తూత్తుకూడి

From Wikipedia, the free encyclopedia

తూత్తుకూడిmap

తూత్తుకూడి (గతంలో టుటికోరిన్) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తూత్తుకూడి జిల్లాలోని ఓడరేవు నగరం.ఇది నగరపాలక సంస్థ ప్రధానకార్యాలయం, పారిశ్రామిక నగరం.ఈ నగరం బంగాళాఖాతంలోని కోరమాండల్ తీరంలో ఉంది. తూత్తుకూడి నగరం తూత్తుకూడి జిల్లాకు ప్రధాన కార్యాలయం. ఇది చెన్నైకి నైరుతిదిశలో 590 kiloమీటర్లు (367 మైళ్లు), తిరువనంతపురంకు ఈశాన్యంగా 190 kiloమీటర్లు (118 మైళ్లు), బెంగుళూరుకు ఆగ్నేయంగా 580 kiloమీటర్లు (360 మైళ్లు) దూరంలో ఉంది. భారత పరిశ్రమల సమాఖ్య ప్రకారం, చెన్నై తర్వాత తమిళనాడులో తూత్తుకూడి రెండవ అత్యధిక మానవ అభివృద్ధి సూచికను కలిగి ఉంది.[3]తూత్తుకూడి నగరం తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. నగరంలోని ప్రధాన విద్యా సంస్థలలో ప్రభుత్వ తూత్తుకూడి వైద్య కళాశాల, చేపల కళాశాల, పరిశోధనా సంస్థ, తమిళనాడు మారిటైమ్ అకాడమీ,[4] విఒ చిదంబరం కళాశాల, కామరాజ్ కళాశాల, అన్నా విశ్వవిద్యాలయం (తూత్తుకూడి క్యాంపస్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. [5] విఒ చిదంబరనార్ నౌకాశ్రయ సంస్థ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ నౌకాశ్రయాలలో ఒకటి. తూత్తుకూడి "దక్షిణ భారతదేశంలో ఉద్భవిస్తున్న శక్తి, పరిశ్రమల కేంద్రం" గా గుర్తింపు పొందింది. [6]

త్వరిత వాస్తవాలు Thoothukudi Tuticorin (colonial), Country ...
Thoothukudi
Tuticorin (colonial)
City
Thumb
ThumbThumb
ThumbThumb
ThumbThumb
Clockwise from the top
Thoothukkudi Thermal Power Station, Tuticorin Airport, Pearl Oyster of Pearl City, Our Lady Of Snows Church, Tiruchendur Subramaniya Swamy Temple, Salt Pans in Thoothukudi and V.O. Chidambaranar Port Authority
Nickname(s): 
Pearl City, Salt Capital of Tamil Nadu and Sea Gateway of Tamil Nadu.
Thumb
Thoothukudi
Thoothukudi, Tamil Nadu
Thumb
Thoothukudi
Thoothukudi (India)
Coordinates: 8.764200°N 78.134800°E / 8.764200; 78.134800
Country India
StateTamil Nadu
DistrictThoothukudi
Former nameTuticorin
RegionPandya Nadu
Named forMacaroon, Parotta, Pearl and Salt
Government
  TypeMunicipal corporation
  BodyThoothukudi City Municipal Corporation
  Corporation CommissionerT. Charusree, I.A.S.
  Lok Sabha ConstituencyThoothukkudi
  State Assembly ConstituencyThoothukkudi
విస్తీర్ణం
  Metro
90.663 కి.మీ2 (35.005 చ. మై)
  Rank8
Elevation
29 మీ (95 అ.)
జనాభా
 (2011)[1]
  City2,37,830
  Rank8th in Tamil Nadu
  Metro
4,11,628 [2]
DemonymThoothukudian
Languages
  OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
628 0xx
Telephone code+91-461
Vehicle registrationTN-69, TN-92,TN-96
Literacy92.10[2]
ClimateBSh (Köppen)
Coastline40 kiloమీటర్లు (25 మై.)
Website
మూసివేయి

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,37,830 జనాభాను కలిగి ఉంది. పట్టణ సమ్మేళనం జనాభా 4,10,760 కలిగి ఉంది. నగర పరిధి 353.07 kమీ2 (136.32 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని పరిపాలన తూత్తుకూడి నగరపాలస సంస్థ ద్వారా సాగుతుంది. తూత్తుకూడికి రోడ్డు మార్గాలు ప్రధాన రవాణా మార్గం, నగరంలో రైలు, విమాన, సముద్ర రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

చరిత్ర

తూత్తుకూడి పట్టణ తీరప్రాంతంలో నిర్వహించే ముత్యాల చేపల వేట కారణంగా దీనిని "ముత్యాల నగరం"గా పిలుస్తారు. ఇది ఒక వాణిజ్య నౌకాశ్రయం, దీని ద్వారా దక్షిణ భారతదేశంలోని లోతట్టు నగరాలకు సేవలు అందుతాయి. ఇది తమిళనాడులోని సముద్ర ప్రవేశ మార్గాలలో ఒకటి. భారతదేశంలో సా.శ. 6వ శతాబ్దం నాటి చరిత్ర కలిగిన ప్రధాన ఓడరేవులలో ఇది ఒకటి. ఈ నగరం చాలా ముఖ్యమైన పురాతనమైనదని నమ్ముతారు. వివిధ సమయాల్లో, ప్రారంభ పాండ్యులు, మధ్యయుగ చోళులు, తరువాత చోళులు, తరువాతి పాండ్యాలు, మాబర్ సుల్తానేట్, తిరునెల్వేలి సుల్తానేట్,విజయనగర సామ్రాజ్యం, మదురై నాయకులు, చందా సాహిబ్, కర్నాటిక్ సుల్తానేటులు ,పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వారు పాలించారు. తూత్తుకూడి పోర్చుగీస్, డచ్ పాలన తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థిరపడింది.

నగరంలోని ఎక్కువ మంది ప్రజలు సముద్ర సంపద వ్యాపారం ఉప్పు చిప్పలు, చేపలు పట్టడం, పర్యాటక రంగం ద్వారా ఉపాధి పొందుచున్నారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లోని తూత్తుకూడి, రామేశ్వరం తీరాల మధ్య ఉన్న 21 ద్వీపాలు భారతదేశం లోని మొదటి సముద్ర జీవావరణ ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. వీటిలో దాదాపు 36,000 జాతుల వృక్షజాలం జంతుజాలం కలిగి ఉన్నాయి.ఈ రక్షిత ప్రాంతాన్ని గల్ఫ్ మన్నార్ మెరైన్ జాతీయ ఉద్యానవనం అంటారు. అవర్ లేడీ ఆఫ్ స్నోస్ బసిలికా ఉత్సవాన్ని ఏటా ఆగస్టులో జరుపుకుంటారు.ఇది శివాలయ ఉత్సవం.ఆది అమావాసై, సస్తి, చిత్తిరై రథోత్సవాలు ఈ ప్రాంతంలో ప్రధాన పండుగలు.

తూత్తుకుడిని 'ముత్యాల నగరం' అని, "తమిళనాడు సముద్ర ముఖ ద్వారం" అని అంటారు. [7] తూత్తుకూడి పెర్ల్ ఫిషరీ కోస్ట్‌లో భాగం, పెర్ల్ ఫిషింగ్, చేపల పరిశుభ్ర పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. [8] సా.శ. 16వ-19వ శతాబ్దాలలో పోర్చుగీస్, డచ్, బ్రిటీష్ కాలంలో తూత్తుకూడి ఓడరేవు పట్టణం.1907 తర్వాత ప్రభుత్వ సంస్థల ఉనికి కారణంగా నగరం విస్తరించింది.1907, 1930 మధ్య కాలంలో పాలయంకోట్టై, ఎట్టయ్యపురం రోడ్ల చుట్టూ నివాస, పారిశ్రామికాభివృద్ధి చెందింది. [9]

జనాభా గణాంకాలు

మరింత సమాచారం సంవత్సరం, జనాభా ...
సంవత్సరంజనాభా±%
19611,24,230    
19711,59,506+28.4%
19811,80,832+13.4%
19911,99,654+10.4%
20013,20,270+60.4%
20114,11,628+28.5%
మూసివేయి

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తూత్తుకూడి నగరం 2,37,830 జనాభాను కలిగి ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,010 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది, జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ [10] తూత్తుకూడి సగటు అక్షరాస్యత రేటు 92.10%, పురుషుల అక్షరాస్యత రేటు 94.84% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 89.37% ఉంది. మొత్తం జనాభాలో ఆరేళ్లలోపు వారు 24,959 మంది ఉన్నారు.

వారిలో 12,684 మంది పురుషులు కాగా, 12,275 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 7.42% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.1% మంది ఉన్నారు. [10] నగరం పరిధిలో మొత్తం 60,714 గృహాలు ఉన్నాయి.

నగరపరిధి లోని మొత్తం జనాభాలో 83,669 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 114 మంది రైతులు,154 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు,1,498 మంది గృహ పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులు, 77,420 మంది ఇతర కార్మికులు, 4,483 సన్నకారు కార్మికులు, 69 సన్నకారు రైతులు, 25 మంది ఉపాంత వ్యవసాయ కార్మికులు, 25 మంది ఇతర వ్యవసాయ కార్మికులు, 90 మంది మార్జినల్ కార్మికులు, 40 మంది ఇతర వ్యవసాయ కార్మికులు ఉన్నారు.

మతాల ప్రకారం

మరింత సమాచారం మతాల ప్రకారం జనభా (2011) ...
మతాల ప్రకారం జనభా (2011)[11]
మతం శాతం
హిందూ
 
64.97%
క్రిష్టియన్లు
 
30.14%
ముస్లిం
 
4.74%
ఇతరులు
 
0.15%
మూసివేయి

2011 భారత జనాభా లెక్కల సమయంలో, తూత్తుకుడి పట్టణ సముదాయంలో 4,11,628 జనాభా ఉంది.జనాభా మొత్తంలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు 42,756 మంది ఉన్నారు. [12]

నగరంలో ప్రధానమైన భాష తమిళం. దీనిని జనాభాలో దాదాపు 99% మంది మాట్లాడతారు. మాండలికం నెల్లై తమిళానికి సంబంధించిన తూత్తుకూడి తమిళం. ఆంగ్లభాష విస్తృతంగా మాట్లాడతారు. [13]

తూత్తుకుడి నగరపాలక సంస్థ జనాభాలో 65% హిందువులు, 30% క్రైస్తవులు, 5% ముస్లింలు ఉన్నారు.మొత్తం పట్టణ సమ్మేళనంలో 71% హిందువులు, 25% క్రైస్తవులు 4% ముస్లింలు ఉన్నారు.

రవాణా సౌకర్యాలు

నగర పరిధిలో

Thumb
మద్రాసు ప్రెసిడెన్సీ కాలంలో తూత్తుకుడి ఓడరేవు, సుమారు 1913

తూత్తుకూడి నగరం విస్తృతమైన రవాణా వ్యవస్థను కలిగి ఉంది. రహదారుల, రైలు, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఇతర ప్రధాన నగరాలకు బాగా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. నగరపాలక సంస్థ తన పరిధిలోని 428.54 kమీ. (266.28 మై.) మొత్తం పొడవు కలిగిన రహదారులను నిర్వహిస్తుంది. నగరంలో 37.665 kమీ. (23.404 మై.) కాంక్రీట్ రోడ్లు, 329.041 kమీ. (204.457 మై.) తారు రోడ్లు, 56.592 kమీ. (35.165 మై.) కంకర రోడ్లు,5.242 kమీ. (3.257 మై.) కలిగిన మట్టి రోడ్లు ఉన్నాయి. [14] జాతీయరహదారి -138ని కలుపుతున్న తమిళ్ సలై, ఎన్ఎచ్-38ని కలుపుతున్న కామరాజర్ సలై, రాష్ట్ర రహదారి -49ని కలుపుతున్న రామనాథపురం రోడ్, ఎస్ఎచ్-176ని కలుపుతున్న తిరుచెందూర్ రోడ్, విఒ చిదంబరనార్ సలై, విక్టోరియా ఎక్స్‌టెన్షన్ రోడ్ నగరంలోని ప్రధాన రహదారులు. నగరం వెలుపల ఉన్న హైవేపై ఉన్న విఒసి సలై నౌకాశ్రయం సంస్థ, థర్మల్ పవర్ స్టేషన్, ఎస్పిఐసి పరిశ్రమను జాతీయ రహదారి -38 లను కలుపుతుంది.నగరంలో రెండు బస్సు టెర్మినీలు ఉన్నాయి. [15]

రహదారి మార్గం

తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ వివిధ నగరాలను తూత్తుకూడికి కలుపుతూ రోజువారీ సేవలను నిర్వహిస్తోంది. తమిళనాడు రోడ్డురవాణ సంస్థ కొత్త ప్రాంతీయ ప్రధాన కార్యాలయం తూత్తుకూడిలో ఉంది. ఇది ప్రభుత్వ బస్సుల ద్వారా మెరుగైన రవాణాను కల్పిస్తుంది.[16] రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నగరాన్ని బెంగళూరు, చెన్నై, వెల్లూరు, నాగపట్నం, కన్నియాకుమారి వంటి ముఖ్యమైన నగరాలకు కలుపుతూ సుదూర బస్సులను నడుపుతోంది.

రైలు మార్గం

తూత్తుకుడి రైల్వే స్టేషన్ భారతదేశం లోని పురాతన ప్రసిద్ధ రైల్వే స్టేషన్లలో ఒకటి. తూత్తుకూడి నుండి సుదూర రైళ్ల నిర్వహణను సులభతరం చేసే రైలు పెట్టెలను శుభ్రపరచడం, నిర్వహణ కోసం పిట్‌లైన్ సౌకర్యం ఉన్న దక్షిణ తమిళనాడులోని కొన్ని స్టేషన్‌లలో ఇది ఒకటి. [17]

వాయు మార్గం

నగరం నుండి 14 kమీ. (45,932 అ.) దూరంలో వాగైకులంలో తూత్తుకుడి విమానాశ్రయం ఉంది. ఇది బెంగుళూరు, చెన్నైకి ఇండిగో ద్వారా నిర్వహించబడే విమాన సర్వీసులను కలిగి ఉంది. ఇది చెన్నైకి ప్రతిరోజూ నాలుగు సర్వీసులను బెంగళూరుకు ఒక ధఫా సర్వీసును నిర్వహిస్తుంది. కొలంబో, దుబాయ్‌లకు రోజువారీ అంతర్జాతీయ అనుసంధానంతో సమీప మదురై కస్టమ్స్ విమానాశ్రయం ఉంది. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం 200 kమీ. (656,168 అ.) దూరంలో ఉన్న సమీప అంతర్జాతీయ విమానాశ్రయం .

జల మార్గం

విఒ చిదంబరనార్ నౌకాశ్రయ సంస్థ ఒక కృత్రిమ లోతైన సముద్ర నౌకాశ్రయం. ఇది భారతదేశంలోని ప్రధాన ఓడరేవులలో ఒకటి. ఒక లగ్జరీ ఫెర్రీ లైనర్, స్కోటియా ప్రిన్స్, శ్రీలంకలోని కొలంబోకు ఫెర్రీ సర్వీస్‌ను నడుపుతోంది. 20 ఏళ్ల తర్వాత రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలు పునరుద్ధరించబడ్డాయి. [18]

విద్యా సౌకర్యాలు

తూత్తుకుడి నగరంలో 31 పాఠశాలలు ఉన్నాయి.వాటిలో 10 నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది.తూత్తుకూడి నగర అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది.స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత రేటు అంతరం తక్కువగా ఉంది. [19] నగరంలో ఐదు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, మూడు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. ఇది తమిళనాడులోని డా. జె. జయలలిత మత్య్య విశ్వవిద్యాలయం, నాగపట్నంకు అనుబంధంగా శివార్లలో ఒక మత్స్య కళాశాల ఉన్నాయి. నగరంలో అన్నా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఒక ప్రభుత్వ కళాశాల, అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల, తిరుచెందూర్ రోడ్డులో తమిళ్ సలై ఆర్ట్స్ కళాశాల ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి ఉన్నాయి. కళాశాలలు తిరునెల్వేలిలోని మనోన్మనీయమ్ సుందరనార్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. [20] [21]

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.