Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
భత్కల్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలోని 30 జిల్లాలలో ఒకటి. భత్కల్ (కన్నడం: ಭಟ್ಕಳ, ಭಟಕಳ ( కన్నడంలో భత్కళ), ప్రముఖ యాత్రీకుడు ఇబ్న్ బటుయా దీనిని " బాద్- ఉల్- క్విలాహ్" అని వర్ణించాడు. పోర్చిగీసు చారిత్రక రచనలలో బతేకల ఉత్తర కన్నడలోని నౌకాశ్రయ పట్టణాలలో ఒకటి. భత్కల పట్టణం ముంబయి- కొశ్చి రహదారి మార్గంలో ఉంది. భత్కల్ రైల్వే స్టేషను కొంకణి రైలు మార్గంలో ఉన్న ప్రధాన రైలు స్టేషనులలో ఒకటిగా గుర్తించబడుతుంది. భత్కల్సమీపంలో ఉన్న విమానాశ్రయం " మంగుళూరు విమానాశ్రయం " .
బాగల్కోట్ జిల్లా
బాగల్కోట్ Bagalkote | |
---|---|
జిల్లా | |
Nickname: క్వాతి | |
Country | India |
రాష్ట్రము | కర్ణాటక |
Headquarters | బాగల్కోటె |
తాలూకాలు | బాగల్కోటె తాలూకా, బాదామి, బిల్గి, హున్గుండ్, జమఖండి, ముధోల్, ఇల్కల్, రబ్కవి బన్హట్టి , గులేద్గుడ్డ |
విస్తీర్ణం | |
• Total | 6,575 కి.మీ2 (2,539 చ. మై) |
జనాభా (2012) | |
• Total | 18,91,009 |
• జనసాంద్రత | 290/కి.మీ2 (740/చ. మై.) |
Languages | |
• Official | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 587101-587325 |
Telephone code | + 91 (0)8354 |
Vehicle registration | KA-29 |
ప్రబల మొరొకాన్ యాత్రీకుడు ఇబ్న్ బటుయా (1307-1377), "బాద్- ఈ - క్విల్లాహ్ " భత్కల్ నవాథ్ ముస్లిం, జైనులు నివసించే అరేబియన్ సముద్రతీర పట్టణంగా వర్ణించబడింది. షరావతి నదీ తీరంలోని భత్కల్ను నవాథ్ పాలించాడని పేర్కొనబడింది. దేశచరిత్రలో భత్కల్కు ప్రాధాన్యత ఉంది. పలు సామ్రాజ్యాలు, చక్రవర్తుల ఉన్నత, పతనాలకు భత్కల్ సాక్ష్యంగా ఉంది. 1291 నుండి 1343 వరకు హొయశిల సామ్రాజ్యంలో భాగంగా ఉంది. హొయశిలల నుండి భత్కల విజయనగర పాలనలోకి మారింది. తరువాత భత్కల్ సులువ (జైన) పాలకుల ఆధీనంలోకి మారింది. సలైవా కాలంలో పలు ఆలయాలు, సత్రాలు నిర్మించబడ్డాయి. సలైవా కాలానికి చిహ్నాలుగా ఇప్పటికీ ముద్భత్కల్ వద్ద ఉన్న ఆలయాలు నిలిచి ఉన్నాయి. చోళా చక్రవర్తి మొదటి ఆదిత్యా ఆయన కుమారుడు మొదటి పరంతక, వారి వారసుడు సుందర చోళ (రెండవ పరంతక చోళుడు) (క్రీ.శ880-975) కన్నడ రాజ్యం మీద దండయాత్రచేసి మైసూర్ పీఠభూమిలోని గంగావాడి ప్రాంతాలను, సహ్యాద్రి పర్వతశ్రేణిలో ఉన్న భత్కల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. కన్నడ రాజ్యం మీద వారి విజయానికి చిహ్నంగా సోలేశ్వర ఆలయాన్ని నిర్మించారు. మొదటి పరంతక చోళుని నుండి మూడవ కులోత్తుంగ చోళునివరకు వారి సైనికాధికారులు " కొంకణ ప్రభువులు " అని ప్రశంశించినట్లు శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి.కొంకణ లోని సోలేశ్వరుని మీద భక్తిప్రపత్తులు ప్రదర్శించే శిలాశాసనం భత్కల్ వద్ద కూడా ఉంది. 16 వ శతాబ్దంలో పోర్చుగీసులు కూడా వారి చిహ్నాలను ఇక్కడ వదిలి వెళ్ళారు. కెలాడి పాలకుల నుండి భత్కల్ హైదర్ అలి, టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి మారింది. 1799లో టిప్పు సుల్తాన్ మరణం తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి మారింది.
భత్కల్ జిల్లా 13.97 ఉత్తర అక్షాంశం, 74.57 తూర్పు రేఖాంశంలో ఉంది.[1] జిల్లా సుమారుగా సముద్రమట్టానికి 3 మీ. ఎత్తులో ఉంది.
2011 గణాంకాలను అనుసరించి భత్కల్ జనసంఖ్య 49,730. వీరిలో స్త్రీ పుషులు సమానంగా ఉన్నారు. జిల్లా అక్షరాస్యత 83%.పురుషుల అక్షరాస్యత 88%. స్త్రీల అక్షరాస్యత 78%. 6 వయసుకు తక్కువగా ఉన్న బాలబాలికలు 14% ఉన్నారు.
Religions in Bhatkal | ||||
---|---|---|---|---|
Religion | Percent | |||
Hindus | 45% | |||
Muslims | 51% | |||
Christians | 3.7% | |||
Others† | 0.3% | |||
Distribution of religions †Includes Sikhs (0.2%), Buddhists (<0.2%). |
జిల్లా ఆర్థికంగా అత్యధికంగా పర్యాటక రంగం, చేపల పరిశ్రమ మీద ఆధారపడి ఉంది.
భత్కల్ అసెబ్లీ నియోజకవర్గంగా ఉంది.[2]
భట్కల్ ఇటీవల తీవ్రవాదం పర్యాయపదంగా మారింది. పేదరికం బారిన పడిన ముస్లిం మతం సుకి మాక్డోం కాలనీ శివారు టెర్రర్ రియాజ్ అహ్మద్ సయీద్, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద యాసిన్ భత్కల్ (అహ్మద్) తీవ్రవాద అనుమానితులుగా గుర్తించబడ్డారు.[3] బెంగుళూర్ పోలీసులు భట్కల్ లోని ఒక నివాసం జర్పిన ఒక తీవ్రవాద దాడిలో, భట్కల్ 3 స్థానికులు కాక్స్ టౌన్, బెంగుళూర్ ఉగ్రవాద కార్యకలాపాలకు అరెస్టు చేశారు. దాడి సమయంలో, పోలీసు అమ్మోనియం నైట్రేట్ 5 కి.లో జెలటిన్ జెల్ 3 కిలోల, 10 విద్యుత్ సర్క్యూటులను, 3-4 టైమర్లు, కమ్యూనికేషన్ పరికరాలు పట్టుబడ్డాయి. .[4][5]
చన్నపట్టణ హనుమాన్ ఆలయం భత్కల్ పట్టణం మద్యలో ఉంది. ఆలయ ప్రధానదైవానికి వార్షికంగా రథోత్సవం నిర్వహించబడుతుంది. ముస్లిం సుభాందారి కుటుంబం నుండి ఈ ఉత్సవ నిర్వహణకు అనుమతి తీసుకుని ఉత్సవం నిర్వహించబడుతుంది. ఉత్సవ సమయంలో ఆలయ నిర్వాహం, సుభాందారి కుటుంబం మద్య తీపివంటకాల పరిమార్పిడి జరుగుతుంది. పురాతన కథనం అనుసరించి ఒకదారి ఆలయ రథం విరిగిందని దానిని మరమ్మత్తు చేయడానికి హిందువుల వద్ద తగిన ధనం లేదని ఆసమయంలో రథం మరమ్మత్తులకు సుభాందారి కుటుంబం ధనసహాయం చేసిందని వివరిస్తున్నాయి. అప్పటి నుండి సుభాందారి కుటుంబం నుండి అనుమతి తీసుకుని రథోత్సవం నిర్వహించే సంప్రదాయం ఏర్పాటైంది. కొంజి సంవత్సరాల ముందు యువత హిందూ ఉత్సవనిర్వహణకు ముస్లిం అనుమతి తీసుకోవడానికి అభ్యతరం తెలిపారు. ఆ సంవత్సరం అనుమతి తీసుకోకుండా రథోత్సవం నిర్వహించబడింది. అయినప్పటికీ రథం కచ్చితంగా సుభాందారి కుటుంబం ఇంటి ముందు విరిగింది. అప్పటి నుండి మరెవరూ రథోత్సవానికి సుభాందారి కుటుంబం అనుమతి తీసుకోవడానికి అభ్యంతరపెట్ట లేదు.[3]
దారుల్ ఖురాన్ (ఖురాన్ గృహం) మౌలానా అబ్దుల్ అలి నద్వి అకాడమీ (భత్కల్) ఉంది. ఇది 2004లో స్థాపించబడింది. మ్యూజియంలో 55 దేశీయ, అంతర్జాతీయ భాషలకు చెందిన వెలకట్టలేని అరుదైన ఖరాన్ అనువాద ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. వీటిలో 1000 సంవత్సరాల పురాతనమైన ఖురాన్ ఒకటి. [6]
భత్కల్ పర్యాటక గమ్యంగా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా మురుడేశ్వరాలయంలోని శివుని శిల్పం, బసాదీలు, సముద్రతీరాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భత్కల్ పట్టణానికి 100 కి.మీ దూరంలో ఉన్న జోగ్ జలపాతం అధికసంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
జిల్లాలో పలు సంప్రదాయాలు ఉన్నందున పలు సంప్రదాయ ఆహారాలు కూడా జిల్లాలో వాడుకలో ఉన్నాయి. భత్కలి బిర్యాని జిల్లాలోని ప్రబల ఆహారాలలో ఒకటి. భత్కల్ పట్టణం జాతీయరహదారి 17 సమీపంలో ఉంది.
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
దక్షిణ సరిహద్దు | మంగుళూరు జిల్లా |
ఉత్తర సరిహద్దు | హొన్నువర్, కుంత, జిల్లా కేంద్రం కరవార్ |
కొంకణి రైలు మార్గంలో భత్కల్ రైల్వే స్టేషను ఉంది. నేత్రావ్ని గుండి బైలాజికల్, మేరిన్ స్పెసీస్ లకు ప్రసిద్ధి చెంది ఉంది. జిల్లాలో పలు ఆలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి.
మహిళల * అంజుమన్ ప్రీ యూనివర్సిటీ కాలేజ్ మహిళల * అంజుమన్ కాలేజ్
మేనేజ్మెంట్ * అంజుమన్ ఇన్స్టిట్యూట్
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.