్కోరు: 80, 2012లో కొలంబో (RPS) వద్ద భారతదేశంతో
టి20 వ్యక్తిగత రికార్డులు
- అత్యధిక మ్యాచ్‌లు: 115 - ఇయాన్ మోర్గాన్
- ఎక్కువ కాలం కెప్టెన్‌గా పనిచేసిన: 72 మ్యాచ్‌లు - ఇయాన్ మోర్గాన్
టి20 బ్యాటింగ్ రికార్డులు
- అత్యధిక పరుగులు: 2,713 - జోస్ బట్లర్
- అత్యుత్తమ సగటు: 37.93 - కెవిన్ పీటర్సన్
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 147.90 - లియామ్ లివింగ్‌స్టోన్
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 116* - అలెక్స్ హేల్స్, 2014లో చిట్టగాంగ్‌లో శ్రీలంకతో
- రికార్డ్ భాగస్వామ్యం: 182 – డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్, 2019లో మెక్లీన్ పార్క్ వద్ద న్యూజిలాండ్‌తో
- అత్యధిక శతాబ్దాలు: 1 - అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్
- అత్యధిక డకౌట్లు: 9 - ల్యూక్ రైట్, మోయిన్ అలీ
టి20 బౌలింగ్ రికార్డులు
- అత్యధిక వికెట్లు: 96 – క్రిస్ జోర్డాన్
- అత్యుత్తమ సగటు: 16.84 – గ్రేమ్ స్వాన్
- అత్యుత్తమ బౌలింగ్: 5/10 – 2022లో పెర్త్‌లో సామ్ కర్రాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 13.2 – మార్క్ వుడ్
- అత్యుత్తమ ఎకానమీ రేటు: 6.36 – గ్రేమ్ స్వాన్
టి20 ఫీల్డింగ్ రికార్డులు
- అవుట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 46 - ఇయాన్ మోర్గాన్
- వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 64 – జోస్ బట్లర్ [a]
- ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక అవుట్‌లు: 4 – మాట్ ప్రియర్, 2007లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో
వివిధ దేశాలతో ఆడిన టి20 ల రికార్డు
ఇంగ్లాండ్ జట్టులో ఎక్కువసార్లు ఆడిన ఆటగాళ్ళు
ఈ జాబితాల్లో ఆట ప్రతి రూపంలోనూ ఇంగ్లండ్ తరపున అత్యధికంగా ఆడిన ఐదుగురు ఆటగాళ్లను చూడవచ్చు. ఇవి 2023 మార్చి 14 వరకు సరైనవి.
- † = ఎంపిక కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్లు, గత 12 నెలల్లో ఇంగ్లండ్‌కు ఫార్మాట్‌లో ప్రాతినిధ్యం వహించినవాళ్ళు.
Remove ads
ప్రస్తుత జట్టు
ఇది గత సంవత్సరం (2022 జూలై 11 నుండి) ఇంగ్లండ్ తరపున ఆడిన యాక్టివ్ ప్లేయర్‌లందరి జాబితా ఇది.
ECB ప్రతి సంవత్సరం సెప్టెంబరులో, ఇంగ్లండ్ ఆటగాళ్లలో జట్టులో ప్రధానంగా ఉండాలని సెలెక్టర్లు భావించేవారికి సెంట్రల్ కాంట్రాక్టులను అందజేస్తుంది.[49] సంవత్సరంలో తగినన్ని ఆటలు ఆడే ఇతర ఆటగాళ్ళకు ఇంక్రిమెంటల్ కాంట్రాక్టులు ఇస్తారు. ప్రతిభ ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ల కోసం పేస్ బౌలింగ్ అభివృద్ధి ఒప్పందాలు కూడా ఉన్నాయి. [50]
Remove ads
కోచింగ్ సిబ్బంది
టెస్టులు
పరిమిత ఓవర్లు
Remove ads
ఇంగ్లండ్ పురుష క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
ప్రతి సీజన్ ప్రారంభంలో ECB ఇంగ్లండ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేస్తుంది, "గత సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తించి", [51] క్రికెట్ మీడియా సభ్యులు ఓటు వేశారు. [52]
ఈ అవార్డును గతంలో గెలుచుకున్న వారు:
ఇవి కూడా చూడండి
నోట్స్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads