కూర లేదా కర్రీ అనేది భారతీయ ఉపఖండంలోని వంటలకు సంబంధించిన అనేక వంటకాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన వంటకం. దీన్ని సాధారణంగా అన్నంతో గాని లేదా చపాతీ లతో గాని కలిపి తింటారు. మామూలుగా ఎండు మిరపకాయలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు లేదా మూలికలు వంటివి కూర తయారీలో ఉపయోగిస్తారు.[1] భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో తయారు చేసే కూర వంటకాలు మాత్రం, కూరగాయలు లేదా ఆకుకూరలతో తయారు చేస్తారు.[2]

త్వరిత వాస్తవాలు మూలము, ప్రదేశం లేదా రాష్ట్రం ...
కూర
Thumb
భారతదేశం నందలి వంకాయ టమాట చిక్కుడుకాయ కూరగాయలతో చేసిన వంటకము
మూలము
ప్రదేశం లేదా రాష్ట్రంభారత ఉపఖండం, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు సుగంధ ద్రవ్యాలు, మూలికలు, సాధారణంగా తాజా లేదా ఎండిన మిరియాలు / మిరపకాయలు
మూసివేయి

'కూర' అని పిలువబడే వంటకంలో కూరగాయలతో పాటుగా చేపలు, మాంసం, పౌల్ట్రీ లేదా షెల్‌ఫిష్ వంటి వాటిని కూడా కలిపి వండుకుంటారు. చాలామంది పూర్తిగా శాకాహారిగా ఉంటారు, అందువల్ల వీరు కేవలం కూరగాయలతో మాత్రమే కూరలు వండుకుంటూ ఉంటారు. కూరలు అనేవి 'వేపుడు' లేదా 'పొడిగా' లేదా 'తడి'గా గాని ఉండవచ్చు. వేపుడు కూరలు పూర్తి పొడిగాను, పొడి కూరలు తడి పొడి గాను, తడి కూరలు పూర్తి తడిగాను ఉంటాయి. తడికూరలలో ఒకే కూరగాయతో లేదా వివిధ రకముల కూరగాయల మిశ్రమంతో కూడా చేసుకుంటూ ఉంటారు. వేపుడు కూరలలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ మంది వాడరు. తడి కూరల్లో పెరుగు, క్రీమ్, కొబ్బరి పాలు, కొబ్బరి క్రీమ్, టొమాటో ప్యూరి, ఉల్లిపాయ రసం లేదా ఉడకబెట్టిన చింతపండు పులుసు వంటి పదార్థాలు ఎక్కువ మొత్తంలో వాడతారు.

భారత ఉపఖండం

ఆధునిక భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఆధునిక దేశాలతో పోల్చితే, భారత ఉపఖండం పాకశాస్త్ర విషయంలో, మొత్తం చారిత్రాత్మక ప్రదేశంగా పరిగణించటానికి ఉపయోగపడుతుంది.[3] దీనివల్ల ఉత్తర, దక్షిణ భారతీయ వంటకాల మధ్య ఉన్న భేదాలు విస్తృతంగా గుర్తించడానికి వెసులుబాటుగా ఉంటుంది, [3]

దక్షిణ భారతదేశం

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకే ప్రత్యేకం అని కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాల్లో తెలుగు వంటలు ఉంటాయి. కర్నాటక, తమిళనాడులలో ఉండే తెలుగు వారు కొద్దిపాటి ప్రాంతీయ ప్రభావాలతో కూడిన తెలుగు వంటలనే వండుకుని ఆస్వాదిస్తారు. ఈ వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి. వంట వండే విధానంలో చాలా తేడా కనిపించినా అది కేవలం తెలుగు వారు ఇతర ప్రాంతాలలో విస్తృత వ్యాప్తికి నిదర్శనం. ఆంధ్ర ప్రదేశ్ లో పండే ముఖ్యమయిన పంటలయిన వరి, మిరపలు ప్రస్ఫుటంగా ఈ వంటల్లో కనిపిస్తాయి. చాలా వరకూ సాంప్రదాయక వంటలు మాత్రం బియ్యం, ఇంకా మిరప అధికంగా వాడకంతోనే చేస్తారు. మసాలా దినుసులు కూడా అత్యధికంగా వాడబడతాయి. శాకాహారమయినా, మాంసాహారమయినా, లేక చేపలు (ఇతర సముద్ర జీవాలు) ఆధారిత ఆహారమయినా అన్నిట్లోనూ మసాలా దినుసులు ఉంటాయి. పప్పు లేనిదే ఆంధ్ర ఆహారం ఉండదు. అలానే టొమాటోలు, చింతపండు వాడకమూ అధికమే! తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని కొన్ని రకాల కూరగాయలతో ఊరగాయలు తెలుగు వారు చేసుకోవడం పరిపాటిగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో తెలుగు మాట్లాడే స్థానిక ప్రజలు తయారు చేసుకునే ఆహారం, భారతదేశం లోనే అత్యధిక కారం తినే ప్రజలుగా భావిస్తారు. ఎర్ర మిరప, ఆకుపచ్చ మిరపల తయారీదారులుగా ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. వీటితోనే కూరలు, చట్నీలు, సావరీలు తయారు చేసుకుంటారు. దీనివల్ల సుగంధ ద్రవ్యాల అధికంగా వాడకాన్ని సూచిస్తుంది. వీటి రుచిలో బాగా కారంగా ఉంటుంది. అదేవిధంగా కారంతో కూడిన ఊరగాయాలు తయారు చేస్తూ ఉంటారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

మరింత చదవడానికి

బయటి లింకులు

చిత్రమాలిక

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.