నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఈ నియోజకవర్గంలో భాగం కాగా, ఇది వరకు ఉన్న గోపాలపేట మండలం వనపర్తి నియోజకవర్గానికి తరలించబడింది.[1][2]
నాగర్‌కర్నూల్ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
1962 | పి.మహేంద్రనాథ్[4] | భారత జాతీయ కాంగ్రెస్ | బి.ఎం.రావు | స్వతంత్ర అభ్యర్థి |
1967 | వంగా నారాయణ గౌడ్ | స్వతంత్ర అభ్యర్థి | కె.జనార్థన్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
1972 | వంగా నారాయణ గౌడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | ఏ.ఆర్.రెడ్డి | స్వతంత్ర అభ్యర్థి |
1978 | శ్రీనివాసరావు | వంగా నారాయణ గౌడ్ | ||
1983 | వంగా నారాయణ గౌడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | నాగం జనార్థన్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
1985 | నాగం జనార్ధన్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | వంగా నారాయణ గౌడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | వంగా మోహన్ గౌడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | డి.గోపాల్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
1994 | నాగం జనార్ధన్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | వంగా మోహన్ గౌడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1999 | నాగం జనార్ధన్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | కూచుకుల్ల దామోదర్ రెడ్డి | స్వతంత్ర అభ్యర్థి |
2004 | నాగం జనార్ధన్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | కూచుకుల్ల దామోదర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి |
2009 | నాగం జనార్ధన్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | కూచుకుల్ల దామోదర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2012 ఉప ఎన్నికలు | నాగం జనార్ధన్ రెడ్డి | ఇండిపెండెంట్ | కూచుకుల్ల దామోదర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2014 | మర్రి జనార్దన్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | కూచుకుల్ల దామోదర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2018 | మర్రి జనార్దన్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | నాగం జనార్ధన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2023[5] | కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | మర్రి జనార్దన్ రెడ్డి | బీఆర్ఎస్ |
1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై 31466 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. నాగం జనార్థన్ రెడ్డికి 61964 ఓట్లు రాగా, దామోదర్ రెడ్డి 30498 ఓట్లు పొందినాడు. రంగంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వి.మోహన్ గౌడ్‌కు మూడవ స్థానం లభించింది. మొత్తం 8 అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. మిగితా 5గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కూచకుళ్ళ దామోదర్ రెడ్డిపై 1449 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నాగం జనార్థన్ రెడ్డి 57350 ఓట్లు సాధించగా, దామోదర్ రెడ్డి 55901 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి[6], భారతీయ జనతా పార్టీ తరఫున జె.రఘునందన్ రెడ్డి [7], కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్తు చైర్మెన్ కె.దామోదరరెడ్డి[8], ప్రజారాజ్యం పార్టీ నుండి నూర్జహాన్[9], లోక్‌సత్తా నుండి కె.రామకృష్ణ [10] పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై విజయం సాధించి ఐదవసారి శాసనసభలో ప్రవేశించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.