ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
" ఫతేపూర్ జిల్లా " (హిందీ:फ़तेहपुर ज़िला), (ఉర్దూ:فتح پور ضلع)ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఒకటి. జిల్లా వైశాల్యం 4,152 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2,308,384. ఫతేపూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. పవిత్రమైన గంగా, యమునా నదీ తీరంలో ఉన్న ఫతేపూర్ గురించిన ప్రస్తావన ప్రాణసాహిత్యంలో చోటుచేసుకుంది. బితౌరా, అసని స్నానఘట్టాలు పవుత్రమైనవిగా పురాణాలలో పేర్కొనబడింది. ఫతేపూర్ భృగుమహర్షి నివసించిన ప్రాంతం అని పురాణకథనాలు వివరిస్తున్నాయి. ఫతేపూర్ జిల్లా అలహాబాద్ డివిజన్లో భాగంగా ఉంది.
Fatehpur(Haswan) జిల్లా
फ़तेहपुर ज़िला فتح پور ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | Allahabad |
ముఖ్య పట్టణం | Fatehpur, Fatehpur |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Niranjan Jyoti |
• శాసనసభ నియోజకవర్గాలు | Vikram Singh |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,152 కి.మీ2 (1,603 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 26,75,384 |
• జనసాంద్రత | 640/కి.మీ2 (1,700/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 58.6% |
ప్రధాన రహదార్లు | NH 2 |
Website | అధికారిక జాలస్థలి |
ఫతేపూర్ జిల్లా అలహాబాదు (ప్రయాగ), కాంపూర్ అనే రెండు ప్రధాన జిల్లాల మద్య ఉంది. ఫతేపూర్ జిల్లా వాటితో రహదారి, రైలు మార్గంతో చక్కగా అనుసంధానించబడి ఉంది. ఇది అలహాబాదుకు 117 కి.మీ, కాంపూరుకు 76 కి.మీ. దూరంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో గంగానది దక్షిణ సరిహద్దులో యమునానది ఉన్నాయి.
వేద కాలంలో ఈజిల్లాప్రాంతం " అంతర్దేశ్ " అని పిలువబడింది. అంటే రెండు పెద్ద నదుల మద్య ఉన్న సారవతమైన ప్రదేశమని అర్ధం. జిల్లా ఉత్తరప్రాంతంలో అవధి సంస్కృతితో ప్రభావితమై ఉంది. దక్షిణప్రాంతంలో " బుండేల్ఖండ్ " ప్రభావం అధికంగా ఉంటుంది. ఫతేపూర్ జిల్లాప్రాంతం బౌద్ఫ్హ సాహిత్యంలో ప్రస్తావించబడిన " వాత్సా " మహాపరగణాలో భాగంగా ఉండేది.
Ramchandra Ghat make by head master Sri Ramsingh (jamrawan village) contributed from honest people of viiage
ఫతేపూర్ జిల్లా గురించి వేదకాంలం నుండి చరిత్రను కలిగి ఉంది. జనరల్ కరింఘం వ్రాతలలో జిల్లాలోని బితౌరా, అసని ప్రాంతాలగురించిన ప్రస్తావన ఉంది.వేదకాలంలో కూడా ఈ ప్రాంతాల ప్రస్తావన ఉంది. చైనీస్ యాత్రికుడు హూయంత్సాంగ్ ఈప్రాంతాన్ని సందర్శించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఫతేపూర్ పట్టణానికి నైరుతీదిశలో 25 కి.మీ. దూరంలో ఉన్న రెంహ్ గ్రామంలో ఆర్కియాలజీ ఆధారాలు లభించాయి. ఇవి క్రీ.పూ 800 సంవత్సరాలకు చెందినవని భావిస్తున్నారు. జిల్లాలో మౌర్యకాలం, కుషానుల కాలం, గుప్తులకాలంనాటి నాణ్యాలు, ఇటుకలు కనుగొనబడ్డాయి. గుప్తులకాలంనాటి పలు ఆలయాలు టెండులి, కొరారి, సర్హన్ బుజర్గ్ గ్రామాలలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అవి ఆర్కియాలజీ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి.రెండవ చంద్రగుప్తుని కాలంనాటి బంగారు నాణ్యాలు బిజౌలీ గ్రామంలో లభించాయి. అసనికోట నిర్మించడానికి ఉపయోగించిన ఇటుకరాళ్ళు గుప్తులకాలానికి చెందినవని విశ్వసిస్తున్నారు.
ఆయాహ్లో శిథిలావస్థలో ఉన్న అతిపురాతనమైన కోటను అర్కవంశ క్షత్రియుల చేత నిర్మించబడిందని భావిస్తున్నారు. అర్కవంశ క్షత్రియులు 11వ శతాబ్దం కంటే ముందు ఈప్రాంతాన్ని ఖాగాతో చేర్చి పాలించారు. ఆర్కాలు సూర్యారాధన, శివారాధన చేయడంలో ఆసక్తికలిగి ఉండేవారు. ఈప్రాంతంలో పలు పురాతన సూర్య, శివ విగ్రహాలు లభించాయి. మొఘల్ రోడ్డు ప్రక్కన ఉన్న పురాతన పట్టణం ఖజుహా గురుంచిన ప్రస్తావన హిందూ మతగ్రంధం అయిన " బ్రహ్మపురాణం "లో ఉంది. దీనికి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది.
సా.శ. 1561లో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ జౌన్పూర్ రాజ్యంమీద దండెత్తే సమయంలో ఈప్రాంతం మీదుగా ప్రయాణించాడు. సా.శ. 1659 జనవరి 5న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భయానకంగా పోరాడి తనసోదరుడైన " షాషుజా (మొఘల్ వమ్శీయుడు) ను ఈప్రాంతంలోనే చంపాడు. విజయానికి గుర్తుగా ఇక్కడ " బాద్షాహి బాఘ్ " అనే పెద్ద పూదోటను, 130 గదుల వసతిభవనాన్ని నిర్మించాడు. మొఘల్ పాలనా కాలంలో ఫాతేపూర్ మీద జౌన్పూర్, ఢిల్లీ, కన్నౌజ్ పాలకులు ఆధిపత్యం సాగించారు.
సా.శ. 1801లో ఈప్రాంతం ఈస్టిండియా కంపెనీ నియత్రణలోకి మారింది. ఫతేపూర్ జిల్లాకేంద్రంగా రూపొందించబడింది. జిల్లాలో భవ్నీ ఇమ్లీ అనే ప్రాంతంలో " గ్రేట్ ఇండియన్ మ్యూటినీ " సమయంలో ఆగ్లేయులను ఉరితీసారు. ఇది బిందికీలో ఉంది.1966లో దీనికి పరగణా అంతస్తు ఇవ్వబడింది. ప్రధానకార్యాలయం భితౌరాలో ఉంది. అది ప్రస్తుతం మండల కార్యాలయంగా ఉంది.
2006లో " పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ " ఫతేపూర్ జిల్లాను భారతదేశంలోని (మొత్తం 640 జిల్లాల్లాలు ) 250 వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించింది. [1] " బ్యాక్వర్డ్ రీజంస్ గ్రాంటు " అందుకుంటున్న 34 ఉత్తరప్రదేశ్ జిల్లాలలో ఫతేపూర్ ఒకటి.[1]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,632,684,[2] |
ఇది దాదాపు. | కువైట్దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 154 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 634 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.05%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 900-1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 68.78%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లా ఫతేపూర్, బింద్కి, ఖగా అనే మూడు 3 విభాగాలుగా విభజించబడింది. అదనంగా ఐరాయ, అమౌలీ, అసోథర్, బహుయా, భితౌరా, డియోమై, ధాటా, హస్వా,హథ్గాం, ఖజుహా, మల్వాన్, తెలియాని, విజయీపూర్.
కొరై ప్రముఖ పురాతత్వ ప్రాంతం వీక్షణాకేంద్రం నుండి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రెండు ఇటుకలతో నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. వీటిమీద అద్భుతంగా చెక్కబడిన కుడ్యశిల్పాలు ఉన్నాయి.
ఈ స్మారకచిహ్నం స్వాతంత్ర్యసమరయోధులు నివాళులకు చిహ్నంగా నిలిచి ఉంది. ఇది 1858 ఏప్రిల్ 28న బ్రిటిష్ వారిచేత ఇమాలీ చెట్టుకు ఉరితీయబడిన ఇద్దరు స్వాతంత్ర్యసమర యోధులకు చిహ్నంగా ఉంది. ఇమ్లీ చెట్టు ఇప్పటికీ సజీవంగా ఉంది. హత్యల తరువాత ఇమ్లీ చెట్టు పెరుగుదల ఆగిపోయిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ ప్రదేశం జిల్లాలోని బింద్కీ ఉపవిభాగంలో ఉన్న ఖజుహా పట్టణానికి సమీపంలో ఉంది.
ఈమండల కేంద్రం పవిత్ర గంగాతీరంలో ఉంది. ఇక్కడ భృగుమహర్షి దీర్ఘకాలం తపసు చేసిన కారణంగా ఈప్రాంతం భృగు తౌరా అని పిలువబడింది. మతపరంగా ఇది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది.
ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగిన అతి పురాతనమైన విశాలమైన పట్టణం. గాంధీజీ, ఇందిరా గాంధి, శ్యాం లాల్ గుప్తా ప్రసాద్, హేమమాలిని, చైనా యాత్రికుడు హూయంత్సాంగ్, రాజ్ బహదూర్, మాయావతి, ములాయంగ్ సింగ్ యాదవ్, రేజేష్ పైలట్, సుష్మా స్వరాజ్, జగదాంబికా పాల్ జిల్లాప్రాంతాన్ని సందర్శించారు.జిల్లాలో పైనా కోట, ఘాజీపూర్ కోట (ప్రస్తుతం ఇది పోలీస్ స్టేషన్‌గా మార్చబడింది), దర్గా, తుగ్లకి మసీదు, ముర్చౌరా యుద్ధభూమి మొదలైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. మేవాతి ముహల్లా, కాంచంపూర్, పురానాథానా, ప్రేమ్‌నగర్, సుభాస్ మార్కెట్, పురానీ బజార్, చౌక్, డేరా మొదలైన ప్రబల ఆకర్షణలు ఉన్నాయి.
జతేపూర్ జిల్లా ఉత్తర ప్రదేశ్, భారతదేశం లోని ఇతర ప్రాంతాలతో జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారితో చక్కగా అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి (ఎన్.హెచ్.-2) (గ్రాండ్ ట్రంక్ రోడ్డు) ఫతేపూర్ జిల్లాలో పయనిస్తూ ఉంది. జతేపూర్ కాంపూరుకు 78కి.మీ, అలహాబాదుకు 121 కి.మీ, రాష్ట్ర రాజధాని లక్నో నుండి 120 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నుండి కాంపూర్, అలహాబాదు, బండా (ఉత్తరప్రదేశ్), లక్నో నగరాలకు దినసరి బసులు నడుపబడుతున్నాయి. 1857లో జరిగిన " గ్రేట్ ఇండియన్ మ్యూటినీ " సమయంలో ఫతేపూర్‌లో జరిగిన అనేక సంఘటనలు చారిత్రకప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జిల్లా రైలుమార్గం ద్వారా దేశంలోని ప్రధాననగరాలతో అనుసంధానించబడి ఉంది. ఢిల్లీ, కొలకత్తా మార్గంలో ఫతేపూర్ రైల్వే స్టేషన్ ప్రధాన్యత కలిగి ఉంది. ఈ మార్గంలో హౌరా, ఢిల్లీ మద్య అతిపెద్ద ఫ్లాట్ ఫారం కలిగిన ఒకేఒక రైల్వే స్టేషన్ ఫతేపూర్ మాత్రమే. 2011 జూలై 10న మాల్వాన్ సమీపంలో రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 70 మంది మరణించడం, 300 మంది గాయపడడం సంబవించింది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.