Remove ads
ఝార్ఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో దేవ్ఘర్ (హింది: पूर्वी सिंहभूम ) జిల్లా ఒకటి. 1990 జనవరి 16 న ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది. సింగ్భుం అంటే " సింహాల భూమి " అని అర్ధం. జిల్లాలో 50% కంటే అధికంగా దట్టమైన అరణ్యాలు, పర్వతాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ వన్యమృగాలు స్వేచ్ఛగా సంచరించాయి. ఈ జిల్లా రెడ్ కార్పెట్లో భాగం. [1]
తూర్పు సింగ్భుం జిల్లా
पूर्वी सिंहभूम जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | కొల్హన్ |
ముఖ్య పట్టణం | జంషెడ్పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | జంషెడ్పూర్ |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,533 కి.మీ2 (1,364 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 22,91,032 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.13 % |
• లింగ నిష్పత్తి | 949 |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లా తూర్పు సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మిడ్నాపూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో పురూలియా జిల్లా, పశ్చిమ సరిహద్దులో పశ్చిం సింగ్భుం దక్షిణ సరిహద్దులో ఒడిషా రాష్ట్రానికి చెందిన మయూర్బని జిల్లాలు ఉన్నాయి.
జార్ఖండ్ రాష్ట్రంలో తూర్పు సింగ్భుం జిల్లా గనులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందినది. దేశంలో ప్రధాన పారిశ్రామిక నగరమైన జెంషెడ్పూర్ ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. 50 సంవత్సరాల చరిత్ర ఉన్న " హిందూస్థాన్ కాపర్ " సంస్థ ఘట్శిలా వద్ద ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో సుబర్నరేఖా నది ఉంది. ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్న ధంజౌరీ పర్వతశ్రేణిలో రాగి, యురేనియం గనులు ఉన్నాయి. అధికమైన రాగి గనులు బనలోపా, బడియా, పథర్గొరా, ధిబ్ని, కెండదిహ్, రాఖ, సుర్ద ఉన్నాయి. వీటన్నింటిలో సుర్దలో మాత్రమే త్రవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధాన యురేనియం గనులు జడుగొర, నర్వపహర్, భతిన్, తురందిహ్, భగ్జంత ఉన్నాయి. జిల్లా ఆగ్నేయంలో ఉన్న చకులియా పట్టణం రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, వాషింగ్ సోప్ (బట్టలు ఉతికే సబ్బు) తయారీ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. జాతీయ రహదారి 6 పక్కన ఉన్న మరొక ప్రాధాన్యత కలిగిన బహరగొండ ఉంది.
గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో తూర్పు సింగ్భుం జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధాల్భుం, ఘట్షిల.
జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో శాంతలి, హిందీ, బెంగాలీ, ఒరియా భాషలు ప్రధానమైనవి. ప్రముఖ హిందీ కవి సౌరవ్ రాయ్ [3] ఈ జిల్లాకు చెందినవాడే. దుర్గాపూజ, వసంత పంచమి, మకర సంక్రాంతి, సొహ్రై, దీపావళి పండుగలు జరుపుకుంటారు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,291,032,[4] |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 199 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 648 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 15.53%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 949:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 76.13%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
శీతోష్ణస్థితి డేటా - Jamshedpur, India | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °F (°C) | 76 (24) |
81 (27) |
91 (32) |
98 (36) |
98 (38) |
93 (33) |
88 (31) |
88 (31) |
87 (30) |
86 (30) |
82 (27) |
76 (24) |
87 (30) |
సగటు అల్ప °F (°C) | 57 (14) |
62 (16) |
70 (21) |
78 (25) |
81 (27) |
81 (27) |
80 (26) |
79 (26) |
78 (25) |
73 (22) |
65 (18) |
57 (13) |
72 (22) |
సగటు అవపాతం inches (cm) | 0.43 (1.08) |
0.52 (1.33) |
0.76 (1.94) |
0.70 (1.77) |
2.16 (5.49) |
6.8 (17.28) |
9.09 (23.09) |
9.95 (25.27) |
6.53 (16.58) |
2.15 (5.45) |
0.34 (0.87) |
0.23 (0.59) |
39.66 (100.74) |
Source: Weatherbase[7] and MSN Weather[8] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.