Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
విజాపుర జిల్లా, కర్నాటక రాష్ట్రంలో భాగంగా ఉండేది. బీజాపుర్ నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బెంగుళూరుకు 530 కి.మీ వాయవ్య దిశలో ఉంది. ఆదిల్ షా కాలంనాటి పలు స్మారక చిహ్నాలు అనేకం ఉన్నాయి. బిజ్జపూర విజాపుర కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది కర్ణాటకలో ఉత్తరం వైపున మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఆదిల్‌షాహి వంశస్థులు నిర్మించిన అనేక చారిత్రక కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 5 డివిజన్లు విజాపుర, బాగేవాడి, సింధగి, ఇండి, ముద్దెబిహాళ, బసవన బాగెవాడి ఉన్నాయి. పరిపాలనాపరంగా, బీజాపూర్ జిల్లా బాగల్‌కోట్, బెల్గాం, ధార్వాడ్, గడగ్, హవేరి, ఉత్తర కన్నడ (కార్వార్) జిల్లాలతో పాటు బెల్గాం డివిజన్‌లోకి వస్తుంది.
Bijapur District
విజపుర విజయపుర, బిజాపుర, బిజ్జనహళ్ళి | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
ప్రాంతం | దక్షిణ భారతదేశం |
రాస్ట్రం | కర్ణాటక |
జిల్లా కేంద్రం | విజయపుర |
తాలుకాలు | విజాపుర, బసవన బాగెవాడి, సిందగి, ఇండి, ముద్దెబిహళ |
విస్తీర్ణం | |
• Total | 10,541 కి.మీ2 (4,070 చ. మై) |
జనాభా (2010) | |
• Total | 22,06,918 |
• జనసాంద్రత | 250/కి.మీ2 (600/చ. మై.) |
భాషలు | |
• అధికారిక భాష | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
ఎస్టీడీ కోడ్ | + 91 (0) 8352 |
Vehicle registration | KA- 28 |
ఆంగ్లేయుల పాలనలో విజాపుర జిల్లా బాంబే ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. స్వాతంత్ర్యానంతరం 1948లో బొంబాయి రాష్ట్రంలో చేర్చారు. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాకా ఈ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో చేర్చబడింది.[1] 1997లో విజాపురను విభజించి బాగల్‌కోట్జిల్లాను ఏర్పాటుచేశారు[1].
పురావస్తు ఆధారాలు ఈ ప్రాంతం చివరి పాలియోలిథిక్ చేత స్థిరపడినట్లు సూచిస్తున్నాయి,[2] బీజపూర్‌ను సా.శ. 900 లో రాష్ట్రకూట్లుల రాజప్రతినిథి (తర్దవాడి) తైలప్ప చేత నిర్మించబడింది.[3] మాల్వా వంశస్థుల దండయాత్ర తరువాత రాష్ట్రకూట సామ్రాజ్యం పతనావస్థకు చేరుకున్న తరువాత తైలప్పా స్వంతత్రం ప్రకటించుకుని కల్యాణిచాళుఖ్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[4] అప్పుడీ నగరం విజయపురా (విజయ నగరం) అని పిలువబడింది.[5] [6]13వ శతాబ్దం ఆఖరి కాలంలో జిల్లాభూభాగం ఖిల్జీ సుల్తానేట్, ఢిల్లీ సుల్తానేట్ లోకి చేర్చబడింది. 1347లో జిల్లాభూభాగాన్ని గుల్బర్గాకు చెందిన బహ్మనీ సుల్తానులు ఆక్రమించుకున్నారు. ఈ సమయంలో విజయపూర్ బీజపూర్ అని పిలువబడింది.
1518లో బహ్మనీ సుల్తానేట్ ఐదు రాజాస్థానాలుగా (దక్కన్ సుల్తానేట్‌గా) విభజించబడింది. వీటిలో ఒకటి ఆదిల్షాహీ రాజ్యంగా (1490-1686) పాలించబడింది. స్వతంత్ర బీజపూర్ సామ్రాజ్య స్థాపన చేసిన యూసఫ్ ఆదిల్ షా కాలంలో బీజపూర్ ఉన్నత స్థితికి చేరింది. 1686 నాటికి మొగల్ చక్రవర్తులు బీజపూర్‌ను ఆక్రమించుకున్న తరువాత ఆదిల్షా పాలన ముగింపుకు చేరింది. 1724లో హైదరాబాదు నిజాం స్వతత్రం ప్రకటించుకుని దక్కన్‌లో నిజాం సామ్రాజ్య స్థాపన చేసాడు. తరువాత నిజాం బీజపూర్‌ను తనరాజ్యంలో విలీనం చేసుకున్నాడు. 1760లో మరాఠీలు నిజాంను ఓడించారు. తరువాత బీజపూరును నిజాం మరాఠీల వశంచేసాడు. 1818 నాటికి పేష్వా మూడవ బ్రిటిష్ - మరాఠీ యుద్ధంలో బ్రిటిష్ చేతిలో ఓడించబడ్డాడు. తరువాత బీజపూర్ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం అయింది.
1848లో రాజ్యానికి చివరి పాలకుడు వారసుడు లేకుండా మరణించిన తరువాత సతారా కూడా బీజపూరుతో బాంబే ప్రొవింస్‌లో విలీనం చేయబడింది. తరువాత జిల్లాభూభాగన్ని బ్రిటిష్ ప్రభుత్వం కలదగి పేరుతో కొత్త జిల్లాగా రూపొందించింది. కలదగి జిల్లాలో ప్రస్తుత బీజపూర్, బాగల్‌కోట్ జిల్లాలు భాగంగా ఉన్నాయి. జిల్లకు బీజపూర్ కేంద్రంగా చేయబడింది. 1885లో జిల్లాకేంద్రం బాగల్‌కోటకు మార్చబడింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జిల్లా బాంబే రాష్ట్రంలో భాగంగా మారింది. 1956లో మైసూరు రాష్ట్రంలో భాగం అయింది. మునుపటి జిల్లాలోని దక్షిణప్రాంత తాలూకాలు బాగల్‌కోట్ జిల్లాలో విలీనం చేయబడ్డాయి.
ఆదిల్షా నిర్మించిన కోట ప్రాకారం 2 మైళ్ళ చుట్టుకొలతతో నిర్మించబడింది. ఇది విస్తారమైన సామాగ్రితో శక్తివంతంగా నిర్మినచబడింది. కోటచుట్టూ కందకం 100 గజాల వెడల్పుతో త్రవ్వించబడింది. మునుపు ఈ కందకానికి నీరు అందించబడేది. ఇపుడు ఇది చెత్తతో నిండి పోయింది. అందువలన దాని అసలైన లోతు కనిపెట్టడం కష్టం. కోట ప్రాకారంలో హిందూ ఆలయాలు, మసీదులు ఉన్నాయి. 1566లో ఆదిల్షా కోట నిర్మాణం పూర్తి చేసాడు. తరువా కోట ప్రాకారం చుట్టు కొలత 6 మైళ్ళ ఉంది. కోట గోడ ఎత్తు 30-50 అడుగులు. కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. గోడ వెడల్పు 25 అడుగులు. కోట లోపల రక్షణదళం నిలిచి ఉండేది. వెలుపల నగరం ఉండేది. ప్రస్తుతం శిథిలాల నడుమ సమాధులు, మసీదులు మొదలైనవి ఉన్నాయి. బీజపూర్ సమీపంలోని బాదామి, అయిహోల్, పట్టడకల్ చాళుఖ్యుల కాలం నాటి చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి. .
బ్రిటిష్ రాజ్ పాలనలో విజాపుర జిల్లా బాంబేప్రొవింస్‌లో భాగంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948 బీజాపూర్ జిల్లా బాంబే జిల్లాలో భాగం అయింది. 1956లో దక్షుణభారతదేశం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టబడిన తరువాత కన్నడ భాషాధిఖ్యం కారణంగా వీజాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో భాగం అయింది. [1] 1997లో విజాపుర జిల్లా నుండి కొంతభూభాగం వేరిచేసి బాగల్‌కోట్ జిల్లా రూపొందించబడింది. [1]
భౌగోళికంగా జిల్లా దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. జిల్లాలోని భూభాగం 3 భాగాలుగా విభజించబడింది. ఉత్తర భాగంలో బీజపూర్ జిల్లా ఉత్తర భూభాగం లోని సిండిగి, ఇండి ఉన్నాయి. మద్యభూభాగంలో బీజపూర్ నగరం ఉంది. దక్షిణ భాగంలో కృష్ణానది తీర సారవంతమైన భూమి ఉంది. ఉత్తరభూభాగంలో వృక్షరహిత పర్వత దిగువ భూభాగం ఉంది. మద్యలో లోయలతో కొంచం గుండ్రంగా ఉంటుంది. ఎగువభూములు సారరహితంగా ఉంటాయి. జలప్రవాతీరాల వెంట గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు ఒకటికి ఒకటి దూరంగా ఉన్నాయి. డాన్ నదీలోయలలో సారవంతమైన నల్లరేగడి మట్టి ఉంటుంది.[13] కృష్ణానది కృష్ణానదీ తీరం వెంట తూర్పుపడమరలుగా ఉన్న ఇసుకరాతి కొండలమద్య మైదానం విస్తరించి ఉంది. జిల్లా సరాసరి వార్షిక వర్షపాతం 553 మి.మీ (37..2 దినాలు) వర్షపాతం ఉంది. జూన్- అక్టోబరు మాదాల మద్య వర్షాలు అధికంగా కురుస్తుంటాయి. అత్యధిక వర్షపాతం సెప్టెంబరు (149 మి.మీ) అత్యల్ప వర్షపాతం 34 మి.మీ ఫిబ్రవరి.
విషయాలు | వివరణలు |
---|---|
పూర్/ నాన్ -లో యల్డింగ్- మోడరేట్ - | 72.2% (1000 నుండి 8000) |
జిల్లాలో పూర్, నాన్ యల్డింగ్ | 9% (1000) |
పూర్, నాన్ యల్డింగ్ తాలూకాలు | ముద్దెబిహల్, (19%), ఇండి (15%), బీజపూర్, సిందగి (13%), బసవన్‌బగెవాడి (4%), |
లో యల్డింగ్ | 40% (4000) |
లో యల్డింగ్ తాలూకాలు | బసవన్‌బగెవాడి (54%), ఇండి తాలూకాలో కొంత ఉంది. |
మోడరేట్ యల్డింగ్ | 36% (4000-8000) |
మోడరేట్ యల్డింగ్ తాలూకాలు | బీజపూర్ 70%, సిందగి 19%, |
హై యల్డింగ్ | 15% |
హై యల్డింగ్ తాలూకాలు | సిందగి 2%, ముద్దెబిహల్ 29% |
2014లో " సజ్జాడే పీరన్ ముష్రి " చారిత్రక బీజపూర్‌కు మొదటి మేయరుగా నియమించబడ్డాడు.[1]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,175,102,[14] |
నగర నివాసితులు | 21.92% .[15] |
ఇది దాదాపు. | లతివ దేశ జనసంఖ్యకు సమానం.[16] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[17] |
640 భారతదేశ జిల్లాలలో. | 210వ స్థానంలో ఉంది.[14] |
1చ.కి.మీ జనసాంద్రత. | 207 [14] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.38%.[14] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 954:1000 [14] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 67.2%.[14] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జనసంఖ్య 2001 | 1,806,918 |
2001-1991 జనసంఖ్య అభివృద్ధి | 17.63% |
బీజపూర్ చారిత్రక ఆకర్షణలకు ప్రసిద్ధి. బీజపూర్ నగరంలో గోల్ గుంబజ్, జుమ్మా మసూద్, ఉప్పలి బురుజ్ టవర్, రెండవ ఇబ్రహీం ఆదిల్ షా సమాధి (ఇబ్రహీం రుజ్జా) ఉన్నాయి
వీటిలో 2 జాతులను సాధారణంగా బాయూబాబ్ చెట్లు అంటారు. వీటిని బీజపూరులో గుర్తించి జాబితాలో చేర్చారు. ఒకటి బీజపూరు లోని ఇబ్రహీం రోజా సమారక చిహ్నం వద్ద ఉంది. దీని చుట్టుకొలత 10.84 అడుగులు, ఎత్తు 5 అడుగులు. మరొకటి బీజపూరు లోని యోగపూర్ దర్గా వద్ద ఉంది. దీని వయసు 359, చుట్టుకొలత 9 అడుగులు, ఎత్తు 7 అడుగులు. ఈ రెండు వృక్షాలు ఆదిల్ షా కాలంలో నాటబడ్డాయి. పరిశోధకులు రాజా ఆదిల్ షా ప్రకృతి ఆరాధకుడని భావిస్తున్నారు. ప్రత్యేకంగా అడసోనియా డిజిటా ఇంపోనియా చెట్లు టర్కీ నుండి దిగుమతి చేయబడ్డాయని భావిస్తున్నారు. రాజులు వీటిని పెంచడంలో చాలా శ్రద్ధ వహించారు. వారు ఆ చెట్లను వారి పిల్లలుగా భావించి సంరక్షించారు.
బీజపూర్ జిల్లాలో ప్రాంతాలను రాజ్‌ట్రాంస్‌పోర్ట్ రహదారి మార్గంతో చక్కగా అనుసంధానం చేస్తుంది.
జిల్లాలో 100 కి.మీ దూరంలో షోలాపూర్ వద్ద వాణిజ్యరహిత విమానాశ్రయం ఉంది. జిల్లాకు ఉత్తరంలో 200 కి.మీ దూరంలో ఉన్న బెల్గాం జిల్లాలో విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్వేస్, జెట్ ఎయిర్వేస్ సర్వీసులు లభిస్తుంటాయి. సైనిక్ స్కూల్ వద్ద హెలిపాడ్ ఉంది. ఇది సైనిక్ స్కూలు అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుండి ప్రభుత్వ అతిధులు, అధికారులు మాత్రమే ప్రయాణిస్తుంటారు.
బీజపూర్‌లో బ్రాడ్ గేజ్ స్టేషన్ ఉంది. ఇది నగరకేంద్రం నుండి 2 కి.మీ దూరంలో ఉంది.[19] ఇక్కడి నుండి బెంగుళూరు, ముంబయి, హైదరాబాదు, హుబ్లి, షోలాపూరు, షిర్ది.
ప్రభుత్వానికి స్వంతమైన " నార్త్ వెస్ట్ స్టేట్ రోడ్డు ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ " [20] జిల్లాలోని అన్ని ప్రాంతాలకు బసులను నడుపుతుంది. ప్రాంతీయ బసులు బీజపూరు నగరపరిమితిలో మరొయు 15కి.మీ దూరంలో ఉన్న గ్రామాలకు నడుపబడుతున్నాయి. దూరప్రాంత బసులతో పో ల్చినట్లైతే నగరప్రాంతం బసులు అధికంగా ఉంటాయి. బీజపూర్ - బెంగుళూరు - హుబ్లి- ధార్వాడ, బెల్గాం మద్య ప్రైవేట్ యాజమాన్యం లగ్జరీ బసులను నడుపుతుంది. నగరం లోపల టాటా సుమో, టాటా ఇండికా. టెంపో టాక్సీలు లభ్యం ఔతుంటాయి.[21] ఆటో, టోంగాలు ఇప్పటికీ ప్రజాదరణ కలిగి ఉన్నాయి. సైకిల్ రిక్షాలు సామాను తరలించడానికి ఉపయోగించబడుతున్నాయి.
మద్య ఆసియాదేశం నుండి ముస్లింపాలకుల బిడారు ప్రజలలో భాగంగా ఇక్కడకు వచ్చారు. వీరిలో అత్యధికులు లిగాయత, సున్ని ముస్లిం వర్గానికి చెందినవారు. 2001 గణాంకాలను అనుసరించి వీరిలో 3,34,254 ఆదివాసి ప్రజలు. 30,051 మంది షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందినవారు. జిల్లాలో లంబాణి వర్గానికి చెందిన ప్రజలు అధికంగా స్థిరపడ్డారు. గ్రామాలలో నివసిస్తున్న లంబాణి ప్రజలను తండాలు అంటారు.
బీజపూర్ గుర్తింపుఒందిన జిల్లా నేషనల్ రోడ్డు సైక్లిస్టులు ఉన్నారు. మలేషియాలో నిర్వహించబడిన పెరిల్స్ ఓపెన్ 99 పోటీలలో సురేబన్ పాల్గొన్నాడు. .[22] బి.ఆర్. అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడలకు ప్రధానకేంద్రంగా సేవలందిస్తుంది. అంబేద్కర్ స్పోర్ట్స్ వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, సైక్లింగ్ క్రీడలకు అవసరమైన సౌకర్యాలను అందిస్తుంది. ప్రభుత్వసంస్థలే కాకుండా బి.ఎల్.డి.ఇ.ఎ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజి ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సౌకర్యం అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతంలోని కబడీ, కోకో లను గుర్తిస్తుంది. క్రికెట్ ప్రాంతీయవాసులకు అభిమాన క్రీడ. అయినా స్కూల్స్, పాఠశాలలలో ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించబడుతుంటాయి. ప్రతిసంవత్సరం జిల్లాలో నవరాత్రి సమయంలో దసరా స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది.
నవరసపూర్ వద్ద ఆదిల్ షా అడిటోరియం ఉంది. ఇది నగరసరిహద్దు నుండి 10కి.మీ దూరంలో ఉంది. ఇప్పటికీ ఆసిధిలాలు కనిపిస్తూ ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి ప్రతిసంవత్సరం నవరసపూర్ ఉత్సవం నిర్వహింస్తున్నారు. భీంసేన్ జోషి, ఉస్తాద్ అల్ల రక్ష, జాకీర్ హుస్సేన్ (గాయకుడు), మల్లికార్జున మ్ంసూర్, గంగూభాయి హంగల్, పలువురు ప్రబల కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు.
బీజపూర్ " మదీనాతుల్ ఔలియా " (సూఫీలి) లేక సూఫీ సన్యాసుల నగరం. వివిధ ఔలియా (సూఫి సన్యాసులు) బీజపూర్‌ను సందర్శుంచారు. సూఫీ సన్యాసులలో అధికశాతం బీజపూర్‌లో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. జిల్లాలో ఔలియా క్వాద్రియా, సకఫ్యా, అష్రైఫ్యా, షుఫారియా, నాద్క్వాభండ్యా, చిసిత్యా మొదలైన విధానాలు ఆచరణలో కనిపిస్తుంటాయి.
జిల్లా వాసులకు వ్యవసాయం ప్రధానవృత్తి. జిల్లా వైశాల్యంలో 7,760 చ.కి.మీ వ్యవసాయానికి అందుబాటులో ఉంది. జిల్లావైశాల్యంలో ఇది 74% ఉంది. అరణ్యప్రాంతం 0.19% ఉంది. 17.3% వ్యవసాయభూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది. 82.7% భూభాగం వర్షాధారితంగా ఉంది.
జిల్లాలో ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, బజ్ర, గోధుమలు, కందులు, చనగలు, పెసలు పండించబడుతున్నాయి. పొద్దుతిరుగుడు, కుసుంభగింజలు, వేరుశనగ మొదలైన పంటలు పండించబడుతున్నాయి. హార్టి కల్చర్ పద్ధతిలో ద్రాక్ష, దానిమ్మ, జామ, బెర్, సపోటా, నిమ్మ పండించబడుతున్నాయి. సమీపకాలంగా పండ్ల తోటలలో దానిమ్మ, ద్రాక్ష 8,610 చ.కి.మీ ప్రదేశంలో పండించబడుతుంది. 2002-3 లలో 52.2% ఆహారధాన్యం, నూనె గింజలు 15.6%, పత్తి, చెరకు 4.8%' ప,డించబడుతున్నాయి. సమీపకాలంలో 2 సంవత్సరాలుగా పత్తి, చెరకు పంట తగ్గుతూ వస్తుంది.
శ్రామికిలు వర్గీకరణ | శ్రామికుల సంఖ్య |
రైతులు | 2,21,060 |
వ్యవసాయ కూలీలు (భూ రహిత రైతులు) | 2,87,778 |
Artisans | 17,776 |
కుటీర పరిశ్రమలు | 18,232 |
సేవా, ఇతర రంగాలు | 1,95,573 |
బీజపూర్ సమీపకాలంలో విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది. 1980 కంటే ముందు జిల్లాలో కొన్ని వృత్తివిద్యాసంస్థలు ఉన్నాయి. వృత్తివిద్యాసంస్థలతో పలు విద్యాసంస్థలు గ్రాజ్యుయేట్, పోస్ట్ గ్రాజ్యుయేట్ ఫ్యాకల్టీ ఆర్ట్స్, సైన్సు, సోషల్ స్టడీస్, సైన్సు విద్య అందిస్తూ ఉండేవి. వృత్తివిద్యాసంస్థలు తప్ప మిగిలిన కాలేజీలు రాణిచెన్నామ్మ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు విశ్వేశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. బి.ఎల్.డి.ఇ.ఎ వైస్ ప్రింసిపాల్ డాక్టర్ పి.జి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హలకట్టి కాలేజ్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ కళాశాలల ఎస్.ఇ.సి.ఎ.బి కాలేజ్ అనుబంధంగా ఉన్నాయి. హెల్త్ సైన్సెస్ రాజీవ్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం .[23] బి.ఎల్.డి.ఇ.ఎ యొక్క బి.ఎం.పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అల్-అమీల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, సైనిక్ స్కూల్, బీజాపూర్, కర్ణాటక స్టేట్ వుమెన్ విశ్వవిద్యాలయం. ఎం.బి.ఎ, ఎం.సి.ఎ వంటి వివిధ పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. డిఫెంస్ ఫోర్స్‌కు సిబ్బందిని అందించడానికి అవసరమైన ఒకేఒక రెసిడెంషియల్ సైనిక పాఠశాల బీజపూరులో మాత్రమే ఉందని బీజపూర్ వాసులు సగర్వంగా చెప్పుకుంటారు. బీజపూర్ ఆలయాలకు స్మారకభవనాలకు గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికొరకు 1993లో కర్ణాటకా యూనివర్శిటీ పోస్ట్- గ్రాజ్యుయేట్ కాలేజీని స్థాపించారు. కర్ణాటకా యూనివర్శిటీ 2003లో బీజపూర్‌లో మహిళా విశ్వవిద్యాలయం స్థాపించింది. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర కర్నాటక జిల్లాలలో 12 మహిళా కాలేజీలు పనిచేస్తున్నాయి.విశ్వవిద్యాలయం బేచిలర్ డిగ్రీ కొరకు ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్, విద్య, ఫ్యాషన్ టెక్నాలజీ, హోంసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ సోషల్కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ మొదలైన కోర్సులను అందిస్తున్నాయి. బీడు భూములలో వ్యవసాయం అభివృద్ధిచేయడానికి అనువైన " యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ " సిటీ బస్ స్టాండు నుండి 6కి.మీ దూరంలో ఉంది. కిత్తూరు రాణి చెన్నామ్మ రెసిడెంషియల్ స్కూల్ - అంజుతగి ఇండి తాలూకాలో కొత్త భవననిర్మాణం చేపట్టింది.
బీజపూర్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.