From Wikipedia, the free encyclopedia
బాక్టీరియా (ఆంగ్లం Bacteria) ఏకకణ సూక్ష్మజీవులు. ఇవి కొన్ని మైక్రోమీటర్ల పొడవు కలిగి, అసాధారణమయిన నిర్మాణాత్మక వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. బాక్టీరియా సర్వాంతర్యాములు, ఎలాంటి వాతావరణంలోనైనా మనం వీటిని కనుగొనవచ్చు.[1] సాధారణంగా ఒక గ్రాము మట్టిలో 40 మిలియన్, ఒక మిల్లీ లీటరు నీటిలో ఒక మిలియన్ బాక్టీరియా కణాలుంటాయి. లెక్క కడితే ప్రపంచంలో మొత్తం 5 నొనిలియన్ (5×1030) బాక్టీరియా కణాలుంటాయి.[2] సగానికి పైగా బాక్టీరియా ఇంకా కారక్టరైజ్ చేయబడలేదు, చాలా కొన్ని జాతులను మాత్రం ప్రస్తుతానికి ప్రయోగశాలలో వర్ధనం ద్వారా పెంచవచ్చు.[3] బాక్టీరియాల అధ్యయనాన్ని 'బాక్టీరియాలజీ' అంటారు. విట్టాకర్ ఐదు రాజ్యాల వర్గీకరణలో వీటిని మొనీరా రాజ్యంలో చేర్చడం జరిగింది. లీవెన్ హాక్ సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మొదటిసారిగా బాక్టీరియాను కనుక్కొన్నాడు.
బాక్టీరియా Temporal range: Archean or earlier - Recent | |
---|---|
E. కోలై బాక్టీరియా | |
Scientific classification | |
Domain: | బాక్టీరియా |
Phyla | |
ఏక్టినోబాక్టీరియా |
మానవుని శరీరంపైన, లోపల కలిపితే మొత్తం మానవ కణాల సంఖ్యకన్నా బాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువ. చాలా శాతం బాక్టీరియాలు చర్మంపైన, జీర్ణనాళంలోనూ నివసిస్తాయి.[4] ఇందులో అత్యధిక శాతం బాక్టీరియా మానవునికి ఎలాంటి హని కలగజేయవు, కొన్ని మానవులలో ఇమ్మూనిటికి రక్షణ కల్పిస్తాయి, ఇంకొన్ని హానికారక బాక్టీరియాలు. హానికారక బాక్టీరియాల వల్ల కలిగే అంటువ్యాధులలో కలరా, సిఫిలిస్, ఆంథ్రాక్స్, కుష్టు (లెప్రసీ), క్షయ వ్యాధులు ప్రాణాంతకమైనవి.
బాక్టీరియా అన్ని రకాల ఆవాసాలలో వ్యాపించి ఉన్నాయి. ఇవి మృత్తిక, నీరు, వాతావరణం, జీవుల దేహాలలో లేదా దేహాలపైన విస్తరించి ఉన్నాయి. వివిధరకాల ఆహారాలు, వాటి ఉత్పాదితాలపైన పెరుగుతాయి. అతిశీతల, అత్యోష్ణ, జలాభావ పరిస్థితులను కూడా తట్టుకొని బాక్టీరియా జీవిస్తాయి. కొన్ని బాక్టీరియా మొక్కల, జంతువుల దేహాలలో పరాన్నజీవులుగా లేదా సహజీవులుగా జీవిస్తున్నాయి.
ఆధునిక బాక్టీరియా యొక్క పూర్వీకులు సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం అవతరించిన మొట్టమొదటి ఏకకణ జీవులు. తర్వాతి 3 బిలియన్ సంవత్సరాల వరకు ఇవి అతి సూక్ష్మమైన ఏక కణ జీవులుగానే జీవనం సాగించాయి.[5][6] నిర్దిష్టమైన కణనిర్మాణం లేనందువల్ల స్ట్రోమాటోలైట్‌ల శిలాజాలను అధ్యయనం చేసి బాక్టీరియా పరిణామక్రమాన్ని (ఎవలూషన్‌ను) నిర్దారించడం వీలు పడదు. కాని, జీన్ సీక్వెంస్‌లను బట్టి వాటిని ఫైలోజెనిగా గుర్తించారు. వీటివల్ల బాక్టీరియా అర్కియల్/యూకారియోటిక్ లినియేజ్ నుండి విడిపోయినట్టు నిర్దారించారు.[7] బాక్టీరియాకు ఆర్కియాకు అత్యాధునిక కామన్ పూర్వీకులుగా థెర్మోఫైల్ (దాదాపు 2.5-3.2 బిలియన్ సంవత్సరాలు జీవించాయి)ను చెప్పుకోవచ్చు.[8][9]
ఆర్కియా, యూకారియోట్ల మధ్య జరిగిన విపరిణామంతో (డైవర్జెన్స్) ముడిపడి ఉన్నట్టు ఆధారాలున్నాయి.[10][11]
ఘ్ఘృహఘ్టృహట్ట్యఊట్యహట్ట్హట్ట్ట్ట్టూయట్యట్ట్యహట్ట్
బాక్టీరియాల ఆకారం వాటి జాతిని బట్టి మారుతుంది. ఒక జాతిలో ఆకారం నిర్ధిష్టంగా ఉంటుంది.
బాక్టీరియాలు వాటి నిర్మాణంలో చూపే వైవిధ్యతను మార్ఫాలజీస్ అని వ్యవహరిస్తారు. బాక్టీరియా కణాలు యూకారియోట్ల కణాలకంటే దాదాపు పదింతలు చిన్నవిగా ఉంటాయి (సాధారణంగా 0.5-5మైక్రోమీటర్లు). కాని థయోమార్గరీటా నమీబియెన్సిస్, ఎపులోపిషియమ్ ఫిషెల్‌సోని అనే బాక్టీరియా దాదాపు మిల్లీమీటరులో సగం ఉండడం చేత మం మామూలు కంటితో చూడవచ్చు.[12] ఇక సూక్ష్మమైన వాటి విషయానికి వస్తే మైకోప్లాస్మా జాతికి చెందిన బాక్టీరియాలు 0.3 మైక్రోమీటర్ల పొడవుంటాయి.[13]
చాలావరకు బాక్టీరియల్ జాతులు గోళాకారంలో గాని, దండాకారంలోగాని ఉంటాయి. మరికొన్ని కామా ఆకారంలో గాని, శంఖావర్తంగా (స్పైరల్) గాని ఉంటాయి. మరికొన్ని చాలా అరుదుగా టెట్రహెడ్రల్ లేదా క్యూబాయిడల్ ఆకృతిలో ఉంటాయి[14] ఈ ఆకృతి చాలా వరకు బాక్టీరియా సెల్‌వాల్, సైటోస్కెలిటన్‌లు నిర్ణయిస్తాయి.[15][16]
గోళాకారంగా ఉండే బాక్టీరియమ్ లను "కోకస్" (Coccus) అంటారు. కణాల సంఖ్య, అమరికలను బట్టి వీటిని ఆరు రకాలుగా విభజించారు.
దండాకార బాక్టీరియాలను "బాసిల్లస్" (Bacillus) అంటారు. ఇవి తిరిగి మూడు రకాలుగా ఉంటాయి.
కామా (,) ఆకృతిలో ఉండే బాక్టీరియాలను "విబ్రియో" (Vibrio) అంటారు.
సర్పిలాకారంలో ఉండే బాక్టీరియాలను "స్పైరెల్లమ్" (Spirillum) అంటారు. నమ్యతను చూపించే స్పైరిల్లమ్ లను "స్పైరోకీట్స్" (Spirochetes) అంటారు. కొన్ని బాక్టీరియాలు పోగు లేదా తంతువు రూపాలలో ఉంటాయి.
చాలా బాక్టీరియల్ జాతులు ఏకకణ జీవులే, కాని కొన్ని జాతుల్లో (కన్ని కణాలు దగ్గరగా చేరి బహుకణజీవులుగా అగుపిస్తాయి.నిస్సేరియాలో రెండు కణాలు చేరి దిప్లాయిడ్‌గాను, స్ట్రెప్టొకోకస్లో గొలుసుగాను,, స్టాఫైలోకోకస్లో ద్రాక్షగుత్తివలె అమరి ఉంటాయి. ఫిలమెంటస్ బాక్టీరియాలో ఒక కవచంలో చాలా కణాలు విడివిడిగా అమరిఉంటాయి. నొకార్డియాలో శాఖలు కలిగిన ఫిలమెంట్‌లుగా అమరబడి ఉంటాయి.[17]
బాక్టీరియాల అభిరంజన విధానాన్ని క్రిస్టియన్ గ్రామ్ అనే శాస్త్రవేత్త 1884లో రూపొందించాడు. అభిరంజన లక్షణాన్ని బట్టి వీటిని గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగిటివ్ అనే రెండు రకాలుగా విభజించారు. ఈ విధానంలో బాక్టీరియాలు క్రిస్టల్ వయొలెట్ (Crystal violet) అనే ద్రావణం ఉపయోగించి అభిరంజనం చేస్తారు.
బాక్టీరియా కణాన్ని చుట్టి కణ త్వచం అనబడే ఒక లిపిడ్ పొర ఉంటుంది. ఈ కణ త్వచం కణనిర్మాణాలనన్నింటిని రక్షిస్తూఉంటుంది. బాక్టీరియా ప్రోకారియోట్లు కావున వాటిల్లో త్వచాలను కలిగి ఉండే కణనిర్మాణాలుండవు. దీనిమూలంగా కేంద్రకము, క్లోరోప్లాస్ట్, గాల్గీ నిర్మాణాలు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వంటి యూకారియోట్లలో ఉండే నిర్మాణాలు లోపిస్తాయి.[18]
బాక్టీరియాలు మానవుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకరంగాను, హానికరంగాను ఉంటునాయి. కాబట్టి వీటిని మానవుడి మిత్రులుగాను, శత్రువులుగానూ కూడా భావించవచ్చు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.