Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బెళగావి జిల్లా / బెల్గాం జిల్లా (కన్నడ: ಬೆಳಗಾವಿ) కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా. జిల్లా ముఖ్యపట్టణం బెల్గాం. ఈ జిల్లా ఉత్తర కర్నాటకలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 42,14,505. అందులో 24.03% ప్రజలు పట్టణాలలో నివసిస్తున్నారు.[2] జనంఖ్యా పరంగా జిల్లారాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బెంగుళూరు జిల్లా ఉంది.[3] 13,415 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన జిల్లాలో 31,415 చ. కి.మీ. (12,129 చ.మై) వైశాల్యంతో 1278 గ్రామాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 4.8 మిలియన్ల జనాభా ఉంది. బెల్గాం జిల్లా కర్ణాటకలో అతిపెద్ద జిల్లా. అరేబియా సముద్రం నుండి దాదాపు 779 మీ (2,556 అడుగులు), 100 కిమీ (62 మై) ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణుల (పశ్చిమ కనుమలు) పాదాలకు సమీపంలో మార్కండేయ నది ప్రవహిస్తూ ఉంటుంది.బెల్గాం స్థలాకృతి వాతావరణంలో వేగవంతమైన, కాలిడోస్కోపిక్ మార్పులను ప్రదర్శిస్తుంది.
Belagavi district
ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲೆ | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | కర్ణాటక |
ప్రాంతం | ఉత్తర కర్ణాటక |
డివిజన్ | Belagavi Division |
ప్రధాన కార్యాలయం | Belagavi |
విస్తీర్ణం | |
• Total | 13,415 కి.మీ2 (5,180 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 47,78,439 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (920/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | KA-22,KA-23,KA-24,KA-49 |
లింగ నిష్పత్తి | 1.04 ♂/♀ |
అక్షరాస్యత | 64.2% |
Precipitation | 823 మిల్లీమీటర్లు (32.4 అం.) |
ఈ జిల్లాకు పశ్చిమాన, ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రము, ఈశాన్యాన బీజాపూర్ జిల్లా, తూర్పున బాగలకోట్ జిల్లా, ఆగ్నేయాన గదగ జిల్లా, దక్షిణాన ధారవాడ, ఉత్తర కన్నడ జిల్లాలు, నైఋతిన గోవా రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు.
ఉత్తరకర్నాటక డివిషనల్ కేంద్రం బెళగావి. పట్టణ పురాతన నామం వేణుగ్రామ అంటే వెదురు గ్రామం అవి అర్ధం. దీనిని మాలాండ్ ప్రదేశ్ అని కూడా పిలిచేవారు. ఈ పరిసరాలలో లభించిన తాళపత్రాల ఆధారంగా జిల్లాలో అతి పురాతన ప్రాంతం హలసి అని భావిస్తున్నారు. హలసిని రాజధానిగా చేసుకుని కదంబరాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని భావిస్తున్నారు. 6 వ శతాబ్దం మద్య నుండి 760 వరకు ఈ ప్రాంతాన్ని చాళుఖ్యులు పాలించారు. వారి తరువాత రాష్ట్రకూటులు పాలించారు. రాష్ట్రకూటుల పతనం తరువాత ఈ ప్రాంతాన్ని (875-1250) రాట్టాలు పాలించారు. వీరు 1210 నుండి వేణుగ్రామాన్ని తమ రాజధానిగా చేసికొని పాలించారు. రాట్టలకు, గోవాకు చెందిన దీర్ఘకాలం పోరాటం జరిగిన తరువాత 12వ శతాబ్ధపు చివరిలో జిల్లా ప్రాంతంలో కొంతభాగాన్ని కదంబాలు స్వాధీనం చేసుకున్నారు. 1208 నాటికి రాట్టాలు కంబాలను ఓడించి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1250 నాటికి రాట్టాలను ఓడించి యాదవాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. యాదవులను తొలిగించి ఈ ప్రాంతాన్ని 1320 నాటికి ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం తరువాత ఘటప్రభా నదికి దక్షిణ ప్రాంతం విజయనగర పాలకుల వశం అయింది. 1347 నాటికి ఉత్తర భూభాగాన్ని బహ్మనీ సుల్తానేట్ స్వాధీనం చేసుకుంది. తరువాత వారు 1473లో బెల్గాంను స్వాధీనం చేసుకుని దక్షిణప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నారు. 1686 నాటికి ఔరంగజేబు బీజపూర్ సుల్తానులను తొలిగించి ఈ ప్రాంతాన్ని ముగల్ సామ్రాజ్యంలో విలీనం చేసాడు. 1776లో ఈ ప్రాంతాన్ని మైసూరు రాజు హైదర్ అలి స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ సహకారంతో మాధవరావు పేష్వా ఆధీనంలోకి మారింది. 1818 నాటికి ఈ ప్రాంతం బ్రిటిష్ పాలకుల వశం అయింది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ధార్వాడ జిల్లాలో విలీనం చేసింది. 1836 నాటికి జిల్లాను రెండుభాగాలుగా విభజించినప్పుడు ఉత్తరభూభాగం బెల్గాం జిల్లా అయింది.[4] కృష్ణానదీతీరంలో ఉన్న యాదూరు వద్ద ప్రముఖ వీరభద్రాలయం ఉంది. కర్నాటక, మహారాష్ట్ర నుండి పలుభక్తులు వస్తుంటారు. బెల్గవి జిల్లాలో హూలి ఒక పురాతన గ్రామం. ఇక్కడ పలు చాళుఖ్య కాలంనాటి ఆలయాలు ఉన్నాయి. వీటిలో పంచలింగేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది.
బెల్గవి జిల్లాలో కిత్తూరు జిల్లా చారిత్రక ప్రసిద్ధి చెందింది. కిత్తూరు రాణిచెన్నమ్మ (1778-1829) బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన వీరవనితగా గుర్తించబడుతుంది.
భౌగోళికంగా మిలటరీ ప్రాముఖ్యతను గ్రహించిన బ్రిటిష్ ఇంఫాంటరీ పోస్ట్ ఏర్పాటు చేసింది. అందువలన బెల్గవి జిల్లాకు " ది క్రేడిల్ ఆఫ్ ఇంఫాంటరీ " అనే ముద్దు పేరు ఉంది. ఇక్కడ శిక్షణ పొందిన సైకిలను ఈస్టిండియా కంపనీ సైన్యంలో నియమించబడ్డారు. తరువాత బ్రిటిష్ భారతదేశం అంతటినీ తన స్వాధీనంలోకి తీసుకుంది. బెల్గవిలో ఉన్న మహాత్మా గాంధీ రైల్వేస్టేషను బ్రిటిష్ వారిచే స్థాపించబడిందిది.
బెళగావి జిల్లా కొత్తగా రూపొందిన మైసూర్ రాష్ట్రంలో (ప్రస్తుత కర్ణాటక) ఒక జిల్లాగా రూపొందించబడింది. 1956 దేశం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజిస్తున్న తరుణంలో జిల్లాభూభాగంలో పలు పట్టణాలలో మరాఠీ ప్రజలు అధికంగా ఉన్నప్పటికీ కన్నడిగులు అధికంగా ఉన్నందున ఇది మైసూరు రాష్ట్రంలో చేర్చబడింది. భాషా పరంగా అధికంగా ఉన్న మరాఠీ ప్రజలు ధాఖలు చేసిన కేసు సుప్రీం కోర్టులో ఉంది.ఇ
బెల్గాం జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి :- జిల్లాలో చిక్కోడి తాలూకా (వైశాల్యం 1,995.70) పెద్దదిగా ఉంది. అలాగే చిన్న తాలూకా రేబాగ్ తాలూకా (వైశాల్యం 958.8) జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి. జిల్లాలో 17 పురపాలకాలు, 20 పట్టణాలు, 485 గ్రామపంచాయితీలు, 1138 నివాస గ్రామాలు, 26 నిర్జన గ్రామాలు ఉన్నాయి బెల్గవి నగరం బెల్గాం రెవెన్యూ డివిషన్కు కేంద్రంగా ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. |
2011 జనాభా లెక్కల ప్రకారం బెలగావి జిల్లాలో 4,778,439 జనాభా ఉంది, ఇది సింగపూర్ దేశానికి లేదా అమెరికా రాష్ట్రమైన అలబామాకు సమానం. ఇది భారతదేశంలో 25 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 లో). జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 356 మంది (920 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 13.38%. బెల్గాం లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 969 మంది స్త్రీలు,, అక్షరాస్యత రేటు 73.94%.
కన్నడ ప్రధాన భాష, జిల్లాలోని జనాభాలో ఎక్కువ మంది (73% మంది) మాట్లాడతారు, అయితే బెలగావి, ఖానాపూర్, నిపానీ, ఉగర్ మొదలైన నగరాల్లో, దక్షిణాన చాలా గ్రామాల్లో మరాఠీ ప్రధానంగా మాట్లాడుతుంది. బెల్గాం, ఖానాపూర్ తాలూకాలో భాగం. జిల్లాలో దఖిని (ఉర్దూ యొక్క దక్షిణ మాండలికం), కొంకణి మాట్లాడేవారు కూడా ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, రెండోది కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా మాధ్యమం, మరాఠీ, కన్నడ, ముస్లిం కుటుంబాల చాలా ఉన్నత తరగతి, విద్యావంతులైన గృహాలలో మాట్లాడే భాష. బెల్గాం జిల్లాలో దాదాపు 67% మంది బహుభాషా, కన్నడ, మరాఠీ, ఉర్దూ-హిందీ, కొంతవరకు ఇంగ్లీషులో సంభాషిస్తున్నారు.
బెల్గాం జిల్లా పర్యాటక ఆకర్షణలు[5]
' 'బెళగావి' ప్రసిద్ధ బెల్గాం ఫోర్ట్ కమల్ బసది జైన్ టెంపుల్, సఫి మసీదు, అనేక చారిత్రిక కట్టడాలు ఉన్నాయి. బెలగావి ఫోర్ట్ నగరం నడిబొడ్డులో ఉంది. కొటే సరస్సు కూడా సందర్శించడానికి అనువైన ఒక అందమైన సరస్సు. కోట లోపల ఒక పురాతన కమలా బసది , చిక్క బసది జైన దేవాలయంలు ఉన్నాయి. ఈ ఆలయ కొన్ని మీటర్ల నడకదారిలో రామకృష్ణ ఆశ్రమం ఉంది. ఇక్కడ పర్యాటకులు విశ్రాంతి తీసుకోవచ్చు. కోటలో ఒక పురాతన మసీదు ఉంది. పోర్చుగీస్, బ్రిటిష్ శైలి రెండింటినీ భవనాలతో చేరిన బెల్గాం కంటోన్మెంట్, చర్చి (భవనం), పాఠశాలలు ఉన్నాయి.
'హూలి పంచలింగేశ్వరాలయం జిల్లాలోని పురాతన గ్రామం సవదత్తి నుండి 13 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఇతర శిథిలావస్థలో ఉన్న చాళుక్య దేవాలయాలు పరిరక్షణ, పునరుద్ధరణ కోసం వేచి ఉన్నాయి.
'ముగల్ఖాడ్' 'రాయబాగ్ తాలూకాలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిందిన శ్రీ యల్లలింగేశ్వర ఆలయం ఉంది.
గోకాక్ ఫాల్స్
'షెద్బల్ ' , షెడ్బాల్ దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని ఒక గ్రామం. కర్ణాటకలో బెలగావి జిల్లా అథిని తాలూకాలోని ఒక ప్రసిద్ధ జైన ఆశ్రమమం. షెద్బల్ శాంతినాధ జైన దేవాలయం సంవత్సరం క్రీశ 1292 లో నిర్మించబడింది. ఎలాచార్య పరమపూజ్య ముని శ్రీ 108 విద్యానంద మహారాజ్ తపస్వి జన్మస్థలం. పరమపూజ్య ముని శ్రీ శాంతిసాగర్ మహారాజ్ ఆధ్వర్యంలో శాంతిసాగర్ చత్ర ఆశ్రమం నిర్మించబడింది. 24 తీర్థంకరుడైన చతుర్వంశధి తీర్థంకరుల మందిర్ 1952లో నిర్మించారు.
బెల్గాం నుండి 20 కి.మీ దూరంలో ఉంది. సతతహరిత అరణ్యంతో కప్పబడిన కొండ ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం.
మందోవి నది 60 అడుగుల ఎత్తు నుండి జాలువారుతూ వరపోహ జలపాతం. ఇది బెలగావి జిల్లాలో ఒక అందమైన జలపాతం.
'సౌన్డాట్టీ ' లోని సవదత్తి కోట, చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ కిత్తూరు కోట, మ్యూజియం, ఇతర స్మారకాలు ఉన్నాయి.
షిరసంగి దేశాయ్ వాడే, ప్రసిద్ధి చెందిందిన కాళికా ఆలయం (షిరసంగి) ఉంది. ఇక్కడ ఇతర చారిత్రాత్మక స్మారక చిహ్నాలు ఉన్నాయి.
సంగోలీ నుండి 7 కి.మీ దూరంలో ఉన్న తుర్మారి వద్ద 300 సంవత్సరాల కంటే అధిక పురాతనమైన బి.సి.పాటిల్ హౌస్' (గౌడరమనె) ఉంది. ఇది రెండు అంతస్తుల భవనం. ఇక్కడ ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు గిరీష్ కర్నాడ్ చిత్రీకరించిన చలనచిత్రం' 'ఒందానొందు కాలదల్లి చిత్ర చిత్రీకరణ జరిగింది.
డెగావ్( డెగాంవ్ లేక దేవ్గాం) వద్ద ప్రసిద్ధి చెందిందిన కమలా నారాయణ ఆలయం ఉంది. ఇది కిత్తూరు నుండి 5కి.మీ దూరంలో ఉంది.
'కాసమల్గి మందిరం' నుండి 10 కి.మీ దూరంలో ; కమలా నారాయణ ఆలయం,
' హలసి లో ప్రముఖ కదంబ రాజవంశం ఉండేది. ఇక్కడ 'దేవనాధ నరసింహ' ఆలయం ఉంది.
'యల్లమ్మగుడ్డా' లో ప్రజలు ప్రసిద్ధి చెందిందిన రేణుకా యల్లమ్మ ఆలయం, ఇక్కడకు మహారాష్ట్ర, ఆంధ్ర, దక్షిణ భారతదేశం పర్యటకులు వస్తుంటారు. .
'నవిలతీర్ధ
' ' స్తవంది ఘాట్ జైన్ టెంపుల్ ' స్తవంది లేదా తవంది ఘాట్ ఒక పురాతన ప్రసిద్ధ జైన గణిత & ఆలయం ఉంది. ఇది నిప్పాని నగరం సమీపంలో ఉంది.
'పరసగాడ్ కోట ' పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి.
'ఎం.కె. హుబ్లి ' అశ్వథ నరసింహ దేవాలయం, మలప్రభ నదిలో గంగామాత మెమోరియల్, ఎం.కె హుబ్లి ఇక్కడ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది " హజారత్ ముఘత్ ఖాన్ సహబ్" దర్గా ఉంది.
సంగోలి గ్రామానికి కిత్తూర్ రాణి చెన్నమ్మ కుడిభుజం సంగోలి రాయన్న ( స్వాతంత్ర్య సమరయోధుడు) పేరు పెట్టారు.
నందగాడ్ స్వాతంత్ర్య సమరయోధుడు సంగోలి రాయన్న బ్రిటిష్ ప్రభుత్వంచే ఉరితీశారు వేదికైంది.
మునవల్లి వద్ద పంచలింగేశ్వర ఆలయం ఉంది.
కృష్ణా నదీతీరంలోచందూర్ యదూర్ ఉంది.
బొరాగావ్ దుధగంగా నదీతీరంలో ఉన్న గ్రామంలో ఉన్న ఒక జైన దేవాలయం (నిషిధి).
బెల్గవిలో విశ్వేశ్వరయ్యా టెక్నాలజీ యూనివర్శిటీ ఉంది. కర్నాటక రాష్ట్ర మొత్తం టెక్నికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఈ విశవవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. జిల్లాలో విమాన సిబ్బంది ట్రైనింగ్ పాఠశాల, సంబ్ర వద్ద ఉన్న భారత వైమానిక దళం శిక్షణా కేంద్రం. మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ బెలగావి సైనిక విభాగ కార్యాలయం ఉంది. కమాండో పాఠశాల, జంగిల్ వార్ఫేర్ పాఠశాల, భారత సైన్యం మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. జిల్లాలో కర్నాటక లింగాయత్ (కె.ఎల్.ఈ), ఎజ్యుకేషన్ సొసైటీ (బెల్గవి), ది కె.ఇ.ఎల్.ఎస్. హాస్పిటల్ ఆఫ్ బెల్గవి, (ఆసియాలో రెండవ పెద్ద ఆసుపత్రిగా గుర్తించబడుతుంది), మెడికల్ కౌంసిల్ ఆఫ్ ఇండియా, (ఇది రీజనల్ సెంటర్), ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, వ్యాక్సిన్ ఇంస్టిట్యూట్ కూడా ఉన్నాయి. 1945 నాల్గవ కింగ్ జార్జ్ ఇండియా మిలటరీ పాఠశాలలులో ఒకటైన మిలటరీ స్కూల్ ఆఫ్ బెల్గవి (ప్రింసిపల్ - లిమిటెడ్ కొ) స్థాపించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.