పదర మండలం

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

పదర మండలం

పదర మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 7 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్‌కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 7  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం పదర.

త్వరిత వాస్తవాలు రాష్ట్రం, తెలంగాణ ...
పదర
  మండలం  
Thumb
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, పదర స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, పదర స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం పదర
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 627 km² (242.1 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 17,903
 - పురుషులు 9,138
 - స్త్రీలు 8,765.
పిన్‌కోడ్ {{{pincode}}}
మూసివేయి

గణాంకాలు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 627 చ.కి.మీ. కాగా, జనాభా 17,903. జనాభాలో పురుషులు 9,138 కాగా, స్త్రీల సంఖ్య 8,765. మండలంలో 4,620 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం

లోగడ పదర  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను పరిధిలోని అమ్రాబాద్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా పదర గ్రామాన్ని (1+06) 7 గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. పదర
  2. వంకేశ్వరం
  3. ఉడిమిళ్ళ
  4. ఇప్పలపల్లి
  5. మారెడుగు
  6. గానుగుపెంట
  7. మద్దిమడుగు

మాతా శిశు మరణాల నివారణ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక

ఈ మండలంలో ఎక్కువుగా చెంచులు నివశిస్తారు. మండల పరిధిలోని గర్భణీలందరూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోనే ప్రసవించేలాగున, వార్కి మెరుగైన వెద్య సేవలు అందించి, మాతా శిశు మరణాల నివారణలో భాగంగా మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపికచేయబడింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.