ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని గ్రామం From Wikipedia, the free encyclopedia
ఉన్నవ, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన యడ్లపాడు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1359 ఇళ్లతో, 4901 జనాభాతో 959 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2429, ఆడవారి సంఖ్య 2472. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 907 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 194. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590203.[1]
ఉన్నవ | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°10′43.464″N 80°16′32.052″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | యడ్లపాడు |
విస్తీర్ణం | 9.59 కి.మీ2 (3.70 చ. మై) |
జనాభా (2011) | 4,901 |
• జనసాంద్రత | 510/కి.మీ2 (1,300/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,429 |
• స్త్రీలు | 2,472 |
• లింగ నిష్పత్తి | 1,018 |
• నివాసాలు | 1,359 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 522233 |
2011 జనగణన కోడ్ | 590203 |
నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్డిఎ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్ణం (959 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు 30 నుండి చేరినట్లుగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]
పూర్వం ఈ గ్రామం ఏర్పడక ముందు దక్షణపు దిక్కున పుచ్చకాయలపాడు అనే గ్రామం ఉండేది. శాతవాహనులు పరిపాలన కాలంలో జన్యావుల పెద్దక్క గోపశ్రీ అనే ఆమె తన పశువుల మందల మేపుకొనుటకు నల్లకొండ శీను అనే కాపరిని వెంటపెట్టుకొని ఈ ప్రదేశానికి వచ్చింది. గ్రామం ప్రక్కన ఉన్న మెరక ప్రదేశంలో దొడ్డికాకర పంటను పండిస్తూ, అక్కడే పశువుల మందతో ఉంటుంది. కొన్నాళ్లకు ఆవుల మందలో పాలు శ్రేష్టంగా ఇచ్చే మూడు ఆవుల పాలు ఉదయానికి ఎవరో దొంగిలించినట్లుగా పాలు ఇచ్చేవి కావు. కాపరి పాలు తీయుటకు వెళ్లగా ఆ మూడు ఆవుల పాలు ఇవ్వక పోగా “వుంన్నా, వుంన్నా” అనే ధ్వని వినిపించేది. ఈ సంగతిని కాపరి కొన్ని రోజులు చూచి, తన యజమాని పెద్దక్కతో చెప్పగా, ఆమె పరీక్షించి ఇదేమో వింతగా ఉందని ఆలోచన చేస్తూ, ఆ రాత్రి తన ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని నిదురించింది.ఈరాత్రి శ్రీరాజగోపాలస్వామి పెద్దక్కకు కలలో కనపడి మేము స్యయం వ్యక్తంగా ముగ్గురు రాజగోపాల మూర్తులం.రుక్మిణి, సత్యభామ సమేతంగా ఆ ప్రదేశంలోఅవతరించాం. మమ్ములను వెలుపలికి తీయించి మూడు బండ్లపై ఉంచి, అరక కట్టే మువ్వ కోడెదూడలను ఆ బండ్లకు కట్టి విడిచిపెడితే, ఆబండ్లు ఎక్కడికి వెళ్లి ఆగితే అక్కడ ఆలయం కట్టించి ప్రతిష్ఠ చేయవలెనని చెప్పుట జరిగింది. ఆ మరుసటి రోజు ఆవుల మంద నివాసం ఉన్న స్థలం వద్దనున్న భావిలో వెతకగా మూడు రాతి తొట్లలో మూడు రాజగోపాలస్వామి విగ్రహాలు రుక్మిణి, సత్యభామ సమేతంగా బయల్పడినవి. వాటిని వెలుపలికి తీసి కలలో పెద్దక్కకు తన ఇష్ట దైవం చెప్పిన ప్రకారం చేయగా, మూడు బండ్లలో ఈ ప్రదేశంనకు నాలుగు ఆమడల దూరంలో బెల్లంకొండ శీమలో ఉన్న క్రోసూరు వద్ద ఒక బండి, మూడు ఆమడల దూరంలో ఉన్న పణిదెం వద్ద ఒక బండి ఆగినవి. ఒక బండి ఎక్కడకు వెళ్లకుండా అక్కడే ప్రదక్షిణ చేసి ఆప్రదేశంనందే ఆగింది.ఈ మూడు ప్రదేశాలనందు పెద్దక్క ఆలయాలు కట్టించి స్వామి వారలను ప్రతిష్ఠ చేసింది. శ్రీరాజగోపాలస్వామి ఈ ప్రదేశంలో అవతరించి “వుంన్నా, వుంన్నా” [3] అని పలికినందున అక్కడ గ్రామం నిర్మించి “వుంన్నవ” అనే పేరుతో గ్రామం నిర్మించబడింది. తరువాత అది “వున్నవ”గా ప్రస్తుత కాలంలో "ఉన్నవ"గా పిలువబడుతుంది.
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ప్రత్తిపాటి బసవమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
కారుచోల 4 కి.మీ, వంకాయలపాడు 4 కి.మీ, యడ్లపాడు 5 కి.మీ, ప్రత్తిపాడు 5 కి.మీ, జగ్గాపురం 6 కి.మీ
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి యడ్లపాడులో ఉంది. సమీప జూనియర్ కళాశాల యడ్లపాడులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చిలకలూరిపేటలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల బోయపాలెంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చిలకలూరిపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
ఉన్నవలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
ఉన్నవలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
ఉన్నవలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
ఉన్నవలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ఈ గ్రామానికి చెందిన దంటు రత్నకుమారి, ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుచున్నది. ఇటీవల ప్రభుత్వం ఎస్.ఐ. ఉద్యోగాలకు నిర్వహించిన అర్హత పోటీలలో ఆమె, రాష్ట్రంలోనే నాల్గవస్థానం సాధించింది.
గ్రామం నుండి ఎందరో విద్యావంతులు, వ్యాపార వేత్తలు, ఇతర ప్రముఖులు కలరు.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 4248, పురుషుల సంఖ్య 2118, మహిళలు 2130, నివాసగృహాలు 1091,విస్తీర్ణం 959 హెక్టారులు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.