From Wikipedia, the free encyclopedia
మాగుంట పార్వతమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
మాగుంట పార్వతమ్మ | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 2004 - 2009 | |||
ముందు | వంటేరు వేణుగోపాల్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | బీద మస్తాన్ రావు | ||
నియోజకవర్గం | కావాలి | ||
లోక్సభ సభ్యురాలు | |||
పదవీ కాలం 1996 - 1998 | |||
ముందు | మాగుంట సుబ్బరామిరెడ్డి | ||
తరువాత | మాగుంట శ్రీనివాసులురెడ్డి | ||
నియోజకవర్గం | ఒంగోలు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1947 జూలై 27 బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | మాగుంట సుబ్బరామిరెడ్డి |
మాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించింది. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాల నుండి పాఠశాల విద్యను అభ్యసించింది.
మాగుంట పార్వతమ్మ 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామ రెడ్డిని వివాహం చేసుకుంది. ఆయనను 1995 లో పీపుల్స్ వార్ గ్రూప్ సభ్యుల చేతిలో హతమవ్వగా[2], 1996లో ఆమె 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై 50060 ఓట్ల మెజారిటీతో గెలిచి 11వ లోక్సభకు ఎంపీగా ఎన్నికైంది.[3][4] మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5] ఆమె 2012లో జరిగిన ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయింది.[6]
మాగుంట పార్వతమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 25న మరణించింది.[7][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.