Remove ads
From Wikipedia, the free encyclopedia
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న యునానీ వైద్య కళాశాల.[1][2] నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న ఈ కళాశాల కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.
రకం | యునానీ వైద్య కళాశాల |
---|---|
స్థాపితం | 1810 |
చిరునామ | హైదరాబాదు, అలీజా కోట్ల, మొఘల్‌పురా, హైదరాబాదు, హైదరాబాదు, తెలంగాణ, 500002, భారతదేశం 17.3605319°N 78.4750474°E |
కాంపస్ | చార్మినార్ సమీపంలో |
సాజిదా బేగం మసీదు అనే ఆఫ్ఘనిస్తాన్ పండితుడు 1810లలో హైదరాబాదులోని చార్మినార్ సమీపంలో ఈ కళాశాలను ప్రారంభించాడు.
ఈ కళాశాలలో యుజి విద్యలో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బి.యు.ఎం.ఎస్.) కోర్సు,[3][4] కళాశాల పిజి విద్యలో (ఎండి) కోర్సును కూడా అందిస్తోంది.[5]
బి.యు.ఎం.ఎస్. కోర్సులో నీట్ - యూజీ ప్రాతిపదికగా ప్రవేశం పొందవచ్చు. ఉర్దూ/అరబిక్/పర్షియన్ మీడియంలో పదవ తరగతి చదివుండాలి, ఇంటర్మీడియెట్ (బైపీసీ) చేసివుండాలి. లేదా ఏడాది వ్యవధి ఉండే ప్రీ-టీఐబీ పరీక్షలో ఉత్తీర్ణతీర్ణులై ఉండాలి. పురాతన వైద్య విధానాల్లో ఒకటైన యునానీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అనేక కంపెనీలు యునానీ మందులపై పరిశోధనలు చేస్తుండడంవల్ల ఎన్నో అవకాశాలు వస్తాయి. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, యునానీ కాలేజీల్లో అధ్యాపకులుగా కూడా పనిచేయొచ్చు.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.