తెలుగు నాటకరంగ ప్రముఖులు, రచయిత From Wikipedia, the free encyclopedia
పెద్ది రామారావు (మార్చి 17, 1973) తెలుగు నాటకరంగ ప్రముఖులు, [1] తెలుగు కథా రచయిత. ఆయన దూరదర్శన్‌లో చిరకాలంగా ప్రసారమయిన మెగా డెయిలీ సీరియల్ ఋతురాగాలు మాటల రచయితగా తెలుగు ప్రేక్షకలోకానికి సుపరిచితులు. తెలుగు నాటకాన్ని సుసంపన్నం చేయడానికి ఆయన తన "యవనిక" పత్రిక నడిపిన రోజుల నుంచి, ఎంతో కృషి చేస్తున్నారు. మిస్ మీనా, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి లాంటి అద్భుత నాటకాలతో 'నాటకాని' కి లక్షల్లో ఆడియన్స్ ని సృష్టించిన ఆ అద్భుతానికి కర్త, కర్మ, క్రియ ఆయన. దర్శకత్వం, కథావిస్తరణ అన్నీ ఆయన చేయగలిగినప్పటికీ, తన విద్యార్థులకు ప్రోత్సాహం అందించి పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు సరైన మార్గనిర్దేశనం చేస్తూ వారితో చేయించిన నిజమైన ఉపాధ్యాయుడు ఆయన.
పెద్ది రామారావు | |
---|---|
జననం | మార్చి 17, 1973 |
వృత్తి | రంగస్థల అధ్యాపకులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు నాటకరంగ ప్రముఖులు, కథా రచయిత |
జీవిత భాగస్వామి | శ్రీలక్ష్మి కనకాల |
పిల్లలు | ఇద్దరు అమ్మాయిలు (ప్రేరణ, రాగలీన) |
తల్లిదండ్రులు |
|
పెద్ది రామారావు 1973, మార్చి 17న గుంటూరు జిల్లా లోని ఉన్నవ గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పెద్ది సాంబశివరావు రిటైర్డు ఉపాధ్యాయుడు, తల్లి రామ రత్నమ్మ గృహిణి. 1991-94లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. చదివిన రామారావు, 1994-96లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఏ. పూర్తిచేశారు. 1998-2003లో అదే విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పి.హెచ్.డి. పూర్తిచేశారు.
2002, మార్చి 31న తెలుగు టెలివిజన్ నటి అయన శ్రీలక్ష్మి కనకాల తో పెద్ది రామారావు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (ప్రేరణ, రాగలీన).
నరసరావుపేటలో చదువుకునే రోజుల్లో రామారావు ఎస్.ఎఫ్.ఐ. అనే వామపక్ష విద్యార్థి సంస్థలో పనిచేశారు. ఆంధ్ర ప్రజానాట్య మండలి సంస్థలో చేరి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఒక దశలో ప్రజానాట్య మండలికి పూర్తి కాలపు కార్యకర్తగా 'సేవ' చేయాలని కూడా అనుకున్నారు. 1994 లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటక విభాగంలో ఎం.ఎ చేయడానికి వచ్చిన వీరు అదే విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసారు. కవిత్వం రాసారు. అనేక కథలను నాటకాలుగా మలచి ప్రదర్శించారు. ఎం.ఎ., పి.హెచ్.డి. కి మధ్య గల ఏడాది కాలం ఆయన "సుప్రభాతం" పత్రికలో జర్నలిస్టు గా పనిచేసారు. సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాసాలు రాసారు. ఆ కాలంలో భద్రాచలం అడవుల్లో నక్సలైట్ దళాన్ని కలసి వారి జీవన విధానంపై ఆసక్తికరమైన కథనం వ్రాసారు.
ఆయనకు దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలులో పనిచేసే అవకాశం లభించింది. అది ఆయన జీవితంలో పెద్ద మలుపు. ఈ అవకాశం ఫలితంగా ఆయనకు స్వయంగా ఆర్థిక శక్తి లభించడంతో దాని ఆసరాతో "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని ప్రారంభించారు.[2] నాటకరంగ వ్యాసాలను రాసి, వాటన్నిటిని "యవనిక" పేరుతో పుస్తక రూపంలో తీసుకువచ్చారు.[3]
ఆయన ఆధునిక నాటకరంగానికి మూల పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం ఏప్రిల్ 16 న తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహణలోనూ, నాటకరంగ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చెయ్యడంలోనూ క్రియాశీలక పాత్ర వహించారు. ప్రస్తుతం హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.