సాంగ్లి మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. పసుపు వ్యాపారం కారణంగా దీనిని మహారాష్ట్ర పసుపు నగరం అని పిలుస్తారు.[3] సాంగ్లి, కృష్ణా నది ఒడ్డున ఉంది.‌ ఇది ముంబై నుండి 390 కి.మీ, పూణే నుండి 240 కి.మీ (150 మైళ్ళు), బెంగళూరు నుండి 700 కి.మీ (430 మైళ్ళు) దూరంలో ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చక్కెర కర్మాగారాలకు సాంగ్లీ ప్రసిద్ధి చెందింది. ఈ ఒక్క జిల్లాలోనే 30 కి పైగా చక్కెర కర్మాగారాలు ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు సాంగ్లి, దేశం ...
సాంగ్లి
మెట్రో నగరం
Thumb
సాంగ్లి
సాంగ్లి
Coordinates: 16.853°N 74.583°E / 16.853; 74.583
దేశం India
రాష్ట్రం మహారాష్ట్ర
జిల్లాసాంగ్లి
Founded byహర్భట్ పట్వర్ధన్
విస్తీర్ణం
  Total200.18 కి.మీ2 (77.29 చ. మై)
Elevation
549 మీ (1,801 అ.)
భాషలు
  అధికారికమరాఠి
Time zoneUTC+5:30 (IST)
PIN
416416[2]
Telephone code+91-233
Vehicle registrationMH-10
Literacy85.93%
శీతోష్ణస్థితిDry and Arid (Köppen)
మూసివేయి

సాంగ్లి యుఎ / మెట్రోపాలిటన్ రీజియన్, విస్తృత రహదారులు, ప్రధాన రైల్వే జంక్షన్, బహుళ వంటకాలు కలిగిన హోటళ్ళు, చాలా మంచి విద్యా సౌకర్యాలతో ఆధునిక నగరంగా అభివృద్ధి చెందింది. ఈ నగరంలో దాని జంట నగరం మిరాజ్‌తో కలిసి ఒక ప్రధానమైన ఆరోగ్య కేంద్రంగా ఉంది. ఇది టెలికమ్యూనికేషన్, వినోద సౌకర్యాలతో కూడిన ప్రధాన నగరం. నగరం ప్రధాన ప్రదేశంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేయబడుతోంది.

భౌగోళికం

సాంగ్లి, కృష్ణానది ఒడ్డున ఉంది. వారణ నది సంగ్లి వద్దనే కృష్ణా నదిలో కలుస్తుంది.

చరిత్ర

నగరం పేరు సహగల్లి అనే పేరు మీదుగా వచ్చింది. ఆ మరాఠీ పేరుకు ఆరు గల్లీలు అని అర్థం. వాడుకలో అదే సాంగ్లీగా మారింది.[4]

మధ్యయుగ భారతదేశంలో కుండల్ (ఇప్పుడు సాంగ్లి నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం) అని పిలువబడే ఈ ప్రాంతం సా.శ. 12 వ శతాబ్దంలో చాళుక్య సామ్రాజ్యానికి రాజధాని.[5] శివాజీ కాలంలో, సాంగ్లి, మీరాజ్, పరిసర ప్రాంతాలు మొఘల్ సామ్రాజ్యం నుండి మరాఠాలు చేజిక్కించుకున్నారు. 1801 వరకు, సాంగ్లీని మీరాజ్ జహగిర్‌లో చేర్చారు. చింతామన్‌రావ్ పట్వర్ధన్, అతని బాబాయి గంగాధరరావు పట్వర్ధన్ మధ్య కుటుంబ వివాదం తరువాత 1801 లో సాంగ్లీ మిరాజ్ నుండి విడిపోయింది, 1782 లో గంగాధరరావు, సంతానం లేని అన్నయ్య తరువాత మీరాజ్‌కు ఆరవ పాలకుడీగా వచ్చాడు.

శీతోష్ణస్థితి

సాంగ్లీ శీతోష్ణస్థితి పొడిగా ఉంటుంది. వేసవి కాలం ఫిబ్రవరి మధ్య నుండి జూన్ మధ్య వరకు ఉంటుంది. ప్రారంభంలో చాలా వరకు పొడి వాతావరణం ఉంటుంది, వేసవి ముదిరేకొద్దీ వర్షపాతం పెరుగుతుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా వేడిగా ఉండే పగళ్ళు, తేలికపాటి వేడిగా ఉండే రాత్రుళ్ళు ఉంటాయి. రుతుపవనాలు జూన్ మధ్య నుండి అక్టోబరు చివరి వరకు ఉంటాయి. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు వెచ్చని, తేమతో కూడిన పగళ్ళు, తేలికపాటి, తేమతో కూడిన రాత్రుళ్ళూ ఉంటాయి. శీతాకాలం నవంబరు ప్రారంభం నుండి ఫిబ్రవరి ప్రారంభం వరకూ ఉంటుంది. ఈ సీజన్ చాలా వరకు పొడిగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా నవంబర్‌లో ఉంటుంది. శీతాకాలంలో పగళ్ళు వెచ్చగాను, రాత్రుళ్ళు చల్లగానూ ఉంటాయి. మొత్తం వార్షిక వర్షపాతం దాదాపు 22 అంగుళాలు (580 మిమీ).

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Sangli, నెల ...
శీతోష్ణస్థితి డేటా - Sangli
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 31
(88)
33
(91)
36
(97)
38
(100)
37
(99)
31
(88)
28
(82)
28
(82)
30
(86)
32
(90)
30
(86)
30
(86)
32
(90)
సగటు అల్ప °C (°F) 9
(48)
15
(59)
18
(64)
21
(70)
22
(72)
22
(72)
21
(70)
21
(70)
20
(68)
19
(66)
11
(52)
10
(50)
17
(63)
సగటు అవపాతం mm (inches) 3.8
(0.15)
0.5
(0.02)
5.3
(0.21)
22.1
(0.87)
48.3
(1.90)
71.1
(2.80)
108.7
(4.28)
79.8
(3.14)
99.6
(3.92)
88.9
(3.50)
33.5
(1.32)
6.9
(0.27)
568.5
(22.38)
Source: Government of Maharashtra
మూసివేయి

ఇవి కూడ చూడండి

హుజూర్పాగా

కులభూషణ్ జాదవ్

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.