From Wikipedia, the free encyclopedia
చిక్కుడు ఫాబేసి కుటుంబానికి చెందినవి.
లేత చిక్కుడులో గింజలుండవు, తొక్కలతో తక్కువ సెల్యులోస్ ఉంటుంది, కనుక త్వరగా ఉడికి రుచిగా ఉంటుంది. మధ్యరకంగా ఉన్నవాటిలో గింజలు, తొక్కలు త్వరగా ఉడికి కూర రుచిగా ఉంటుంది. ముదిరిన చిక్కుడు ఉడకవు, సెల్యులోస్ గట్టిగా పీచువలె ఉంటుంది. అందువల్ల జీర్ణం కాదు.
భారత దేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ. భౌతిక వివరములు--ఇది చిక్కుడు జాతికి చెందినది. సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగును. కొన్ని అనుకూల పరిస్థితుల యందు ఇది మూడు మీటర్ల ఎత్తువరకు పెరుగును. గోరుచిక్కుడు సామాన్యముగా విత్తిన ఆరు ఏడు వారముల లోపున పూయనారంభించును. సాగు చేయు పద్ధతి---దీనిని అన్ని నేలలయందూ, అన్ని కాలములందూ సాగు చేయవచ్చు. దీనిని ఒంటిగా కానీ, అంతర పంటగా కానీ, మిశ్రమ పంటగా కానీ సాగు చేయవచ్చు. బాగుగ దున్ని సాగు చేయవలెను. దీనికి ఎరువు అంతగా అవసరములేదు, ఎందుకంటే ఇది సూక్ష్మ జీవుల సహాయముతో నేలలోని నత్రజని స్వీకరించును.
సామాన్యముగా పులుసు, బెల్లముపెట్టి వండెదరు. ఇంకా కొబ్బరి చేర్చి ఇగురు లేదా వేపుడు చేయుదురు. ఇది మంచి బలవర్థకమైన ఆహారము. --
చిక్కుడు జాతులలో ఒకటి. ఇది బలమైన ఆహారము. అధికంగా అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, చైనా, ఇండియాలు సోయాను ఉత్పత్తి చెస్తున్నాయి. అమెరికాలో లోవా, మిన్నెసొటా, ఇండియానా లలో, బ్రెజిల్లో మాంటాగొస్సా, పరగ, రియో గ్రాండెసుల్లలో సొయాను పండిస్తున్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు. సోయామొక్క--విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది. విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా, పొడవుగా వుండు కాయ (pod) లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో, చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకాన్ని బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును.సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో నూనె శతం 18-20% వరకు వుండును.సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్ (soya meal) లో ప్రొటిన్ శాతం 45-48%. ఉపయోగాలు 1. సొయా గింజలను ముఖ్యంగా నూనెను తీయుటకు వాడుచున్నారు. ఉత్పత్తి అయిన సొయాలో85-90%ను సోయానూనెను తీయుటకు వినియోగిస్తున్నారు. 2.5-10% వరకు సొయాను సొయా పిండి (flour), సొయా మీల్ చెయ్యుటకు వాడెదరు. 3.5-10% వరకు ఆహరపధార్దంలలో నేరుగా వాడెదరు. సొయా నుండి 'పిల్లల ఆహరపధార్దంలు, బిస్కత్తులు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారిలో వాడెదరు.అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చెయ్యుదురు. సొయాలోని ప్రొటీన్లు (మాంసక్రుత్తులు), మాంసంలోని ప్రోటిన్లవంటివే. అందుచే సొయాసీడ్స్తో 'సొయమీట్ మీల్' చెయ్యుదురు. భారతదేశంలో కూడా వెజిటెరియన్ బిర్యానిలో సొయామీట్ మీల్ ను వుపయోగిస్తారు. నూనె తీసిన సొయ మీల్్‌ను పశువుల, కోళ్ల మేతలో వాడెదరు. సొయ గింజలలోని పోషక విలువలు
పధార్ధం శాతం తేమ 9.5-14% ఫ్యాట్/నూనె 18-24 ప్రొటిను 39-47 పిండి పధార్ధం 3-20 పీచు పధార్ధం 4-8
పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. తమిళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా సాగుచేస్తున్నారు. ఇప్పుడిప్పడే ఉత్తర భారతదేశంలో ఇది ప్రాచుర్యం పొందుతోంది. రాష్ట్రంలో చిక్కుడుజాతి కూరగాయలు 12వేలకు పైగా హెక్టార్లలో పండిస్తూ ఏటా 70వేలకు పైగా టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. పందిరి చిక్కుడు కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పుదినుసుగా వాడతారు. ఫ్రెంచిచిక్కుడుతో పోల్చితే దీనిలో పోషక విలువలు అధికం. ప్రతి వంద గ్రా. చి క్కుడు 48 కేలరీల శక్తిని ఇస్తుంది. -- బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు.
అనపకాయ లేదా "అనుములు" అనేది చిక్కుడు జాతికి చెందిన ఒక కాయ. ఇది తీగ చిక్కుడు జాతికి చెందినది. (గోరు చిక్కుడు కాదు) దీని కాయలు పలచగా చిక్కుడు కాయల వలేనుండి. దీని మొక్క తీగ జాతికి చెందినది. దీనిని ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో వర్షాధార పంటగా - వేరుశనగలో అంతర పంటగా - పండిస్తారు. దీని గింజలను అనేక విదములుగా ఉపయోగిస్తారు. కూరలకు, గుగ్గిళ్ళు చేయడానికి ఎక్కువగా వుపయోగిస్తారు.
'వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు' అంటున్నారు పోషకాహార నిపుణులు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరువాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెండ్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.