నైరుతి గారో హిల్స్ జిల్లా

From Wikipedia, the free encyclopedia

నైరుతి గారో హిల్స్ జిల్లా

నైరుతి గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 2013 ఆగస్టు 7న అంపతి ఉపవిభాగం నైరుతీ గారీహిల్స్‌గా పూర్తిస్థాయి జిల్లాగా మార్చబడింది.[1] ఈ జిల్లాను మేఘాలయ ముఖ్యమంత్రి " డాక్టర్.ముకుల్ సగ్మా"ను ప్రారంభించారు. దీని ముఖ్య పట్టణం అంపతి.

Thumb
Inauguration of South West Garo Hills District by Chief Minister of Meghalaya, Dr. Mukul Sangma on 7th of August, 2012
త్వరిత వాస్తవాలు నైరుతి గారో హిల్స్ జిల్లా, దేశం ...
నైరుతి గారో హిల్స్ జిల్లా
Thumb
మేఘాలయ పటంలో నైరుతి గారో హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంఅంపతి
Government
  శాసనసభ నియోజకవర్గాలు3
జనాభా
 (2011)
  మొత్తం1,72,495
జనాభా వివరాలు
  అక్షరాస్యత56.7%
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి

చరిత్ర

పశ్చిమ గారో హిల్స్ జిల్లా నుండి కొంత భాగం విడదీసి నైరుతీ గారీహిల్స్ జిల్లా రూపొందించబడింది. జిల్లాలోని గ్రామాలన్ని రెండు బెటాసింగ్ [2], జిక్జాక్ [3] కమ్యూనిటీ, రూరల్ డెవలప్మెంట్ బ్లాక్స్ గా ఏర్పాటు చెయ్యబడ్డాయి. సెల్సెల్లాలో ముగ్దంగ్ర గ్రామసేవక్ సర్కిల్ (33 గ్రామాలు, [4] కమ్యూనిటీ రూరల్ డెవలెప్మెంట్ బ్లాక్, ఒక్కపర సొంగమ గ్రామసేవక్ సర్కిల్ (24 గ్రామాలు ), గంబెగ్రె వద్ద ఉన్న చెంగ్‌కురెగ్రె గ్రామసేవక్ సర్కిల్ [5] కమ్యూనిటీ & రూరల్ డెవలెప్‌మెంట్ బ్లాక్, డాలులో ఉన్న జరంగ్‌కొన గ్రామసేవక్ సర్కిల్ (13 గ్రామాలు, [6] కమ్యూనిటీ రూరల్ డెవలంప్మెంట్ బ్లాక్, రొంగ్రం వద్ద అంగల్గ్రె విలేజ్ అఫ్ రొంఖొంగ్రె గ్రామసేవక్ సర్కిల్, [7] కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంట్ బ్లాక్ ఏర్పాటు చెయ్యబడ్డాయి.

గుర్తింపు పొందిన గ్రామసేవక సంఘం

గ్రామసేవిక సంఘం గుర్తింపు పొందిన తరువాత గ్రామాలన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి.

గణాంకాలు

నైరుతీ గారో హిల్స్ జనసంఖ్య 1,72,495. 2011 గణాంకాలను అనుసరించి వీరిలో పురుషుల సంఖ్య 87,135 స్త్రీల సంఖ్య 85,360. జిల్లాలో గురింపు పొందిన బెట్సాంగ్, జిక్జాక్ కమ్యూనిటీ, రూరల్డెప్మెంట్ బ్లాకులు గ్రామసేవిక సంఘాలు ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా అక్షరాస్యత శాతం 56.7%.[8]

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.