నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ప్రభుత్వ యునాని హాస్పిటల్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్. జనరల్ మెడిసిన్, యునానీ మెడిసిన్ ఈ హాస్పిటల్ ప్రత్యేకత. నిజాం కాలంలో స్థాపించబడిన ఈ హాస్పిటిల్ చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఉంది.[1] ఈ ప్రాంగణంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల కూడా ఉంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ | |
---|---|
తెలంగాణ ప్రభుత్వం | |
భౌగోళికం | |
స్థానం | చార్మినార్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం, 500002 |
నిర్దేశాంకాలు | 17.3605319°N 78.4750474°E |
Services | |
పడకలు | 180 |
చరిత్ర | |
ప్రారంభమైనది | 1938 |
చరిత్ర
హైదరాబాదు రాజ్య చివరి (7వ) నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1926లో ఈ నిజామియా జనరల్ హాస్పిటల్ ను నిర్మించాడు.[2]
హాస్పిటల్
ఈ హాస్పిటల్ లో గైనకాలజీ, శస్త్ర చికిత్స, డెంటిస్ట్రీ, నేత్ర వైద్యం, పాథాలజీ మొదలైన విభాగాలు ఉన్నాయి. పక్షవాతం, ఫంక్షనల్ న్యూరోలాజికల్ డిజార్డర్స్, వైరల్ హెపటైటిస్ మూత్రపిండ కాలిక్యులి, నెఫ్రిటిస్, పైలోనెఫ్రిటిస్, మధుమేహం, డయాబెటిక్ అల్సర్స్, సైనసైటిస్, ఉబ్బసం, స్థూలకాయం, మొలలు, ఫిస్టులా-ఇన్-అనో, క్రానిక్ నాన్-స్పెసిఫిక్ అల్సర్స్, లైంగిక సమస్యలు, వ్యాధులు, వంశ రుగ్మతలకు చెందినవాటిలో ఈ హాస్పిటల్ యునానీ ఔషధ సేవలను అందిస్తుంది.[3]
వివరాలు
- ఇందులో మొత్తం 180 పడకలు ఉన్నాయి.
- హౌస్ సర్జన్‌షిప్ పూర్తి చేయడానికి 50 హాస్పిటల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.
- 63మంది ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉన్నారు. 104మంది మినిస్టీరియల్, పారా మెడికల్, 4వ తరగతి సిబ్బంది ఉన్నారు.
- రోజుకు సగటు 600-700మంది ఔట్ పేషెంట్స్, 120-130మంది ఇన్ పేషెంట్ ఉంటుంది.
ఇతర వివరాలు
కరోనా వ్యాధి వచ్చిన సమయంలో ఈ వ్యాధి సోకిన వారిని ఈ హాస్పిటల్ చేర్చుకొని చికిత్స అందజేశారు.[4][5]
ఇవికూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.