Remove ads
భారతదేశం, తెలంగాణ రాష్ట్రం లోని జిల్లాలు From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం లోని ఒక రాష్ట్రం. 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు కలెక్టర్కు నాయకత్వం వహిస్తాడు[1]
తెలంగాణ జిల్లాలు | |
---|---|
రకం | జిల్లా |
స్థానం | తెలంగాణ |
సంఖ్య | 33 జిల్లాలు |
జనాభా వ్యాప్తి | ములుగు – 257,744 (అత్యల్ప); హైదరాబాదు – 3,943,323 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | హైదరాబాదు – 217 కి.మీ2 (84 చ. మై.) (అతిచిన్న); భద్రాద్రి కొత్తగూడెం – 7,483 కి.మీ2 (2,889 చ. మై.) (అతిపెద్ద) |
ప్రభుత్వం | తెలంగాణ ప్రభుత్వం |
ఉప విభజన | తెలంగాణ రెవెన్యూ డివిజన్లు |
భారత స్వాతంత్ర్యం తరువాత 1948లో భారతదేశంలోని డొమినియన్లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి 8 జిల్లాలు ఉన్నాయి.[2] 1953, అక్టోబరు 1న వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటుచేయబడింది.[3] 1956, నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మెరుగైన పరిపాలన కోసం భద్రాచలం డివిజన్, అశ్వారావుపేట తాలూకా భాగాలను గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లాలో కలుపబడ్డాయి.[3] 1978, ఆగస్టు 15న హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ అర్బన్ జిల్లా, హైదరాబాద్ రూరల్ జిల్లాగా విభజించారు. హైదరాబాద్ అర్బన్ జిల్లాను చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్ తాలూకాలు అనే 4 తాలూకాలుగా ఉన్నాయి. వీటిలో ఎంసిహెచ్ ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ రూరల్ జిల్లాను రంగారెడ్డి జిల్లాగా మార్చారు.[4]
ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చారు.[5][6]
2016, అక్టోబరు 11న 21 కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలు కనిష్ఠంగా 2 నుండి గరిష్ఠంగా 5 జిల్లాలుగా విభజించబడ్డాయి.[7]
2019, ఫిబ్రవరి 17న 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. అప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.[8] 2016లో వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు. ఆ తరువాత 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[9][10][11]
భద్రాద్రి జిల్లా 8,062 కి.మీ2 (3,113 చ. మై.) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా కాగా, 2,019 కి.మీ2 (780 చ. మై.) వైశాల్యం కలిగిన రాజన్న జిల్లా అతి చిన్న జిల్లా. హైదరాబాద్, 3,52,69,257 మందితో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.[12]
వ.సంఖ్య | జిల్లా | జిల్లా ప్రధాన
కార్యాలయం |
రెవెన్యూ
డివిజన్లు సంఖ్య |
మండలాలు సంఖ్య | మొత్తం రెవెన్యూ గ్రామాలు | అందులో నిర్జన గ్రామాలు | నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు సంఖ్య | జనాభా (2011) | వైశాల్యం (చ.కి) | జిల్లా పటాలు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ఆదిలాబాద్ జిల్లా | ఆదిలాబాద్ | 2 | 18 | 505 | 31 | 474 | 7,08,952 | 4,185.97 | |
2 | కొమరంభీం జిల్లా | ఆసిఫాబాద్ | 2 | 15 | 419 | 17 | 402 | 5,15,835 | 4,300.16 | |
3 | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | కొత్తగూడెం | 2 | 23 | 377 | 32 | 345 | 13,04,811 | 8,951.00 | |
4 | జయశంకర్ భూపాలపల్లి జిల్లా | భూపాలపల్లి | 1 | 11 | 223 | 23 | 200 | 7,12,257 | 6,361.70 | |
5 | జోగులాంబ గద్వాల జిల్లా | గద్వాల్ | 1 | 12 | 196 | 0 | 196 | 6,64,971 | 2,928.00 | |
6 | హైదరాబాద్ జిల్లా | హైదరాబాద్ | 2 | 16 | - | - | 34,41,992 | 4,325.29 | ||
7 | జగిత్యాల జిల్లా | జగిత్యాల | 3 | 18 | 286 | 4 | 282 | 9,83,414 | 3,043.23 | |
8 | జనగామ జిల్లా | జనగామ | 2 | 12 | 176 | 1 | 175 | 5,82,457 | 2,187.50 | |
9 | కామారెడ్డి జిల్లా | కామారెడ్డి | 3 | 22 | 473 | 32 | 441 | 9,72,625 | 3,651.00 | |
10 | కరీంనగర్ జిల్లా | కరీంనగర్ | 2 | 16 | 210 | 5 | 205 | 10,16,063 | 2,379.07 | |
11 | ఖమ్మం జిల్లా | ఖమ్మం | 2 | 21 | 380 | 10 | 370 | 14,01,639 | 4,453.00 | |
12 | మహబూబాబాద్ జిల్లా | మహబూబాబాద్ | 2 | 16 | 287 | 15 | 272 | 7,70,170 | 2,876.70 | |
13 | మహబూబ్ నగర్ జిల్లా | మహబూబ్ నగర్ | 1 | 16 | 310 | 2 | 308 | 13,18,110 | 4,037.00 | |
14 | మంచిర్యాల జిల్లా | మంచిర్యాల | 3 | 18 | 362 | 18 | 344 | 807,037 | 4,056.36 | |
15 | మెదక్ జిల్లా | మెదక్ | 4 | 21 | 381 | 8 | 373 | 767,428 | 2,740.89 | |
16 | మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా | మేడ్చల్ | 2 | 15 | 163 | 7 | 156 | 2,542,203 | 5,005.98 | |
17 | నల్గొండ జిల్లా | నల్గొండ | 4 | 31 | 566 | 15 | 551 | 1,631,399 | 2,449.79 | |
18 | నాగర్ కర్నూల్ జిల్లా | నాగర్ కర్నూల్ | 4 | 20 | 349 | 9 | 340 | 893,308 | 6,545.00 | |
19 | నిర్మల్ జిల్లా | నిర్మల్ | 2 | 19 | 429 | 32 | 397 | 709,415 | 3,562.51 | |
20 | నిజామాబాద్ జిల్లా | నిజామాబాద్ | 3 | 29 | 450 | 33 | 417 | 1,534,428 | 4,153.00 | |
21 | రంగారెడ్డి జిల్లా | రంగారెడ్డి | 5 | 27 | 604 | 32 | 572 | 2,551,731 | 1,038.00 | |
22 | పెద్దపల్లి జిల్లా | పెద్దపల్లి | 2 | 14 | 215 | 8 | 207 | 795,332 | 4,614.74 | |
23 | సంగారెడ్డి జిల్లా | సంగారెడ్డి | 4 | 27 | 600 | 16 | 584 | 1,527,628 | 4,464.87 | |
24 | సిద్దిపేట జిల్లా | సిద్దిపేట | 3 | 24 | 381 | 6 | 375 | 993,376 | 3,425.19 | |
25 | రాజన్న సిరిసిల్ల జిల్లా | సిరిసిల్ల | 2 | 13 | 171 | 4 | 167 | 546,121 | 2,030.89 | |
26 | సూర్యాపేట జిల్లా | సూర్యాపేట | 2 | 23 | 279 | 9 | 270 | 1,099,560 | 1,415.68 | |
27 | వికారాబాదు జిల్లా | వికారాబాద్ | 2 | 19 | 503 | 19 | 484 | 881,250 | 3,385.00 | |
28 | వనపర్తి జిల్లా | వనపర్తి | 1 | 14 | 216 | 1 | 215 | 751,553 | 2,938.00 | |
29 | హన్మకొండ జిల్లా | వరంగల్ | 1 | 14 | 163 | - | - | 1,135,707 | 1,304.50 | |
30 | వరంగల్ జిల్లా | వరంగల్ | 2 | 13 | 192 | - | - | 716,457 | 2,175.50 | |
31 | యాదాద్రి భువనగిరి జిల్లా | భువనగిరి | 2 | 17 | 321 | 3 | 318 | 726,465 | 3,091.48 | |
32 | ములుగు జిల్లా [13] | ములుగు | 1 | 9 | 336 | 109 | 277 | 2,94,000 | ||
33 | నారాయణపేట జిల్లా[13] | నారాయణపేట | 1 | 11 | 252 | 2 | 250 | 5,04,000 | ||
మొత్తం | 76 | 594 | 35,003,694 | 112,077.00 |
మూలం: తెలంగాణ జిల్లాలు [14]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.