అంపతి
మేఘాలయ రాష్ట్రం, నైరుతి గారో హిల్స్ జిల్లా ముఖ్య నగరం. From Wikipedia, the free encyclopedia
అంపతి, ఈశాన్య భారత దేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని నైరుతి గారో హిల్స్ జిల్లా ముఖ్య నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] 2012, ఆగస్టు 7న పశ్చిమ గారో హిల్స్ జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పడింది. ఈ నగరం, పశ్చిమ గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణమైన తుర నుండి 52 కి.మీ.ల దూరంలో ఉంది.
జనాభా
ఈ నగరంలోని మొత్తం 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడి కొండ ప్రాంతంలో ఎక్కువగా గారో ప్రజలు, హజాంగు, కోచ్ మొదలైన తెగలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. గారో తరువాత రెండవ అతిపెద్ద జాతి హజాంగు.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ 70మంది జనాభా ఉన్నారు., అందులో 36 మంది పురుషులు, 34 మంది మహిళలు ఉన్నారు. ఒక్కడ 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 20మంది (28.57%) ఉన్నారు. అంపతి అక్షరాస్యత 74.00% కాగా, రాష్ట్ర అక్షరాస్యత 74.43% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 76.00% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 72.00% గా ఉంది.[2]
రవాణా
అంపతి నగరం నుండి అస్సాం రాష్ట్రంలోని దక్షిణ సల్మారా జిల్లా ముఖ్యమైన వాణిజ్య కేంద్రమైన మంకాచర్ నగరంతో సహా ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది.
పర్యాటక ప్రాంతాలు
- కోడాల్డోవా
- చెంగా - బెంగ & ది వాటర్ ట్యాంక్
- మీర్ జున్లా సమాధి
- షా కమల్ దుర్గా - దర్గా షరీఫ్
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.