Remove ads
From Wikipedia, the free encyclopedia
ప్రదీప్ రావత్ ఒక భారతీయ నటుడు. తెలుగు చిత్రాలలో ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. లగాన్ సినిమాలో దేవా అనే ఒక సర్దార్ పాత్ర పోషించాడు. ఈ సినిమాను చూసిన రాజమౌళి సై సినిమాలో విలన్ గా అవకాశం ఇచ్చాడు.[2]
ప్రదీప్ రావత్ | |
---|---|
జననం | ప్రదీప్ రావత్ 1952 [1] జబల్‌పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, బ్యాంకు అధికారి |
ఇతడు 1952లో న్యూఢిల్లీలో పుట్టాడు. ఇతడి నాన్నగారి పేరు మంగల్‌సింగ్ రావత్. రిటైర్డ్ మేజర్. ఇతడి పూర్తి పేరు ప్రదీప్ రామ్‌సింగ్ రావత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలోని మిలటరీ పాఠశాలలో ఇతడు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ జబల్‌పూర్ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో చేశాడు.[1]
జబల్పూరులోని యూకోబ్యాంకులో కొద్ది కాలం ఉద్యోగిగా పనిచేసిన ఆయన దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుండి దాదాపు రెండేళ్ళు ప్రసారమైన 'మహాభారత్' మెగా సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో నటించాడు. ఇదే ఇతడి మొదటి సీరియల్. ఇతడి నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సీరియల్‌లోకి ఇతడిని తీసుకోమని దర్శకుడు రవిచోప్రాకు ప్రముఖ హిందీనటీమణి స్మితాపాటిల్ సిఫార్సు చేయడం అతిముఖ్యమైన విశేషం. దేశంలోని కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ సీరియల్ చూశారు. బి.బి.సి ఛానల్ కూడా దీన్ని ప్రసారం చేసింది. అలా బి.బి.సిలో రావడం అదే మొదటిసారి.
ఈ సీరియల్ ఒకవైపు ప్రసారం అవుతున్న సమయంలోనే ఎన్నో స్టేజీ నాటకాల్లో నటించేవాడు. ముంబయి, కోల్‌కత, చెన్నై, ఢిల్లీ నగరాల్లోని పలు ఆడిటోరియమలలో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు పోషించాడు. ప్రముఖ హిందీ నటుడు రాజ్‌బబ్బర్ నాటక సంస్థ ద్వారా ఎన్నో నాటకాల్లో పాల్గొన్నాడు. ఇతడితోపాటు రాజ్‌బబ్బర్, అనుపమ్‌ఖేర్, ఆయన సతీమణి ఠాకూర్‌కిరణ్ , అనితాకవార్, అలోక్‌నాథ్ నటించేవారు. వారందరితో కలిసి అనే నాటకాల్లో స్టేజీ పంచుకున్నాడు.
బాలీవుడ్‌లో ఇతడికి ఎవ్వరూ పరిచయస్థులు లేరు. కానీ ఇతది పర్సనాలిటీ చూసి ఇతడి స్నేహితులు, శ్రేయోభిలాషులు మాత్రం, 'నువ్వు సినిమాల్లో చేరితే బాగా రాణిస్తావు అంటూ ప్రోత్సహించేవారు. మోడలింగ్ కూడా చేసేవాడు. ఆ సమయంలో బాలీవుడ్‌లో ఇతడికి ఎలాంటి గైడెన్స్‌గానీ, సపోర్ట్‌గానీ లేదు. స్వయంకృషి, పట్టుదలే ఇతడిని ఇంతవాణ్ణి చేసింది.
హిందీలో ఇతడి మొదటి చిత్రం బాఘి (BAAGHI). కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ 'బాఘి ' ద్వారా ఇతడికి గుర్తింపు వచ్చింది. ఇందులో సల్మాన్‌ఖాన్, నగ్మా హీరోహీరోయిన్లు. శక్తీకపూర్, కిరణ్‌కుమార్, ఆశాసచ్‌దేవ్, బీనాబెనర్జీ తదితరులు నటించారు. 1990లో ఈ చిత్రం సూపర్‌హిట్ కావడంతో ఇతడి దశ తిరిగి ఇతడి సినీనట జీవితం యూ టర్న్ తీసుకోకుండా పురోగమించింది. ఎన్నో చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. దర్శకులకు కాల్‌షీట్లు ఇవ్వలేని నిస్సహాయస్థితిలో పడిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతోమంది దర్శకుల పరిచయ భాగ్యం కలిగింది. ఇతడి సినీ జీవితంలో అదో కొత్తదశ.
పలువురు ప్రముఖ హిందీ దర్శకుల చిత్రాల్లో నటించాడు. అపరాధి, ఇన్‌సానియత్, దుష్మని, రాజ్‌కుమార్, కోయల, అమితాబ్ హీరోగా నటించిన 'దీవార్' , షరాబి, లగాన్, గజని చిత్రాలు ఇతడి హిందీ చిత్రజీవితంలో మైలురాళ్ళుగా నిలిచిపోతాయి. ముఖ్యంగా సల్మాన్‌ఖాన్ గజని చిత్రం ఇతడికి ఇంకా ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం లభించింది. కోయల చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్రకు ఇంకా మంచిపేరు వచ్చింది.
దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి లగాన్ చిత్రం చూసి ఇతడి నటన మెచ్చుకుంటూ తన మేనేజర్‌ను ముంబయిలోని అమీర్‌ఖాన్ ఆఫీసుకు పంపించారు. అక్కడ ఇతడి చిరునామా తెలుసుకుని ఆ మేనేజర్ వీరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాడు. ఇతడిని హైదరాబాద్ రమ్మని చెప్పారు. ఇతడు వెళ్లి ఆయన కలవడం, ఆయిన ఇచ్చిన ఆఫర్‌కు సై అనడం జరిగాయి. తెలుగులో ఇతడు నటించిన మొదటి చిత్రం సై. సూపర్‌హిట్ చిత్రం. ఇక అప్పటినుండి తెలుగులో మంచిపాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది. ఎందరో దర్శకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు. కానీ హిందీ చిత్రాల్లో అగ్రిమెంట్ల కారణంగా తెలుగులో ఎక్కువ కాల్షీట్లు ఇవ్వలేకపోయాడు.
రాజమౌళి మరో చిత్రం ఛత్రపతి లో కూడా ప్రతినాయకుడిగా ఇతడి నటన అద్భుతం అని ఎంతోమంది అభిమానులు ఇతడి పైన అభినందనల వర్షం కురిపించారు. సై చిత్రాన్ని హిందీలో ‘ఆర్–పార్’ పేరుతో 2004లో నిర్మించారు. దీనినే ‘ఛాలెంజ్’ గా మలయాళంలోకి డబ్బింగ్ చేశారు. ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో అదే పేరుతోనూ, మలయాళంలో ‘చంద్రమౌళి’గా హిందీలో హుకూమత్‌కి జంగ్ గా డబ్ చేశారు. కన్నడంలో మాత్రం ‘ఛత్రపతి’ పేరుతోనే రీమేక్ చేశారు.
తెలుగులో ఇతడు నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్ ఇతడి టాలీవుడ్ కెరీర్‌లో మరువలేని చిత్రాలు. ప్రేక్షకులు ఈ చిత్రాలన్నీ ఆదరించారు. ఉత్తమ విలన్‌గా 'సై' చిత్రానికి ఫిలిమ్‌ఫేర్ అవార్డు, ఉమ్మడి ప్రభుత్వ నంది అవార్డు సహా ఎన్నో వందల అవార్డులు అందుకున్నాడు. ఒక ఇంగ్లీషు చిత్రంలో కూడా నటించాను.
సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరములు |
---|---|---|---|
2023 | జనతాబార్ | త్రిపాఠి | |
2023 | ఏజెంట్ నరసింహ 117 | ||
2022 | దహనం | వెబ్ సిరీస్ | |
2019 | పండుగాడి ఫొటో స్టూడియో | ||
2019 | మిస్ మ్యాచ్ | ||
2018 | నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | పిసి | |
2017 | ఆకతాయి | ||
2017 | ఏంజెల్ | ||
2015 | సౌఖ్యం [3] | ||
2013 | 1 (సినిమా) | ||
2013 | వాల్ పోస్టర్ | ||
2013 | మహంకాళి | ||
2013 | సేవకుడు | బలరామ్ జాదు | |
2013 | నాయక్ | మినిస్టర్ రావత్ | |
2012 | జీనియస్ | ఎం. ఎల్. ఏ. నానాజీ | |
2012 | ఢమరుకం | ||
2012 | అధినాయకుడు | రామప్ప | |
2012 | పూలరంగడు | లాలాగౌడ్ | |
2012 | నిప్పు | రాజాగౌడ్ | |
2012 | ఆల్ ది బెస్ట్ | ||
2011 | దళపతి | ||
2011 | రాజన్న | ||
2011 | వీర | పెదరాయుడు | |
2011 | చట్టం | ||
2011 | మంగళ | ||
2010 | రగడ | పెద్దన్న | |
2010 | పంచాక్షరి | రణదీప్ / బిల్లా భాయ్ | |
2009 | కాస్కో | ||
2009 | ఓయ్! | రస్ బిహారీ | |
2009 | మిత్రుడు | ||
2009 | మేస్త్రీ | ||
2009 | మస్కా | షిండే | |
2008 | రక్ష | సనాతన్ బాబా | |
2008 | ఆదివిష్ణు | యాదగిరి | |
2008 | బలాదూర్ | ఉమాపతి | |
2008 | హోమం | పోసీస్ ఆఫీసర్ విశ్వనాధ్ | |
2008 | భలేదొంగలు | వీర్రాజు | |
2008 | నగరం | ||
2008 | వీధి రౌడీ | ||
2007 | మైసమ్మ ఐ.పి.ఎస్. | ఖాన్ భయ్యా | |
2007 | జగడం | మాణిక్యం | |
2007 | మహారధి | ||
2007 | యోగి (2007 సినిమా) | నర్సింగ్ పహిల్వాన్ | అతిధిపాత్ర |
2007 | దేశముదురు | తంబిదురై | |
2006 | స్టాలిన్ (సినిమా) | ఎం. ఎల్. ఏ | |
2006 | హనుమంతు | కృష్ణమూర్తి | |
2006 | మాయాజాలం | ||
2006 | లక్ష్మి (2006 సినిమా) | ||
2005 | ఛత్రపతి (సినిమా) | రాస్ బిహారీ | |
2005 | జగపతి | ఎం. ఎల్. ఏ. గౌడ్ | |
2005 | అందరివాడు | సత్తి బిహారీ | |
2005 | భద్ర | వీరయ్య | |
2004 | సై | భిక్షు యాదవ్ | ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు పురస్కారము |
సంవత్సరం | చిత్రం | సాత్ర | వివరములు | బచ్చన్ |
---|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.