Remove ads
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు చాలా మందే ఉన్నారు.
తెలుగు కథ | ||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.
ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో లాగానే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. ఈ జిల్లాలో జన్మించిన కథకుడు పి.వెంకట రామారావు తెలంగాణ పల్లెవాసుల జీవిత సన్నివేశాలను చిత్రిస్తూ ‘కొత్తనాగలి’ మొదలైన కథలు రాశాడు. అలాగే రామారెడ్డి రాసిన ‘సర్కారుశిస్తు’ కథలో వానల్లేక భూమిశిస్తు కట్టలేని రైతన్నలపై గ్రామాధికారుల జులుం కథా వస్తువైంది. మహబూబ్‌నగర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరనివాస మేర్పరచుకున్న ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ‘కస్తూరి’ కలం పేరుతో వందలాది కథలు వెలువడ్డాయి. అందులోని కొన్ని కథలు ‘నూరు కథలు’ సంపుటిగా వెలువడ్డాయి. భారతీయ సంస్కృతికి అద్దం పట్టాయతని కథలు. గాథాసప్తశతి కథల్ని తెలుగులో కనువదించగా ‘ఆంధ్రప్రదేశ్’ పత్రికలో అచ్చయినాయి. ఈ రచయిత కథ ‘కాలం కరిచింది’ సర్వజనామోదమైంది.[1] ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో ఎంతో మంది కథారచయితలుగా రాణిస్తున్నారు.
ఈ క్రింది జాబితాలో మహబూబ్‌నగర్ జిల్లాకథకుల వివరాలుక్రోఢీకరించబడ్డాయి.[1][2]
రచయిత పేరు | ప్రస్తుత నివాసం | కలం పేరు | పుట్టిన సంవత్సరం | పుట్టిన ఊరు | రచనలు |
---|---|---|---|---|---|
బడారు శ్రీనివాసరావు | రాజయ్య-సోమయాజులు (పాలమూరు తొలికథ-1913) [3], కువైద్యరాజు, మృత్యువు దాని జాపకం, విషాదం | ||||
సురవరం ప్రతాపరెడ్డి | 1896 మే 28 | ఇటిక్యాలపాడు | మొగలాయి కథలు, నిరీక్షణ, సంఘాల పంతులు, హుసేన్ బీ, వకీలు ఎంకయ్య, వింత విడాకులు, మెహ్దీ బేగం, ఖిస్మత్, | ||
పాకాల యశోదారెడ్డి | 1929 | బిజినపల్లి | మా ఊరిముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల | ||
కసిరెడ్డి వెంకటరెడ్డి | హైదరాబాద్ | కస్తూరి | పోలేపల్లి | 300కు పైగా కథలు, అలక (సంకలనం) | |
వల్లపురెడ్డి బుచ్చారెడ్డి | 50కు పైగా కథలు (పరాజితులు) | ||||
పి.వెంకట రామారావు | |||||
నాగులపల్లి కోదండరామారావు | |||||
మంద రామారెడ్డి | సర్కారు కిస్తు, విడిజోళ్ళు | ||||
బూర్గుల రంగనాథరావు | బూర్గుల | 13 కథలు | |||
అందుగుల సోదరులు (తిరుమలరావు, లక్ష్మణరావు | అంతే నా నోము, నిష్పలం | ||||
బ్రహ్మ రఘురామరాజు | హైదరాబాద్ | 1957 జూలై 18 | మహబూబ్ నగర్ | ||
పైడి చంద్రలత | నెల్లూరు | 1969 ఫిబ్రవరి 10 | మహబూబ్ నగర్ | ||
ధనరాజ జ్ఞానేశ్వర్ | మహబూబ్ నగర్ | 1964 జనవరి 05 | వనపర్తి | ||
మీనా ప్రభాకర్ | |||||
కల్వకుంట శరత్‌చంద్ర | |||||
భీంపల్లి శ్రీకాంత్ | |||||
చంద్ర | |||||
పొల్కంపల్లి రాజేశ్వరి | |||||
పోల్కంపల్లి శాంతాదేవి | 7 కథా సంపుటాలు | ||||
గొరుసు జగదీశ్వర్ రెడ్డి | వనపర్తి | గజఈతరాలు | |||
తంగెళ్ల శ్రీనివాసరెడ్డి | |||||
తంగెళ్ళపల్లి శ్రీదేవిరెడ్డి | ఆత్మకూరు | ||||
జ్ఞానేశ్వర్ | |||||
ఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి | |||||
ఉమ్మెత్తల లక్ష్మీనారాయణ | |||||
వెల్దండ రుక్మాంగదరెడ్డి | |||||
ఇరివెంటి కృష్ణమూర్తి | |||||
గొట్టిముక్కల కృష్ణమూర్తి | దివ్యాలోకం, ఇంటిముఖం, తంతే పరుపులో ( టాల్‌స్టాయ్, రవీంద్రుల అనువాద కథలు) | ||||
ఆకుమళ్ళ మల్లికార్జునశర్మ | అలంపూర్ | అనువాద కథలు | |||
గడియారం రామకృష్ణశర్మ | అలంపూర్ | కన్నడఅనువాద కథలు | |||
చౌడూరి గోపాలరావు | చంపు, సమాజం | ||||
గోపాలరెడ్డి | గప్చుప్ | ||||
కాచిరాజు శేషగిరిరావు | గప్చుప్ | ||||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.