Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో గదగ్ జిల్లా ఒకటి. గదగ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 1997లో ధర్వాడ జిల్లాలోని కొంతభూభాగం తీసుకుని గదగ్ జిల్లా రూపొందించబడింది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 971,952. వీరిలో 35.21% ప్రజలు నరర వాసితులు. 1991 - 2001 నుండి 13.14% అభివృద్ధి చెందింది.
Gadag district
ಗದಗ ಜಿಲ್ಲೆ | |
---|---|
District | |
Country | India |
State | కర్ణాటక |
Division | Belgaum division |
ప్రధాన కార్యాలయం | Gadag |
విస్తీర్ణం † | |
• Total | 4,656 కి.మీ2 (1,798 చ. మై) |
జనాభా (2001)† | |
• Total | 9,71,835 |
• జనసాంద్రత | 209/కి.మీ2 (540/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
టెలిఫోన్ కోడ్ | 08372XXXXXX |
Vehicle registration | KA-26 |
లింగ నిష్పత్తి | .969 ♂/♀ |
అక్షరాస్యత | 66.1% |
Climate | Tropical wet and dry (Köppen) |
Precipitation | 631 మిల్లీమీటర్లు (24.8 అం.) |
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | బాగల్‌కోట్ |
తూర్పు సరిహద్దు | కొప్పల్ |
ఆగ్నే సరిహద్దు | బళ్ళారి |
ఆగ్నేయ సరిహద్దు | హవేరి |
పశ్చిమ సరిహద్దు | దర్వాడ |
వాయవ్య సరిహద్దు | బెల్గాం |
జిల్లాలో పశ్చిమ చాళుఖ్య సాంరాజ్యానికి చెందిన పలు హిందూ, జైన స్మారకచిహ్నాలు ఉన్నాయి. గదగ్ జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి. గడగ్-బెత్గెరి, రాన్ (కర్ణాటక), షిర్హత్తి, నార్గుండ్, లక్ష్మేష్వర, గజెంద్రగద్, ముందర్గి.
త్రికూటేశ్వర ఆలయ సమూహం ఆరంభకాల చాళుఖ్యులచేత 6-7 శతాబ్ధాలలో నిర్మించబడింది. ఇది చాళుఖ్యుల నిర్మాణకౌశలానికి ఉదాహరణగా నిలిచింది. ఆలయ ప్రధాన దైవం " శరవస్తి ".
అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్న వీరనారాయణ ఆలయం 11 వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు.
జుమ్మామసీదులో 600 మంది ఒకేసారి ప్రార్ధించగలిగిన అవకాశం ఉంది. 17-18 వ శతాబ్ధాలలో గదగ్‌ను ముస్లిములు పాలించిన సమయంలో ఈ మసీదు నిర్మించబడింది. జిల్లా భూభాగం తరువాత మరాఠీలు ఆతరువాత బ్రిటిష్ ఆధీనంలో ఉంది.
సిరహట్టిలో ఉన్న లక్ష్మేష్వరలో పలు హిందూ, జైన ఆలయాలు, మసీదులు ఉన్నాయి. సోమేశ్వర ఆలయసమూహంలో పలు శివాలయాలు ఉన్నాయి. ఇది కోట వంటి ప్రాకారం లోపల నిర్మించబడింది.
చాళుఖ్యుల జోడిగోపుర, మల్లిఖార్జునాలయాలు, బృహత్తర గణాశ, నంది శిల్పం మొదలైన స్మారకచిహ్నాలు.
గదగ్ నుండి 12 కి.మీ దూరంలో ఉన్న లక్కుండి చాళుఖ్యరాజుల నివాస ప్రదేశంగా ఉంది. ఇక్కడా 101 మెట్లున్న కల్యాణి అనే బావి ఉంది. ఇక్కడ హిందూ, జైన ఆలయాలు ఉన్నాయి. పురాతత్వ శాఖ నిర్వహణలో ఒక శిల్పప్రదర్శన శాల ఉంది.
దంబల్ 12వ శతాబ్ధానికి చెందిన చాళుఖ్య కాలానికి చెందిన దొడ్డబసప్ప ఆలయం ఉంది.
గజేంద్రగాడ్ ఒక కొండ మీద నిర్మించబడిన కోట. ఇక్కడ కాలకాళేశ్వర ఆలయం ఉంది.
హర్తిలో పలు హిందూ ఆలయాలు ఉన్నాయి. బసవేశ్వర ఆలయాలు ఆలయాలంలో వార్షిక ఉత్సవాలు, ఊరేగింపులు ఉన్నాయి. పార్వతి పరమేస్వరాలయం (ఉమా మహేశ్వరాలయం)లో చాళుఖ్యరాజుల కాలంనాటి కుడ్యశిల్పాలు ఉన్నాయి.
గదగ్ పట్టణానికి 12 కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ గ్రామం కొటుమచగి. ఇక్కడ సోశ్వర, దుర్గాదేవి, చామరాస ఆలయాలు ఉన్నాయి. ఇది కన్నడ రచయిత ప్రభులింగ్లీలె జన్మస్థలం.
నరేగల్ వద్ద రాష్ట్రకూటులు నిర్మించిన పెద్ద జైన ఆలయం ఉంది. [1]
గడగ్ నుండి 12 కిలోమీటర్ల (7.5 మైళ్ళు) దూరంలో ఉన్న ఈ గ్రామం పాత దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది.
రాన్ వద్ద అనంతసాయి గుడి, ఈశ్వర గుడి, కాలా గుడి, లోకనాథ ఆలయం, మల్లికార్జున గుడి,ంపత్స్వనాథ్ జైన ఆలయం, సోమలిగేశ్వర ఆలయం మొదలైన చారిత్రక స్మారకచిహ్నాలు ఉన్నాయి.
కుర్తకోటి గదగ్ నుండి 16 కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడ ఉగ్రనరసింహ ఆలయం, దత్తాత్రేయ ఆలయం, విరూపాక్షలింగ, రామా ఆలయం ఉన్నాయి. రామా, రామాలయంలో లక్ష్మణ, సీత విగ్రహాలను బ్రహ్మచైతన్య స్థాపించాడు. ఇది కన్నడ రచయిత కీర్తినాథ్ కుర్తకోటి స్వస్థలం.
నర్గుండిలో ఉన్న 17వ శతాబ్ధపు కోట 1857లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తురుగుబాటులో ప్రధానపాత్ర వహించింది.
గదగ్ నుండి 24 కి.మీ దూరంలో ఉన్న దొని కొండ పవనశక్తికి ప్రత్యేకత పొందింది.
గదగ్ నుండి 10 కి.మీ దూరంలో ఉన్న బెలదాడిలో రామాలయం ఉంది.
గదగ్ నుండి 23 కి.మీ దూరంలో వ్యవసాయ గ్రామం " శ్రీ జగద్గురు బుదిమహేశ్వమిగళ సంస్తాన్ మఠం ఉంది. మఠాన్ని హిందువులు, క్రైస్తవులు సంరక్షిస్తున్నారు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,065,235,[2] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | రోలే ద్వీపం నగర జనసంఖ్యకు సమం..[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 426 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 229 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.61% [2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 978:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 75.18 %.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మగడి పక్షుల శరణాలయం,[5] మగడి పక్షుల శరణాలయం వైశాల్యం 26 చ.కి.మీ. ఇది గదగ్ - బెంగుళూరు రహదారిలో ఉంది. ఇది షిర్హట్టి నుండి 8 కి.మీ దూరంలో, కక్ష్మృశ్వర్ నుండి 11 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ బార్- హెడ్డేడ్ గూస్ వంటి వలస పక్షులు వస్తుంటాయి. అవి వ్యవసాయ పక్షిలు, చేపలను ఆహారంగా తీసుకుంటాయి.
నారాయణ రావు షంకర్ రావు కంపలి, మార్తాండరావు నర్గుండ్కర్ ఆయన అనుయాయులు భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు.
కనగినహల్‌లో భారతదేశంలో మొదటిసారిగా (100 సంవత్సరాలు దాటింది) సహకార ఉద్యమం ఆరంభించబడింది.[6] తరువాత కె.హెచ్.పటేల్ దీనికి అధుకరణీకరణ కార్యక్రమం చేపట్టాడు.
జిల్లాలోని గజేంద్రగాడ్, కప్పటగుడ్డ, కుర్కొటి లలో పవన విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.