కాంతం కథలు

మునిమాణిక్యంవారి కథలు From Wikipedia, the free encyclopedia

కాంతం కథలు

కాంతం కథలు మునిమాణిక్యం నరసింహారావు రాసిన హాస్య ప్రధానముగా సాగే కథలు. ఇవి తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి గాంచాయి.

త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
కాంతం కథలు
పుస్తక ముఖచిత్రం
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: మునిమాణిక్యం నరసింహారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: విశాలాంధ్ర
విడుదల: 2004 (కొత్తది)
పేజీలు: 128
మూసివేయి

కథలు విత్ స్క్రిప్ట్

శైలి

ఈ కథల్లో కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. పేదబడిపంతులు భార్య. భర్త అంటే ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి కురిపిస్తుంటుంది. ఆమె తన భర్తను వేళాకోళం చేస్తుంది, కించపరచదు. ఆమె అపహాస్యం వెనుక భర్త అంటే అంతులేని ఇష్టం. సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు.

ఇతర విశేషాలు

ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ మునిమాణిక్యాన్ని ముట్నూరి కృష్ణారావు దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే కాంతం భర్త కాదూ అన్నాడట. ఈ ఉదాహరణ తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో తెలియజేస్తుంది.[1]

కాంతం కథల్లో ఆయన నిజజీవితంలో జరిగిన సంభాషణలు స్ఫూర్తిగా రాసేవాడు. ఉదాహరణకు ఆయన ఓ సారి భార్యని పిలిచి నా కలం కనపట్లేదు,వెతికి పెట్టమంటే ఆవిడ వంటింట్లోనుంచి నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి అందంట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి.[2]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.