ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు. అత్యధికంగా శస్త్రచికిత్సకి దారితీసే రోగాలలో సైనసైటిస్ ఒకటిగా ఒక అధ్యయనంలో వెల్లడైంది.
సైనసైటిస్ | |
---|---|
ప్రత్యేకత | Otolaryngology |
నేపధ్యము
ప్రతి మనిషి తన జీవితకాలంలో సైనసైటిస్ బారిన పడనివారు ఉండరు.అలా కాకపోయినా కనీసం 90శాతం పైన దాని బారిన పడతారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వైరస్, బాక్టీరియా, ముఖ్యంగా స్టైప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నయం చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నివారించవచ్చు. సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషన్ తప్పదని, ఆ తర్వాత కూడా ఇది మళ్లీ మళ్లీ వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుంటుందని దీని బారిన పడిన వారు అంటుంటారు.
సైనసైటిస్ వర్గీకరణ
అక్యూట్
చాలా సైనస్ ఇన్ఫెక్షన్లు జలుబు వంటి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లతో ప్రారంభమవుతాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా 5 నుండి 7 రోజుల్లో తగ్గుతాయి. ఈ దశలో, నాసికా నిర్మాణాల వాపు కారణంగా స్తబ్దత ప్రారంభమవుతుంది, ఈ ద్రవాలలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బాక్టీరియా సైనస్‌ల చర్మ పొరను ప్రభావితం చేసి సైనసైటిస్‌కు దారి తీస్తుంది.[1] కాబట్టి ఐదు రోజుల వరకు, లక్షణాలు జలుబుకి చెందినవి, ఆరు నుండి పదిహేను రోజులలో ఉండే లక్షణాలు అక్యూట్ సైనసైటిస్‌కు చెందినవి.[1]
సబ్ అక్యూట్
ఒక వ్యక్తి అక్యూట్ దశలో అంటే లక్షణాలు కనిపించిన 15 రోజులలోపు చికిత్స పొందకపోతే లేదా పాక్షికంగా చికిత్స పొందినా, అప్పుడు లక్షణాల తీవ్రత తగ్గి, వ్యాధిని సబాక్యూట్ సైనసైటిస్ అని పిలిచే తదుపరి దశకు పోతుంది.[1]
ఈ దశ దాదాపు ఒక నెల పాటు కొనసాగుతుంది, అంటే, ఇన్ఫెక్షన్ సోకిన 15వ రోజు నుంచి 45వ రోజు వరకు ఉంటుంది.[1]
క్రానిక్
30 రోజుల సబాక్యూట్ సైనసైటిస్ తర్వాత, అంటే, ఇన్ఫెక్షన్ వచ్చిన 45 రోజుల తర్వాత, ఇది క్రానిక్ సైనసైటిస్‌గా మారుతుంది. క్రానిక్ సైనసైటిస్ లో లక్షణాల యొక్క తీవ్రత, సంఖ్య తగ్గుతుంది. ఇది రోగిని అస్సలు ఇబ్బంది పెట్టదు.[1]
ఇక్కడ బ్యాక్టీరియా, రోగనిరోధక శక్తి మధ్య సమతౌల్యం చేరుకుంటుంది. లక్షణాలు మాత్రమే తగ్గుతాయి, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి మధ్య రాజీ సాధించబడుతుంది, కానీ ఇన్ఫెక్షన్ అంతర్గతంగా తగ్గదు.[1]
అక్యూట్ ఆన్ క్రానిక్
క్రానిక్ సైనసైటిస్ రోగి చల్లటి వాతావరణంలోకి వెళ్ళినప్పుడల్లా, నాసికా శ్లేష్మం కొద్దిగా ఉబ్బుతుంది. ఇప్పటికే పాక్షికంగా మూసుకుపోయిన ఓపెనింగ్ లేదా డ్రైనేజీ మార్గాలు ఎక్కువగా మూసుకుపోతాయి లేదా పూర్తిగా మూసివేయబడతాయి. మొత్తం అడ్డంకి ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది,, అక్యూట్ సైనసైటిస్ మాదిరిగానే లక్షణాలు పెరుగుతాయి. ఈ దశను "అక్యూట్ ఆన్ క్రానిక్" (acute on chronic) సైనసిటిస్ అంటారు. అక్యూట్ ఆన్ క్రానిక్ సైనసిటిస్‌లో లక్షణాల సంఖ్య, తీవ్రత రెండూ కూడా పెరుగుతాయి. రోగి కొత్త లక్షణాలు వచ్చే అవకాశం ఉంది.[1]
క్రానిక్ రోగి చలిలో లేదా దుమ్ముతో నిండిన వాతావరణంలోకి వెళ్లినప్పుడు లేదా వారికి మరొక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ దశకు రోగం వస్తుంది.[1]
సైనస్‌లలో రకాలు
- ఫ్రంటల్
- పారానాసల్
- ఎత్మాయిడల్
- మాగ్జిలరీ
- స్ఫినాయిడల్, ఇవి కుడి, ఎడమగా రెండు జతలుంటాయి.
ప్రధాన కారణాలు
చాలా సైనస్ ఇన్ఫెక్షన్‌లు సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా ప్రారంభమవుతాయి, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్లు ముక్కు, ముక్కులోని నిర్మాణాలను ప్రభావితం చేస్తాయి. ఇది ముక్కు యొక్క నిర్మాణాలలో వాపుకు కారణమవుతుంది. సాధారణంగా, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ 5 నుండి 7 రోజులలో తగ్గిపోతుంది. రోగికి క్రింది మూడు సమస్యలలో ఏవైనా ఉంటే, ఏదైనా సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ద్రవాలు నిలిపివేయగలవు, ఇది సైనసిటిస్కు దారితీస్తుంది.[2]
- అలెర్జీ (allergy)
- సైనస్ డ్రైనేజ్ మార్గంలో అసాధారణతలు (anomalies in sinus drainage pathway)
- పుట్టుకతో బాక్టీరియాపై రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం
వ్యాధి లక్షణాలు
వ్యాధి నిర్ధారణ[4]
సైనసిటిస్ ఇన్ఫెక్షన్‌ని నిర్ధారించడానికి ENT వైద్యుడు క్రింది పద్ధతులను ఉపయోగిస్తాడు
- రోగనిర్ధారణ నాసికా ఎండోస్కోపీ[4]
- సైనస్ యొక్క CT స్కాన్
ఇతర దుష్పలితాలు[5] (complications)
సైనసైటిస్ యొక్క సంక్లిష్టతలు చాలా అరుదు. సరైన జాగ్రత్తలు, మందులు సమయానికి తీసుకుంటే అవి సంభవించవు.[5]
చికిత్స చేయని క్రానిక్ (దీర్ఘకాలిక) సైనసిటిస్‌లో చాలా సమస్యలు (complications) వచ్చినప్పటికీ, అక్యూట్ సైనసిటిస్‌లో సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అక్యూట్ సైనసిటిస్‌లోని సమస్యలు "అక్యూట్ ఆన్ క్రానిక్" సైనసిటిస్‌లో కూడా సంభవించవచ్చు.[5]
అక్యూట్ సైనసిటిస్ & అక్యూట్ ఆన్ క్రానిక్ సైనసిటిస్లో సమస్యలు[5]
కంటి సమస్యలు - ఆర్బిటల్ సెల్యులైటిస్ & ఆర్బిటల్ అబ్సెస్[5]
- కంటిలో నొప్పి
- కంటిలో వాపు
- దృష్టి కోల్పోవడం
- కంటి కదలికలో పరిమితి
- ఆప్టిక్ నరాల నష్టం
మెదడు సమస్యలు - మెనింజైటిస్ & ఏన్కెఫలైటిస్ (Encephalitis) లేదా మెదడు వాపు[5]
- వాంతులు
- రక్తపోటు పెరుగుదల
- గుండె కొట్టుకునే వేగం తగ్గుదల
- తీవ్ర జ్వరం
- మూర్ఛలు
- కోమా
- మరణం
క్రానిక్ సైనసిటిస్లో సమస్యలు[5]
లారింగైటిస్
- బొంగురుపోవడం
- స్వరంలో మార్పు
- గొంతులో నొప్పి
- మాట్లాడేటప్పుడు నొప్పి
- వినిపించని స్వరం
- పొడి దగ్గు
- జ్వరం
బ్రోన్కైటిస్ (Bronchitis) & న్యుమోనియా (Pneumonia)[5]
- తీవ్రమైన పొడి దగ్గు
- ఊపిరి ఆడకపోవడం
- ఆస్త్మాటిక్ దాడులు
- బిగ్గరగా శ్వాస
- ఛాతి నొప్పి
ఒటైటిస్ మీడియా (మధ్య చెవి ఇన్ఫెక్షన్)[5]
- చెవి బ్లాక్ సెన్సేషన్
- చెవి నొప్పి
- కొద్దిగా చెవుడు
- చెవి నుంచి ద్రవాలు కారడం
సైనసైటిస్‌ను ఎలా గుర్తించవచ్చును?
ఎవరైనా పది రోజుల కంటే ఎక్కువగా ఈ కింది వాటిలో దేనితోనైనా బాధపడుతున్నట్లయితే దానిని సైనుసైటిసా అనుమానించి వెంటనే వైద్యుడిని సంప్రదించవలెను.
- ముఖభాగంలో నొప్పి
- తలనొప్పి
- ముక్కుదిబ్బడ
- చిక్కటి పసుపు, ఆకుపచ్చ స్రావాలు
- జ్వరం (99-100 డిగ్రీలు)
- నోటి దుర్వాసన
- పంటినొప్పి
నివారణ
- నోటిని తరచు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం.
- అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండి, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకొని, ఇంటి చుట్టూ నీరూ, బురదా లేకుండా ఉండాలి.
- ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించ వద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీయవచ్చు.
- ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉండటం, చల్లని గాలితో తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం, వేడి ఆవిరి పట్టడం వల్ల కొంత వరకు సైనసైటిస్‌ను నివారించవచ్చు.
హోమియో చికిత్స
హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా నయం చేయవచ్చు.హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కాలిబైక్, కాలిసల్ఫ్, హెపార్ సల్ఫ్, మెర్క్ సాల్, సాంగ్‌న్యూరియా, లెమినా మైనర్, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి.
- MRI image showing sinusitis. Edema and mucosal thickening appears in both maxillary sinuses.
- A computed tomograph showing infection of the ethmoid sinus
- Maxillary sinusitis caused by a dental infection associated with periorbital cellulitis
మందులు
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.